అత్త కోడళ్ల వ్యవసాయం Village Comedy | Emotional Stories | Telugu kathalu | Telugu Stories

అది ఒక చిన్న గ్రామం.ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం అన్ని ఆ కుటుంబంలో శ్రీ లక్ష్మి వాణి అనే అత్తా కోడళ్ళు. శ్రీలక్ష్మి కొడుకు జయరాం. నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు వాళ్ల దగ్గర రెండు ఎద్దులు ఉండేవి. వాటిని ప్రతిరోజు జయరామ్ పొలానికి తీసుకు వెళ్తూ అక్కడ వాటి చేత పొలాన్ని సాగు చేస్తూ ఉంటాడు .
రోజులు గడుస్తున్నాయి అనుకోకుండా ఒక రోజు ఒక ఎద్దు కి జబ్బు చేసింది శ్రీ లక్ష్మి… ఏరా వెంటనే వెళ్లి పశువుల డాక్టర్ నీ తీసుకొని రా. ఆమె ఇంత పొద్దున్నే హాస్పిటల్లో ఉండదు . ఇల్లు ఇక్కడే కదా త్వరగా తీసుకొని రా. అని అంటుంది. అతను సరే అని చెప్పి డాక్టర్ గారి ఇంటికి వెళ్లి. అక్కడ ఆమెకు జరిగిన విషయం ఏంటో చెప్పి ఆమెను తీసుకొని వస్తాడు. ఆమె ఆక్కడి నుంచి ఆ ఇల్లు చేరుకుంటుంది. ఆమె ఆ ఎద్దు ని పరీక్షించి…… ఎద్దు చనిపోయింది అండి. పాము కాటు వేసినట్టుంది మీరు ఏదో దానికి చెప్పు అని అనుకున్నారు.అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది ఆ మాటలకి వాళ్ళు చాలా బాధ పడుతూ ఉంటారు. తల్లి….. మాయదారి పాము ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో.బంగారం లాంటి ఎద్దు నీ పొట్టన పెట్టుకుంది. ఇప్పుడే చేయాలి రా ఏదో ఒకటి చెప్పు. అతను…. చేసేది ఏముందమ్మ ఇంకో ఎద్దుని తీసుకొద్దాం.
ఆమె…. ఒక ఎద్దు ని ఎవరిస్తారు జత ఎద్దులు అయితే ఇస్తారు. ఆయన ఇప్పుడు ఎద్దుని కొనడానికి అంత డబ్బు ఉందా. అతను… అది కూడా నిజమే లే అమ్మ. అని అంటాడు .కానీ మరో ఎదుర్కొనడం కోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ అక్కడ ఒక ఎద్దు దొరకకపోవడంతో నిరాశ ఇల్లు చేరుకుంటాడు. రెండు రోజులు తర్వాత అయిదు పైన దిగులు పెట్టుకొని మరో ఎద్దు కూడా చనిపోతుంది. ఇక వాళ్ళు ఆ ఎద్దు కూడా దూరమై పోవడంతో మరింత బాధ పడతారు. శ్రీలక్ష్మి…. అయ్యో నా బంగారు గాజుల తమ్మి మరి తీసుకొచ్చాను ఎద్దుల్ని .
అవి మనకి పొలం దున్నడానికి ఉపయోగపడుతున్నాయి. వీడు గడ్డివాములు బండి లాగడానికి ప్రతి దానికి ఎంత చక్కగా ఉపయోగపడ్డాయో. ఇప్పుడు మళ్లీ కొనాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అంటూ తెగ ఏడుస్తూ ఉంటుంది కోడలు… అత్తయ్య ఊరుకొండి అత్తయ్య బాధపడకండి అంటూ ఆమెను ఓదారుస్తుంది. రోజులు గడిచాయి ఒక రోజు కొడుకు తల్లి దగ్గరకు వచ్చి….. అమ్మ అందరూ పొలం సాగు చేసుకుంటున్నారు. మనకు ఇప్పుడు ఎద్దులు లేవు కదా . మనం పొలాన్ని కౌలుకు ఇద్దామా.
శ్రీలక్ష్మి….. కౌవలిస్తే మనకంటు లాభం ఏం వస్తదిరా అసలుకే చాలా మీ నాన్న పోతూ పోతూ ఎన్ని అప్పులు చేసి పెట్టాడు తెలుసుగా. ఆ ఎద్దును ఉంటే వాటి చేత పొలం నుంచి ఈ సంవత్సరం కూడా ఏదో విధంగా అప్పులు కట్టుకునే వాళ్ళం. ఏం చేద్దాం మన తలరాత అలా రాసి పెట్టింది.
కొడుకు…. మరి కౌవులు ఇవ్వకుండా మనము సాగు చేయకుండా ఉంటే ఎలా అమ్మ. అలా అయితే చిల్లిగవ్వ కూడా రాదు కదా . ఖాళీగా దాన్ని వదిలేయడమే.
ఇంతలో కోడలు వచ్చి…. ఖాళీగా ఏం వద్దు నేను ఒకటి చెప్తాను వినండి. మనకంటూ మనం ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాము అలాగే ఇప్పుడు కష్టపడుతున్నాo . ఎప్పటి లాగే ఎద్దులు కి బదులుగా అత్తయ్య నేను నాగలి పట్టుకొని దున్ను తాము. ఏమంటారు అత్తయ్య మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది. అత్త….. మంచి సలహా ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తప్పేమీ లేదు మనమే నాగాలి పట్టుకొని దున్న దాము.
కొడుకు…. అమ్మ దానికంటే మతి లేక మాట్లాడుతుంది నువ్వు కూడా దానికి వత్తాసు పలుకుతావ్వు ఏంటి. మీరిద్దరూ నాగలి పట్టుకొని పొలం సాగు చేస్తే చూసే వాళ్ళు ఏమంటారు. శ్రీలక్ష్మి…. ఏమైనా అనుకో నివ్వరా ఏమవుతుంది మన కష్టాలు మనకి తెలుసు ఎదురు చూడాలి అంటే డబ్బు లేదు . పొలాన్ని కవులకు ఇస్తే మన అప్పులు తీరవ్వు అలా అని ఖాళీగా వదిలేస్తే బీడుగా మారుతుంది. అందుకే కోడలు చెప్పిందే సరైనది. అని అంటుంది . అందుకు అతను సరే అంటాడు. ఇక ఆ ముగ్గురు కలిసి పొలం దున్నడానికి వెళ్తారు. అత్త కోడలి ఇద్దరూ నాగలి కావిడి ని భుజాలపై మోస్తారు . వెనకాల ఉన్న అతను నాగలి పట్టుకుంటాడు అలా ముగ్గురు పొలాన్ని దున్నుతూ ఉంటారు.
అప్పుడే దాసు అనే ఒక వ్యక్తి అక్కడకు వచ్చి….. ఏరా నువ్వు మనిషివా పశువ్వా. తల్లి భార్య తో పొలాన్ని దున్నిపిస్తున్నావు.
శ్రీలక్ష్మి…. ఏమయ్యా ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తప్పేమీ లేదు . నువ్వు అంతగా మా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు.
అతను…. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు . నేను అన్న దాంట్లో తప్పేముంది. అలా చేయకూడదు అని చెప్తున్నాను మీ మంచి కోరే చెప్తుంటే అలా మాట్లాడుతున్నారు ఏంది.
శ్రీలక్ష్మి…. అవునా మీరు మా మంచి కోరుకుంటే మీకు రెండు ఎద్దులు ఉన్నాయి కదా. అవి ఒక నాలుగు రోజులు మాకు ఇవ్వండి. మా పొలం సాగు చేపించుకొని తర్వాత వాటిని మీకే అప్ప చెప్తాం.
అతను ఏం మాట్లాడకుండ అక్కడనుంచి వెళ్ళి పోతూ ఉంటాడు కోడలు… ఏంటండీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు.
అతను….. నీకు నా ఎద్దుల ని ఇస్తే నేను ఏం సాగు చేయాలి.
కోడలు…. కదా మాకు ఎద్దులు లేవు కాబట్టి మాకు మేము సాగు చేసుకుంటున్నాము ఇందులో బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటుంది అతను సరే అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
శ్రీలక్ష్మి…. సాయం చేయడం తెలియదు గానీ అందరూ మంచి కోరుకుంటమూ అని చెప్పేవాళ్లే. ఏంటో ఈ సమాజం అనుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.
కొంత సమయం తర్వాత తన పొలానికి వెళుతూ దాసు భార్య సరోజా అనే ఒక ఆమె వాళ్లని చూస్తుంది. ఆమె వెంటనే అక్కడికి వెళ్లి…. శ్రీ లక్ష్మీ వదిన ఏంటి మీరు ఈ పని చేస్తున్నారు. ఆమె…. మా ఎద్దులు రెండు చనిపోయాయి. వదిన అందుకే ఏం చేయాలో అర్థం కాక మేమే పొలాన్ని సాగు చేస్తున్నాం.
ఆమె….. అయ్యో ఎంత కష్టం వచ్చింది మికు అయినా. అయినా నాగలి పట్టి ఎద్దులు దున్నుతుంటే నే విత్తనాలు అంతంత మాత్రంగా లోపలికి వెళ్తున్నాయి. మీరిద్దరూ దున్నితే ఆ మొక్కలు కొంచెం ఎదిగిన తర్వాత నేల కులుతాయి. అందుకు శ్రీ లక్ష్మి…. మమ్మల్ని ఎత్తుపోవడానికి వచ్చారా వదిన మీకు ఏం పని పాట లేదనుకుంటా. మా కష్టం ఏదో మేం పడుతున్నాము. అయ్యో పాపం అని జాలి అనాల్సింది పోయి. పంట పండుతుందో లేదో అని శాపనార్థాలు పెడుతున్నారా. ఆమె…. అయ్యో మామ నీకు అలా అర్థమైందా వదిన నేను వాస్తవాలు చెప్తున్నాను.
కోడలు…. మీరు బాగా చెప్పారు కానీ . అయ్యో రామా అనే బదులు మామ అని కలిసినప్పుడే మీ బుద్ధ ఏంటో అర్థమైంది. చెప్పినంత వరకు చాలు ఇక మీరు వెళ్ళండి.
ఆమె…. ఉన్నది చెప్తే ఉలికిపాటు అంట . అలాగే ఉంది ఇది చూస్తుంటే. నాకెందుకు వచ్చింది అమ్మ మీ పాట్లు ఏదు మీరే పడండి అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
అప్పుడు అతను తల్లితో….. అమ్మ ఆమె చెప్పింది కూడా నిజమే కదా. ఎద్దును పెట్టి సాగు చూపిస్తేనే విత్తనాలు దున్నడం అంతంత మాత్రంగా ఉంటుంది. ఒకవేళ విత్తనాలు పెట్టిన మొక్క బలం గా ఉంటుందో లేదో అని చెప్పలేము. ఎందుకమ్మా ఇంత కష్టం. ఇంతటితో వదిలేసి వెళ్లి పోదాం పద.
అందుకు ఆమె…. ఒరేయ్ మనవంతు మనం కష్టపడుతున్నాము. ఇంక మిగిలింది అంతా ఆ పైవాడు చూసుకుంటాడు నువ్వు నోరు మూసుకొని పని కానివ్వు . అంటుంది అందుకు అతను సరేలే అన్నట్టుగా పొలం దున్నడం చేస్తారు. ఇక రోజులు గడిచాయి వరుసగా వారం రోజులు పైగా వాళ్ళు కష్టపడి
పొలాన్ని దున్నడం చేస్తారు ఆ తర్వాత విత్తనాలు చల్లడం నీళ్లు పెట్టడం కూడా జరిగిపోతుంది. రోజులు గడిచాయి పొలం పచ్చగా కనబడుతుంది. శ్రీలక్ష్మి…. ఒరేయ్ చూసావురా ఎట్లాగ పొలం పడిందో . ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం అప్పుడే వదిలేసినట్లు అయితే ఇంత బాగా పొలం పండించే వాళ్లమా . అతను…. అవునమ్మా నిజమే పొలం చాలా బాగా పండింది. అందరి కంటే మనమే చాలా బాగా కనబడుతుంది ఇంకా కొన్ని రోజుల్లో విత్తనం ఈనకు వస్తుంది. కొన్ని రోజుల్లో అది ముదురుతుంది. ఇక కోత కూడా మన ముగ్గురమే కలిసి కోసుకుందా ము. అని అంటాడు కోడలు…. తప్పకుండా అదే చేద్దాం అండి. అని అనుకుంటారు అప్పుడే అక్కడికి సరోజ తన పొలానికి వెళుతూ. వాళ్ల చేను బలంగా పచ్చగా ఉండటం చూసి వాళ్లతో…. వదినా ఆరోజు నేను ఏదో అనుకున్నాను కానీ మీరు నిజంగా సాధించారు వదిన. నేను చాలా పచ్చగా ఉంది . మొక్క కూడా బలంగా కనబడుతుంది. చాలా కష్టపడ్డారు నేను అన్న మాటలకి ఆ రోజే వెనక్కి వెళ్లిపోతారు ఏమో అనుకున్నాను . కానీ మీరు బాగా కృషి చేసి ఇంత వరకు వచ్చారు. ఇంక పొలం బాగా పండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వదిన.
శ్రీలక్ష్మి…. చాలా కృతజ్ఞతలు వదిన.
సరోజ… మీ అన్నయ్య నా కోసం అక్కడ ఎదురుచూస్తున్నాడు. నేను క్యారేజ్ తీసుకుని వెళ్లాలి. అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
శ్రీలక్ష్మి…. చూసావా అబ్బాయి మనుషులు ఎలా ఉన్నారో. అప్పుడేమో మీ వల్ల ఏమీ కాదు అన్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి నీకు ఏమీ అర్థం అర్థమైంది.
కొడుకు… నాకు చాలా బాగా అర్థమైంది అమ్మ . ఒక మనిషి కష్టమైన పనిని మొదలు పెట్టినప్పుడు ఇక వెనక్కి తిరిగి చూడకూడదు ఎలాంటి విమర్శలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగిపోవాలి. అప్పుడే మనం అనుకున్నట్టుగా విజయాన్ని సాధిస్తాము.
కోడలు…. కరెక్ట్ గా చెప్పారు. అయినా అత్తయ్య దాసు మావయ్య ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు కదా ఈ saroja పిన్ని మాత్రం ఏమి చేయకుండా ఉంటుంది.
మళ్లీ ఏదో పెద్ద కష్టపడే దానికి మళ్ళీ భలేగా మాట్లాడుతుంది.
శ్రీలక్ష్మి…. ఒసేయ్ దానికి మాటలే కాని చేతలు రావు సరే మనం వెళ్దాం పదండి అంటూ అక్కడి నుంచి ముగ్గురు వెళ్ళిపోతారు.
ఇక రోజులు గడిచాయి అతను అప్పుడప్పుడు పొలానికి కావలసిన బలం మందు చల్లుతూ నీటిని పెడుతూ వాటిని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా మరి కొన్ని రోజులు గడచాయి పంట బాగా విస్తారంగా పండుతుంది. దాన్ని చూసిన అతను చాల సంతోషపడుతూ. ఇక ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి పంటని వస్తారు.
మరి కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ల చేతికి వస్తుంది. అతను వాటిని అమ్మి డబ్బు తీసుకొని వస్తాడు.
డబ్బు తీసుకొచ్చి ఇంట్లో….. అమ్మ అమ్మ నేను
ఇవ్వాల్సిన అప్పులన్నీ అందరికీ ఇచ్చేస్తాను అవి పోగా ఇంకా నా దగ్గర 7 లక్షల రూపాయలు ఉన్నాయి అమ్మ. వీటితో ఒక 70 వేలు పెట్టి ఎద్దుల్ని కొనుక్కో వస్తానమ్మా.
శ్రీలక్ష్మి…. బాబు ఇప్పుడు ఎద్దులను తీసుకు రావడం ఎందుకు. పొలం పనులు లేవు కదా. వాటిని వృధాగా మేపి నట్టే అలా ఊరికే పని చేయకుండా తింటే వాటికి సోమరితనం వస్తుంది. పొలం వేసే ముందు తీసుకుందాం అంతేగాని. ఇదంతా జరగడానికి కారణం వి నీ భార్య ఆమెకు వచ్చిన ఆలోచనే కదా . మన అప్పులు తీరిపోయాయి కొంత డబ్బు సంపాదించాము. దానికి చీరలు నగలు కొన్ని పెట్టు. మిగిలినవి బ్యాంకులో వేసుకుందాం.
కోడలు ఆ మాటలు విని… ఏవండీ నా కంటే ముందు మీ అమ్మగారికి తీసుకురండి. ఈ వయసులో కూడా ఎంతో కష్టపడ్డారో.
అంటుంది ఆమె… కాదు ముందు కోడలికి తీసుకురా. కోడలు… కాదు అత్తయ్య కి తీసుకురండి. అంటూ ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇక దానిని అంతా వింటున్న అతను… అబ్బా ఇంకా ఆపండి ఇద్దరికీ ఒకేసారి తీసుకొస్తాను.
అని అంటాడు.
అందుకు అత్తా కోడలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని …హా హా హా హా అని నవ్వుకుంటారు. దాన్ని చూసిన అతను కూడా నవ్వుకుంటాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *