అమ్మ కోతి కావాలి | Telugu Stories | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu

కీచురాయి పల్లి అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో లక్ష్మీ అనే ఒక ఆమె ఉండేది. ఆమెకు ఒక కూతురు భర్త చనిపోవడంతో ఆమె నాలుగేళ్లలో పాచి పని చేసుకొని కూతుర్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒక రోజు ఆమె కూతురు రజిని ఒక చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉండగా. చెట్టు పై నుంచి ఒక కోతి దబేలు అని కింద పడుతుంది . రజినీ కోతిని చూసి చాలా
భయపడుతూ. ఉంటుంది కానీ కోతి ఎటూ కదలలేని పరిస్థితి లో ఉంటుంది. ఆ కోతి తన మనసులో….. దాహం గా ఉంది భగవంతుడా నాకు సహాయం చేయి. అంటూ చాలా బాధపడుతూ భగవంతుని ప్రార్థిస్తున్నాది.
రజనీకి ఆ కూతురు చూసి ఏమనిపిస్తుందో ఏమోకానీ దానికి నీళ్లు తీసుకుని వెళ్లి అందిస్తుంది. కోతి నీటిని తాగీ తన దాహం
తీర్చుకొని అక్కడ కూర్చుంటుంది.
కోతి తన మనసులో… చాలా కృతజ్ఞతలు తల్లి నీకు నా ప్రాణాలు నిలబెట్టావు దేవుడు నిన్ను చల్లగా చూడాలి. అని చాలా సంతోషంగా తన మనసులో అనుకుంటూ ఆమెను దీవిస్తుంది.
రజిని ఆ కోతి దగ్గరకు వెళ్లి. ఆ కోతి తల నిమురుతూ ఉంటుంది కొంచెం సమయం తర్వాత. ఆ కోతి చేయి పట్టుకొని… థా మా ఇంటికి వెళ్దాం రా మా ఇంటికి వెళ్దాం అని అమాయకంగా. తను ముద్దు ముద్దు కోతిని పిలుస్తూ దాని చేతిని పట్టుకొని తన ఇంట్లోకి తీసుకెళుతుంది.
తల్లి కోతిని చూసి చాలా బాయపడుతుంది.
rajini తల్లితో…. అమ్మ భయపడుతున్నావా మన కోతి అమ్మాయిది మంచి కోతి మన కోతి మంచి కోతి ఇది.
అంటూ చెబుతూ వస్తుంది తల్లి దాన్ని చూసి ఆశ్చర్యపోతూ. ఉంటుంది ఆ కోతికి తినడానికి తల్లి ఆహారాన్ని అందిస్తోంది. బాగా ఆకలి మీద ఉన్న కోతి.ఆ ఆహారాన్ని తింటుంది .
తిని తన మనసులో…. చాలా చాలా కృతజ్ఞతలు మీ రుణం నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. అని అనుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది అలా ప్రతిరోజు ఆ కోతి పాపతో ఆడుకోడానికి వస్తూ . ఆమె తల్లి ఇచ్చిన ఆహారాన్ని తింటూ ఉంటుంది. మరి కొన్ని రోజులు గడిచాయి అనుకోకుండా రజిని తల్లి
ఆరోగ్యం చెడిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న రజనీ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కోతి ఎప్పట్లాగే తన ఇంటికి వస్తుంది. అక్కడ మంచంపైన తల్లి పడుకొని ఉండడం రజిని ఏడవడం చూసి ఆశ్చర్యం గా….. ఏమైంది ఏమైంది అంటూ కంగారుపడుతూ సైగ చేస్తూ ఉంటుంది. రజిని…. అమ్మకు అస్సలు బాగోలేదు. అంటూ ఏడుస్తూ చెబుతోంది.
ఆ కోతికి ఏం చేయాలో అర్థం కాదు అక్కడే ఉండిపోతుంది. చాలా సమయం తర్వాత రజనీ …. అమ్మకి తినడానికి ఏమన్నా ఇవ్వు. నాక్కూడా చాలా ఆకలిగా ఉంది. అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కోతి అక్కడ్నుంచి పరుగుపరుగున ఆ చెట్టు ఈ చెట్టు దూకి పండ్లు తీసుకొనివచ్చి సరాసరి రజనీ దగ్గరకు వెళ్తుంది. రజినీ తల్లికి ఆ పండ్లు ఇస్తుంది. రజనీ కూడా వాటిని ఇస్తుంది వాళ్ళిద్దరూ. వాటిని తింటారు రజినీ తల్లి కొంచెం నీరసంగా…. నా కూతురి ఆకలి తీర్చి నందుకు చాలా కృతజ్ఞతలు. నా పరిస్థితి ఇలా ఉంది అని అస్సలు అనుకోలేదు నాకు చాలా నీరసంగా ఉంది నడవలేక పోతున్నాను.
ఏ పని చేయలేకపోతున్నాను. ఊరికే కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఏం జబ్బు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు అంటూ ఏడుస్తూ బాధ పడుతుంది.
కోతి…. మరేం పర్వాలేదు అమ్మ నేను ఉన్నా కదా మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. దానికి రుణం తీర్చుకునే సమయం నాకు దొరికింది అని నేననుకుంటాను . మీకు త్వరలోనే నయమవుతుంది. అని చెప్పి పాపను తీసుకుని బయటకు వెళ్తుంది .
అక్కడ రోడ్డు మీద ఒక గిన్నెను ఉంచి కోతి సర్కస్ చేయడం చేస్తుంది.
కోతి సర్కస్ చేయడం చూస్తూనే పాప చప్పట్లు కొడుతూ ఉంటుంది. కోతి గెంతడం సర్కస్ చేయడం చూసిన ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తూ అక్కడికి వస్తూ ఉంటారు.
కోతి అక్కడికి వచ్చిన వాళ్ల దగ్గరికి గిన్నెను తీసుకొని వెళ్తుంది వాళ్ళంతా గిన్నెలో వాళ్లకు తోచినంత డబ్బుని ఇస్తూ ఉంటారు.
అలా చాలా సమయం వరకు ఆ కోటి ఆలా కష్టపడుతూ డబ్బు సంపాదిస్తుంది.
ఆ తర్వాత ఆ పాపను తీసుకుని ఇంటికి వెళ్తుంది. అలా రోజులు కడుతున్న వి ప్రతిరోజు కోతి సర్కస్ చేస్తూ. వచ్చిన డబ్బుతో వాళ్ళకి కొంత ఆహారాన్ని సమకూరుస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి చాలా డబ్బు పోగు చేస్తుంది ఆ తర్వాత ఒక వైద్యురాలు దగ్గరికి పాపను తీసుకుని వెళుతుంది.
కోతి మీ పాపను చూసిన డాక్టర్…. ఇది పశువుల హాస్పిటల్ కాదు పాపా ఇది నీ పెంపుడు కోతి నా.
పాప…. అవును ఇది మా కోతి చాలా మంచిది. ఇది పశువుల హాస్పిటల్ అని మేము ఇక్కడికి రాలేదు . మా అమ్మకి ఒంట్లో బాగోలేదు . ఒకసారి వచ్చి చూస్తారా మా ఇంటికి వెళ్దాం. అంటూ ఏడుస్తుంది.
డాక్టరమ్మ…. పాప ఏడవకు మీ ఇల్లు ఎక్కడో నాకు చూపించు మీ అమ్మ దగ్గరికి వెళ్దాం అని అంటుంది పాపా సరే అని చెప్పి ఆమెను తీసుకుని అక్కడికి వెళుతుంది. వైద్యురాలు ఆమెను చూసి…. భయపడాల్సింది ఏమీ లేదు రక్తహీనత వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. బలమైన ఆహారం తీసుకుంటే అంతా సరిపోతుంది. అప్పటివరకు నేను కొన్ని మందులు ఇస్తాను వాటిని వాడండి అని అంటుంది
అందుకు ఆమె డాక్టర్ తో….. మీకు చాలా కృతజ్ఞతలు అమ్మ ఇక్కడ దాకా వచ్చినందుకు. అప్పుడు ఆమె జరిగిన విషయం చెప్పి అందుకు జాగ్రత్తలు చెప్పి, మందులను ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆమె కోతికి చాలా కృతజ్ఞతలు చెప్పుకొని బాధపడుతుంది. కొన్ని రోజులు గడిచాయి కోతి సర్కస్ చేసి వచ్చిన డబ్బుతో మంచి ఆహార పదార్థాలు వాళ్లకు తీసుకెళ్లి అందిస్తూ ఉంటుంది కొన్ని రోజులకు ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది.
ఆమె ఎప్పటిలాగే తిరుగుతూ ఉంటుంది .
ఆమె కోతి తో…. నువ్వు మా ఇంటికి వచ్చి . మళ్లీ మా కుటుంబంలో సంతోషాన్ని తీసుకొచ్చావు నీకు కృతజ్ఞతలు.అని కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
కోతి…. మీరు అన్నం పెట్టిన రుణాన్ని నేను తీర్చుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. ఇక ఆ పాప కోతి ఆమె సంతోషంగా అక్కడే వాళ్ళ జీవితాన్ని మళ్ళీ కొత్తగా కొనసాగిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *