ఆకలి రాజ్యం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక అందమైన గ్రామం ఆ గ్రామమంతా ఈ ఇప్పుడు సంతోషంతో జీవిస్తూ ఉండేవారు అనుకోకుండా ఒక పెద్ద మహమ్మారి వ్యాధి ఆ గ్రామానికి సంభవించింది. దానితో ఇంటి నుంచి బయటకు వచ్చే వాళ్ళు కాదు. ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి మాత్రమే వచ్చే వాళ్ళు. అదే ఊరిలో బాలయ్య, సూరమ్మ అ అనే దంపతులు కూడా నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళది చాలా పేద కుటుంబం రోజు గడిస్తే గాని పూట గడవదు. సూరమ్మ ఆ వూరి పక్కనే ఉంటున్న పట్టణంలో నీ ఇళ్లలో పాచిపని చేసుకొని కుటుంబాన్ని సాగిస్తూ ఉండేవాడు.అదేవిధంగా బాలయ్య కూడా పట్టణంలోని ఇళ్లల్లోని తోట పనిచేస్తూ కుటుంబాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు. ఆ మహమ్మారి వ్యాధి కారణంగా ఇప్పుడు ఎవ్వరూ వాళ్ళని పనిలోకి రమ్మని అడగటం లేదు. అందుకోసమే వాళ్లు చాలా ఇబ్బందులు పడుతూ తినడానికి తిండి లేకుండా బాధపడుతూ ఉన్నారు ఆ సమయంలో సూరమ్మ బాలయ్యతో…. ఏవండీ నాకు చాలా ఆకలిగా ఉంది అండి. తిండి తిని ఎన్ని రోజులు అవుతుంది. ఇలాగే ఉంటే నేను మీకు దక్కను అంటూ ఏడుస్తుంది.

బాలయ్య…. అలా మాట్లాడకు సూరమ్మ. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతికి ఉంటాను. ఈ మహమ్మారి వ్యాధి ఎక్కడి నుంచి వచ్చింది. మన ప్రాణాలు తీస్తుంది. అంటూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు.
దాన్ని చూసి సూరమ్మ కంగారు పడిపోయి… ఏమండీ ఏమైంది ఏమైంది అండి. అంటూ అతన్ని కంగారుగా పిలుస్తూ ఉంటుంది. కానీ అతడు తిండి లేకపోయినా కారణంతో సృహ తప్పి పడిపోయాడు అనుకొని తెలుసుకొని.
పరుగు పరుగున ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ఇంట్లోకి వెళ్లి వాళ్లతో…. అయ్యా ఒక ముద్ద అన్నం ఉంటే పెడతారా. మీకు పుణ్యం ఉంటుంది. తిండి తిని చాలా రోజులు అవుతుంది బాబు ఒక ముద్దు ఉంటే పెట్టండి.
అని ప్రాధేయపడింది.
అందుకు అతను…. ఏమమ్మా కాళ్లు చేతులు బాగానే ఉన్నాయి కదా. ఏదన్నా పని చేసుకొని బ్రతకొచ్చు కదా. ఇలా అడుక్కు తినడానికి సిగ్గు లేదు.
అందుకు suramma ఏడుస్తూ…. అయ్యా నేను అడుక్కునే దాన్ని కాదు. నాలుగు ఇళ్ళల్లో పాచి పని చేసుకొని బ్రతికే దాన్ని. ఇప్పుడు కొత్త వ్యాధి కారణంగా నన్ను ఎవరూ పనిలోకి రమ్మని పిలవడం లేదు. నా భర్త భోజనం లేక సృహ తప్పి పడిపోయాడు. ఆయన ను బతికించుకోవడం కోసమే నేను ఇలా ఆడుకుంటున్నాను. మీకు పుణ్యం ఉంటుంది ఒక ముద్ద పెట్టండి అయ్యా.
ఆ మాటలు విన్న అతను కి గుండె కరిగి పోయి…. అమ్మ ఒక్క నిమిషం ఆగండి అంటూ కొంత భోజనాన్ని తీసుకువచ్చి. ఆమెకి ఇచ్చాడు.
సూరమ్మ ఎంతో సంతోషంతో ….మీకు కృతజ్ఞతలు బాబు. అంటూ దాన్ని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి తన భర్తతో…. ఏవండీ లేవండి మీకోసం నేను భోజనం తీసుకు వచ్చాను. అంటూ అతన్ని లేపి భోజనాన్ని తినిపిస్తూ ఉండగా
బాలయ్య…. సూరమ్మ ఈ భోజనం ఎక్కడ నుంచి వచ్చింది.
సూరమ్మ…. ఎక్కడి నుంచి చూస్తే ఏంటి. ముందు మీరు తినండి.
బాలయ్య…. నువ్వు నిజం చెప్పక పోతే నేను తినను. ఇలాగే పస్తులుండి చచ్చిపోతాను.
అందుకో సూరమ్మ ఏడుస్తూ… మిమ్మల్ని బ్రతికించడం కోసం ఏం చేయమంటారు అండి అందుకే అడుక్కొని భోజనం తీసుకు వచ్చాను. తప్పంటారా.
అందుకు బాలయ్య ఏడుస్తూ… తప్పు ఎందుకు సూరమ్మ చివరికి మనకి ఆ భగవంతుడు ఈ రాత రాశాడు. కానీ ముష్టి ఎత్తుకోవడం కంటే చనిపోవడమే నయం కదా.
అంటూ ఇద్దరూ బోరు అంటూ ఏడుస్తారు.
ఆరోజు రాత్రి బాలయ్య తీవ్రంగా ఆలోచిస్తూ. తనలో… ఇక లాభం లేదు ఇలాగే కూర్చుంటే ఏం పని జరగదు. ఎక్కడ పని కూడా దొరకడం లేదు. ఏదో ఒక ఇంట్లో లో దొంగతనం చేయాల్సిందే. అని అనుకొని suramma నిద్రపోతున్న సమయంలో రాత్రి వేళ లేచి చిన్నగా నడుచుకుంటూ పక్కనే ఉన్న పట్నాo లో ఒక ఇంటి లోపలికి వెళ్ళాడు.. ఆ ఇంట్లో తనకు కావలసిన ఆహార పదార్థాల్ని కూరగాయల్ని దొంగిలించుకుని తిరిగి వస్తుండగా తన కాలికి ఏదో తగిలి కిందపడి అమ్మ అంటూ పెద్దగా అరుస్తాడు. ఆ శబ్దం విన్న ఇంటి వాళ్లు లేచి చూస్తారు వెంటనే ఆమె….. దొంగ దొంగ దొంగ అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడికి చేరుకొని అతన్ని పట్టుకుని కొడుతూ ఉంటారు. బాలయ్య అమ్మ అయ్యా వద్దు నన్ను వదలండి అయ్యా అంటూ ప్రాధేయ పడుతూ ఉంటాడు.
అప్పుడు ఆ ఇంటి యజమాని…. రేయ్ ముందు నీ దగ్గర ఉన్న మూట విప్పి. ఏమి దొంగతనం చేశావో చూపించు. అని అంటాడు.
బాలయ్య ఏడుస్తూ ఆ మూట విప్పి చూపిస్తాడు…. దాన్లో ఉన్న వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దానిలో కూరగాయలు తినడానికి ఆహారం ఉంటుంది.
అప్పుడా ఆ యజమాని…. ఏంట్రా ఇది భోజనాన్ని కూరగాయలు తీసుకెళుతున్నావ్వు. అసలు నువ్వు ఎవరు.
అని ప్రశ్నించగా అందుకు బాలయ్య… అయ్యా నేను కూలిపని చేసుకునే ఒక వ్యక్తిని. ఈ లాక్ డౌన్ కారణంగా కొత్త వ్యాధి కారణంగా తినడానికి తిండి లేక ఏం చేయాలో తోచక
ఇలాంటి పని చేశాను. అంటూ ఏడుస్తాడు.
అందుకు యజమాని…. సరేసరే బాధపడకు.
అని బాలయ్యని లోపలి కి వెళ్దాం పద అంటూ అతన్ని లోపలికి తీసుకు వెళ్తూ అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల జనంతో….సరే మీరు అందరు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఇక మీరు వెళ్ళండి. అని చెప్పి వారిని పంపి చేస్తాడు. లోపలికి తీసుకు వెళ్ళిన బాలయ్య తో మాట్లాడి అతని పూర్తి వివరాలు కనుక్కొని తర్వాత….. చూడు బాలయ్య ఇక నువ్వు ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదు.మీ భార్య పని చేస్తుంది అంటున్నావు కదా రేపట్నుంచి మీ భార్యను మా ఇంటికి పనికి పంపించు.ఆ కొత్త వ్యాధి గురించి భయపడాల్సిందేమీ లేదు. ఈ పట్టణం అంతా సురక్షితంగానే ఉంది. అలా అని విచ్చలవిడిగా నేను బయట తిరగమని చెప్పట్లేదు కానీ. మాస్కులు ధరించి sanitizer ni ఉపయోగించి తగు జాగ్రత్తలు తీసుకుంటే. మంచిది అని చెప్తున్నాను మీ భార్యను రేపటి నుంచి పనికి పంపించు. అని చెప్తాడు అందుకు బాలయ్య….అయ్యా మీకు చాలా కృతజ్ఞతలు మీది చాలా పెద్ద మనసు అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి పోతాడు . ఆ రోజు ఉదయం రాత్రి జరిగిన విషయమంతా సూరమ్మ కు చెప్పాడు. ఆమె ఆ విషయం గురించి బాధ పడిన పని దొరికింది అని సంతోషపడి పనికి వెళ్లడం ప్రారంభించింది. అలా కొన్ని రోజులు గడిచాయి బాలయ్య దొంగిలించిన కూరగాయలు అన్ని అయిపోవడంతో వాళ్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
అప్పుడు సూరమ్మ తన మనసులో….జీతం రావాలి అంటే ఖచ్చితంగా నెల గడపాల్సిందే ఏం ముఖం పెట్టుకొని పనిలో చేరిన నాలుగు రోజులకే డబ్బులు అడుగుతాము. అని బాధపడుతూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆ ఇంట్లో కొంత పాడైపోయి కొంత మెరుగ్గా ఉన్న కూరగాయలు కనిపిస్తాయి . వాటిని ఎలాగైనా బయటపడే వేయాల్సిందే. అందుకని ఆమె ఆ కొంత పాడైపోయి కొంత మెరుగ్గా ఉన్న కూరగాయలు అన్ని తీసుకొని తన ఇంటికి బయలు దేరుతుంది. ఆ దృశ్యాన్ని ఆ ఇంటి యజమాని గమనించాడు.
ఆ మరుసటి రోజు సూరమ్మ ఇంటికి వచ్చి పనులను చేసుకుంటూ ఉండగా అతను ఆమెతో….. చూడు సూరమ్మ ఈరోజు ఇంటికి బంధువులు వస్తారు. వాళ్ల కోసం కూడా భోజనం తయారు చేయి. అని చెప్తాడు అందుకు సూరమ్మ….. సరే అయ్యగారు అంటూ వాళ్ళ కోసం కూడా భోజనం తయారు తయారు చేసి ఇంటికి తిరిగి వెళ్తూ….. అయ్యగారు ఇక నేను వెళ్తాను. అని అంటుంది అందుకు యజమాని…. సూరమ్మ వాళ్ళ కోసం భోజనం తయారు చేశావు కదా. దాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇంటికి రావడంలేదని ఫోన్ చేశారు. మా ఇద్దరికీ అంత భోజనం ఏం చేసుకుంటాము వృధా అయిపోతుంది.
సూరమ్మ సరే అయ్యగారు అంటూ ఆ భోజనాన్ని తీసుకొని ఇంటికి బయలు దేరుతుంది.
అప్పుడు ఆ యజమాని భార్య అతనితో…. ఏమండీ ఎందుకు మీరు ఆ విధంగా చేశారు మన ఇంటికి ఏ బంధువులు రావడం లేదు కదా.
అప్పుడు అతను…. అవును నిజమే నేను ఎందుకు ఆమె చేత భోజనం నేను చేయించాలంటే నిన్న ఆమె పాడైపోయిన కూరగాయలు తీసుకోవడం చూశాను. అంటే వాళ్ళు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది కదా. మనం కనుక భోజనాన్ని ఇస్తే ఆమె ఖచ్చితంగా తీసుకోదు. ఎందుకంటే ఆమె మనస్తత్వం మనకు అర్థం అయింది కదా మొహమాట పడుతుంది. మనం ఆమెకు కొంత జీతాన్ని ఇద్దాము అంటే. మా ఆఫీస్ వాళ్ళే సరిగ్గా డబ్బులు నాకు పంపడం లేదు.
అందుకే ఈ విధంగా చేశాను.
భార్య…. మంచి పని చేశారు. నేను రేపటి నుంచి ఏదో ఒక వంకతో భోజనం ఎక్కువ తయారు చేయించి ఆమె చేత ఇంటికి తీసుకువెళ్లి ఎలా చేస్తాను అని అంటుంది.
అలా ప్రతి రోజు ఆమె చేత ఎక్కువ భోజనం తయారు చేయించి ఆమె ఇంటికి తీసుకెళ్లి చేస్తుంటారు. సూరమ్మ ఆ ఇంటికి తీసుకు వెళ్ళిన తర్వాత అతని భర్తతో….. ఏవండీ మన యజమాని వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే. ప్రతి రోజు ఏదో ఒక వంకతో నాకు భోజనాన్ని తయారు చేయమని చెబుతున్నారు. తరువాత ఆ భోజనాన్ని ఇంటికి తీసుకెళ్ళమని చెప్తున్నారు.వాళ్లు ఇదంతా మన ఆకలి తీర్చడం కోసమే చేస్తున్నారని నాకు అర్థమైంది.
బాలయ్య…. అవును సూరమ్మ ఆ కుటుంబం చాలా మంచిది దొంగతనం చేయడానికి వెళ్ళిన నా గురించి తెలుసుకొని వాళ్ల అ ఇంట్లో పని ఇప్పించారు. అప్పుడే అర్థమైంది వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని.
ఇక నీ ద్వారా ప్రతిరోజు మన ఆకలిని తీరుస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం జన్మజన్మల కి ఉన్న పడాల్సి ఉంది. నువ్వు ఒక పని చెయ్ మనకి ప్రతిరోజు కడుపు నిండుతుంది అది చాలు వాళ్ల దగ్గర జీతాన్ని తీసుకోకుండా మన కడుపు నిండా దానికి కొంత బియ్యాన్ని అడుగు అంతే. డబ్బులు మాత్రం తీసుకోకు ఈ విధంగా అయినా కొంత రుణం తీర్చుకుందాం.
అని అంటాడు అందుకు సూరమ్మ సరే అండి అని అంటుంది అలా ఆ కుటుంబం ద్వారా సూరమ్మ దంపతులిద్దరూ కడుపునిండా భోజనాన్ని తింటూ జీవిస్తున్నారు.
ఆకలి విలువ చాలా గొప్పది. అందుకే భోజనాన్ని వృధా చేయొద్దు. అలా చేసే బదులు బయట పేదవాళ్ళకి దానం చేయండి.
ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది జీవితాలు ఆకలి కేకలతో తెల్లవారి పోతున్నాయి. మన వీలైనంత వరకు మన పరిధిలో ఉన్న అలాంటి వాళ్లకి మన చేతనైన సాయం చేసి మానవత్వాన్ని నిలబెట్టు కుందాం జై హినూ

Add a Comment

Your email address will not be published. Required fields are marked *