ఆక్సిజన్ కరువైన బతుకులు | Telugu Stories | Telugu Kathalu | Bedtime Stories |Panchatantra kathalu

గోవర్ధన పురం అనే గ్రామంలో ఒక పెద్ద అడవి ఉండేది. అక్కడ ఉన్న ప్రజలు ఆ అడవిలో ఉన్న చెట్లను నరికేసి వాళ్ళ అవసరానికి ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. కొందరు ఇల్లు నిర్మించుకోవడం కోసం వాడితే మరికొందరు పొయ్యిలో కట్టెల కోసం వాడేవారు. మరికొందరు వాటిని కట్టెల గా కొట్టుకొని పక్క గ్రామాల కి అమ్ముకునే వాళ్ళు ఆ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళు. అదే గ్రామంలో సీతమ్మ రాజయ్య అనే దంపతులు ఉన్నారు వాళ్ళది పేద కుటుంబం కావడంతో వాళ్లు కూడా అడవి మీద ఆధారపడి ఉన్నారు. కానీ వాళ్లు ఎప్పుడూ కూడా అడవిలో చెట్లు నరికే వాళ్ళు కాదు అడవిలో ఉన్న పండ్లు తీసుకొచ్చి అమ్ముకోని డబ్బు సంపాదించే వాళ్లు.
అలా ఉండగా ఒకరోజు భార్య అతనితో….. ఏవండీ ఇలా మనం పండ్లను అమ్మగా వచ్చే లాభం కంటే . కట్టెలు కొట్టి అమ్మకపోతే వచ్చిన లాభమే ఎక్కువ. మీరేమో కట్టెలు కొట్టడానికి ఇష్టపడరు. చెట్లు నరకడం గా ఉండడం మీ ఒక్కరి బాధ్యత నా . నరికే వాళ్ళందరూ సంగతి ఏంటి. మనం ఇలాగే ఉంటే ఇంకాస్త పేదరికంలోకి జారిపోతాము.
నా మాట విని కట్టెలు కొట్టుకొని రండి.
ఆ మాటలు విన్న అతను భార్యతో…. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా. మనం ఎన్ని రోజులు బ్రతుకుతుంది ఆ చెట్లు నుంచి వచ్చే పండ్ల ద్వారా . అందరూ వాటిని కొట్టేస్తే మనం తర్వాత ఏం చేయాలి అడవి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మనకి పని ఉండదు వాళ్లకు కూడా పని ఉండదు.
చెట్లు పెంచడం వల్ల ఎన్ని లాభాలు ఉంటే నరకడం వల్ల కేవలం ఒక్క లాభమే ఉంటుంది చెట్టు ఎండిపోతే దాన్ని నరికి కట్టలుగా మార్చుకుంటే. మార్చుకుంటే పర్వాలేదు బతికి ఉన్న చెట్లు నరికితే మాత్రం తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది.
ఆ మాటలకు ఆమె ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది.
రోజులు గడిచాయి. అక్కడ ప్రజలు తెలియని వ్యాధితో బాధపడుతూ ఉంటారు ఆక్సిజన్ అందక సతమతమై పోతుంది అన్నారు.
రాజయ్య భార్య సీతమ్మ కూడా ఆ తెలియని వ్యాధి సోకుతుంది ఆమె చాలా బాధ పడుతూ… ఏవండీ నన్ను హాస్పిటల్ కి తీసుకు వెళ్ళండి నావల్ల కావడం లేదు. త్వరగా తీసుకు వెళ్ళండి .
అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అతనికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు .
అక్కడ డాక్టర్ ఆమె ను పరీక్షించి….. హాస్పటల్ అంతా ఈ వ్యాధి తోనే బాధపడుతున్నారు ఆక్సిజన్ సిలిండర్స్ లేవు . అని అంటుంది అందుకు అతను బతిమిలాడుకుంటూ ఉంటాడు. డాక్టర్ కి ఏం చేయాలో అర్థం కాదు. శ్రీదేవి శ్వాస ఆడక చాలా ఇబ్బంది పడుతుంటే ఇక అతను తన నోటి ద్వారా ఆమెకు శ్వాసని అందిస్తాడు దాన్ని చూసిన డాక్టర్ చాలా ఆశ్చర్యపోతూ…. అయ్యో ఇది అంటువ్యాధి అది నీకు కూడా అంతే ప్రమాదం ఉంది ఇలా ఎందుకు చేశారు మీరు.
అతను ఏడుస్తూ…. డాక్టర్ మరి ఏం చేయమంటారు . నాతో ఏడడుగులు నడిచి వచ్చింది నా భార్య కడవరకు నేను తోడు ఉంటాననీ చెప్పాను ఇప్పుడు నేను తోడు లేకుండా ఆమెని వదిలి పెట్టలేదు కదా
అందుకే ఇలా చేశాను నా భార్య బ్రతకాలి డాక్టర్ అంటూ ఏడుస్తూనే ఆమెకు శ్వాసని అందిస్తాడు.
ఆమెకు కొంత ఊపిరి అందీ కుదుటపడుతుంది. ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం డాక్టర్ వాక్సిన్ సిలిండర్ను ఆమెకు అందించి…. చూడండి ఇది అంటువ్యాధి కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మందులు మీరు కూడా వాడండి ఎందుకన్నా మంచిది అని ఇద్దరికీ కలిపి మందులు రాస్తుంది ఇక వాళ్ళు అక్కడే ఉండి వాటిని వాడుతూ జాగ్రత్తగా ఉంటారు .
చాలా సమయం తర్వాత అతను బయటకు వస్తాడు అప్పుడు అక్కడ ఉన్న చాలామంది ప్రజలు పెద్ద పెద్దగా ఏడుస్తూ …. ఓరి భగవంతుడా ఎంతపని జరిగిపోయింది నా బిడ్డను తీసుకెళ్ళి పోయావా. ఇంక నేను ఎవరికోసం బ్రతకాలి నా భర్త కూడా లేడు . నన్ను కూడా తీసుకెళ్ళు అంటూ ఒక తల్లి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది.
మరోవైపు …. పవిత్ర నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా ఇప్పుడు నేను పిల్లలిద్దరినీ ఏం చేయమంటావు. వాళ్ళ అమ్మ కావాలి అంటే నేను ఎక్కడనుంచి తీసుకురావాలి .
అయ్యో అంటూ ఏడుస్తూ ఉంటారు .
చాలామంది హాస్పిటల్ బెడ్ లో లేక బయట చెట్ల కింద ఉంటారు దాన్ని చూసి అతను చాలా బాధపడుతూ లోపలికి వెళ్లి డాక్టర్ తో…. డాక్టర్ బయట అంత మంది ప్రాణాలు పోయినాయి మీరు ఏం పట్టించుకోవడం లేదు . చాలా మంది చెట్ల కింద పడుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి డాక్టర్.
డాక్టర్ అతనితో… మేము చేయగలం ఆ ప్రయత్నాలన్నీ చేసాము హాస్పటల్లో బెడ్ లేవు . ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి స్తోమత లేని వాళ్ళు.
మేము మా సొంత డబ్బుతో ఆక్సిజన్ సిలిండర్లు మరికొన్ని బెడ్ తీసుకు వచ్చాము అయినప్పటికీ సరిపోవడం లేదు . మేము అంటూ ఎంత ప్రయత్నం చేయగలము ఎవరైనా దాతలు ఆదుకోవాల్సిన దే అంటూ చాలా బాధగా చెబుతుంది .
అతను… పేదవాడి జీవితం అంటే ఇలాగే ఉంటుందేమో భగవంతుని దయవల్ల నేను కొంచెం ముందు వచ్చాను. కొంచెం ఆలస్యం అయినట్టయితే నా భార్య పరిస్థితి ఎలా ఉండేదో మేం కూడా బయట ఉండాల్సి వచ్చేది. అంటూ చాలా బాధపడతాడు.
కొన్ని రోజుల గడుస్తుంది ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది ఆమెను అతను ఇంటికి తీసుకు వెల్తాడు అక్కడ భార్యతో…. చూసావా శ్రీదేవి ప్రాణవాయువు లేకపోతే నువ్వు ఎంతగా తల్లడిల్లిపోయావు. అదే విధంగా ఇక్కడ ఉన్న చెట్లు మొత్తం నరికేస్తే చివరికి ఫోన్ మీద ఆక్సిజన్ ఉంటుందా అప్పుడు ఈ కొత్త వ్యాధి వల్ల సగం మంది చనిపోతే . చెట్లు కొట్టడం వల్ల ప్రాణ వాయువు లేక అందరూ తెచ్చుకోవాల్సి వస్తుంది .
అందుకే నేను చెట్లు నరకద్దు అని చెప్తాను .
ఆ మాటలు విన్న ఆమె…. అవునండి మీరు సరిగ్గా చెప్పారు చెట్లు నాటడం కాదు చెట్లను పెంచాలి . అది ఇచ్చే నీడలో సంతోషంగా బతకాలి అవి ఇచ్చే పండ్లను ఆస్వాదించాలి అవి. లేకపోతే ఈ భూమ్మీద ప్రాణవాయువు ఉండదు . గాలి మొత్తం కలుషితం గా మారి మనం చనిపోతాం. అని అంటుంది అతను… అవును సరిగ్గా చెప్పవు. ఇకనుంచి అర్థం చేసుకో నీ తోటి వాళ్ళ కూడా అదే చెప్పు. చెట్లు నరకడం కాదు చెట్లు పెంచుదాం అని అంటాడు అందుకు ఆమె సారీ ఉంటుంది కొన్ని రోజులు గడిచి వాళ్ల ఆరోగ్యం కుదుట పడిన తర్వాత భార్య ఇంటి చుట్టూ
చెట్లు నాటుతున్న ఉంటుంది దాన్ని చూసి అతను చాలా సంతోషపడ్డాడు తర్వాత ఆమె…. ఏవండీ నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది మీరు పనులు అమ్ముతున్నారు కదా నేను అడవిలో ఉన్న చిన్న చిన్న మొక్కలు ని తీసుకువచ్చి తక్కువ దరికీ అమ్ముతాను .
అతను…. కానీ డబ్బులు ఈ వాటిని అమ్మడం ఎందుకు ఉచితంగా ఇవ్వచ్చు కదా.
ఆమె…. అయ్యో ఉచితంగా ఇస్తే దాని మీద అంత శ్రద్ధ చూపించరు డబ్బులు పెట్టి తీసుకుంటే డబ్బులు వృధా చేయడం ఎందుకు చెట్టు తీసుకున్నాం కదా దాన్ని బ్రతికించు కోవాలని ఆశ ఉంటుంది.
దానికోసమే డబ్బు తీసుకుంటాను అని అంటున్నాను దానికి డబ్బులు వచ్చినట్లు ఉంటుంది వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని శ్రద్ధగా చూసుకుంటారు.
ఆ మాటలు విన్న అతను…. భలే తెలివైన దానివి నువ్వు అని అంటాడు ఇక ఇద్దరూ కలిసి అడవి కి వెళ్తారు అక్కడ అతను పండ్లు సేకరిస్తూ ఉంటే ఆమె చిన్న చిన్న మొక్కలని సేకరిస్తూ ఉంటుంది.
అలా కొంత సమయానికి ఇద్దరు వాళ్ళ పని ముగించుకొని అడవి నుంచి గ్రామానికి వెళ్లి వాటిని అమ్ముతూ ఉంటారు ఇక అతను ఆ గ్రామంలోని ప్రజలకు చెట్ల యొక్క గొప్పతనం గురించి అలాగే తన భార్య ఆక్సిజన్ లేక పడిన ఇబ్బందులు గురించి చెప్పుకుని వస్తాడు దాన్ని విన్న వాళ్లంతా …. నువ్వు చెప్పిందంతా నిజమే నా బాబు.
అని ఒక అతను ప్రశ్నిస్తాడు అందుకు శ్రీదేవి…. నిజంగా నిజం . మేము మా వ్యాపారం కోసం
ఇలాగ చేయడం లేదు నిజంగానే మొక్కలు నాటడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి . ఈ మొక్క పెరిగి పెద్ద అయితే మనకి నీడనిస్తుంది . పక్షులు ఉండడానికి గూడు ని ఇస్తుంది. మనకి తినడానికి పండ్లు ఇస్తుంది. సకాలంలో వర్షాలు పడి పంటలు పండడానికి సహాయం చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం బ్రతకడానికి ప్రాణవాయువు ఇస్తాయి. గాల్లో ఉన్న చెడువాయువు మొత్తాన్ని తీసుకొని మన కోసం ప్రాణవాయువు అందిస్తున్న చెట్లను పెంచడం లో తప్పేమీ లేదు . వాటిని తరగకుండా ఉంటే అంతే చాలు అని అంటుంది. ఆ మాటలు విన్న వాళ్లంతా సరే అని చెప్పి ఆ మొక్కలు తీసుకుంటారు . ఇక అందరూ చెట్లను కొట్టడం మానివేసి మొక్కలు నాటి వాటిని చూసుకుంటూ ఉంటారు .
ఆ విధంగా మా ఊరు మొత్తం చేస్తుంది ఇక ఇది ఇలా ఉండగా చాలామంది పేదవాళ్ళు కొత్త వ్యాధి కారణంగా చనిపోతూ ఉంటున్న విషయం ఆ శ్రీదేవి దంపతులకి తెలియడంతో వాళ్లు వాళ్ల వంతు సహాయం చేయడానికి సిద్ధపడతారు.
అదే ఊర్లో ఉన్న ప్రజలతో ఆ విషయాన్ని చర్చిస్తారు. అతను…. కొత్త వింత సంగతి మనకి తెలిసిందే . మన మీద చాలా పెద్దరికం లో ఉన్నాము. కానీ మన కంటే పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లకి మన తరఫున సహాయం చేద్దాం.
వాళ్లకి డబ్బు ఆహారం అందిద్దాం.
ఈ వ్యాధికి విరుగుడు మందు ముఖ్యంగా మంచి బలమైన ఆహారం దానిని అందించి వాళ్లకి మందులు సరఫరా చేద్దాం అని అనుకుంటున్నాను మీరు ఏమంటారు.
వాళ్లు…. మంచిదే కదా బాబు ఇప్పటికే మన ఊర్లో చాలా మంది కొత్త వ్యాధి బారినపడి కోలుకున్నారు కాని పక్క గ్రామాల వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు వారికి సహాయం చేయడం మనిషిగా మన బాధ్యత.
అలాగే చేద్దాం అని అనుకోని అక్కడ ఉన్న వాళ్లంతా చందాలు వేసుకుంటారు.
ఇక ఆ వచ్చిన డబ్బుతో మందులు అలాగే ఆహారాన్ని సిద్ధం చేసి శ్రీదేవి అతని భర్త రామయ్య అలాగే మరికొందరు కలిసి వాళ్ళకి మందులు అలాగే ఆహారాన్ని అందిస్తూ వుంటారు. వాళ్లంతా సేవ చేయడం చూసిన ఒక జమిందారు ఏం జరుగుతుందో వాళ్ల ద్వారా తెలుసుకుంటాడు .
అతను రామయ్యతో…. చూడండి మీరు చేస్తుంది చాలా గొప్ప పని నా వంతు సహాయం నేను చేస్తాను అని అంటాడు అందుకు వాళ్లు చాలా సంతోష పడతారు కానీ రామయ్య…. బాబు ఈ ఆహారం మందులు లాంటివి మేము అందరం కలిసి అందించగలము. కానీ ఆస్పత్రిలో మాత్రం ప్రాణవాయువు లేక చాలా మంది చనిపోతున్నారు . మీరు ఎక్కడైతే ప్రాణవాయువు లేక ఇబ్బంది పడుతున్నారో. అక్కడ వాళ్ళకి దానిని అందించారు అంటే . చాలా గొప్ప పని చేసిన వాళ్లు అవుతారు.
కాదనకుండా సహాయం చేయండి . అని అంటాడు అందుకు తను సరే అంటాడు .
ఇక ఆ జమీందారు చెప్పినట్టుగానే ఎన్నో హాస్పిటల్కి ప్రాణవాయువుని ఆక్సిజన్ సిలిండర్స్ ని అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతాడు అలా ఆ వాళ్లందరూ మనిషికి మనిషి సహాయం చేసుకుంటూ మేమున్నాము అంటూ ధైర్యం చెబుతూ మంచి కార్యక్రమాలు చేస్తూ అలా ముందుకు సాగిపోతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *