అండర్ గ్రౌండ్ ఇల్లు Underground House | Telugu Kathalu | Stories in Telugu| Panchatantra Kathalu

అది దేవరకోట అనే ఒక చిన్న గ్రామం . ఆ గ్రామంలో బేబీ అనే ఒక పాప ఉండేది. ఆమె తన తండ్రితో నివసిస్తూ ఉండేది వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం.
బేబీ తల్లి ఎక్కడికి పోయిందో తెలియదు. అందరూ చనిపోయింది అని అనుకుంటారు. వాళ్లు కూడా అదే భావిస్తారు. రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి సమయం తండ్రి నిద్రపోతున్న బేబీ దగ్గర కి వచ్చి…. అమ్మ బేబీ అమ్మ బేబీ . లే లే త్వరగా లే అంటూ ఆమెనీ నిద్ర లేపుతాడు ఏమైంది నాన్న అన్నట్టుగా
బేబీ అడుగుతుంది . తండ్రి…. చెప్తాను త్వరగా రా అని ఇంట్లోనే ఉన్న ఒక స్టోర్ రూమ్ లోకి తీసుకు వెల్తాడు . అక్కడ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంటుంది. దాన్ని తెరిచి లోపలకు వెళ్తారు అక్కడ అండర్ గ్రౌండ్ లో ఒక ఇల్లు ఉంటుంది.
ఆ ఇంటిని చూసి పాప చాలా ఆశ్చర్య పోయింది.
తండ్రితో…. నాన్న ఏంటి ఇదంతా మన ఇంట్లో ఇంకొక ఇల్లు ఉందని నాకు ఇప్పుడే తెలిసింది . మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము నాన్న. అని అడుగుతుంది ఇంతలో చనిపోయింది అనుకున్న తల్లి అక్కడ కనబడుతుంది.
ఆమె బేబీ ని చూసి పట్టుకొని ఏడుస్తూ…. అమ్మ బేబీ నిన్ను చూసి ఎన్ని రోజులు అయిపోయింది. నా బంగారు తల్లి ఎలా ఉన్నావమ్మా.
బేబీ….. అమ్మ నేను బాగానే ఉన్నాను ఏంటమ్మా ఇదంతా నాకు ఏమీ అర్థం కావడం లేదు.
బేబీ తల్లి….. ఇంకేముంది అమ్మా మీ ఇద్దరు మామయ్యలు ఈ ఆస్తిని సంపాదించాలని నన్ను చంపాలనుకున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే మేము గ్రహించాము అందుకే అండర్ గ్రౌండ్ ఇంటిని ఏర్పాటు చేసుకున్నాం.
కొన్ని రోజులు నేను కనపడకుండా గానే ఉండాలి అనుకున్నాను అందుకే ఇక్కడ ఉన్న.
అందరి దృష్టిలో నేను చనిపోయాను నాకు మీ నాన్న కి తప్ప నేను ఇక్కడ ఉన్నాను అని ఎవరికీ తెలియదు.
కానీ ఇప్పుడు వాళ్లు మిమ్మల్ని కూడా చంపాలని నిర్ణయించుకున్నారు.
అందుకే మీరు అక్కడ ఉండడం మంచిది కాదు ఇక మనం ఇక్కడే ఉంటాము.
బేబీ….. కానీ ఎంతకాలం అమ్మా ,యిలా ఉంటాము. ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది.
వాళ్ళు మనల్ని చంపేస్తారు అలాంటప్పుడు మనము ఎందుకు భయపడాలి.
వాళ్ళుకి ఎదురు తిరిగి మాట్లాడదాం .
వాళ్ళు ఏం చేస్తారు మహా అయితే మన ప్రాణాలు తీశారు. మన తదనంతరం ఈ ఆస్తి మొత్తం ఒక అనాధ ఆశ్రమానికి రాసే లాగా వీలునామా రాసి దానినీ పశుపతి లాయర్ అంకుల్ చేతిలో పెడదాం. మనం చనిపోయిన కూడా ఆ పేద పిల్లలు సంతోషంగా బతుకుతారు.
ఆ మాటలు విన్న వాళ్లు కాసేపు ఆలోచనలో పడతారు. రెండు రోజుల తర్వాత
పాప చెప్పినట్టుగానే వాళ్ళ ఆస్తి పేపర్ల మొత్తాన్ని చెందేలా గా రాస్తారు .
వాళ్ళు ఆ పేపర్ని లాయర్ చేతికి అందించాలని. బయటికి వస్తారు .
వాళ్ళు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్నా బేబీ ఇద్దరు మామయ్యలు కూడా
వాళ్లకి రోడ్డుపై కనబడదు.
వాళ్ళని చూసి…. మీరు ఎప్పుడో ఒకరోజు మాకు కనపడతారని తెలుసు. మర్యాదగా ఆస్తి పేపర్లు మాకు ఇవ్వు . మీ ప్రాణాలు మిగులుతాయి లేదంటే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
బేబి తల్లి శారద ఏడుస్తూ….. అన్నయ్య తమ్ముడు మీరు ఎందుకు నా మీద ఇలా పగ పెంచుకున్నారు . మాకు ఆస్తి కావాలని ఎప్పుడూ కోరుకోలేదు కానీ ఈ ఆస్తి మా దగ్గర ఉంచు కోవడానికి బలమైన కారణం ఉంది.
పాపకి ఆపరేషన్ చేయాలి దానికి చాలా ఖర్చవుతుంది.
కొంత వయస్సు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. మా బిడ్డను కాపాడు కోవాలన్న ఉద్దేశంతో ఆస్తిని కోరుకుంటున్నాము కానీ మరొకటి ఏమీ లేదు దయచేసి మమ్మల్ని ఏం చెయ్యొద్దు అంటూ ఏడుస్తూ వాళ్ల కాళ్ల మీద పడుతుంది తల్లి.
అన్నదమ్ములు మాత్రం ఏమాత్రం జాలి లేకుండా ఆమె చేతిలో ఉన్న పేపర్లో లాక్కున్నారు . అందులో ఉన్నది చదివి….. అనాధ ఆశ్రమానికి ఎలాగ చెందుతుందని అనుకుంటున్నావు . అని లైట్ తో ఆ కాగితాలను తగలబెడతారు.
ఆ తర్వాత వాళ్ళు వాళ్ళని పట్టుకుంటారు.
తల్లి…. బేబీ నువ్వు పారిపో అంటూ కేకలు వేస్తోంది. బేబీ పరుగులు తీస్తుంది.
తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వారి నుంచి తప్పించుకుని పరుగులు తీస్తారు. శారద అన్నదమ్ములు ఇద్దరు కూడా శారద శారద భర్త ప్రసాద్ వైపుగా పరుగులు తీయడంతో.
బేబీ వారినుంచి తప్పించుకొని
తిరిగి వాళ్ళ ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ఇంటిలో కి వెళ్తుంది.
అన్నదమ్ములు ఇద్దరూ కలిసి శారద ప్రసాద్ ని చంపేస్తారు. ఇక ఆ పాప ఎక్కడుందో వెతకడం మొదలుపెడతారు.
రోజులు గడిచాయి కానీ పాప ఎక్కడుందో వాళ్లకి తెలీదు.
ఆస్తి పేపర్ లో ఎక్కడ ఉన్నాయో అని బేబీ వాళ్ళ ఇంట్లో మొత్తం వెతుకుతూ ఉంటారు.
కానీ ఎక్కడా కూడా ఆస్తి పేపర్లో కనిపించవు.
వాళ్లకి కి ఏం చేయాలో అర్థం కాదు ఇద్దరు కూడా కోపంగా ఒకరినొకరు చూసుకుంటూ .
కోపంగా బయటకు వెళుతూ….. ఎంత వెతికినా పాప దొరకలేదు. ఆస్తి కాగితాలు దొరకలేదు. అంటూ ఇద్దరూ కారులో బయలుదేరుతారు వాళ్ళు మాట్లాడుకుంటూ
ఉంటారు. అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది . ఆక్సిడెంట్ లో ఒకరు చనిపోతారు ఒకళ్ళు మాత్రం కోమా లోకి వెళ్ళిపోతారు.
ఇది ఇలా ఉండగా అక్కడ అండర్ గ్రౌండ్ లో బేబీ ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది అక్కడ తినడానికి ఉన్న సరుకులు అయిపోతాయి.
ఆమె దాహం ఆకలితో అల్లాడిపోతూ ….. అమ్మ నాన్న నాకు బయటకు వెళ్లాలంటే భయం గా ఉంది నన్ను కూడా మావయ్య లు చంపేస్తారేమో అని .
అంటూ ఏడుస్తూనే ఉంటుంది.
కాకి దాహం తో పాప కూడా అక్కడే ఉంటుంది. అప్పుడే లాయి లాయి ఇంటికి వస్తాడు కొన్ని రోజుల నుంచి నుంచి ఎలాంటి సమాచారం లేదు అన్న కారణం తోనే
అతను అక్కడికి వస్తాడు.
అతడు ఇంట్లోకి వచ్చిన ఇప్పుడు ఎవరూ కనపడరు. కచ్చితంగా అండర్ గ్రౌండ్ లో ఉంటారు అనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ ఇల్లు గురించి తనకు ముందే తెలియడంతో సరాసరి అతను అక్కడికి వెళతాడు.
అక్కడ పాపా చావు బ్రతుకుల మధ్య ఉంటుంది.
వెంటనే అతను పాపను తీసుకుని….. పాప పాప అంటూ పిలుస్తాడు పాపం ఆయన సొంత ఆకలి దాహం అని అంటుంది వెంటనే అతను పాపను అండర్ గ్రౌండ్ నుంచి పైకి తీసుకు వస్తాడు. ఆమెకు నీళ్లు అందిస్తాడు పాప నీళ్ళు కొంచెం తాగుతుంది వెంటనే బయటికి వెళ్లి భోజనం తీసుకొస్తాడు.
పాపా భోజనం తిని కొంచెం విశ్రాంతి తీసుకుంటోంది.
కొన్ని గంటల తర్వాత ఆమె నిద్ర లేస్తుంది .
ఆమె నిద్ర లేచిన వెంటనే లాయర్ తో ఏడుస్తూ…. అంకుల్ మా అమ్మ నాన్న మా మామయ్య వాళ్ళు ఏం చేశారో తెలియదు ఖచ్చితంగా చంపేసి ఉంటారు.
నేను ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి తిరిగి వచ్చాను అంటూ జరిగిన విషయం చెప్తోంది అతను…… పాప మీ అమ్మ నాన్న సంగతి నాకు తెలియదు కానీ మీ మామయ్య మాత్రం ఒకరు చనిపోయారు ఒకరు కోమాలో హాస్పిటల్లో ఉన్నారు . వాళ్లు నీకు చేసిన ద్రోహానికి భగవంతుడు వాళ్ళకి మంచి శిక్ష. విధించాడు. బేబీ బాధపడుతూ……
అయ్యో మామయ కొమ్మ లో ఉన్నాడా,మరో మావయ్య అంటూ ఏడుస్తుంది.
లాయర్ …. బాధపడకకు పాప వాళ్లకి జరగాల్సిందే జరిగింది .
నువ్వు ఇంకా ఎలాంటి చింత లేకుండా ఆయన ఇక్కడే ఉండొచ్చు.
పాప….. అంకుల్ ఈ ఆస్తి కోసమే కదా ఇదంతా జరిగింది. అనాధ నీ ఆస్తి ఏమి వద్దు ఆశ్రమానికి ఇచ్చేయండి. నేను మాత్రం ఈ అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇంట్లోనే ఉండి పోతాను. అని అంటాది.
అందుకు అతను ఏం మాట్లాడకుండా చాలా బాధపడుతూ అలా చూస్తాడు. అతను సరే అని అంటాడు కొన్ని రోజులు గడిచాయి.
అతను ఆస్తి మొత్తం అనాధ ఆశ్రమానికి రాశాను అని చెప్తాడు.
నిజానికి దానిని అలా రాయడు ఎందుకంటే పాప ఆపరేషన్ సంగతి ముందే తెలుసు కాబట్టి. రోజులు గడిచాయి ఒకరోజు పాపకి బాగోక పోవడం వలన హాస్పిటల్కి తీసుకు వెళ్తాడు డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలని
అంటారు లాయర్. వెంటనే సరే అని చెప్తాడు. పాప ఆస్తితో ఎంత డబ్బు ఖర్చుపెట్టి ఆమెకు ఆపరేషన్ పూర్తి చేస్తాడు.
పాప ఆరోగ్యంగా ఉంటుంది.
అప్పుడు అతను పాపతో జరిగిన విషయమంతా చెప్పాడు….. ఆ డబ్బు ఇప్పుడు ఏమీ లేదు. నీ ఆపరేషన్ కి చాలా డబ్బు ఖర్చు అయింది. నీకు మిగిలింది ఆయిల్ ఒక్కటే అని అంటాడు అందుకు పాపా సరే అంటుంది కొన్ని తర్వాత పాప మా ఇంటికి వెళ్తుంది ఆమె ఆ ఇంటిని అద్దెకు ఇచ్చి తన అండర్ గ్రౌండ్ లో నివసిస్తుంది. అద్ది డబ్బులతో తన జీవితాన్ని గడుపుతు ఆ అండర్ గ్రౌండ్ లో నివసిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *