ఆడపిల్ల Adapilla web series Episode 1 : పాప బ్రతుకుతుందా
ఆదిశంకర పురం అనే గ్రామం. అక్కడ శంకర్ అనిత అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకి ఒక పాప పేరు బేబీ ఎంతో సంతోషంగా వాళ్ల కుటుంబాన్ని గడుపుతున్నారు. ఇక అతను ప్రతి రోజు పొలం పనులకు వెళుతూ. పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు. అనిత ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది
బేబీ బడికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చి ఇంట్లో చదువుకుంటూ ఉండేది.
అలా వుండగా ఒక రోజు అనిత పని చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. దాన్ని చూసి శంకర్ బేబీ లో చాలా కంగారు పడిపోతారు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
అక్కడ డాక్టర్ వాళ్లతో….. కంగారు పడాల్సిందేమీ లేదు శుభవార్తే మీరు మరోసారి తండ్రి కాబోతున్నారు. అని సంతోషకరమైన వార్తని చెబుతోంది డాక్టర్. దానిని విన్న అతను చాలా సంతోషపడ్డాడు ఆమెనీ అక్కడినుంచి తీసుకొని ఇంటికి వెళతాడు.
ఇక అప్పటి నుంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అతను ఆమెతో…. కచ్చితంగా మనకు పుట్టబోయేది మగ బిడ్డ నేను మగ బిడ్డ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అనిత అని అంటాడు.
అందుకు ఆమె…. భగవంతుడి దయవల్ల మగ బిడ్డ పుట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను.
అని అంటుంది ఇక ఆరు నెలలు గడిచాయి
ఒక రోజు రాత్రి సమయం ఆమె ప్రసవవేదన పడుతూ చాలా బాధ పడుతూ ఉంటుంది ఇక
హాస్పటల్ కి తీసుకెళ్ళు అంత సమయం కూడా ఉండదు . అతను పక్కనే ఉన్న పెద్ద ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్తాడు ఆమె పేరు సారమ్మ.
సారమ్మ, పెద్దమ్మ పెద్దమ్మ అంటూ కేకలు వేస్తాడు . ఆమె వస్తున్నా అంటూ ఇంత రాత్రివేళ ఎవరు బాబు అని కంగారుగా బయటకు వస్తుంది. ఇక అతన్ని చూడగానే…. ఏమైంది శంకర్ ఏమైంది అంటూ ప్రశ్నిస్తోంది అతను …. పెద్దమ్మ నా భార్యకి పురిటి నొప్పులు మొదలయ్యాయి కొంచెం త్వరగా రావా అంటూ ఆమెనీ తీసుకొని వెళ్తాడు.
పాప భయపడుతూ అలా చూస్తూ ఉంటుంది. సార్ మా పాపను తీసుకుని బయటకు వెళ్ళమని చెబుతోంది.
అతను పాపను తీసుకుని బయటకు వస్తాడు.
సార్ మా ఆమెకు పురుడు పోస్తుంది.
ఆమె ఒక ఆడ బిడ్డకు జన్మనిస్తుంది.
ఆ విషయాన్ని సారమ్మ అతని దగ్గరకు వచ్చి చెబుతుంది. అతను కొంచెం బాధ పడతాడు ఎందుకంటే అతను మగబిడ్డ కోవాలని కోరుకున్నాడు కాబట్టి.
ఆ మరుసటి రోజు ఉదయం భార్య అతనితో…. ఏమండీ నన్ను క్షమించండి. భగవంతుడు నాకు మగబిడ్డను ప్రసాదిస్తాడనుకున్నాను కానీ ఇలా జరిగింది నేను ఏంచేయాలి.
అందుకు అతను నవ్వేసి వెళ్ళిపోతాడు.
ఇక పొలం పనుల్లో అతను చాలా హడావిడిగా
ఉంటాడు పాపని కానీ ఆమెను పట్టించుకోడు అతని వాలకం మీద అనుమానం వచ్చిన ఆమె తన మనసులో….. నా భర్త లో చాలా మార్పు వచ్చింది నేను ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అత్తనిలో చాలా మార్పు వచ్చింది నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. అంటూ ఎంతగానో బాధ పడుతుంది ఆమె. ఇక ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటారు.
ఆవాస రోజు ఉదయం అతను పాపతో…. బేబీ మీ చెల్లి ని తీసుకొని మనం గుడికి వెల్దామా కొండ దగ్గర పెద్ద గుడి ఉంది కదా అక్కడికి నువ్వు ఎన్నో సార్లు వెళ్దాం అని అడుగుతున్నావు. పాపను తీసుకుని వెళ్దామా.
అందుకు బేబీ… సరే నాన్నా నేను చెల్లి ని తీసుకొని వస్తాను మన ముగ్గురం కలిసి వెళ్దాం మరి అమ్మ సంగతి ఏంటి
అతను….. అమ్మ అంత పైకి నడవలేదు కదమ్మా అందుకే. పాపా నువ్వు నేను ముగ్గురు వెళ్దాం . అని అంటాడు ఆ మాటలు వింటున్న భార్య…. ఏమండీ ఇప్పుడు ఈ పసి పాపని తీసుకెళ్ల పోతే ఏం కాదు . కావాలంటే మీరిద్దరూ వెళ్ళండి. అని అంటుంది అందుకు అతను ఏమాత్రం ఒప్పుకోడు ఇక ఆమెతో గొడవ పెట్టుకొని మరీ పాపను తీసుకుని కొండ ప్రాంతానికి వెళ్తారు.
బేబీ….. నాన్న ఎంత దూరం తీసుకెళ్తారు నాకు కళ్లు చాలా నొప్పులుగా ఉన్నాయి నాన్న. అందుకు అతను….. సరే అమ్మా ఇదిగో ఇక్కడే వచ్చేసాను అని కొండ మూల ప్రాంతానికి తీసుకు వెళ్తాడు.
ఆ మూల ప్రాంతం కింద ఒక చెట్టు కొమ్మకి పెద్ద పాము వేలాడుతూ ఉంది.
దాన్ని చూసి బేబీ…. నాన్న పెద్ద పాము నాన్న మనం ఇక్కడి నుంచి వెళ్లి పోదాం పద .
అని అంటుంది అందుకు అతను వెళ్లడానికి కాదమ్మా వచ్చింది అంటూ చేతిలో ఉన్న పాప ని ఒక్క సారిగా పాము వైపుగా విసిరేస్తాడు ఆపాము ఆమాంతం నోరు తెరిచి పాపను మింగేస్తుంది.
వెంటనే అనిత పాప అంటూ ఒక్కసారిగా నిద్రనుంచి లేస్తుంది.
ఆమె కేకకి శంకర్ నిద్రలేచి….. ఏమైంది అనిత ఎందుకు అలా పరిచావు.
అందుకు అనిత ఏం లేదు అని సమాధానం చెబుతుంది ఆమె తన మనసులో…. భగవంతుడా నా భర్త నిజంగానే ఇలా చేస్తాడేమో నాకు చాలా భయంగా ఉంది.
పాపని కంటికి రెప్పలా చూసుకోవాలి అని కంగారు పడుతూ ….. ఎందుకంటే నా భర్త లో చాలా మార్పు వచ్చింది నిన్ను జాగ్రత్తగా ఉండాలి లేదంటే నా బిడ్డ నాకు దక్కదు అంట్టూ చాలా బాధపడుతుంది.
అతను ఆమెను…. ఏదైనా పీడ కల అయితే
ఏమి ఆలోచించకుండా పడుకో అని అంటాడు అందుకు ఆమె…. మీరు పడుకోండి నాకు ఇక్కడ గాలి రావడం లేదు నేను పాపను తీసుకొనీ.
పక్కగదిలో పడుకుంటాను అని చెప్పి చిన్న పాప ని తీసుకొని పక్క గదిలోకి పెళ్లి పడుకుంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే అనిత…. ఏవండీ నేను కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్లాను నాకు ఎందుకో మనసు బాలేదు నన్ను కొంచెం మా పుట్టింట్లో విడిచిపెట్టండి.
అందుకు అతను… ఏమైంది ఇక్కడ బానే ఉంది కదా ఇప్పుడు పుట్టింటికి వెళ్లే దానివి కాదు కదా.
అనిత…. నాకు ఇప్పుడు వెళ్లాలని ఉంది దయచేసి నన్ను పుట్టింటికి పంపించండి. అని అంటుంది అందుకు తను సరే అంటాడు ఇక ఆమె బేబీ ని పాపను తీసుకుని తన పుట్టింటికి వెళ్తుంది.
తల్లి ఆమెను చూసి ఎంతగానో సంతోషపడుతుంది.
శంకర్ కొంతసేపు అక్కడే ఉండి తర్వాత అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
అనిత తల్లి… కనీసం నాకు ఒక్క మాట కూడా కబుర్లు చెప్పలేదు ఎందుకు. ఇక్కడికి రమ్మని అన్నా కూడా రాను అనే దానివి ఈరోజు చెప్ప చేయకుండా వచ్చారే . ఆ మాటలకు అనిత ఏం మాట్లాడకుండా ఉంటుంది.
అనిత తల్లి….. మీ రెండో కూతురు అచ్చం నీలాగే ఉంది అందంగా అని అంటుంది బేబీ…. అమ్మమ్మ నేను నీలాగే అందంగా ఉన్నాను
కదా .
అందుకు ఆమె…. అవునే నా బంగారు మనవరాలా అంటూ దగ్గరికి తీసుకుంటుంది.
వాళ్ళు అక్కడే సంతోషంగా ఉంటారు రోజులు గడిచాయి . ఒకరోజు అనిత స్నానానికి వెళుతుంది అదే సమయంలో
అనిత భర్త అక్కడికి వస్తాడు . అతను తన అత్తగారితో….. అత్తయ్య నా కూతుర్ని పూజ చేయించడానికి . తీసుకు వెళ్తున్నాను.
అని అంటాడు ఆమె…. ఒక్క నిమిషం ఆగు అమ్మాయి కూడా వస్తుంది.
అతను…. అనిత అవసరం లేదు అత్తయ్య.
నేను వెళ్లి వస్తాను.
అందుకు ఆమె మాట్లాడుతూ బేబీ …. నాన్న నేను కూడా వస్తాను. అని అడుగుతుంది అతను వద్దు అని పుట్టిన పాపను తీసుకుని వెళ్ళి పోతాడు.
కొంత సమయం తర్వాత అనిత అక్కడికి వస్తుంది. ఆమె తల్లితో…. పాప ఏదమ్మా.
ఆమె తల్లి…. మీ ఆయన ఏదో పూజ వుంది అని చెప్పి గుడి కి తీసుకు వెళ్ళాడు.
అని అంటుంది ఆ మాటలు విన్న ఆమె ఏడుస్తూ…. ఎంత పని చేసావ్ అమ్మ నా బిడ్డ ని చంపేస్తాడు. అంటూ ఏడుస్తూ పరుగులు తీస్తుంది ఆ మాటలు విన్న ఆమె కూడా ఆమె …. ఏమైంది దీనికి ఇలా పరుగులు తీస్తుంది . అంటూ బేబీ ని తీసుకొని ఆమె వెంట వెళుతుంది.
ఆమె సరాసరి వాళ్ళ ఊర్లో కొండ ప్రాంతంలో ఉన్న గుడి దగ్గరికి వెళుతుంది అప్పుడు శంకర్ ఖాళీ చేతులతో గుడి మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు. ఆమె అతన్ని చూసి ఏడుస్తూ….. నా బిడ్డ ఏది . బేబీనీ చంపేశారా. నా బిడ్డ నీకు ఏమి అన్యాయం చేసింది కళ్ళు కూడా తెరవని పసికందుని పొట్టన పెట్టుకున్న రాక్షసుడి మీరు. నా బిడ్డ కావాలి . నా బిడ్డ ఏది ఎక్కడ . అంటూ అతని చొక్కా పట్టుకొని….. మగ బిడ్డ పుట్టక పోతే ఆడబిడ్డ ని చంపుకుంటారా. నా కూతురు నాకు కావాలి . నా కూతురు నాకు తీసుకువచ్చి ఇవ్వండి. నా కడుపు కోతే నీకు అర్థం కావడం లేదా అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది.
అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున
అతని మాట పట్టించుకోరు ఇంతలో తల్లి బేబీ ఎదురు అక్కడికి చేరుకుంటారు.
అనిత ఏడుస్తూ తల్లితో…. అమ్మ చంపేశాడు అమ్మ నీ అల్లుడు నీ మనవరాలిని చంపేశాడు. ఆ పసికందు ఏం పాపం చేసింది. ఇదిగో దీన్ని నన్నుకూడా చంపేయి. అంటూ
ఏడుస్తూ మొర పెట్టుకుంటుంది అతను.. అనిత నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని
అంటాడు ఇంతలో పంతులుగారు పాపను తీసుకుని వస్తాడు.
పాప ఏడుపు విని అనిత పాపను తీసుకుని…. నా బిడ్డ నా బిడ్డ అంటూ గుండెలకు హత్తుకుంటుంది.
శంకర్…. అనిత నీకు ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు. నేను ఆ భగవంతునికి మొక్కుకున్నాను. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటే . బిడ్డ అంతా బరువు డబ్బుని
ఇస్తాను అని. నేను తనని ఎవరికీ చెప్పలేదు పైగా నువ్వు ఇంత పైకి ఎక్కడ మంచిది కూడా కాదు అని ఇక్కడికి ఎవరిని తీసుకు రాలేదు అని అంటాడు అందుకు ఆమె ఏడుస్తూ…. అయ్యో నన్ను క్షమించండి. ఆ నేను ఉలికిపడి నిద్రలేచాను కదా . అప్పుడు నాకు మీరు పాపని చంపినట్టుగా కల వచ్చింది అందుకే భయం వేసింది. అంటూ ఏడుస్తూ చెబుతుంది
శంకర్…. నీకేమైనా మతి పోయిందా నా బిడ్డనీ నేను ఎందుకు చంపకు ఉంటాను.
అనిత… మీరు పాప పుట్టిన దగ్గర నుంచి మాతో సరిగ్గా మాట్లాడటం లేదు కదా అందుకే భయం వేసింది.
అతను…. నేను పని హడావిడిలో ఉండి సరిగా పట్టించుకోలేదు అంతేకానీ నా బిడ్డల మీద నాకు ఎలాంటి కోపం లేదు . మగ బిడ్డ అయితే ఏంటి ఆడబిడ్డ అయితే ఏంటి. కాకపోతే నేను మగ బిడ్డ ని ఎందుకు కోరుకున్నాను అంటే. మొదటిగా బేబీ పుడితే మా అమ్మ అనుకున్నాను రెండోసారి అబ్బాయి పుడితే మా నాన్న అనుకునేవాణ్ణి . అంతే ఆయన ఇప్పుడు నేను పాపని అక్కడే వదిలి పెట్టి వచ్చింది కొంత చిల్లర తగ్గింది తీసుకువద్దామని. ఇంతలో నువ్వు ఇదంతా చేశావు. అందుకని ఆమె క్షమాపణ కోరుకుంటుంది ఆ తర్వాత వాళ్లంతా అక్కడి నుంచి వాళ్ళ కార్యక్రమం ముగించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు.
Related Posts

పేద vs ధనిక ఇల్లులు Poor vs rich houses| Telugu Kathalu | Telugu Stories | Telugu Moral Stories
గర్భవతి తల్లి బాధ 4_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu
