అత్తా కోడళ్లని ఈ ఏనుగు కాపాడగలదా! Village attha kodalu | తెలుగు కథలు | elugu stories |Comedy Stories

కేంద్ర పురమని ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. ఆ ఏనుగు ఎవరు ఏది ఇచ్చినా తింటూ ఉండేది. అందరికీ అది చాలా మచ్చిక. ఎవర్ని ఏం చేసేది కాదు . అందర్నీ ప్రేమతో చూసేది. మనుషులు కూడా దానిని ప్రేమతో చూసేవాళ్ళు. అలా ఉండగా ఒక రోజు ఆ ఊరిలో ఉంటున్న అత్తా కోడలు . ఇద్దరూ
ఆ ఏనుగు దగ్గరికి వస్తారు. అత్త….ఒసేయ్ కోడలా ఏంటి అలా చూస్తా ఉంటావు . దానికి తినడానికి అరటి పండ్లు తీసుకు వచ్చావ్ కదా దానికి ఇవ్వు. కోడలు… ఇస్తున్న అత్తయ్య మీరు ఎందుకు అంత పెద్ద గా అరుస్తున్నారు . మీకు ఇవ్వకుండా దానికి ఇస్తున్ననాన. మరేం పర్వాలేదు మీకు కూడా ఇస్తాలేండి. మన ఇంటి దగ్గర చాలానే ఉన్నాయి. అత్త…. ఒసేయ్ ఇంకొక్క మాట ఎదురు మాట్లాడవు అంటే నీ మూతి పళ్ళు రాలగొడతా జాగ్రత్త .
నోరు మూసుకొని దానికి అరటి పండ్లు తినిపించు. కోడలు …. సరే అత్తయ్య అంటూ ఆ ఏనుగుకి అరటి పండ్లు ఇస్తుంది . ఏనుగు అరటిపండు తింటూ ఉండగా కోడలు…..
చూడమ్మా ఏనుగు నువ్వు పళ్ళు తిన్నాక మా మీద విశ్వాసం చూపించాలి కొంతమందికి అలాంటి విశ్వాసం ఉండదు అనుకో. నువ్వు మాత్రం విశ్వాసఘాతకురలుగా . మాత్రం అస్సలు ఉండదు. అత్త…. ఎవరి గురించి అలా మాట్లాడుతున్నావు ముక్కు కోసి పప్పు లో పెడతాను.
కోడలు…. ఎందుకు అత్తయ్య గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు . ప్రతి దానికి నేను ఒక్కదానుకి నేను ఉన్నాను అంటూ తగుదునమ్మా. అని పానకంలో పుడక లాగా మధ్యలో దూరాతా ఉంటారు.
అత్త… ఒసేయ్ సామెత నీకే కాదు నాక్కూడా వస్తాయి. అయినా నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఊరికే అనలేదు నీ లాంటి దానితో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ.
ఛీ అంటూ కోపంగా అసహ్యించుకుంటుంది ఆ మాటలు అన్నీ వింటున్నా ఏనుగు … అబ్బా మీ తిట్లతో నా చెవులు రెండు చిల్లులు పడిపోయేలా గా ఉన్నాయి ఒక మాటతో
వదిలి పెట్టేలా గాలేరు ఎందుకింత కోపాన్ని పెంచుకుంటున్నారు. ఒకరికి ఒకరు అస్సలు పడదు ఏంటో. ఆ మాటలు విన్న అత్త…. ఇంకొంచెం బాగా గడ్డి పెట్టమ్మా బుద్ధి అయినా వస్తుంది. ఇలాంటి దానికి ఎన్ని చెప్పినా కూడా అసలు అర్థం కాదు.
కోడలు…. ఎందుకు అర్థం కాదు. మీరు అసలు అర్థం అయ్యేలాగా చెప్తేనే కదా . చూడు ఏనుగు ఎప్పుడైనా నీకు మా అత్త కనిపిస్తే వెనక నుంచి ఒక గుద్దు … గుద్దితే చచ్చి ఊరుకుంటుంది . ఆ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకో అమ్మ.
అత్త…. ఏంటే ఎక్కువ వాగుతున్నావ్ . ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడాలంటే . నిన్ను తీసుకెళ్ళి చెరువులో తోస్తూనే అనుకున్నావో.
అలా ఇద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు ఏనుగు…. మీరిద్దరూ ఒక్క నిమిషం ఆగుతారా అసలు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు గొడవ పడుతున్నారు నాకు అర్థం
కావడం లేదు ఎప్పుడు మీరు బాగానే ఉంటారు కదా ఈరోజు మీకు ఏమైందో నాకు అర్థం కావడం లేదు . మీ ఇద్దరికీ పిచ్చి పట్టలేదు కదా.
అత్త…. అయ్యో కంగారుపడకు ఏనుగు . ఒక స్వామీజీ మాకు ఈ విషయం చెప్పాడు మీ ఇద్దరు ఎప్పుడూ అత్త కోడలు లాగా జన్మజన్మలకు పుట్టాలి అంటే . మేము ఒక రోజు తిట్ల పూజ చేయాలి అన్నాడు . అంటే మేము ఇద్దరం ఒక్క రోజు మొత్తం తిట్టు కోవాలి అని దాన్ని ఎవరో ఒకరు ఖచ్చితంగా వినాలి అని. మేమిద్దరం కనుక ఇంట్లో తిట్టుకున్నా అంటే చుట్టుపక్కల వాళ్ళు వింటారు ఎప్పుడూ లేనిది వీళ్లిద్దరు ఏంటి ఇలా గొడవ పడుతున్నారు అని. వాళ్లు కంగారు పడతారు అందుకే ఏ గొడవా లేకుండా నీ దగ్గరికి వచ్చాము. నువ్వైతే అన్ని వింటావు కదా . సరిపోతుంది మా మొక్కుబడి తీరుతుంది మేము జన్మజన్మలకు అత్తా కోడలు లాగే ఉంటాము.
ఆ మాటలు విన్న ఏనుగు చాలా పెద్దగా నవ్వుతూ…హా హా హా మీ ఇద్దరి పోరు చూస్తుంటే భలే వింతగా ఉంది. అదేదో సినిమాలో విలను హీరో కొట్టుకొని కమెడియన్ ని చంపేశారు అంట అలా ఉంది మీ ఇద్దరి వాలకం మీ ఇద్దరు తిట్టుకుంటూ నా చెవులు రెండు చిల్లులు పడే లాగా చేస్తున్నారు. ఇంక మీరు తిట్టుకుంది చాలు ఇక మీరు ఇంటికి దయచేయండి.
కోడలు… అయ్యో అప్పుడే వెళ్తే ఎలా. మేము ఈ రోజు మొత్తం ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉండాలి ఏనుగు అప్పుడే వెళ్తే మా వ్రతం పూర్తి అవ్వదు. ఇంక కొంచెం సేపు ఇక్కడే తిట్టుకుంటూ ఉంటాము . కొంచెం సేపు ఓపిక పట్టు. అని ప్రాధేయపడతాడు అందుకు ఏనుగు…. అమ్మో ఇంక నా వల్ల కాదు బాబోయ్ . నేను ఇప్పుడే ఇక్కడ నుంచి పరుగులు తీస్తాను. అంటూ అక్కడి నుంచి పరుగులు తీయడం మొదలు పెడుతుంది.
దాన్ని గమనించిన అత్త కోడలు ఇద్దరూ …. ఏనుగు ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను. ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను అంటూ కేకలు వేస్తారు. అందుకు ఏనుగు…. నేను ఆగలేను అంటూ ఒక చెరువు పై ఉన్న బ్రిడ్జి మీద నుంచి పరుగులు తీస్తుంది.
ఆ బ్రిడ్జి అసలుకి సరిగ్గా ఉండదు. ఆ ఏనుగు సురక్షితంగానే దాటి వెళ్లి పోతుంది.
అత్త కోడలు ఇద్దరూ ఆ బ్రిడ్జి మీద పరుగులు తీస్తూ వుండగా బ్రిడ్జి కొంచెం కూలుతుంది. కోడలు పడిపోవడానికి సిద్ధంగా ఉండి…. అత్తయ్య కాపాడండి నన్ను. అత్తయ్య వెంటనే కాపాడండి అత్తయ్య. అంటూ కేకలు వేస్తోంది వెంటనే అత్త కోడలు చెయ్యి పట్టుకొని.. ఆమెను బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ…. వామ్మో ఏం తింటున్నా వే. ఎంత బరువు ఉన్నావు నా తిండి కూడా సగం నువ్వే తింటున్నావ్ అనుకుంటా.
కోడలు…. అత్తయ్య నన్ను పైకి లాగండి కావాలంటే తీరిగ్గా నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఆమె ఎంత ప్రయత్నించినా కోడల్ని బయటికి తీయలేక…. ఓయ్ ఏనుగు అలా చూస్తూ ఉంటే ఎలా వచ్చ కొంచెం మాకు సహాయం చెయ్యి ..
అంటూ కేకలు వేస్తోంది అత్త. ఆ ఏనుగు వెంటనే అత్త చేయి పట్టుకొని ఇద్దరినీ పక్కకు లాగుతుంది.
కోడలు… అయ్యబాబోయ్ స్వర్గం అంచుల దాకా వెళ్లి వచ్చాను. ఇదేంట్రా బాబోయ్ ఏనుగు సరైన సమయానికి బలే కాపాడావు.
అత్త…. ఒసేయ్ అది కాపాడ్డానికి ముందే నేను నిన్ను పట్టుకున్నాను. ఆ సంగతి మరచి పోతున్నావా . కోడలు…. చాల్లెండి సంబడం అప్పుడే మరిచిపోయారా వ్రతం సంగతి. ఆ మాటలు విన్న ఏనుగు… ఇంకా మీ వ్రతం సంగతి ఆపాలి . ఇంత ప్రమాదం నుంచి బయటపడ్డ కూడా మీకు వ్రతాలు గుర్తుకొస్తున్నాయా . అసలా చెప్పిన వాడు ఎవడో గాని తలకు మాసిన వాడు అనుకుంటా . ఎవరు చెప్పారో ఆ స్వామీజీని నా దగ్గరికి తీసుకు రండి. అని అంటుంది అనువు అత్త……. ఇంకెవరు ఎప్పుడు ఎక్కడ తిరుగుతూ ఉంటాడు ఏ ఆ స్వామీజీ చాలా మహిమగల వాడు. అదిగో వస్తున్నాడు చూడు అంటూ స్వామీజీ వైపు చూపిస్తుంది. స్వామీజీ చూసిన ఏనుగు ….హా హా హా మీకు చెప్పింది ఆ స్వామీజీనా చంపారు పోండి.
ఆ మాటలు విన్న అత్తా కోడలు ఇద్దరూ చాలా ఆశ్చర్యపోతూ…. ఏమైంది ఎందుకు అట్లా అన్నావు ఏంటి చెప్పు.
ఏనుగు…. అతను ఒక పిచ్చివాడు మూడు సంవత్సరాలుగా ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. పిచ్చోడు చెప్పాడు అని చెప్పి మీరు
ఒక పిచ్చి వ్రతాన్ని ఎంచుకున్నారు ఇంకా వెళ్ళండి ఇంటికి. అని అంటుంది ఆ మాటలు విన్న అత్తా కోడలు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ….. ఒసేయ్ కోడలా ఏంటి ఇది. ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది.
కోడలు… ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి. సరే ఇంక వెళ్దాం పదండి అత్తయ్య బలే పనిచేశారు.
అత్త…. సరే వెళ్దాం లే కాని ఏనుగు. నువ్వు నా కోడలు ప్రాణాన్ని కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు అలాగే ఇప్పుడు ఆ పిచ్చి వాడి గురించి చెప్పి కూడా మంచి పని చేశావు. ఇక మేము వెళతాము అప్పుడప్పుడు మా ఇంటి వైపు వస్తూ ఉండు. సరేనా ఏనుగు…. సరే తప్పకుండా వస్తాలే అని అంటుంది ఆ తర్వాత .వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఏనుగు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక రోజులు గడిచాయి ఒకరోజు ఏనుగు కాలికి గాయం అయ్యి పెద్దగా అరుస్తూ అత్తా కోడలు ఉన్న ఇంటి ముందు పడిపోతుంది ఆ ఏనుగు అరుపులు విన్న అత్తా కోడలు ఇద్దరూ బయటకు వచ్చి…. అయ్యో ఏనుగు ఎంత పెద్ద గాయం అయింది . అయ్యో ఒసేయ్ చూస్తావ్ ఏంటి కోడలా లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రా. కోడలు పరిగెత్తుకుంటూ వెళ్ళి
ఇంటి లోపల ఉన్న బాక్స్ ని తీసుకొని వస్తుంది. అత్త ఏనుగు కాలు కి కట్టు కడుతుంది. ఏనుగు ఏడుస్తూ…. మీ ఇద్దరికీ చాలా కృతజ్ఞతలు. చాలా నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తుంది. అత్త…. అసలు ఈ గాయం ఎందుకయింది. ఏనుగు…. ఆ తాగుబోతు రామకృష్ణ ఉన్నాడు కదా. వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను…. రామకృష్ణ ఎందుకు ఎలా ఎప్పుడు తాగుతూ ఉంటావు . మీ ఆవిడ నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు ఏడ్చెదో . తెలుసా. పాపం నువ్వు ఆమె గురించి అస్సలు పట్టించుకోవటం లేదంట అసలుకి ఆమె గర్భవతి. ఈ మద్యం తాగడం మానేసి. భార్య ని చక్కగా చూసుకో.
అని చెప్పాను అందుకు రామకృష్ణ చాలా కోపంగా…. ఒసేయ్ ఏనుగు నాకే చెప్పే అంతటి దాని వెయ్యవా . ఎందుకే నీకు అంతా పొగరు. నేను మద్యం తాగకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా .నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను పదిమందిచేత తాగి స్థాను. అసలు ఎక్కడ దాక ఎందుకు నీ చేత మద్యం తాగి వస్తాను. అని బలవంతంగా నా చేత మద్యం తాగించి డానికి ప్రయత్నించాను. నేను మధ్యాన్ని దూరంగా విసిరి కొట్టి పరుగులు తీసాను అతడు నా కాలు ముందు మద్యం సీసా ని విసిరికొట్టాడు . అవి నా కాలి కి గుచ్చుకున్నాయి అంటూ ఏడుస్తుంది.
ఆ మాటలు విన్న అత్తా కోడలు ఇద్దరూ ఏడుస్తూ …. అయ్యో వాడు ఎంత పని చేసాడు అయిన నువ్వు ఎందుకు వాడిని వదిలేసాను . నీ బలం ముందు వాడి బలం ఎంత . నీకు అంత మంచి తనం పనికిరాదు.
ఏనుగు … నేను అతన్నికి హాని చేస్తే నా కన్నా విశ్వాసహీను రాలు ఎవరు ఉండరు . ఎందుకంటే అతని భార్య రోజు నాకు తినడానికి ఆహారం పెడుతుంది . ఆమె ఉప్పు తిని ఆమెకు ఎలా ద్రోహం చేయమంటావ్.
ఆ మాటలు విన్న అత్తా కోడలు ఇద్దరూ…. ఏనుగు నువ్వు ఎంత మంచి దానివి . కడుపు నింపిన పాపానికి నీకు నష్ట పెట్టిన వాడిని కూడా క్షమించవు . నీ జాలి హృదయం చూసి. అతని లాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి . అంటూ బాధపడతారు. తనం అంత దూరం నుంచి ఆ తాగుబోతు వ్యక్తి రామకృష్ణ వింటాడు. అతను చాలా బాధపడుతూ ఏనుగు దగ్గరకు వచ్చి…. అయ్యో ఏనుగు నన్ను క్షమించు . నా గురించి ఆలోచించి అలా చేసావా . నేను పెద్ద పొరపాటు చేశాను . నిజానికి నీ బలం ముందు నా బలం ఎంత. మీ యొక్క మంచితనంతో నా మనసుని మార్చావు . ఇంకెప్పుడూ నేను తాగను. నిన్ను గాయపరిచిన పాపానికి ప్రాయశ్చిత్తంగా
నేను నిన్ను పెంచుకుంటాను. నా దగ్గరే ఉండు.
నేను నిన్ను చూసుకుంటాను. ఇన్ని సంవత్సరాలు నా పెళ్ళాం పొలాన్ని సాగు చేసి. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపింది నేను దాని దగ్గర డబ్బు తీసుకొని తాగి తందనాలు ఆడాను . ఇక మీదట ఆ పొలం నేనే సాగు చేస్తాను . నేనే కష్టపడతాను. ఆ మాటలు విన్న అత్తా కోడలు చాలా సంతోష పడతారు. ఏనుగు కూడా మరింత సంతోషపడుతూ…. రామకృష్ణ నీలో మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా నేను నీతో పాటే వస్తాను . అలాగే నీకు పొలం పనులలో సహాయం కూడా చేస్తాను. అంటుంది అందుకు తను సరే అంటాడు . ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. అత్తా కోడళ్ళు ….. చెడు వెనకాలే మంచి దాగి ఉన్నట్టు. ఏనుగుకి చెడు చేసినా . అది ఇప్పుడు ఇద్దరికీ మంచిదయింది అంటూ సంతోషపడుతూ ఇంటిలోపలికి వెళ్తారు. ఇక ఆరోజు నుంచి రామకృష్ణ తాగుడు మానేసి . పొలాన్ని సాగు చేసుకుంటూ , ఏనుగు ని అతని భార్య ని బాగా చూసుకుంటూ ఉంటాడు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *