అత్యాశ పెరుగు వ్యాపారి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu


కేశవపాడు అనే గ్రామంలో బ్రహ్మయ్య అంజయ్య అనే పెరుగు వ్యాపారస్తులు ఉండే వాళ్ళు అంజయ్య చాలా మంచి వ్యాపారి అందరికీ తలలో నాలుకలా లాంటివాడు అంజయ్య ఎక్కువగా అందరూ అంజయ్య దగ్గరికి పెరుగును కొనుగోలు చేయుటకు వెళ్తుంటారు తన ఇంటి దగ్గరే ఉండి పెరుగును అమ్ముకుంటాడుఅంజయ్య
బ్రహ్మయ్య మాత్రం ఆ ఊరు పక్క ఊరు కూడా తిరిగి పెరుగు అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి చేరుకునే వాడు బ్రహ్మయ్య ఎప్పుడు బాధపడేవాడు బ్రహ్మయ్య తనలో తాను ఇలా అనుకుంటున్నాడు
బ్రహ్మయ్య:అంజయ్య సొంత ఊరిలో ఉండి సొంత వ్యాపారం చేసుకుంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే మంచి ధనం కూడా సంపాదిస్తున్నాడు అసలు కారణం ఏమిటి అందరూ ఎక్కువగా అంజయ్య దగ్గరే పెరుగును కొనుగోలు చేస్తారు పెరుగు చాలా తాజాగా చాలా మధురంగా ఉంటుంది అని అంటారు అందరు అని అనుకుంటూ ఉండేవాడు
ఒకరోజు అంజయ్యదగ్గరకు వసంత అనే ఒక ఆమె పెరుగు కొనడం కోసంవచ్చింది
వసంత :అంజయ్య గారు !అంజయ్య గారు! అని పిలువ సాగింది అప్పుడు అంజయ్య బయటకు వచ్చి ఇలా అంటున్నాడు అంజయ్య :ఏమిటి వసంత గారు మళ్ళీ వచ్చారు ఇప్పుడే కదా వచ్చి పెరుగు తీసుకొని వెళ్లారు అని అన్నాడు
అందుకు వసంత ఇలా అంటుంది
వసంత :నిజమే అంజయ్య గారు కానీ ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు అందుకే మళ్లీ రావాల్సి వచ్చింది అని చెప్పింది వసంత అందుకు బ్రహ్మయ్య ఇలా మాట్లాడాడు
బ్రహ్మయ్య :అయ్యో నా దగ్గర పెరుగు ఏమీ మిగల్లేదు అంతా అయిపోయిందండి వసంత గారు .మీరు ఒక పని చేయండి ఈ ఒక్కసారికి బ్రహ్మయ్య దగ్గరకు వెళ్ళి పెరుగును కొనుగోలు చేయండి అని చెప్పి బ్రహ్మయ్య ఇంటికి పంపించాడు
ఆమె బ్రహ్మయ్య ఇంటికి వచ్చి ఇలా అంటుంది వసంత :బ్రహ్మయ్యగారు! ఒకసారి బయటికి రండి అని పిలవ సాగింది
అందుకు బ్రహ్మయ్య బయటకు వచ్చి ఇలా అంటున్నాడు
బ్రహ్మయ్య:ఎవరు వసంత గారు! ఏమిటి ఇలా వచ్చారు అని అడగగా అందుకు
వసంత ఇలా అంటుంది
వసంత: ఏమీ లేదండి ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు మీ దగ్గర ఏమైనా పెరుగు దొరుకుతుందేమో అని ఇలా వచ్చాను అందుకు బ్రహ్మయ్యఇలా అంటున్నాడు బ్రహ్మయ్య: వసంత గారు! నా దగ్గర పెరుగు లేక ఏమి ?మీకు ఎంత కావాలంటే అంత తీసుకువెళ్లండి అని చెప్పి తనకు కావాల్సిన పెరుగును తీసుకెళ్ళింది వసంత
ఆ పెరుగును తన బంధువులకు భోజనంలో వడ్డించింది ఆ పెరుగు తిన్న వాళ్లు ఇలా అనసాగారు
అమ్మాయి !వసంత ఈ పెరుగు ఎక్కడ తీసుకొచ్చావు చాలా పుల్లగా ఉంది ఇంకా ఎన్నో రోజుల నుంచి నిల్వ ఉన్నట్లు గా ఉంది నువ్వు చూసుకోకుండా తెచ్చావు అని అన్నారు
వసంత :అయ్యో నేను బ్రహ్మయ్య దగ్గర తెచ్చాను దాన్ని చూసుకో లేదు అని చెప్పింది అందుకు
వసంత భర్త :ఛీ!:ఛీ!ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు అని తిట్టాడు అందుకు ఆమె కోపంగా బ్రహ్మయ్య దగ్గరకు వెళుతుండగా బ్రహ్మయ్య పెరుగును అమ్మ కుంటూ ఆ మార్గం మధ్యలో కనిపించాడు అప్పుడు వసంత ఇలా అంటుంది
వసంత :ఛీ !బ్రహ్మయ్య నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే ఎవరు నీ దగ్గరకు పెరుగు కొనడానికి రావడం లేదు అని అంటుంది అందుకు బ్రహ్మయ్య
బ్రహ్మయ్య:
ఏమైంది వసంత గారు ఇలా మాట్లాడుతున్నారు
వసంత :హా !ఏమైంది పెరుగు పుల్లగా ఉంది అని తెలిసి కూడా మంచి పెరుగును ఇవ్వకుండా ₹100 తీసుకొని మంచి పెరుగును ఇవ్వలేదు .నువ్వు చేసిన పని వల్ల నా భర్త బంధువులతో మాటలు పడాల్సి వచ్చింది ఇంకా సగం ఆకలితో భోజనం నుంచి లేచి వెళ్ళి పోయారు అని అందరి ముందు తిట్టింది బ్రహ్మయ్య ఆమెని ఏమీ అనలేక తన డబ్బును తిరిగి ఇచ్చి సిగ్గుతో తల దించుకొని వెళ్లిపోయాడు
ఆరోజు వ్యాపారం కూడా మానేసి ఇంటి దగ్గరే ఎంతో దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించాడు అతను ఇలా అనుకుంటున్నాడు
ఎందుకు అందరూ అంజయ్య పెరుగు బాగుంటుంది అని అంటారు అసలు ఏంటో తెలుసుకోవాలి అసలు నిజం తెలుసుకొని ఈ ఊరిలోనే వ్యాపారం మొదలు పెడతాను అనుకొని మరుసటి రోజు అంజయ్య ఇంటికి వెళ్ళాడు బ్రహ్మయ్య
అక్కడికి వెళ్లి ఇలా అనసాగాడు
బ్రహ్మయ్య :అంజయ్య గారు! అంజయ్య గారు! కొంచెం మీ దగ్గర పెరుగు ఉంటే ఇస్తారా అని అడుగగా
ఇలా అంటున్నాడు అంజయ్య
ఇదేమిటి బ్రహ్మయ్య గారు !మీరు పెరుగు వ్యాపారి అయ్యుండి నా దగ్గరికి రావడం ఏమిటి అని అడిగాడు
అందుకు బ్రహ్మయ్యఇలా అన్నాడు
బ్రహ్మయ్య :అంజయ్య గారు! నా దగ్గర ఉన్న పెరుగు అయిపోయింది ఇప్పుడే మా ఇంటికి బంధువులు వచ్చారు అందుకే ఇలా రావాల్సి వచ్చిందని చెప్పాడు
అంజయ్య బ్రహ్మయ్య మాటలు విని తనకు కావాల్సిన పెరుగును ఇచ్చి పంపించాడు వెంటనే దానిని ఇంటికి తీసుకొని వచ్చి రుచి చూశాడు బ్రహ్మయ్య పెరుగు చాలా తాజాగా రుచిగా ఉంది
అప్పుడు తను ఇలా అనుకోని నేను ఈ పెరుగును మరింత తీయగా చేస్తాను అని ఆ పెరుగులో పంచదార కలిపి ఆ పెరుగు అమ్మడం ప్రారంభించాడు ఆ పెరుగులో పంచదార కలపడం వలన అది తీయగా అయింది దాన్ని కొనుగోలు చేసిన వాళ్ళు అందరు పెరుగు రుచిగా ఉంది చాలా తియ్యగా ఉంది అని అనుకుంటూ ఆ విషయంఆ నోటా ఈ నోటా పాకి ఆ ఊరు మొత్తానికి తెలిసింది అప్పటినుంచి బ్రహ్మయ్య మంచిగా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు
అప్పటినుండి అంజయ్య దగ్గరకు పెరుగు కోసం ఎవరూ రావడం లేదు చాలా నష్టపోయాడు అంజయ్య అప్పుడు
అంజయ్య ఇలా అనుకున్నాడు అంజయ్య:ఒకరోజు బ్రహ్మయ్య నా దగ్గర నుంచి పెరుగు తీసుకొని వెళ్లాడు అప్పటి నుంచి పొరుగూరు కూడా పోకుండా ఊర్లోనే వ్యాపారం మొదలుపెట్టాడు అసలు ఏం జరిగి ఉంటుంది నా దగ్గరకు ఎవ్వరూ రావడం లేదు అని బ్రహ్మయ్య ఇంటికి వెళ్ళాడు అదే సమయంలో బ్రహ్మయ్య పెరుగులో పంచదార కలపడం చూశాడు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అంజయ్య
ఆ కుట్రను ఊరి ప్రజలకు చెప్పాడు అంజయ్య కానీ అంజయ్య మాటలు ఎవరూ నమ్మలేదు నమ్మకపో గా ఇలా అనడం మొదలు పెట్టారు
అంజయ్య ! బ్రహ్మయ్య వ్యాపారం బ్రహ్మయ్య ది నీ వ్యాపారం నీది ఇప్పుడు తను కొంచెం మంచిగా సంపాదిస్తున్నాడు అని నువ్వు అతని మీద నింద వేయడం తప్పు అని అన్నారు
పాపం బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంజయ్య
అదేరోజు
వసంత బ్రహ్మయ్య దగ్గరకు వచ్చి ఇలా అంటుంది
వసంత :బ్రహ్మయ్యగారు !నన్ను క్షమించండి ఆ రోజు అలా మాట్లాడినందుకు అని అంది అందుకు బ్రహ్మయ్య పర్వాలేదు వసంత గారు పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని కపట పలుకులు పలికాడు
అందుకు వసంత కూడా నిజమే అన్నయ్య గారు అని ఇలా అంటుంది
వసంత:
మీ దగ్గర పెరుగు చాలా తియ్యగా రుచిగా ఉంటుంది అని అందరూ చెప్పుకుంటున్నారు దానిని విని నేను కూడా అంజి దగ్గరకు వెళ్ళకుండా మీ దగ్గరే పెరుగు కొనడం కోసం వచ్చాను
అందుకు బ్రహ్మయ్య ఎంత కావాలో తీసుకెళ్లండి వసంత గారు! అని తనకు కావాల్సింది ఇచ్చి పంపించాడు ఆ సమయంలో అంజయ్య కలిపిన చక్కెర పూర్తిగా కరగలేదు దానిని గమనించిన వసంత ఇలా అనుకుంటుంది
వసంత:
ఏమిటిది చక్కెర లాగా ఉంది ఓహో! అర్థమైంది అయితే బ్రహ్మయ్య ప్రజలను తన పెరుగు తియ్యగా ఉండడం కోసం తాజాగా ఉండడం కోసం చక్కెరను కలిపి మోసం చేస్తున్నాడు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పింది వసంత
ఆ పెరుగును చూసి వాళ్ళు ఆశ్చర్య పోయారు బ్రహ్మయ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటున్నారు బ్రహ్మయ్య నువ్వు ఎంత మోస గాడివి ప్రజలను ఇంతగా మోసం చేస్తున్నావు అంజయ్య ని గురించి చెప్పినప్పుడు మేమందరం అంజయ్య ను తప్పు పట్టాము కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్న ము అని గొడవకు దిగారు
అందుకు బ్రహ్మయ్య :అయ్యా అందరు నన్ను క్షమించండి అంజయ్య మీద అసూయతో డబ్బు సంపాదించాలనే అత్యాశతో నేను ఇలా చేశాను అని ప్రాధేయపడ్డాడు ఊరి ప్రజలు బ్రహ్మయ్య మీద జాలి పడి అతన్ని వదిలేశారు
అప్పటి నుంచి ఎవరు బ్రహ్మయ్య దగ్గరకుపెరుగు కోసం వెళ్లడం లేదు
ఇంక చేసేది ఏమీ లేక వ్యాపారం పూర్తిగా వదిలేసాడు బ్రహ్మయ్య
నీతి : మనుషులకు ఆశ కలగడం సహజం కానీ ఆశ అత్యాశగా మారితే చివరికి బ్రహ్మయ్య కు పట్టిన గతే మనకి కూడా పడుతుంది

Add a Comment

Your email address will not be published. Required fields are marked *