అత్త కోడళ్ల విచిత్ర మైన ఆట Village attha kodalu | తెలుగు కథలు | Telugu stories |Comedy Stories

అనంతపురం అని ఒక చిన్న గ్రామము ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు అత్తా కోడళ్ళు ఉండేవాళ్ళు. ఒకరోజు అత్త కోడలితో…. అమ్మ నా కోడలా నీ మొగుడు. నా ముద్దుల కొడుకు ఎక్కడికి వెళ్లాడు. కోడలు…. ఏమో అత్తయ్య నాకు తెలియదు. కానీ ఎందుకు.
అత్త…. ఈరోజు నేను ఒకటి అనుకున్నాను నిమ్మకాయ నా కొడుకు తల మీద పెట్టి ఒక ప్లేట్ తో దానినీ కింద పడేయాలి అదే నా టార్గెట్. కోడలు… ఓహో అయితే అత్తయ్య నేను బాదంపప్పు మీ అబ్బాయి మీద పెట్టి దాన్ని ఒక ఒక ప్లేటుతో కిందపడిలే చేస్తాను.
అత్త…. నువ్వు కనుక అలా చేస్తే ఈ రోజు మొత్తం ఇంటిపని వంటపని.
కోడలు…. మీరే చేస్తారా అత్తయ్య.
అత్త… కాదు నా కొడుకు చేత చేయిస్తాను.
నువ్వు గనక ఓడిపోతే ఈరోజు పనులు మొత్తం నువ్వే చేయాలి.
కోడలు… సరే అత్తయ్య పనులు మొత్తం చక్క చక్క అయిపోతాయి. మీరు ఆ దిక్కులేని పెట్టుకోకండి మావయ్య పనులు బాగా చేస్తాడు. నేను ఓడిపోతే పనులు మొత్తం మావయ్యతో చేపిస్తాను.
ఇంతలో మామయ్య బయటకు వచ్చి… అమ్మ కోడలా హీరో విలన్ కొట్టుకొని కామెడ్యను చావు కొట్టినట్టు మధ్యలో నా గొడవ ఎందుకమ్మా.
కోడలు…. అయ్యో మావయ్య నా మీద నీకు నమ్మకం లేదా ఖచ్చితంగా మనమే గెలుస్తాము యు డోంట్ వర్రీ.
అని అంటుంది ఇంతలో కొడుకు రానే వస్తాడు. అత్త….. ఒరే అబ్బాయ్ కి వచ్చావా నువ్వు అక్కడ నిలబడ రా.
అతను… ఎందుకమ్మా ఈ రోజు నా మీద ఏం ప్రయోగం చేయాలనుకుంటున్నారు. ప్రతి రోజు ఏదో ఒక సాహసం చేసి నన్ను చంపుతున్నారు. కావాలంటే ఈ ఒక్క రోజుకి నాన్న మీద ప్రయోగించండి.
అతను…. ఒరేయ్ ఎందుకురా నేను అసలే ముసలి ప్రాణాన్ని. నన్ను వదిలి పెట్టండి నాకు ఎందుకు వచ్చిన గొడవ అంటూ అక్కడి వెళ్ళిపోతాడు.
కోడలు…. ఏవండీ యొక్క రోజు నా మాట వినండి. మేమిద్దరం పందెం పెట్టుకున్నాము అంటూ పందెం గురించి వివరిస్తారు
దాన్ని విని అతను భయంతో …. అమ్మ ఇలాంటి సాహసాలు ఉపయోగాలు నామీద చెయ్యవద్దు అమ్మ. అంటాడు ఎందుకు వాళ్ళు ఒప్పుకోకుండా అతనికి ఒకచోట బలవంతంగా నిలబెడతారు. ఆ తర్వాత అతని నెత్తిమీద నిమ్మకాయ పేడతారు. అప్పుడు కోడలు… అత్తయ్య నీకు కేవలం మూడు అవకాశాలు మాత్రమే. ఇస్తున్నాను మీ దగ్గర ఉన్న మూడు ప్లేట్లతో మాత్రమే ఆ నిమ్మకాయను కింద పడేయాలి ఆ మూడింటిలో ఏ ఒక్క అవకాశం లో అయినా దాన్ని కింద పడి వేయకపోతే మీరు ఓడిపోయినట్టే. అలాగే నేను కూడా నిమ్మకాయ ని తీసేసి బాదం పప్పుని పెడతాను. మీకు ఎలా అయితే మూడు ప్లేట్లు ఇచ్చానో అదే విధంగా నేను కూడా మూడు ప్లేట్లు తీసుకొని . మూడు అవకాశాల్లో బాదం పప్పుని కింద పడేస్తాను. ఒకవేళ నేను ఓడిపోతే నేను చెప్పినట్టుగా మామయ్య పనిచేస్తారు. అంటుంది. ఇక పోటీ మొదలవుతుంది మొదటిగా అత్తా ఒక ప్లేటు తీసుకుని నిమ్మకాయ కు గురి చూసి విసురుతుంది ఆ గురి తప్పి ఆ ప్లేటు అతని మోకాలికి తగిలింది. అతను… అమ్మ చచ్చాను నన్ను కొన్ని రోజులు బతుకునిచ్చిలాగా లేరుగా మీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలేయండి.
అత్త… ఒరేయ్ ఇంకా రెండు ప్లేట్లు కదరా కొంచెం ఓపిక పట్టుకో. అని అంటుంది అతను అలాగే ఉంటాడు మరో ప్లేట్ విసురుతుంది.
అది ఈసారి అతని ముఖానికి తగులుతుంది అతను పెద్దగా అమ్మ అంటూ అరుస్తాడు.
ఆమె…. అయ్యో గురితప్పింది లేరా ఏమనుకోకు. అతను… అమ్మ ఏంటమ్మా ఇది నన్ను చంపేసే లాగే ఉన్నారు నాకు వద్దమ్మ నేను వెళ్ళిపోతాను. తల్లి…. అబ్బ ఒక్కొక్కటిగా లాస్ట్ అంటుంది. అతను సరే అని చెప్పి నిలబడతాడు ఈసారి గురిచూసి కచ్చితంగా ఆ నిమ్మకాయకు తగిలేలా గా కొడుతుంది. కానీ ఆ నిమ్మకాయ కు ప్లేటు తగులుతుంది కానీ కింద పడదు. అత్త …. ఒసేయ్ కోడలా నావల్ల కాలేదు నేను ఓడిపోయాను . అనుకున్న దాని ప్రకారం ఈ రోజు పనులన్నీ నాకొడుకే చేస్తాడు.
కొడుకు…. అమ్మ కూడా సమన్యాయం కాదు మీరిద్దరూ ఆట ఆడి నన్ను ఇరికించడం ఏంటి నేను పని చేయను.
కోడలు…. అత్తయ్య మీరు గనక పని చేయించకపోతే. మొత్తం పని మీరే చేయాలి.
అత్త…. ఒరేయ్ నేను పని చెయ్యలేను రా .నా మాట విను యొక్క రోజులు పని చేసి పెట్టు మా బాబు కాదు అంటూ బ్రతిమలాడు తుంది అందుకు తను సరే అంటాడు. కోడలు… ఏవండీ అయిపోలేదు ఇంకా ఆట .ఇప్పుడే అసలైన ఆట మొదలైంది అంటూ అతని నెత్తిమీద బాదంపప్పు పెడుతుంది.
అతను….. మళ్లీ ఇదేంటి.
కోడలు…. మీకు ఇందాక చెప్పాను కదా మర్చిపోయారా అని చెప్పి మూడు ప్లేట్లు తీసుకొని దూరంగా నిలబడి అతనిపై విసిరి కొడుతుంది అవి ఒకటి తన చేతికి తగులుతోంది. కోడలు…. రెండోది ట్రై చేస్తాను ఈసారి తప్పకుండా బాదంపప్పు కింద పడిపోతుంది. అంటూ రెండు ప్లేట్ విసురుతుంది అది అతని పొట్ట కు తగులుతుంది. అతను… ఒసేయ్ చూసుకొని కొట్టం తగలరాని చోట తగిలితే ఇంక అంతే సంగతులు. కోడలు…. సరే అండి అంటూ మూడు ప్లేట్ విసురుతుంది కానీ అది కూడా గురి తప్పి పక్కకు వెళ్లి పోతుంది.
అత్త…. కోడలా నువ్వు కూడా ఓడిపోయావు.
కోడలు…. నేను కింద ఇచ్చిన మాట ప్రకారం పనులన్నీ మావయ్య గారు చేస్తారు అని అంటుంది అప్పుడే మామ…. కోడలమ్మ నా మీద నమ్మకం లేదా అన్నావు . నీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు బాగా చేసావు ఇప్పుడు నేను చచ్చినట్టు పని చేయాలిగా.
కోడలు… మావయ్య మొత్తం పని మీరు చేయాల్సిన అవసరం లేదు మీ అబ్బాయి కూడా తోడు ఉన్నాడు ఇద్దరు కలిసి చేసుకోండి అని చెప్పి ఆ అత్త కోడలు ఇద్దరూ హాల్లో కూర్చుంటారు. ఇక తండ్రి కొడుకులు ఇద్దరూ అక్కడే పని చేస్తూ… వీళ్ళ వాలకం చూసావా ఎలా అయినా మన చేత పని చేయించాలని ఇలా చేస్తున్నారు. అబ్బా ఏంటో ఈ కర్మ అనుకుంటూ ఆపసోపాలు పడుతూ పనులు చేస్తారు.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఆ అత్తా కోడలు ఇద్దరూ ఒకచోట కూర్చుని …. అత్తయ్య నిన్న మొత్తం పని అంతా మావయ్య గారు ఆయనే చేశారు. ఈరోజు చేయడానికి నాకు చాలా బద్దకంగా ఉంది అత్తయ్య ఈరోజు కూడా పని తప్పించుకోవడం కోసం ఏదైనా చెప్పచ్చు కదా.
అత్త…. రోజు అంటే వాళ్ళకి అనుమానం వస్తుంది ఈ ఒక్క రోజుకి మనం పనులు చేద్దాం రేపు ఏదన్నా ఆలోచిద్దాం.
అని అనుకుంటారు ఆరోజు ఇద్దరూ పనులు చేసుకుంటారు. ఇక భర్తలు ఇంటికి రావడంతో వాళ్ళకి భోజనం వడ్డిస్తారు. వాళ్ళు భోజనం తిని …. ఏంటే ఈ కూరలో చండాలంగా ఉన్నాయి. నిన్న మేము ఎంత బాగా చేశాము.
అత్త…. తినకపోతే అక్కడ పడేయండి . వాడి తింటున్నాడు గా మీకు ఏమైంది.
కొడుకు…. అమ్మ నాన్న చెప్పింది నిజమే కూరలు అస్సలు బాలేదు. నిన్ను మేము చేస్తే లొట్టలేసుకుంటూ తిన్నారు గా అలాగే చెయ్యొచ్చు కదా. అత్త… అయితే రేపు నుంచి మీరే వంటలు చెయ్యండి మేము మిగిలి పని చేస్తాం. అతను…. అది ఎలా కుదురుతుంది అమ్మా మాకు పనులు ఉంటాయి గా.
అత్త… అయితే నోరుమూసుకొని పెట్టింది తినండి అంటుంది ఇక వాళ్ళు చేసేది ఏమీ లేక దాన్ని తింటారు. ఆ తర్వాత వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు ఆ రోజులు గడిచిపోతున్నాయి ఆ మరుసటి రోజు మధ్యాహ్న సమయం అత్త… ఒసేయ్ కోడలా ఈరోజు ఒక మంచి ఉపాయం ఆలోచించాను.
కోడలు…. ఏంటి అత్తయ్య అది చెప్పండి.
అత్త…. ఏం లేదు నా కొడుకు బాహుబలి అను నేను చెప్తాను నువ్వు కాదు అని చెప్పు.
నేను దాన్ని నిరూపిస్తాను నువ్వు కాళ్ళు పట్టుకో నేను చేతులు పట్టుకుంటాను ఒక కారు కింద నేడతాను. నా కొడుక్కి ఏమీ కాకుండా వస్తుందని నేను అంటాను.
దానికి భయపడి నా కొడుకు కచ్చితంగా పరిగెడతాడు. అలా పరిగెడితే పనులన్నీ వాడిచేత చేయిదాo సరేనా .
అందుకని సరే అంటుంది. అప్పుడే కొడుకు ఇంటికి వస్తాడు తల్లి…. ఒరేయ్ అబ్బాయి ఒక్క నిమిషం ఆగు నీతో మాట్లాడాలి.
అతను… ఏమిటమ్మా. ఏం లేదురా నేను నీ మీద ఒక పందెం కట్టాను. అందులో నువ్వే గెలుస్తాను అని నేను. మా ఆయన ఓడిపోతాడు అని నీ పెళ్ళాం అంటుంది నువ్వు ఈ పందెం గెలవాలి నా పేరు నిలబెట్టాలి నువ్వు కనుక ఓడిపోతే పనులన్నీ నువ్వు చేయాలి వాస్తుందంట.
అతను… అమ్మ ఈ పనుల కాన్సెప్ట్ నా దగ్గరికి తీసుకు రాకండి. కోడలు… చెప్పానుగా అత్తయ్య మీ అబ్బాయి దానికి ఒప్పుకోడు ఓడిపోతాడని. అందుకు అత్త…. నిజమే కోడలా వీడు ఇంత పిరికి వాడు అని అస్సలు అనుకోలేదు అంటూ అతన్ని లేనిపోని మాటలతో రెచ్చగొట్టాడు పౌరుషం తెచ్చుకున్న అతను…. అమ్మ అది ఏంటిదో మీరు చెప్పండి నేను తప్పకుండా కలుస్తాను ఒకవేళ నేను ఓడిపోతే ఇంటి పనులు నేనే చేస్తాను.
ఆమె……. అరేయ్ నువ్వు బాహుబలి అని దేనికైనా వేను తిరగవని. నేను చెప్పాను మేమిద్దరం నిన్ను ఒక దానికి ఎదురుగా నిలబడ్డ తాము దాంతో నువ్వు తలపడి గెలవాలి.
అతను…. ఏంటమ్మా అది చెప్పు. ఆమె… చెప్పను చేసి చూపిస్తాను బయటికి రా అంటూ బయటకు తీసుకు వెళుతుంది . అక్కడ ఆమె కోడలితో… కోడలా కాళ్ళు పట్టుకో. కోడలు…. మీ కాళ్ల అత్తయ్య. ఒక నిమిషం ఆగండి పట్టుకుంటాను.
కోడలు… ఒసేయ్ మట్టిబుర్ర నా కాళ్లు కాదే అబ్బాయి కాళ్ళు పట్టుకో నేను చేతులు పెట్టుకుంటాను.
అందుకామె సరే అంటుంది ఇద్దరూ ఒకరు కాళ్లు ఒకరు చేతులు పట్టుకుంటారు.
అతను…. అమ్మ ఏంటిది ఏం చేస్తున్నారు.
ఆమె…. ఒక్క నిమిషం ఆగరా నీకు అర్థం అవుతుంది అని అంటుంది. ఇంతలో ఒక కారు వస్తుంది.
అతను… అమ్మా నన్ను దించండి కార్ వస్తుంది. ఆమె…ఒరేయ్ ఇందాక చెప్పాను కదా దేనికైనా నువ్వు ఎదురు వెళ్ళాలి అని చెప్పి నిన్ను కార్ కి ఎదురు పంపిస్తున్నాను అని అంటుంది.
అందుకు అతను … అమ్మ నన్ను చంపేయి అనుకుంటున్నారా వదలండి అంటు గట్టిగా వాళ్ల నుంచి తప్పించుకొని అక్కడ నుంచి ఇంట్లోకి పరిగెడతాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ
కూడా ఇంట్లోకి పరిగెడతారు.
అక్కడ ఆమె… ఒరేయ్ ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వచ్చావు. నువ్వు ఓడిపోయావు కాబట్టి పని చేయాల్సిందే.
అతను…. అమ్మ ఇప్పుడు నాకు అర్థమైంది మీరు రెండు రోజులకు ఒకసారి పని నుండి తప్పించు కోవడం కోసమే ఇలాగ నా చేత సాహసాలు చేయిస్తున్నారు. నాకు అంత అర్థం అయింది.
అందుకు అతని తల్లి…. నా కొడుకు ఎంతైనా బలే తెలివైనవాడు. ఇట్టే నిజాన్ని పసిగట్టే సాడో. ఒసేయ్ కోడలా ఇంక మనం ప్రతిసారీ ఇలా వీటిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదే వాడు నిజం తెలుసుకున్నాడు. కదా ఇంకా వాడే పని చేస్తాడులే మనం వెళ్దాం పద
అని అత్త కోడలి ఇద్దరు అక్కడినుంచి వెళ్ళిపోతారు దాన్ని విన్న అతను ఆశ్చర్యంగా నోరు తెరుస్తాడు.
దాన్ని చూసిన తండ్రి…. ఒరేయ్ నోరు మూసుకో లేదంటే ఈగలు దోమలు లోపలికి పోతాయి.
అతని మాటలకి అక్కడ ఉన్న అత్త కోడళ్ళు…హా హా హా అని పగలబడి నవ్వుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *