అండర్ గ్రౌండ్ ప్లేన్ ఇల్లు Telugu Kathalu | Telugu Stories | Stories in Telugu| Panchatantra Kathalu
వాయిస్ : రామాపట్టణమనే ఊరిలో మట్టి గోపయ్య అంటే తెలియని వాళ్ళు ఉండరు.
మట్టిని నమ్ముకుని ఆ మట్టితో కుండలు చేస్తూ, వాటిని అమ్ముకుంటూ
జీవనం సాగిస్తూ ఉంటాడు. అతని భార్య అర్చన, కూతురు పూజ పుట్టగానే
చనిపోతుంది. అప్ప్తి నుంచి పూజకు తల్లి లేని తెలియకూడదని అన్నీ తానై
తల్లిలా పెంచుతూ, తండ్రిలా పోషిస్తూ చదివిస్తూ ఉంటాడు. తండ్రి కూతురు
కలిసి సంతోషంగా మట్టిని తొక్కుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ ఇంటికి ఒక
కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి వీరయ్య, అతని కూతురు దామిని
దిగుతారు. వాళ్ళను చూసిన గోపయ్య, సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు.
గోపయ్య : ఏరా వీరు..ఎలా ఉన్నావు? చాలా రోజులకు మా మీదా దయ పుట్టినట్టుంది.
వీరయ్య : నీకు మా మీదా ఆ మాత్రం కూడా లేదు కదా! మా దగ్గరికి రమ్మంటే రావు.
కనీసం పూజను పంపించమని అడిగిన పంపించవు.
పూజ : అంకుల్ బాగున్నారా !
వీరయ్య : అంకుల్ ఎంటమ్మా…ప్రేమగా ముద్దుగా మామయ్య అని పిలువు. నువ్వు
చిన్నగా ఉన్నప్పుడూ నన్ను అలాగే పిలిచే డావిని.
పూజ : అలాగే మామయ్య…కూర్చోండి. నేనెల్లి టీ తీసుకొస్తాను.
వాయిస్ : అని చెప్పి పూజ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వీరయ్య మట్టీ కూర్చిలో
కూర్చుంటాడు. డాడీ కారులో నీకు తెలియని చోటుకు తీసుకెళ్తానని చెప్పితే
దామిని చాలా సంతోష పడింది. తీరా ఈ మట్టి ఇంటికి తీసుకొచ్చే సరికి
దామిని అప్ సెట్ అయింది. అదీకాక అక్కడ ఉన్న మట్టిని చూడగానే
దామినికి నచ్చలేదు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటం ఇష్టం లేదు. టీ
తీసుకొచ్చిన పూజ గమనిస్తుంది.
దామిని : డాడీ…మనం వెళ్లిపోదామా ! నాకు ఈ మట్టిలో ఉండటం ఇష్టం లేదు.
వీరయ్య : బేబీ..అలా అనొద్దని చెప్పాను కదా! జస్ట్ టెన్ మినేట్స్…నా చిన్నప్పటీ
స్నేహితుడితో కాసేపు మాట్లాడుకుంటాను.
దామిని : బుల్ షీట్…మనమెంటి మన స్టేటస్ ఏంటీ ?
పూజ : మామయ్య..దామిని బాగా మాటలు నేర్చుకుంది కదా!
వీరయ్య : అవును తల్లి..ఇలాంటి మాటలు ఇక్కడికి వచ్చాకా చాలా బాగా
మాట్లాడుతుంది. నచ్చిన చొటైతే మనం మాట్లాడినా వినిపించుకోదు.
పూజ : చూస్తుంటే అర్థమవుతుంది అంకుల్ !
దామిని : ఈ చెత్త గ్లాస్ తో టీ తాగుతూ, ఆ మట్టి చైర్ లో కూర్చుని ఆ మట్టి ఇంట్లో ఎలా
ఉంటున్నావు డాడీ. నాకు చిరాకు వేస్తుంది.
వాయిస్ : అని కోపంగా తన చేతిలో ఉన్న గ్లాస్ ను విసిరి కొడుతుంది. అది చూసి
వీరయ్య కోపంగా…
వీరయ్య : బేబీ…ఏంటి నువ్వు చేస్తున్నది? ఈ రోజు మనం ఇలా ఉన్నమంటే అందుకు
కారణం ఈ మట్టి స్నేహితుడే !
దామిని : నువ్వు నమ్మిన నమ్మక పోయిన నా అంతరాత్మ నమ్మితే చాలు. ఈ రోజు మీ
డాడీకి కార్లు తయారు చేసే కంపనీ ఉన్న, ప్లేన్ తయారు చేసే కంపనీలో షేర్
ఉన్న అదంతా నా మిత్రుడు గోపయ్య పెట్టిన బిక్షే !
గోపయ్య : ఒరేయ్ వీర్…పిల్లల ముందు అలాంటి పెద్ద మాటలు ఎందుకురా!
వీరయ్య : లేదురా గోపి..నీ గురించి తెలియాలి.
పూజ : అవును నాన్న…దామినికి వాళ్ళ నాన్న గొప్పవాడు కావొచ్చు. కానీ నా
తండ్రిని తక్కువ చేయడం నాకు నచ్చదు.
దామిని : ఏముందే మీ దగ్గర…మాలాగా పెద్ద బంగ్లా ఉందా! కార్లున్నాయా? మా డాడీ
బిజినెస్ మాన్ ! మరి మీ డాడీ?
పూజ : అయ్యో దామిని…నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఈ రోజు నువ్వు
అనుకున్నట్టుగా కార్లను, బొమ్మలను మా నాన్న ఎప్పుడో మట్టితో తయారు
చేశాడు. మట్టితో కారులా ఉండే ఇల్లులు కట్టాడు. మా నాన్న కూడా బిజినెస్
మానే కానీ డబ్బు బిజినెన్ మాన్ కాదు… మట్టి మనిషి!
వీరయ్య : అవును పూజమ్మా ! చాలా బాగా చెప్పావు. దామిని…మనం డబ్బులు పెట్టి
ఏదైనా కొనుక్కోవాలి. కానీ నా మిత్రుడు గోపయ్యకు ఈ మట్టి చాలు. తనలో
ఉన్న నైపుణ్యంతో ఈ మట్టిని బొమ్మలా మలచగలదు. కారులా తయారు
చేయగలడు. మనలాగ పెద్ద మట్టి ఇంటీని కూడా కట్టుకోగలడు.
దామిని : షో అప్ చేయకండి డాడీ. అంకుల్ కు అన్నీ క్వాలిటీస్ ఉంటే…ఇంకా ఇలా
ఎందుకు ఉన్నాడు? బంగ్లా మోడల్ తో మట్టి ఇల్లు ఎందుకు కట్టుకోలేదు.
మట్టి కారును ఎందుకు వాడటం లేదు.
పూజ : ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటీ దామిని? మాకు మీలాగా ఇల్లు లేదనా…కారు
లేదానా…లేకపోతే మేము మీలాగా డబ్బున్న వాళ్ళం కాదాన… !
దామిని : అన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పూజిత…
వాయిస్ : అని తను నిలబడిన చోటు నుంచి గోపయ్య దగ్గరికి వస్తుంది.
దామిని : అంకుల్…మీరు మా డాడీ చెప్పినట్టుగా టాలెంట్ ఉన్నవాళ్ళు అయితే
నేనొకటి అడుగుతాను. మీరు అది చేసి పెడతార…అప్పుడు నేనే మిముల్ని
మనసారా మామయ్య అని పిలుస్తాను.
గోపయ్య : చెప్పమ్మ…నీ నోటితో కమ్మగా మామయ్య అని పిలిపించుకోవడానికైన
నువ్వు చేసే ఛాలెంజ్ ను తీసుకుంటాను.
దామిని : గుడ్ అంకుల్…ఎప్పటి నుంచో అండర్ గ్రౌండ్ ప్లేన్ హౌస్ కట్టండి.
గోపయ్య : సరేనమ్మా ! భోజనం చేయండి.
దామిని : చెప్పాను కదా అంకుల్…నేను ఇక్కడ ఏమి చేయాలన్న మీరు నేను చెప్పింది
చేయండి. అప్పుడు నేను అన్నీ తీసుకుంటాను.
వాయిస్ : అని చెప్పి వీరయ్య, దామిని కారులో అక్కడి నుంచి వెళ్లిపోతారు. గోపయ్య,
తన పని తను చేసుకుంటూ ఉంటాడు. పూజ చదువుకుంటూ ఉంటుంది.
అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. గొప్పయ్య కష్టపడుతూ అండర్ గ్రౌండ్ ప్లేన్
హౌస్ ను కట్టేస్తాడు. దానిని చూసి పూజ చాలా సంతోష పడుతుంది.
దామినికి ఫోన్ చేసి చెప్పుతుంది. కారులో వీరయ్య, దామిని గోపయ్య
ఇంటికి వస్తారు.
వాయిస్ : గోపయ్య మట్టితో కట్టిన అండర్ గ్రౌండ్ ప్లేన్ హౌస్ ను చూసి దామిని
మురిసిపోతుంది. నిజమైన ప్లేన్ లాగా చాలా అద్భుతంగా ఉంది ఆ ఇల్లు.
దామిని ఆ ఇంటిను చూస్తూ మైమరిచిపోతుంది. ఆ ఇల్లును చూసినప్పటి
నుంచి దామిని గోపయ్యను మెచ్చుకోకుండా ఉందలేకపోతుంది. దాంతో
దామిని వెళ్ళి అందరికీ టీ పెట్టి తీసుకుని వస్తుంది. అది చూసి షాక్
అవుతుంది పూజ. అందరూ టీ తీసుకుంటారు.
దామిని : పూజ ఆఫ్టర్ నూన్ చికెన్ బిర్యాన్ని చేసుకుందాం! డాడీ వాళ్ళకు
చెప్పు…వెళ్ళి అందుకు కావల్సిన వాటిని తీసుకుని రమ్మని అని!
వాయిస్ : ఆ మాట స్నేహితులిద్దరూ వీరయ్య, గోపయ్య మాట్లాడుకుంటూ అలా
నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి పిల్లలకు ఇస్తారు. దామిని, పూజిత ఇద్దరు
కలిసి కిచెన్ బిర్యాన్ని చేస్తారు. అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు.
-0-
వీరయ్య, గోపయ్య ప్రాణా స్నేహితులు. గొప్పయ్య మట్టితో కుండలు, బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటూ బతుకుతూ ఉంటాడు. వీరయ్య కార్య వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాదించి ధనవంతుడవుతాడు. స్నేహాన్ని మరిచిపోకుండా గోపయ్య ఇంటికి కూతురు దామిని తీసుకుని వస్తాడు. మట్టీల్లు, మట్టివాళ్లు దామినికి నచ్చేది కాదు. పేదవాళ్లని, మట్టి వాళ్ళని తిడుతుంది. డబ్బున్నదన్న పొగరుతో మాట్లాడుతుంది. చివరకు మట్టితో అండర్ గ్రౌండ్ ప్లేన్ హౌస్ కట్టమని చెప్పి పందెం వేస్తుంది. గోపయ్య అనుకున్నట్టుగానే అండర్ గ్రౌండ్ ప్లేమ్ హౌస్ కడతాడు. అప్పుడు గోపయ్య విలువ తెలుసుకుని పొగరు తగ్గించుకుని వాళ్ళతో కలిసిపోయి సంతోషంగా ఉంటుంది.
-0-
Related Posts

మాయా స్విమ్మింగ్ పూల్ లో మిషన్ | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu

మాయా ఆక్సిజన్ సిలిండర్ సహాయం | Telugu Stories| Telugu Kathalu| Bedtime Stories| Panchatantra
