ఆకాశంలో షాపింగ్‌మాల్_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక స్వామీజీ నివసిస్తూ ఉండేవాడు. అలా వుండగా ఒక రోజు ప్రవీణ్ అనే ఒక వ్యక్తి స్వామిజి దగ్గరకు వచ్చి పెద్ద పెద్దగా ఏడుస్తూ….స్వామి స్వామి అయిపోయింది అంతా అయిపోయింది మీరు చెప్పినట్టే అయింది. స్వామీజీ…. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్తావా.

ప్రవీణ్…. స్వామి ఆరోజు నేను నా స్నేహితుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమన్నారు నీ కుడి భుజం వైపు ఎక్కువగా ఉన్న వాళ్లతో జాగ్రత్తగా ఉండు.వాళ్లు నిన్ను ప్రమాదంలో ముంచేస్తారు అని చెప్పారు కదా అలాగే జరిగింది. వాడు నన్ను పూర్తిగా వ్యాపారంలో మోసం చేశాడు. అంటూ ఏడుస్తాడు స్వామీజీ…. బాధపడకు ప్రవీణ్ ముందు నువ్వు ఏడవడం ఆపు
ప్రవీణ్… ఆగట్లేదు స్వామి నా బాధ .ఆ రోజు మీ మాటలు విన్నట్టు అయితే బాగుండేది.ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు వాడు నన్ను పూర్తిగా మోసం చేస్తే నేను రోడ్డున పడ్డాను నాకు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించాలి మీ మాట వినలేదు నేను అంటూ స్వామీజీ ఎంత చెప్పినా అతను ఏడుస్తూనే ఉంటాడు స్వామి జాతర చూసి తనలో … ఎంత చెప్పిన నా మాట వినటం లేదు. సరే మీ ఇష్టం వచ్చినంత సేపు ఏడువు ఆ తర్వాత నీతో మాట్లాడుతాను. అని అనుకొని అతనివైపు అలా చూస్తూనే ఉంటాడు ప్రవీణ్ చాలా సేపు ఉంచిన తర్వాత స్వామీజీతో… స్వామి నన్ను వాడు మోసం చేశాడు అందుకు నాకు వాడి మీద పగ తీర్చుకోవాలని ఉంది. దానికి సరైన పరిష్కారం మీరు మాత్రమే చెప్పగలరు నన్ను అన్యాయం చేశాడు. కోట్ల డబ్బు వాడి సొంతం చేసుకున్నాడు.
అందుకు స్వామీజీ….ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది నీ సమస్య కూడా పరిష్కారం ఉంది ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి అలాగే నువ్వు కూడా వాడికి బుద్ది కలిగే లాగా చేయాలి.
ప్రవీణ్…. అది ఎలా స్వామి నాకు అర్థం కాలేదు.
స్వామీజీ…. అసలు మీరు వ్యాపారం ఎక్కడ మొదలు పెట్టారు ఏం వ్యాపారం మొదలు పెట్టారో చెప్పు.
ప్రవీణ్… మీకు తెలుసు కదా స్వామి మేము అందరి కన్నా కొత్తగా అండర్ గ్రౌండ్ లో షాపింగ్‌మాల్ ఏర్పాటు చేశాము. అది అందరికీ నచ్చడంతో వింత గా ఉండడం తో అందరూ అక్కడికి వచ్చి వాటిని తీసుకెళ్తున్నారు డబ్బులు బాగా వస్తున్నాయి వాడికి అత్యాశ కలిగింది. నన్ను మోసం చేశాడు.
అందుకు స్వామీజీ… అయితే అతను భూగర్భంలో షాపింగ్ మాల్ పెడితే నువ్వు ఆకాశంలో షాపింగ్ మాల్ పెట్టు అంటే
ప్రవీణ్…. అది ఎలా స్వామి.
స్వామీజీ…. కంగారు పడుకో నా మాయా శక్తి తో నేను ఏదైనా చేయగలను అంటూ ఆకాశంలో ఒక పెద్ద షాపింగ్ మాల్ ప్రత్యక్షం చేస్తాడు.
దాన్ని చూసిన ప్రవీణ్ చాలా ఆశ్చర్యపోతూ… స్వామీజీ నా రెండు కళ్ళను నమ్మలేకపోతున్నాను ఇదంతా నిజమే కదా.
స్వామీజీ… అక్షరాల నిజం
ప్రవీణ్…. అది సరేగాని స్వామి ఇప్పుడు షాపింగ్ మాల్ అయితే పైన ఉంది మరి అక్కడి మనుషులు రావాలంటే ఎలా.
స్వామీజీ….నేను భూమి మీద ఒక గుండ్రని ఆకారాన్ని ఇస్తాను ఆ ఆకారం లో ఎవరైనా నిలబడితే చాలు వాళ్లకి రెండు రెక్కలు వచ్చి గాల్లో ఎదుర్కొంటూ సరాసరి షాపింగ్ మాల్ లోకి వస్తారు.అక్కడ వాళ్ళ పని పూర్తయిన తర్వాత అదే విధంగా భూమ్మీదికి వస్తారు . ఆ తర్వాత వాళ్లకి ఆ రెక్కలు మాయమైపోతాయి.
దానినీ విన్న ప్రవీణ్….అబ్బ స్వామి వింటుంటేనే ఎంత అద్భుతంగా ఉందో ఇంకా కళ్ళలో చూస్తే ఇంకెలా ఉంటుందో నాకు చాలా ఆత్రుతగా ఉంది స్వామి. నా కోసం మీరు త్వరగా ఆ గుండ్రని వలయా న్నీ గీయండి.
అని అడుగుతాడు అందుకు స్వామీజీ సరే అని చెప్పి నేలమీద గుండ్రని వలయాన్ని ఏర్పాటు చేస్తాడు.
అప్పుడు ప్రవీణ్ స్వామీజీతో…. స్వామి మొదటిసారిగా దాన్ని నేనే ఒక సారి పరీక్షిస్తారు స్వామి . కాదనకండి స్వామీజీ… అందులో కాదు అనడానికి ఏముంది నువ్వు ప్రయత్నించు. అని అంటాడు
అందుకు ప్రవీణ్ సరే అని చెప్పి వెళ్లి ఆ వలయంలో నుంచూ oటాడు . అలా అతను నుంచున్న వెంటనే అతనికి రెండు రెక్కలు వచ్చి గాల్లో ఎగురుతూ చాలా సంతోషంగా…. స్వామి చాలా బాగుంది స్వామి.చాలా చాలా బాగుంది అంటూ అరుస్తూ ఆ షాపింగ్ మాల్ లోకి వెళ్తాడు. హాయ్ షాపింగ్ మాల్ లోకి వెళ్ళిన వెంటనే అతని రెక్కల రెండు మాయమైపోతాయి. అచట షాపింగ్ మాల్ లో రకరకాల వస్త్రాలు చూసి చాలా ఆశ్చర్య పోతూ….. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది.
స్వామీజీ మహిమ అంటే మహిమే చాలా చాలా బాగుంది. అని అనుకొని మొత్తం తిరిగి చూస్తాడు.అలా చూడడం అయిపోయిన తర్వాత అతనికి నచ్చిన బట్టలు తీసుకొని.
తనలో…. అయ్యో పైన అయితే ఒక వలయం ఉంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను మరి కిందకి వెళ్ళాలంటే ఎలాగా ఇక్కడ కూడా అలాంటిది ఉండే ఉంటుంది అని అక్కడ వెతకడం చేస్తాడు అప్పుడు అతనికి ఒక గుండ్రని వలయం కనబడుతుంది. దాన్ని చూసి ఓహో ఎక్కడ ఉందా అంటూ ఆ వలయం మీద నిలబడతాడా వెంటనే అతనికి రెండు రెక్కలు వచ్చి సంతోషంగా కిందికి ఎగురుకుంటూ వెళ్తాడు. అతని కిందికి వెళ్లిన వెంటనే ఆ రెండు రెక్కలు మాయమైపోతాయి .
అప్పుడు అక్కడున్న స్వామీజీతో…… స్వామి అక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది అసలు ఇలా రెక్కలు వచ్చి ఆకాశములు ఎగరడం అంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంది.
అతను చెప్పే మాటలు విని స్వామి చిన్నగా నవ్వుకుంటాడు అప్పుడు ప్రవీణ్…. అది సరే కానీ స్వామి ఇప్పుడు నేను ఆకాశంలో లో షాపింగ్ మాల్ పెట్టినట్టు ఇక్కడ ప్రజలు అందరికీ తెలియ చెప్పాలా ఒక ఆటో మాట్లాడుకొని తీసుకు రమ్మంటారా మొత్తం ప్రచారం చేపిస్తాను.
స్వామీజీ…. నువ్వేమీ కంగారు పడకు అంత ఆడంబరం చేయాల్సిన అవసరం లేదు ఆకాశంలో ఉంది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఇది కనబడుతూ ఉంది నాకు తెలిసినంతవరకు ఈపాటికి ఈ వింతను చూడటానికి బయలుదేరే ఉంటారు. అని స్వామీజీ అంటాడు ఇంతలో కొంతమంది అక్కడికి వస్తూ ఒకరితో ఒకరు…. ఇదెక్కడి వింత రా బాబు పైన ఏదో జరుగుతుంది.
అసలు అది ఏంటో తెలుసుకోవాలి త్వరగా పదండి నాకు చాలా ఆత్రుతగా ఉంది అంటూ అందరూ అక్కడికి చేరుకుంటారు.
అప్పుడు ప్రవీణ్ జరిగిన విషయం అంతా చెప్పి….. అంతా విన్నారు కదా మీకు కావాలి అంటే చాలా తక్కువ ధరకు నేను బట్టలు ఇస్తాను కావలసిన వాళ్లు ఎవ రో ఈ వలయం లో నిలబడండి.మరొక విషయం ఏంటంటే పైకి వెళ్ళిన వాళ్ళు కచ్చితంగా ఏదో ఒకటి కొనుగోలు చేయాల్సిందే లేదంటే కిందకి రావడం అసాధ్యమవుతుంది ముందుగానే చెప్తున్నాను.
అందుకు వాళ్లు సరే అన్నట్టుగా తలూపారు. ఇంతలో ఒక వ్యక్తి ఆ భయంలో నిలబడతాడు వెంటనే ఆ వ్యక్తికి రెండు రెక్కలు వచ్చి గాల్లోకి ఎగరడం ప్రారంభిస్తాడు దాన్ని చూసిన ప్రజలు అంతా చాలా ఆశ్చర్యపోతూ…. భలే భలే బాగుంది అంటూ ముందుకు వెళ్దాం వెళ్దాం అంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆ వలయంలో నిలబడి రెక్కలు పొంది ఆ షాపింగ్ మాల్ కి వెళ్తారు తర్వాత స్వామీజీ మరియు ప్రవీణ్ కూడా అక్కడకు చేరుకుంటారు అక్కడికి వెళ్ళిన ప్రజలంతా షాపింగ్ మాల్ అంతా తిరుగుతూ వాటిని చూస్తూ….. అబ్బా బయట ఎక్కడ ఇలాంటి ఇలాంటి బట్టలు దొరకనే దొరకవ్వి. ప్రవీణ్ వాళ్ళ అండర్ గ్రౌండ్ షాప్ లో కూడా ఇలాంటి బట్టలు లేనేలేవు పైగా అక్కడ ఎక్కువ రేటు ఇక్కడ చాలా తక్కువ రేటు అని అనుకుంటూ అక్కడ ఉన్న వాటిని చూస్తూ వాళ్ళ కావలసిన తీసుకొని డబ్బులు ప్రవీణ్ కి ఇచ్చి అక్కడ ఉన్నవ్ వలయంలో నిలబడతారో వాళ్ళకి రెక్కలు వచ్చి తిరిగి భూమి మీదకి వెళ్తారు అలా ప్రజలంతా ప్రవీణ్ యొక్క షాపింగ్ మాల్ గురించి తెలుసుకొని దాన్ని చూడ్డానికి చాలా మంది వస్తు వెళ్తూ ఉంటారు. అలా ఉండగా సంతోష్ తన ఇంట్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలో అతని భార్య అక్కడికి వచ్చి…. ఏమండీ నేను కూడా ఆ ఆ షాపింగ్ మాల్ కి వెళ్తాను అండీ ఆకాశంలో షాపింగ్‌మాల్ పెట్టాడంట మన ప్రవీణ్. ఊరిలో ప్రజలందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అది చాలా అద్భుతంగా ఉందంట. త్వరగా పదండి మీ స్నేహితుడే కదా. అందరికంటే మనకి ఒక రూపాయి తక్కువగా ఇస్తాడు.
అందుకే అతను చాలా కోపంగా…. అంటే దాని అర్థం ఏంటి మన షాప్ లో ఉన్న బట్టలన్నీ పాతవి. సరిగ్గా నీకు నచ్చలేదు అదే కదా దీని ఉద్దేశం.
అందుకు ఆమె…. నేను అలా అనలేదు అండి.
మీరిద్దరూ స్నేహితులే కదా అందుకని అక్కడికి వెళ్దామా అని అంటున్నాను.
అతను… మేమిద్దరం స్నేహితులు అనేది ఒకప్పటి మాట ఇప్పుడు కాదు మేమిద్దరం ఇప్పుడు బద్ధ శత్రువులమయ్యాము. అసలు నీకు కొంచెమైనా బుర్ర ఉందా వాడు ఆ షాపింగ్ మాల్ పెట్టడం వల్ల మనకి ఎంత నష్టమో ఒక్కరు కూడా మన వైపు చూడటం లేదు.
అందుకు ఆమె….. అయ్యో అవునా అండి ఈ విషయం నాకు తెలియదు. సర్లే నామీద కోపం చూపించకండి నేను లోపలికి వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అలా రోజులు గడిచాయి అందరూ అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్ ఉందన్న సంగతి పూర్తిగా మర్చిపోతారు అందరు ఆకాశంలో షాపింగ్ మాల్ కి వెళ్తూ చాలా ఆనందపడుతూ ఉంటారు దానివల్ల ప్రవీణ్ కి చాలా లాభం వస్తుంది అలా ఉండగా ఒక రోజు ప్రవీణ్ స్వామీజీతో…. స్వామి మీ పుణ్యమా అంటూ నేను చాలా ధనవంతుడు అయ్యాను చాలా డబ్బులు సంపాదిస్తున్నాను . ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏమిటంటే సంతోష్ యొక్క షాపుకి ఎవరూ వెళ్లడం లేదు అని అతను తీవ్ర నష్టాల్లో ఉన్నాడు అని తెలుసుకున్నాను.
కానీ స్వామి నన్ను మోసం చేసినప్పటికీ నాకు బాధగా ఉన్నా. వాడు నా స్నేహితుడు కాబట్టి
వాడు నష్టాల్లో ఉన్నాడు అంటే నాకు కొంచెం బాధగానే ఉంది. ఎంత చెడిన వాడు నాకు స్నేహితుడే కథ స్వామి. వాడికి నేను సహాయం చేయాలని ఉంది ఏమంటారు.
స్వామీజీ…. నీ మంచి మనసు నాకు తెలుసు. ఈ పాటికి నీ మిత్రుడు తన తప్పును తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరడానికి దారిలోనే వస్తున్నాడు.
అని అంటాడు ఇంతలో తన స్నేహితుడు అక్కడికి వస్తాడు అతడు చాలా బాధ పడుతూ…..మిత్రమా నన్ను క్షమించు నేను పూర్తి కష్టాల్లో ఉన్నాను నీకు అన్యాయం చేసినందుకు నాకు దేవుడు తగిన శిక్షను విధించాడు. అంటూ ప్రాధేయ పడుతూ బోర్న్ ఏడుస్తాడు.
స్వామీజీ…. బాధపడకు నీకు బుద్ధి రావడం కోసమే ఇదంతా చేశాను.మంచి స్నేహితుల్ని నమ్మిన వారిని మోసం చేయకూడదు అలా చేస్తే ఆ భగవంతుడు ఊరికే చూస్తూ ఉండడు.
ఏదో ఒక రూపంలో తప్పు చేసినవాడికి శిక్ష విధిస్తాడు. ఈ పాటికి మీకు అర్థమైంది కదా
అందుకు అతను అర్థమైంది స్వామి నా వల్ల ఇలాంటి పొరపాటు జరగదు అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ ఆ ఆకాశం షాపింగ్
వాళ్లని ఇద్దరూ సమానంగా చూసుకుంటూ లాభాన్ని ఇద్దరూ సమానంగా పంచుకుంటూ హాయిగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *