అత్త కోడళ్ళ కోడి గుడ్లు వ్యాపారం | Village Attha Kodalu | తెలుగు కథలు | Telugu Comedy Stories

ఒకరోజు కోడలు అత్త తో…అత్తయ్య నేను కూడా ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను . దానికి మీ తరఫున సహాయం ఉంటే ఇంకా బాగుంటుంది.
అత్త… సహాయం కావాలా నా తరపునుంచి ఏంటది.
కోడలు… ఏం లేదు అత్తయ్య మీరు కొంచెం మీకు వస్తున్న పెన్షన్ల డబ్బుని నాకు ఇవ్వండి దాంతో నేను ఆమ్లెట్ వ్యాపారం పెడతాను అంతకీ మూడింతలు మీకు ఇస్తాను.
అందరూ ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదించుకుంటున్నారు మనము ఈ రూపంలో డబ్బు సంపాదించు కుందాం.
అందుకు ఆమె… అయితే సరే రెండు వేల రూపాయలు ఇస్తాను. ఆ రెండు వేల రూపాయలతో నువ్వు ఏమన్నా చేస్కో.
అందుకు కోడలు ఒకసారి అంటుంది ఆ తర్వాత అత్తా ₹2000 తీసుకువచ్చి కోడలు ఇస్తుంది కోడలు వాటిని తీసుకొని సంతోషపడుతూ. పక్కనే ఉన్న గిరిజా కొట్టుకు వెళుతుంది. అక్కడ గిరిజతో…. గిరిజ ఒక ట్రే కోడిగుడ్లు, కేజీ ఉల్లిపాయలు ఒక ఉప్పు ప్యాకెట్టు, ఒక కారం ప్యాకెట్, నూనె డబ్బా ఒకటి, ఇవ్వు. ఆ మాటలు వినగానే చాలా ఆశ్చర్యంగా…. ఏంటి ఒక అట్ట కోడిగుడ్లు. ఇంకా చాలా రకాల చెప్పావు ఇవన్నీ నిజంగానే కావాలా. నేను వింటుంది చూస్తుంది కలా నిజమా.నాకు అసలు అర్థం కావట్లేదు పిల్లికి బిచ్చం పెట్టని మీ కుటుంబం ఇప్పుడు ఒక కోడిగుడ్డు అట్ట కావాలి అని అడుగుతుంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
దాన్ని విన్న ఆమె కోపంగా…. చూడు గిరిజ నువ్వు అనుకున్నట్టుగా మేము ఏమి మరి అంతా పిసినారి వాళ్లని ఏమీ కాదు . మాకు ఉన్నదానితో సర్దుకు నే అలవాటు.మా సంసారం అంతంత మాత్రంగా ఉంటాయి ఒక్కొక్కళ్ళ సంపాదిస్తే నలుగురు కూర్చుని తింటున్నాము. అందుకే నా భర్త కి వచ్చి తోడుగా ఉండాలని నేను ఆమ్లెట్ వ్యాపారం పెడుతున్నాను. ఈరోజు నుంచి మొదలు
కావాలంటే మీరు ఖచ్చితంగా రావచ్చు తినడానికి. స్పెషల్ ఆమ్లెట్ ఉంటుంది.
గిరిజ…. స్పెషల్ ఆమ్లెట్ ఆ అయితే తప్పకుండా వస్తాను. నిన్ను ఆ మాట అన్నందుకు క్షమించు పల్లవి.
పుసుక్కున నోరుజారి అన్నాను. బాధపడకు.
ఆమె….. ఈ మాత్రం దానికి క్షమాపణ లాగా ఎందుకులే గిరిజ అన్నావు అయిపోయింది.
నువ్వు మాత్రం ఫస్ట్ బోనీ చేయాలి . అందుకామె సరే అంటుంది.
పల్లవి ఆ గుడ్లను తీసుకుని ఇంటికి వెళ్తుంది.
ఆ తర్వాత తన ఇంటి ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుని అట్లు వేయడం మొదలు పెడుతుంది. కొంచెం సమయం తర్వాత గిరిజ అక్కడికి వచ్చి. … పల్లవి ఒక స్పెషల్ ఆమ్లెట్ ఇవ్వు. అందుకు పల్లవి… దివ్య పిలవగానే వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఇదిగో నీ కోసం చాలా స్పెషల్ గా తయారు చేసి ఇస్తాను చూడు. అంటూ స్పెషల్ గా ఆమ్లెట్ తయారు చేసి ఆమెకు అందిస్తుంది.
దాన్ని తీసుకొని ఆమె దాన్ని తిని….అబ్బా పల్లవి ఎంత అద్భుతంగా చేసావో తెలుసా మా ఇంట్లో కూడా నేను ఎప్పుడూ ఇలా చేయలేదు నువ్వు చెప్పినట్టుగా ఇది నిజంగానే స్పెషల్ . స్పెషల్ ఆమ్లెట్ చాలా చాలా బాగుంది ఇదిగో నేను భోనీ చేస్తున్నాను కదా ఇంక నీ వ్యాపారం అద్భుతంగా వృద్ధి చెందుతుంది. అని చెప్పి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇంతలో అత్తా అక్కడికి ఒక చిన్న బోర్డు ని తీసుకొని…. ఇక్కడ స్పెషల్ ఆమ్లెట్ టు అందించబడును. కేవలం 50 రూపాయలు మాత్రమే. అని ఉంటుంది ఆ బోర్డు పై.
ఆత్తయ్య నీకు ఎందుకు అంత అత్యాస .
కోడిగుడ్డు ఆమ్లెట్ టు ఎవరైనా 50 రూపాయలు పెట్టి తీసుకుంటారా. అసలు ఈ బోర్డు ను చూసి అటు నుంచి అటే వెళ్ళిపోతారు . మనది కొత్త వ్యాపారం అందులో సగం రేటు పెట్టండి.
అత్త….. ఇందులో సగం రేటు పెడితే మనకు వచ్చేది ఏముంది.
కోడలు ….. అత్తయ్య మనకి లాభం కొంచెమే చూసుకోవాలి. జనం వచ్చే కొద్దీ మనం కూడా డబ్బుని పెంచవచ్చు . సరేనా అని అంటుంది అందుకనే సరే అంటూ బోర్డు మీద ₹50 కాస్త. 25 రూపాయలు చేస్తుంది.
నన్ను చూసి కోడలు…. ఇప్పుడు చూడండి చాలామంది రావ్వడానికి అవకాశం ఉంటుంది .
అని అంటుంది. ఇది ఇలా ఉండగా గిరిజ తన దగ్గరికి వచ్చిన వారందరితో…. మన పల్లవి కొత్తగా ఆమ్లెట్ వ్యాపారం పెట్టింది అద్భుతంగా ఉంది స్పెషల్ ఆమ్లెట్ మీరు కూడా వెళ్లి రుచి చూడండి. దాన్ని విన్నవాళ్ళు ….. ఆమ్లెట్ వ్యాపారమా ఇదేదో వింతగా ఉంది. అని అనుకుంటూ పల్లవి దగ్గరికి వస్తారు. పల్లవి వాళ్ళని చూసి… రండి రండి అని ఆహ్వానిస్తుంది ఇక వచ్చిన వాళ్లందరికీ తను స్పెషల్ ఆమ్లెట్ తయారు చేస్తూ ఉంటుంది వచ్చిన వాళ్లకి అత్త అందిస్తూ. చేస్తూ ఉంటుంది.
ఇక వచ్చిన వాళ్లంతా పల్లవి మెచ్చు కుంటూ. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్తారు. అలా వాళ్ల వ్యాపారం చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది. లాభం కూడా చాలా బాగా వస్తుంది . ఇంక సాయంత్రానికి డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉండగా కోడలు…. అత్తయ్య ఇదిగో మీరు ఇచ్చిన రెండు వేల రూపాయలు . దానికి వడ్డీ ఇదిగో వెయ్యి రూపాయలు.
అని అంటుంది.
అత్త…. ఏంటి అసలు వడ్డీ కలిపి ఇచ్చావు . ఇంకా తర్వాత నాకు డబ్బులు ఏమీ ఇవ్వువ్వు అన్నమాట .
ఆ మాటలు విన్న కోడలు…అత్తయ్య ఎందుకు ఇవ్వను చెప్పండి అసలు మనం డబ్బు సంపాదిస్తుంది దేని కోసం మన కుటుంబం కోసమే కదా. నా భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు కదా అందుకే ఇదంతా చేస్తున్నాను. ఈ ఒక్క రోజే మన షాప్ గురించి తెలియని వాళ్ళు వచ్చారు . మన షాప్ గురించి అలా అందరికీ తెలిసింది అంటే . ఇంకా చాలా లాభమే వస్తుంది ఇప్పుడు ఆరు వేల రూపాయలు వచ్చాయి . రేపు ఇంకా ఎక్కువ రావచ్చు. మీరు కూడా నాకు సహాయం గా ఉంటే చాలా బాగుంటుంది.
అందుకు అత్త…. తప్పకుండా ఉంటాను. అని అంటుంది ఆ మరుసటి రోజు కూడా వాళ్ళ వ్యాపారాన్ని యధావిధిగా మొదలుపెడతారు.
ఇక వాళ్ళ ఆమ్లెట్ వ్యాపారం వెనక్కి తిరిగి చూసుకోకుండా జోరుగా సాగుతూ ఉంటుంది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వాటిని వచ్చి తీసుకుని వెళుతూ ఉంటారు.
అలా రోజులు గడిచాయి . వాళ్ళిద్దరు చాలా డబ్బు సంపాదిస్తుంటారు. అలా ఉండగా పొలం పనుల మీద పురుగు ఊరు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వస్తాడు ఇంటి ముందు జనాన్ని చూసి ఆశ్చర్యపోతూ…. అమ్మో ఏంటి ఇంత మంది ఇంటి మీద ఉన్నారు కొంపదీసి మా అమ్మ గుండె ఆగి చనిపోయిందా.
అయ్యో అమ్మ నేను వస్తున్న అమ్మ ఎంత ఘోరం జరిగిపోయింది అమ్మా అంటూ ఏడ్చుకుంటూ అక్కడికి వెళ్తాడు.
తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కోడలు దోసెలు వేస్తూ ఉంటే అత్త వాటిని అందిస్తూ ఉంటుంది. అతను దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు అతను ఏడవడం చూసిన అత్త…… ఒరేయ్ ఎందుకురా ఏడుస్తున్నావు నేను ఇంకా చచ్చిపోలేదు బతికే ఉన్నా.
ఆ మాటలు విన్న అతను…. అమ్మ నువ్వు ఇంకా చచ్చిపోతే ఇంతమంది జనం వచ్చారు ఏమో అనుకొని హడావిడిగా వచ్చాను ఇంకా నయం ఏం కాలేదు.
ఆమె…. శుభం పలకరా మంకెన్న అంటే పెళ్ళి కూతురు ముండ అందట. అలా ఉంది నువ్వు చెప్పేది నేను అప్పుడే ఎలా పోతాను. ఇంకా చాలా సమయం ఉంది నీ పిల్లల్ని చూడాలి
వాళ్లతో ఆడుకోవాలి చాలా ఉంది.
అతను…. సరే అమ్మ నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు. మధ్యాహ్న సమయం అవుతుంది .
వాళ్ళు టిఫిన్ సెంటర్ ని చక్కబెట్టుకుని.
ఇంట్లోకి వస్తారు కోడలు భర్తతో…. ప్రయాణం బాగా జరిగిందా . అసలు తిన్నారా లేదా చాలా చిక్కి పోయినట్టున్నారు.
సరిగా తినడం లేదా లేదంటే మీ అమ్మ మీద దిగులు పెట్టుకున్నారా.
అత్త…. నా మీద దిగులు ఎందుకు పెట్టుకుంటాడు. నీ మీదే దిగులు పెట్టుకుంటాడు అని అంటుంది.
అని వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు దాని విన్న కోడుకో……. అమ్మ పల్లవి ఇద్దరు ఆపండి .నేను బానే ఉన్నాను కానీ అసలు ఈ వ్యాపారం ఏంటి, మన ఇంటి నిండా జనం ఏంటి , నాకు ఏమీ అర్థం కావడం లేదు .
ఇంతలో కోడలు వాళ్ళు సంపాదించిన డబ్బు మొత్తం తీసుకు వచ్చి అతని చేతిలో పెడుతుంది. దాన్ని చూసిన అతను …. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. కోడలు…. ఏవండీ ఇదంతా మేము కేవలం ఒక్క నెలలో సంపాదించిన డబ్బు రోజుకి 6000 నుంచి పదివేల దాకా వస్తుంది. ఇంకా మీరు అంతగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు పొరుగూరు వెళ్లాల్సిన అవసరం లేదు.
అని అంటుంది అత్త…..అవున్రా నువ్వు మమ్మల్ని విడిచి పెట్టి ఎక్కడెక్కడో ఉండడం మాకు బాగా లేదు నీకు అస్సలు బాగోదు . నిన్ను చూస్తే అర్థం అవుతుంది అక్కడ ఏం తిన్నావో ఏమి తినలేదనీ. అంటుంది అతను ఏడుస్తూ….అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బాధ నేను ఎవరితో పంచుకోలేను కదా. నేను అక్కడ చాలా చాలా ఇబ్బంది పడ్డాను.మనకి డబ్బు అవసరం అని సరిగ్గా తిండి కూడా తినకుండా డబ్బులు తీసుకు వచ్చే వాడిని అమ్మ. కానీ ఆ నిజాలు ఎప్పుడు నీకు చెప్పలేదు ఎందుకంటే మీరు బాధ పడతారు ఆని. ఇప్పుడైనా ఎందుకు నీ డబ్బులు మీ వ్యాపారం చూసి ఆనందంతో నా గుండె బరువెక్కింది అందుకనే చెప్తున్నాను.
ఇంకా ఈ రోజుతో మనం అప్పులన్నీ తీర్చుకోవచ్చు ఇదిగో నేను 3 నెలరోజులు కష్టపడితే వచ్చిన డబ్బు 80 వేల రూపాయలు. అని అది తీసుకొచ్చిన డబ్బు అక్కడ పెడతాడు.
అందుకు వాళ్లిద్దరూ ఒకరి నొకరు చూసి …. బాబు నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు అర్థమవుతుంది. ఆ డబ్బు రామయ్యకి ఇచ్చేసి నోట్లో తీసుకుని రా . అని అంటుంది అందుకు అతను సరే అమ్మ అని చెప్పి డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు.
ఇక అత్త కోడలు ఇద్దరు…. చూసారా అత్తయ్య మీ అబ్బాయి మన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నాడో. నిజానికి నాకు ఈ ఆలోచన రావడానికి కారణం మీ అబ్బాయి. ఎందుకంటే అందరూ పొలం పనులకు ఉదయాన్నే లేచి వెళ్తున్నారు. అప్పుడు నేను కూడా లేచాను. అప్పుడే ఎవరో ఒకళ్ళు పల్లవి వాళ్ళ ఆయన ఒట్టి పిసినారి . కనీసం ఎక్కడైనా అందరు టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ కూడా చేయడు. మనమేమో వాడిని చూస్తూ తినలేము . అందుకే మనం వాడికి కొంచెం దూరంగా ఉండటం మంచిది . అని చెప్పుకోవడం నేను విన్నాను అత్తయ్య. ఆ మాటలు విని నాకు చాలా బాధేసింది. నా భర్త ఎందుకు అలా చేస్తున్నాడో నాకు అర్థం అయింది. మన కుటుంబ పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇలా చేస్తున్నాడని గ్రహించగలిగాను.
అందుకే ఒక చేత సంపాదన కాదు రెండు చేతులతో సంపాదించి . నా భర్తకు కొంచెం శ్రమ తగ్గి ఇద్దామనుకున్నాను. అందుకే ఈ వ్యాపారం మొదలు పెట్టాను అత్తయ్య.
అత్తా ఆ మాటలకి చాలా సంతోష పడుతూ…. అమ్మ పల్లవి నీలాంటి కోడలు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ మొగుళ్ళని పట్టుచీరలు కావాలి నగలు కావాలి. అవి కావాలి ఇది కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారు . కానీ నువ్వు భర్త చేస్తున్న కష్టంలో పాలుబాగాము అడిగావు.
అంటూ ఆమెను మెచ్చుకుంటూ ఉంది ఆ మాటలకి కోడలు సంతోషపడుతుంది .
ఇక వాళ్ళ అందరి సంపాదనతో వాళ్ళ కుటుంబంలో కష్టాలు పోయి సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *