అవిటి పాప కష్టాలు | Telugu Stories | Telugu Kathalu |Bedtime Stories |Panchatantra kathalu

ఆమె పేరు రజిని. ఆమె ఒక అనాధ.
పైన ఒక కాలు అవ్వడు. ఆమె ప్రతి రోజు రోడ్డు మీద నిలబడి వచ్చే పోయే వాళ్ళని…. బాబు ధర్మం చేయండి అయ్యా ధర్మం చేయండి. అమ్మ కాలు లేని దాన్ని మీకు పుణ్యం ఉంటుంది అమ్మ ధర్మం చేయండి. అంటూ రోడ్డు మీద భిక్షాటన చేస్తూ ఉంటుంది.
అలా వచ్చిన డబ్బుతో ఏదో ఒకటి కొనుక్కొని తన కడుపు నింపుకుంటున్నారు అలా రోజులు గడిచాయి ఒక రోజు ఒక పిల్లవాడు.
రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళని ….. ఒక రూపాయి ఉంటే ఇవ్వండి మా అమ్మ . అక్కడ కళ్లు తిరిగి పడిపోయింది. ఏమైనా డబ్బులు ఇవ్వండి అంటూ ఏడుస్తూ వచ్చే పోయే వాళ్ళని డబ్బులు అడుగుతూ ఉంటాడు. దానిని గమనించిన రజిని….. అయ్యో పాపం అని అతని దగ్గరికి వెళ్లి. బాబు ఎవరు నువ్వు మీ అమ్మ కి ఏమైంది.
బాబు…. మా అమ్మ అక్కడ పడిపోయింది. నీళ్ల ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూస్తున్న ఎవరు కూడా నీళ్లు ఇవ్వడం లేదు అందుకే డబ్బులు అడుగుతున్నాడు నీళ్లు కొనుక్కొని వెళ్ళడం కోసం . అంటూ ఏడుస్తాడు ఆమె …. అయ్యో పాపం అంటూ అతనిపై జాలిపడి వాటర్ బాటిల్ తీసుకొని…. పద మీ అమ్మగారి దగ్గరికి వెళ్దాం అని అంటుంది ఇక ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు.
అక్కడ ఆ తల్లి అయిపోయి ఉంటుంది.
వెంటనే ఆమె నీళ్ళనీ ఆమె ముఖం పై చల్లి ఆమెనీ శ్రుహ నుంచి లేపుతుంది. ఆమె శ్రుహ నుంచి లేచి….. ఎవరమ్మా నువ్వు .పాప జరిగిన విషయం చెప్తుంది.
ఆమె…. సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడే అమ్మ తిండి తిని రెండు రోజులు అవుతుంది ఎక్కడ కూడా పని దొరకడం లేదు.
నా పిల్ల వాడి మొఖం చూసి కూడా ఎవరు పని ఇవ్వడం లేదు అంటూ బాధపడుతుంది.
రజిని…. అయ్యో బాధపడ కమ్మ ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి అని అని డబ్బులు ఇస్తుంది ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న ఆహారాన్ని ఆ పిల్లవాడికి తినిపిస్తుంది అతను చాలా తృప్తిగా భోజనం చేస్తాడు.
తల్లి తన మనసులో…. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. భగవంతుడా అంటూ బాధపడుతుంది.
కొంత సమయం తర్వాత ఆమె రజినీతో….. అమ్మ నేను ఇక్కడే ఒక చిన్న పూరిగుడిసెలో ఉంటున్నాము. నువ్వు అప్పుడప్పుడు వస్తూ ఉండు తల్లి అని అంటుంది.
అందుకు ఆమె సరే అంటుంది రోజులు గడిచాయి . రజిని డబ్బులు భిక్షాటన చేసి ఆ పిల్లవాడికి ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటుంది.
రజిని ఆమెతో…. అమ్మ మీకు ఏదైనా పని దొరికింది దా. ఆమె…. ఒక హోటల్ లో దొరికిన అమ్మ రేపటి నుంచి అక్కడికి వెళ్లాను . అక్కడ ఏదో ఒకటి తినడానికి దొరుకుతుంది. నువ్వు ఇంకా ఇలా బిక్షాటన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా మాతో పాటే ఉండు . నేను హోటల్ నుంచి తీసుకు వచ్చిందే ముగ్గురం తిందాము.
పాప ఏడుస్తూ….. నాకు భిక్షాటన చేయాలి అని ఉండదమ్మ నా తల్లిదండ్రులు బ్రతికి ఉన్నట్టయితే ఇలాంటి ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ఆమె…. అసలు ఏం జరిగింది అమ్మా నీ కాలు ఎందుకు ఆవుడు అయింది . అసలు మీ అమ్మ నాన్న ఎవరు.
రజిని …. మాది కీర్తి వారి పాలెం. మా నాన్న పేరు శంకర్ మా అమ్మ పేరు హారిక మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం మా నాన్న పొలం పని చేసుకుంటూ ఉండేవాడు.
మా అమ్మ ఇంటి పని చేస్తూ మమ్మల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండేది. అలా ఉండగా ఒక రోజు మా నాన్న….. హారిక హారిక మన పంట బాగా పండింది కదా డబ్బులు చాలా బాగా వచ్చాయి . అసలుకే పండుగలు రాబోతున్నాయి. పట్టణం వెళ్లి. కొత్తబట్టలు తెచ్చుకుందాము పదండి. హారిక….. సరే అండి పని ముగించుకుని వెళ్దాం.
ఇంతలో పాప బడి నుంచి వస్తుంది కదా ముగ్గురం కలిసి వెళ్లొచ్చు .
అందుకు మా నాన్న సరే అన్నాడు కొంచెం సమయం తర్వాత ఇంటికి వచ్చాను. మా అమ్మ నాన్న గారు చెప్పిన మాట నాకు చెప్పి రెడీ అవ్వండి అన్నది నేను సరే అని చెప్పి షాపింగ్ కి సిద్ధమయ్యాను. ఇక ముగ్గురం కలిసి పట్టణానికి బయలుదేరారు అక్కడ మాకు కావాల్సిన బట్టలన్నీ తీసుకొని తిరిగి వస్తుండగా ఒక కారు వేగంగా పిచ్చి మా నాన్న నీ మా అమ్మ ఢీకొన్న ది వాళ్ళు దూరంగా వెళ్లి పడ్డారు. అదే కారు నాకు కాలు మీద నుంచి వెళ్ళిపోయింది. నా తల్లిదండ్రులు నా కళ్ళ ముందే కన్నుమూసారు. నేను సృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఎవరో నన్ను హాస్పిటల్లో చేర్పించారు నేను లేచి చూసేటప్పటికి నా కాలు లేదు.
అప్పుడే ఆ డాక్టరమ్మ నాతో….. పాప తప్పనిసరి నీ కాలు తీసి వేయాల్సి వచ్చింది మీ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు .
అని చెప్పింది అందుకు నేను … అమ్మ నాన్న కనీసం చివరి చూపు కూడా చూడలేకపోయాను. అంటూ ఏడుపు మొదలు పెట్టు కున్నాను . కొన్ని రోజుల తర్వాత హాస్పటల్ నుంచి వచ్చేశాను . ఇక ఏం చేయాలో అర్థం కాక. ఇదిగో ఇలాగ భిక్షాటన చేస్తూ. వచ్చిన డబ్బుతో దొరికింది తింటూ ఉంటున్నాను. అని ఏడుస్తుంది ఆ మాటలు విన్న ఆమె ….. అయ్యో పాపం అంటూ ఏడుస్తుంది.
ఇంకా పాప అక్కడే ఉంటుంది. ఆమె ప్రతిరోజు హోటల్ కి వెళ్లి పని చేసుకొని హోటల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్లకి తినడానికి తీసుకుని వస్తూ ఉంటుంది.
వాళ్లు దానినీ తింటూ ఎంతో సంతోష పడతారు. ఆమె ఆ ఇద్దరు పిల్లల్ని చాలా చక్కగా చూస్తూ ఉంటుంది.
అలా రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి సమయం ఆమె ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ తన లో….. భగవంతుడా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు . ఆ పాప కి మా కుటుంబం ఏ అన్యాయం చేసిందని అస్సలు ఎప్పటికీ తెలియకుండా మీరే చూసుకోవాలి. మా వలనే పాప జీవితం నాశనం అయిందని తెలిస్తే
మమ్మల్ని అసహ్యించుకుంటుంది . ఈ నిజం ఎప్పటికీ తెలియకుండా నువ్వే చూసుకోవాలి.
అంటూ ఏడుస్తూ ఉంటుంది పాప ఆ మాటలు విని ఆమె దగ్గరికి వస్తుంది పాపను చూసిన ఆమె చాలా కంగారు పడుతుంది పాప…. అమ్మ మీరు ఇప్పుడు భగవంతుణ్ణి ఏం తెలుసుకున్నారో నేను విన్నాను . నా కుటుంబాన్ని మీరు ఎందుకు నాశనం చేశారు అసలు ఏం జరిగింది. అంటే ఆ కార్ లో ఉన్నది మీరేనా.
ఆమె ఏడుస్తూ… అవునమ్మా ఆ కార్ లో ఉంది నేను నా భర్త. నీ కుటుంబానికి అన్యాయం చేసి నందుకు ఆ భగవంతుడు మాకు కూడా అలాగే చేశాడు ఇప్పుడు సరైన న్యాయం జరిగింది అంటూ ఏడుస్తుంది.
రజిని…. అసలు ఏం జరిగింది అమ్మ
మీరు అంత ఉన్నత స్థాయి నుండి ఇలాగే ఎందుకు వచ్చారు.
ఆమె ఏడుస్తూ…. నా భర్తకి తాగుడు అలవాటు ఉంది. మేము బాగా ధనవంతులము. నా భర్తకి నేను ఎన్నిసార్లు చెప్పినా తాగుడు మానేసి వాడు కాదు . ఆ రోజు మేము షాపింగ్ కి వెళ్లి తిరిగి వస్తున్న ము. నా భర్త తాగి వున్నాడు తాగి కారు నడవద్దు అని నేను చెప్పాను అయినా అతను నా మాట వినకుండా. కారుని నడుపుతున్నాడు అప్పుడే నీ తల్లిదండ్రులని గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. నీ కాలు పోవడానికి కారణం కూడా మేమే.
నేను అతనితో….. ఇవ్వండి పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏమో. మీరు ఇలా వాళ్లని ని గుద్ధి పక్కకు వచ్చేసారు .
పాపం ఆ చిన్న పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఒక్క నిమిషం ఆపండి.
అని ఎంతగానో ప్రాధేయపడ్డాను నా భర్త నా మాట వినలేదు….. ఇప్పుడు నేను కనుక కారు ఆపితే. పోలీసులు కేసు అంటూ పెద్ద గందరగోళం అవుతుంది . వద్దు అంటూ అతను కారుని తీసుకెళ్ళిపోయాడు.
నా భర్త జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ మరింత తాగడం మొదలు పెట్టాడు నేను ఎంత చెప్పినా వినలేదు. పూర్తిగా తాగుడుకు బానిసై అయి వ్యాపారాన్ని వదిలేశాడు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పుడు నా భర్త మరింత తాగడం మొదలు పెట్టాడు వద్దు అన్నా తాగి కారు నడుపుతున్నాడు. ఒక రోజు అలాగే కారు నడుపుతూ యాక్సిడెంట్లో చనిపోయాడు.
దాన్ని తెలుసుకున్న నేను నా బిడ్డ ఇద్దరము….. ఏమండీ ఎంత దారుణం జరిగిపోయింది నా మాట విన్నారా. తాగుడు మానుండి అన్నాను. మీరు వినలేదు ఇప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంటి . మమ్మల్ని ఒంటరివాన్ని చేసి మీ పాటికి మీరు వెళ్లిపోయారు . మమ్మల్ని రోడ్డున పడే సారు . అంటూ ఎంతగానో ఏర్చుకున్నాము.
అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఇల్లు అమ్మేశాను ఇంక రోడ్డున పడ్డాము. అంటూ జరిగిన విషయం చెప్తుంది.
దానిని విన్న రజిని చాలా బాధపడుతుంది ఆమె ….. అమ్మ రజిని ఇప్పుడు నీకు మా మీద చాలా కోపంగా ఉంది కదా.
కానీ తెలిసోతెలియకో మా కుటుంబం వల్ల నీకు చాలా నష్టం జరిగిపోయింది.
మమ్మల్ని క్షమించు అంటూ ఏడుస్తుంది.
రజిని.,… అమ్మ నన్ను మీరు క్షమాపణ కోరడం ఎందుకు. ఏదేమైనా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు . భగవంతుడు నుదుటిమీద ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. కానీ చివరికి మనల్ని ఇలా కలుపుతాడు అని అస్సలు ఊహించలేదు. ఆయన సృష్టి చాలా విచిత్రమైనది అంటూ బాధ పడుతుంది.
ఆమె…. చూడమ్మా నేను మాత్రం ఒకటే చెప్పగలను. నేనెవరో నీకు తెలియనప్పుడు నువ్వు ఎలాగైతే మాతో ఉన్నావో అలాగే ఉంటే మాకు సంతోషం . నీకు ఎలాంటి కష్టం లేకుండా సొంత తల్లి లాగా . నిన్ను నా బిడ్డని చూసుకుంటాను. సరేనా. ఈ తల్లి మీద ఎలాంటి ద్వేషం పెంచుకొని నాకు మాట ఇవ్వు.
అందుకు రజిని ఏడుస్తూ….. అమ్మ మీరు ఎప్పుడు అలా ఆలోచించకండి నేను జరిగిన విషయాన్ని మరిచిపోతున్నాను. ఇక ఈ రోజు నుంచి మీరే నా తల్లి. వాడు నా తమ్ముడు అని అంటుంది ఆ మాటలు ఆమె చాలా చాలా సంతోషపడుతుంది .
రోజులు గడిచాయి ఆమె హోటల్ లో పని చేస్తూ వచ్చిన డబ్బుతో పాప చేత చిన్న కూరగాయల వ్యాపారం పెట్టిస్తుంది.
పాప బాబు ఇద్దరూ ఆ ఇంటి ముందే కూరగాయల అమ్ముకుంటూ ఉంటారు.
అలా ఇద్దరూ సంపాదనతో ఒక చిన్న స్థలం కొనుక్కొని ఇంటికి ఏర్పాటు చేసుకుంటారు అలా కూడబెట్టిన డబ్బుతో పేదరికం నుంచి కొంత బయటపడతారు. మరికొన్ని రోజులు గడుస్తాయి వాళ్ళ కష్టంతో వల్ల పేదరికం పూర్తిగా దూరం అయిపోతుంది . ఇక ఆమె ఆ పిల్లలిద్దర్నీ బడికి పంపిస్తుంది వాళ్ళు చక్కగా చదువుకుంటూ తల్లికి సహాయం చేస్తూ సంతోషంగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *