అత్తగారి గ్యాస్ ట్రబుల్ కష్టాలు | Village Attha Kodalu | తెలుగు కథలు | Telugu Comedy Stories

గోవిందపురం అనే గ్రామంలో విష్ణుమూర్తి అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని భార్య పేరు సరోజా. ఆమెకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది. ఆ దెబ్బతో ఆమె కొడుకు రమేష్ , భర్త విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఇంట్లోనే వేరే గదిలో ఉండే వాళ్ళు. కొన్ని రోజులు గడిచాయి . రమేష్ కి రోజా అనే అమ్మాయి తో పెళ్లి జరుగుతుంది.
రోజాకు అత్త గురించి తెలియదు కాబట్టి ఆమెతో పాటు కలిసి వంట పని చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా పెద్ద శబ్దం వస్తుంది .
కోడలు భయపడుతూ … చి చి ఏంటి శబ్దం అబ్బో విపరీతమైన ఈ కంపు.
అత్త : అయ్యో ఇది నా దగ్గర నుంచి వచ్చింది అనుకోవటం లేదనుకుంటా. ఎలాగైనా దీన్ని కవర్ చేయాలి. అని అనుకోని కోడలితో…. సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు వచ్చారు . పక్క వీధిలో ఉన్నారంట ఒకటే కంపు.
కోడలు : కంపు సరేగాని అత్తయ్య శబ్దమే ఏమిటో అర్థం కాలేదు.
అని అంటుంది అత్త: ఏమో మనకు తెలీదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది .
ఆ మే వెళ్లిపోయిన వెంటనే కోడలు : ఏంటి మా అత్తయ్య వెళ్లిన వెంటనే వాసన కూడా పడిపోయింది. అని అనుకొని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది.
ఇందులో కొడుకు ‘ రోజా ఎక్కడున్నావు ఏం టిఫిన్ చేస్తున్నావు అని అంటాడు.
వెంటనే రోజా అతనితో : సాంబార్ ఇడ్లీ చేస్తున్న నండి అని అంటుంది అందుకు
అతను : సాంబార్ ఇడ్లీ చేస్తున్నావా అమ్మో ఈరోజు మా పని అయిపోయింది . మా అమ్మకు మాత్రం సాంబార్ ఇడ్లీ పెట్టకు.
అనీ అంటాడు అందుకు ఆమె….. ఎందుకండీ మీ అమ్మగారికి సాంబార్ ఇడ్లీ ఎందుకు పెట్టకూడదు.అతను : నేను ఒక సారి చెప్పాను కదా వద్దు అని నా మాట విను లేదంటే ఇల్లంతా ఈరోజు కంపుతో అల్లాడి పోతాము.
రోజా :ఏంటి మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది ఇంతలో అత్త వచ్చి… అమ్మాయి రోజా టిఫిన్ పెట్టు తల్లి నాకు చాలా ఆకలిగా ఉంది.
ఇంకా రమేష్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు కోడలు అత్త కి టిఫిన్ అందిస్తుంది.
ఆమె సాంబార్ ఇడ్లీ తింటూ ఉంటుంది.
కోడలు : ఎలా ఉంది అత్తయ్య సాంబార్ ఇడ్లీ.
అత్త: బావుంది కానీ ఏంటి సాంబార్ కొంచెం పేస్టు వాసన వస్తుంది
కోడలు… ఏం లేదు అత్తయ్య వంటగదిలో ఉప్పు కోసం వెతుకుతున్నాను ఉప్పై అయిపోయినట్టుంది కనపడలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే టీవీలో మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా. అంటూ యాడ్ వచ్చింది . మన టు పేస్టు ఉప్పు ఉంది కదా అని అది వేసాను అత్తయ్య బాగుందా టెస్టు.
అత్త వైపు ఆశ్చర్యంగా చూసి: నా తల్లి నా తల్లి ఎంత గొప్ప పని చేసావ్ అమ్మ . ముందే చెప్పాల్సింది అంతా అయిపోయిన తర్వాత చెప్పావు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో.
అని అనుకుంటుంది ఇంతలో కోడలి భర్త మామయ్య బయటకు వచ్చి హడావిడిగా వెళ్ళి పోతూ ఉంటారు.
దాన్ని చూసిన కోడలు : ఎక్కడికి హడావిడిగా వెళ్లిపోతున్నారు టిఫిన్ చేసి వెళ్ళండి.
వాళ్ళు : మాకు పని ఉంది నువ్వు జాగ్రత్త మేము సాయంత్రం దాక ఇంటికి రాము అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు కోడలు … ఏంటో ఈ మనుషులు నాకు ఏమీ అర్థం కాదు అని అనుకుంటుంది ఇంతలో ఒక్కసారిగా మళ్లీ పెద్ద శబ్దం వినపడుతూ విపరీతమైన దుర్వాసన మొదలవుతుంది.
కోడలు ; అబ్బా ఏంటి దరిద్రమైన వాసన.
నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి బయటకు పరుగులు తీస్తుంది బయట అత్త తన పొట్ట పట్టుకొని : అబ్బా నా కడప అంతా ఒకటే గ్యాస్ ట్రబుల్. నాకేం అర్థం కావటంలేదు. ఏంటి అబ్బో అంటూ పెద్దపెద్ద శబ్దాలతో గ్యాస్ ని బయటికి పంపిస్తూ ఉంటుంది.
దాన్ని చూసిన కోడలు : వామ్మో ఈ శబ్దాలన్నీ చేస్తుంది మా అత్తయ్య గ్యాస్ సిలిండర్ పేలిన అంత పెద్ద శబ్దం.
పొద్దున మా అత్త అబద్దం చెప్పిన మాట నాకు ఇప్పుడు అంతా అర్థమైంది . నా భర్త మావయ్య ఎందుకు బయట పరిగెత్తారు నా భర్త పొద్దున ఆమెకు ఎందుకు సాంబార్ ఇడ్లీ పెట్టొద్దు అన్నాడో వామ్మో. ఇది ఎక్కడ వింత నాయనో నాకు ఏమి అర్థం కావట్లేదు అని ముక్కు మూసుకొని ఇంట్లో కి వెళుతుంది.
అత్త అటు ఇటు తిరుగుతూ ఆపసోపాలు పడుతూ : అబ్బా నేను అనుకుంటూనే ఉన్నాను. సాంబార్ ఇడ్లీ తినకూడదు తినకూడదు అని తిన్న తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నాను. ఓరి భగవంతుడా
అని అటూ ఇటూ తిరుగుతూ లోపలికి వెళుతుంది.
కోడలు ముక్కు మూసుకొని ….అత్తయ్య దయచేసి నాకు దగ్గరగా రాకండి . అమ్మో అది కడుప లేకపోతే సెప్టిక్ ట్యాంక్.న
అత్త : మన మనసులో కోడలికి నా గ్యాస్ ట్రబుల్ సంగతి తెలిసి పోయినట్టుంది.
ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి.
అని అనుకొని కోడలితో: అయ్యో నన్ను ఏం చేయమంటావు. కోడలా నా తప్పు కాదు కదా .
కోడలు :విపరీతంగా తినక పోతే ఏమవుతుంది. మా ఆయన మీ ఆయన ఎలా బయటకు పరిగెత్తాడు తెలుసా ఏంటో వింత జంతువు ఏదో ఇంట్లోకి వచ్చినట్టుగా పరుగులు తీశారు నేను కూడా వాళ్ళతో పాటే వెళ్లాల్సింది. నాకేం తెలుసు ఇంత జరుగుతుందని.
అత్త : సరే అయితే నువ్వు ఒక గదిలోనే ఉండు బయటికి రాకు .
గ్యాస్ ట్రబుల్ తగ్గే లాగా లేదు . పొట్ట అంతా ఒకటే ఉబ్బరం. అని అంటుంది కోడలు నాకెందుకు వచ్చిన గొడవ నేను లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటాను అని లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది.
మా ఇంట్లోనే తిరుగుతూ తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ తన పొట్ట లో ఉన్న గ్యాస్ నీ బయటికి పంపిస్తూ ఉంటుంది .
తలుపులు వేసుకొని లోపల ఉన్న కోడలు : వామ్మో తలుపులు వేసుకుని కూడా ముక్కుల్లి బద్దలై పోతున్నాయి .
అంటూ తలుపు తీసుకొని ఇంటి బయటకు వెళ్ళిపోతుంది.
ఆమె ఇంటి బయట కూర్చొని ఆయాసపడుతూ వాంతులు చేసుకుంటూ ఉంటుంది.
దాన్ని చూసి నా పక్కింటి ఆమె : అమ్మాయి ఏంటి అర్థం చేసుకుంటున్నావు పెళ్లయింది ఈమధ్య కదా అప్పుడే కడుప ఈ జనరేషన్ వాళ్ళు చాలా తొందరగా ఉన్నారు ఏంటో ఇలా పెళ్లి చేసుకోవడం అలా పిల్లల్ని కనడం కంప్యూటర్ కాలం అనుకుంటా .
ఇంకా ముందుముందు ఎలా ఉంటుందో . అని అంటుంది అందుకు కోడలు : మాట్లాడితే మీనింగ్ ఉండాలి మీకు కొంచెమైనా బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా. ఈ వాంతులు ఆ వాంతులు కాదు మా అత్త తన కడుపులో నుంచి బయటికి వదిలే గ్యాస్ తట్టుకోలేక వచ్చింది.
అందుకు ఆమె చాలా ఆశ్చర్యపోతూ ; నాకు ఏమీ అర్థం కాలేదు నువ్వు ఏం చెప్తున్నావ్.
కోడలు : నీకు అర్థం కాలేదా. సరే ఇలా రండి మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను అని అంటుంది ఆమె సరే అని చెప్పి అక్కడికి వస్తుంది వెంటనే ఆ కోడలు ఆమెనీ అత్త ఉన్న ఇంట్లోకి పంపించి తలుపు వేస్తుంది.
లోపల ఉన్న ఆమె : ఏంటండీ నన్ను లోపల పెట్టు తలులిపేసారు తలుపు తీయండి అని అంటుంది.
బయట ఉన్న కోడలు ఆమెతో : కంగారు పడకండి మీకే కొంచెం సేపు ఉంటే అర్థం అవుతుంది.
అని అంటుంది లోపల అంతా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది.
ఆ శబ్దానికి ఆ వాసనకి లోపల ఉన్న ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ….. తెలుపు తియ్యి అమ్మో ఈ కంపుతో నేను చచ్చిపోయేలాగే ఉన్నాను. త్వరగా తలుపు తియ్యి అంటూ కేకలు వేస్తుంది. ఆ మాటలు విన్న కోడలు వెంటనే తలుపు తీస్తుంది ఆమె బయటకు వచ్చి…. అమ్మో లోపల కాసేపు ఉంటే నేను చచ్చి పోయే దానిని ఏమో. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు వాంతులు చేసుకున్నాఓ అని అంటూ ఆమె కూడా వాంతులు చేసుకోవడం మొదలు పెడుతుంది.
కొంత సమయం తర్వాత ఆమె కోడలితో….. వామ్మో ఇన్ని రోజుల నుంచి నేను ఏదో అనుకున్నాను మా ఇంటిదాకా ఈ దుర్వాసన వస్తూ ఉండేది నేను ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అనుకున్నాను కానీ ఎక్కడ నుంచి వస్తుందా. ఏదేమైనా మీ ఇంట్లో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఆమెతో పాటే. ఎలా ఉంటున్నారో. ఆ కంపెనీ ఎలా భరిస్తున్నారు తలుచుకుంటేనే చాలా వింతగా ఉంది అని అంటుంది ఆ మాటలకి కోడలు పెద్దగా నవ్వుతూ ; హా హా నాకు ఈ రోజే ఆ విషయం తెలిసింది. ఇన్ని సంవత్సరాలుగా నా భర్త మావయ్య ఎంతో ఓపికగా భరించారు.
అని అంటుంది అందుకు ఆమె …. ఏమోనమ్మా నాకు ఎందుకు వచ్చిన గొడవ నేను వెళ్ళిపోతాను. అని ఆమె అక్కడ నుంచి వెళ్లి పోతుంది కోడలు బయట తలుపు వేసి…. అత్తయ్య నేను బయట తలుపు వేస్తున్నాను.
అని చెబుతుంది లోపల ఉన్న అత్త…. ఒసేయ్ ఆ పని చేయ మాకా . ఆ కంపు భరించలేక నేను ఇక్కడే చచ్చిపోతాను. తలుపులు కిటికీలు అన్ని తెరిచి ఉంచుతాను. అని అంటుంది కోడలు…. సరే మీరు అయితే ఎలాగో తగలడం డి నేను బయటికి వెళ్ళి పోతున్నాను.
అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది అత్త ఆమెనీ పిలుస్తున్న కూడా పట్టించుకోదు.
అత్త : చి చి ఏంటో నా బతుకు ఇలా తగలడింది అందరు నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు డాక్టర్కు చూపించుకోవాన్న నాకు కొంచెం నామోషి తో ఇలా ఉన్నాను.
లేకపోతే దానికి ఏదో ఒక పరిష్కారం దొరికేది అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది.
అప్పుడే కోడలు అక్కడికి ఒక డాక్టర్ ని తీసుకొని వస్తుంది.
డాక్టర్ ఇంట్లోకి రావడమే …. ఏంటి ఇక్కడ ఎంత కంపు కొడుతుంది. మీ ఇంటిని శుభ్రం చేసుకోవడం లేదా. చాలా విచిత్రంగా ఉంది. ఈ వాసన అంటుంది అందుకు కోడలు నవ్వుతూ…..హా హా హా డాక్టర్ గారు ఇందాక చెప్పింది మర్చిపోయినట్టున్నారు మా అత్తయ్య గ్యాస్ ట్రబుల్ వల్ల ఇదంతా అని అంటుంది డాక్టర్…. వామ్మో ఏంటి ఎలా ఉంది సాంబ్రాణి పొగ మొత్తం ఇల్లంతా కమ్ముకుంటే ఎలా వస్తుందో వాసన. ఈ దుర్వాసన కూడా అలాగే ఉంది వామ్మో వెంటనే ఏమిటి పరిష్కారం మార్గం చూపించాల్సిందే అని లోపలికి వెళ్తుంది అక్కడ డాక్టర్ అత్తతో… మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది.
అత్త… దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఉండండి.
డాక్టర్…. ఎన్ని రోజులు మరి దాని గురించి ఎందుకు పట్టించుకోలేదు.
అత్త…. ఇది డాక్టర్లకు చెప్పుకోవడానికి నాకు సిగ్గు వేసింది అందుకే దాని గురించి పట్టించుకోలేదు.
డాక్టర్ : ఇలాంటి సమస్య మీ ఒక్కరికే కాదు చాలా మందికి ఉంటుంది . అందులో సిగ్గు పడడానికి ఏముంది మనకి మనం గా తెచ్చుకున్న ది కాదు కదా. ఇలాంటి సమస్య డాక్టర్ కి చెప్పండి దానికి పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి అంతేగాని ఇలా తోటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు.
వ్యాధిని ముద్దు పెట్టుకుంటే అది మీకే ప్రమాదం ఆ గ్యాస్ ట్రబుల్ గుండెకు తట్టింది అంటే. గుండె ఆగిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది అని బుద్ధి చెబుతుంది.
ఆ తర్వాత డాక్టర్ కొన్ని మందులు ఇచ్చి.. ఇది ఉదయం పరకడుపున వేసుకోవాలి. అలాగే మీరు గ్యాస్ కలిగించే పప్పుదినుసులు లాంటివి వాడకండి. అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్త… కోడలా ఈరోజుతో నా సమస్య తీరిపోయింది చాలా సంతోషంగా ఉంది. అని అంటూ పెద్ద శబ్దం చేసి గ్యాస్ రిలీజ్ చేస్తుంది కోడలు…. అబ్బా ఈ రోజుతో కాదు. ఆ మందులు మీరు కచ్చితంగా వాడితే అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అత్త తప్పకుండా వాడతాను అని పెద్దగా నవ్వుకుంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *