ఆవును కాపాడిన పేద పిల్లలు Episode 86 | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

వాయిస్ : చెన్నాపూర్ విలేజీలో ఉండే కీర్తి, బాలు అనే పేద పిల్లలు, ఇంకా అడుక్కుని

            తినడానికి మనమేమీ చిన్నపిల్లలం కాదు కదా, రోజు రోజుకు పెరుగుతున్న

            వాళ్ళం. అందుకని ఏదైనా పని చేసుకుని బతకాలని నిర్ణయించుకుంటారు.

            రేపు ఊరంతా తిరిగి పని మాట్లాడుకోవాలని కూడా అనుకుంటారు. అలా రాత్రి

            గడిచిపోతుంది.

           మరుసటి రోజున.. బాలు తలుపు తీయగానే గుమ్మం ముందు నిలబడి

           చూస్తున్న ఆవు, దూడ రెండు కనిపిస్తాయి.

  బాలు : అక్క… అక్క! ఒకసారి బయటికిరా !

     కీర్తి : అబ్బా బాలు..ఎందుకురా అంతలా అరుస్తున్నావు. ఏమైంది ఇప్పుడు ?

వాయిస్ : అంటూ ఇంట్లో నుంచి బాలు దగ్గరికి వస్తుంది. గుమ్మమ బయట నిలబడి  

            చూస్తున్న ఆవు, దూడ కనిపిస్తాయి.

     కీర్తి : ఈ ఆవు దూడ ఎవరివి బాలు? ఇవి మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు?

వాయిస్ : అంటూ ఆ ఆవు, దూడను అక్కడి నుంచి ఏయ్ అంటూ ఆవు, దూడను

           రోడ్డు వరకు కొట్టి, తిరిగి ఇంటికి వెళ్తుంది కీర్తి. ఆ ఆవు, దూడ కీర్తి వెనకాలే

           మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతారు కీర్తి, బాలు.

   కీర్తి : ఇదేమిటి బాలు..ఈ రెండు మన దగ్గరికి వచ్చాయి.

బాలు : బహుశ…మనం అమ్మానాన్న లేని అనాధలం కదా..మనకు తోడుగా

          ఉండటానికి వచ్చాయనుకుంటానక్క!

   కీర్తి : అంతేనంటావా తమ్ముడు !

వాయిస్ : అవును అన్నట్టుగా వాళ్ళను చూస్తూ ఆవు, దూడ రెండు తలలను ఆడిస్తూ

             ఉంటాయి. అలా తలలను ఆడించడం కీర్తి, బాలు గమనించారు.

  బాలు : అక్క చూశావా… ఆవు దూడ అవును అన్నట్టుగా రెండు తలలను

           ఆడించాయి.

   కీర్తి : చూశాను తమ్ముడు. కానీ..!

బాలు : కానీ లేదు ఏమి లేదక్క! మన ఇంటికి వచ్చాయంటే వాటికి మనం కావాలనే

          కదా అర్థం.

   కీర్తి : అవును తమ్ముడు. కానీ రెండు రోజులు పోయిన తరువాత ఈ ఆవు దూడ

          మావి అని ఎవరైనా వస్తే ఎలా చెప్పు?  

 బాలు : అలా అని మన ఇంటికి వచ్చిన వాటిని మనం దూరం పెట్టలేము కదక్కా!

           వాటిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. తీసుకెళ్లి మన ఇంటి వెనక పెరట్లో

          కట్టేసుకుందాం!

   కీర్తి : నాకు తెలిసి దారి తప్పి మన దగ్గరికి వచ్చాయి తమ్ముడు. ఇప్పుడు మన 

         ఇంటి వెనుక పెరట్లో కట్టేసుకున్న ఎవరైనా మావి అని వచ్చినప్పుడు మాత్రం

         వాళ్ళవి వాళ్ళకు ఇవ్వాలి బాలు !

బాలు : ఇచ్చేద్దామక్కా!

వాయిస్ : కీర్తి, ఆ ఆవు దూడను తీసుకెళ్లి ఇంటి వెనుక కట్టేస్తుంది. తాగడానికి నీళ్ళు

           పెడుతుంది. నీళ్ళు తాగుతాయి.

బాలు : అక్క మనం ఎలాగూ అడుక్కుని తినడం మానేసి ఏదైనా పని చేసుకుంటూ

         బతకాలని అనుకున్నాం కదా!

  కీర్తి : అవును తమ్ముడు..

బాలు : వేరే పని ఎందుకు మనకు? ఆ ఆవు దూడను చూసుకుంటూ పాలు పితికి

        అమ్ముకుందాం ! పైసలు వస్తాయి.

   కీర్తి : అయ్యో బాలు..ఈ ఆవు దూడ మన దగ్గర ఎప్పటి అరకు ఉంటాయో ఏమో !

బాలు : ఉన్నంత వరకే అలా చేద్దామక్కా!

   కీర్తి : సరే తమ్ముడు.

వాయిస్ : కీర్తి, బాలు అన్నం తిని ఆవు, దూడను తీసుకుని పొలాల దగ్గరికీ వెళ్తారు.

            అక్కడ ఉన్న పచ్చని గడ్డిని మెస్తూ ఉంటాయి ఆవు, దూడ. అక్కడ ఉన్న

           ఎల్లయ్య అనే రైతు, కీర్తి, బాలు మేపుతున్న ఆవు దూడను చూసి ఇలా

           అడుగుతాడు.

ఎల్లయ్య : ఏమ్మా కీర్తి..ఆవు దూడను కొనుక్కుని పాలు అమ్ముతు మీ కాళ్ళ మీద

            మీరు నిలబడాలని అనుకుంటున్నారా! 

   బాలు : ఇప్పుడు కూడా మా కాళ్ళ మీదనే మేము నిలబడింది.

వాయిస్ : అని అలా ఎల్లయ్యతో మాట మీదా మాట మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవు

            దూడ గడ్డీ మెస్తూ మెస్తూ రైలు పట్టాల వరకు వస్తాయి. ఆ రైలు పట్టాల

           మధ్య ఒక చోట గుంత ఉంటుంది. ఆ విషయం తెలియక దూడ గడ్డి కోసం

           వెళ్తూ ఆ గుంతలో ఇరుక్కుపోతుంది.గట్టిగా అరుస్తూ ఉంటుంది. దూడ

           అరుపులు విన్న ఆవు, కీర్తి, బాలు దూడ దగ్గరికి పరుగెత్తుకొస్తారు. గుంతలో

           ఇరుక్కుపోయిన దూడను బయటకు లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు.

           కానీ దూడ అందులో నుంచి రాదు. ఏమి చేయాలో అర్థం కాదు దూడ

          అరుస్తూ ఉంటుంది. ఇంతలో కీర్తి, బాలుకు ట్రైన్ సౌండ్ వినబడుతుంది.

          ఒక్కసారిగా షాక్ అవుతారు.

బాలు : అక్క…ఏదైనా చేయక్క! పాపం దూడ..! ట్రైన్ సౌండ్ వినబడుతుంది. నాకు

         తెలిసి ఈ పట్టాల మీదానే ఆ రైలు బండి వస్తున్నట్టున్నది. ఇప్పుడెలా !

వాయిస్ : అని కంగారూ పడుతూ దూడ దగ్గరికి వెళ్ళి దూడ ముందు కాలు పట్టుకుని  

            లాగుతుంటాడు. దూడ అరుస్తూ ఉంటుంది. ఆవు అరుస్తూ ఉంటుంది.

            తల్లడిల్లి పోతుంది. ఇంతలో కీర్తి, బాలుకు వస్తున్న ట్రైన్ కనబడుతుంది. ఆవు

            ఆ ట్రైన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దూడ కూడా ఆ ట్రైన్ చూసి కన్నీళ్లు

            పెట్టుకుంటుంది. ఆవు ప్రేమగా చివరి చూపు అన్నట్టుగా దూడను ప్రేమగా

            నాకుతుంది. తనలో తను అనుకుంటుంది.

   ఆవు : నన్ను మన్నించు తల్లి. నేను నిన్ను కాపాడుకోలేకపోతున్నాను. ఈ తల్లి

            చూస్తుండగానే నువ్వు ఇలా చనిపోవాలని ఉన్నట్టుంది కాబోలు మన

            తలరాత.

వాయిస్ : అనుకుంటూ ఆవు కన్నీళ్లు కార్చుతూ ఉంటుంది. నన్ను కాపాడలేవా

            అంటూ దూడ, కన్నీళ్లు నిండిన కళ్ళతో బాలును చూస్తుంది. బాలుకు

            జాలెసింది.  

    బాలు : అక్క ఏమైనా చేయక్కా ! పాపమక్కా! దూడను ఆవును కాపాడాలి. ఏదైనా

            చేయక్కా! అది నన్ను కాపాడలేవా అన్నట్టుగా జాలిగా చూస్తుంది.

    కీర్తి : బాలు కంగారూ పడకు. నన్ను కంగారూ పెట్టకూ ! ఈ కంగారులో ఏమి

          చేయాలనే ఆలోచన కానీ. ఐడియా కానీ రావు. కొంచెం ఆలోచించుకొనివ్వు

          తమ్ముడు ! 

వాయిస్ : ఏమి చేయాలా అని ఆలోచన ఏడుతున్న కీర్తికి, కొద్ది దూరంలో రెడ్ జెండా

           కనబడుతుంది. ఆలస్యం చేయకుండా పరుగున కీర్తి, ఆ జెండా దగ్గరికి వెళ్ళి

           ఆ జెండాను పట్టుకుని ట్రాన్ కు ఎదురుగా వెళ్తూ ఉంటుంది. ట్రైన్ హారన్

           చేసుకుంటూ  వస్తూ ఉంటుంది. ట్రైన్ లో ఉన్న డ్రైవర్, ఎర్ర జెండా పట్టుకుని

           ఎదురుగా వస్తున్న కీర్తిని చూసినా అతను ముందు ఏదో ప్రమాదం

           జరిగినట్టుగా ఉందని ట్రైన్ వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చి వాళ్ళకు కొద్ది

           దూరంలో ట్రైన్ ను ఆగిపోతుంది. ట్రైన్ నుంచి డ్రైవర్ దూడ దగ్గరికి వస్తాడు.

          కీర్తి, బాలు దూడను కాపాడమని అతనిని బతిమాలుతాడు. దాంతో   

          అతను జాలీ పడి, దగ్గరలో ఉన్న క్రేన్ సహాయంతో ఆ గుంతలో నుంచి

          దూడను కాపాడుతాడు. తల్లిని పిల్లను పేద పిల్లలు కీర్తి బాలు కలుపుతారు.

           అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు.

-0-

సింగిల్ లైన్ స్టోరీ

చెన్నాపూర్ విలేజీలో ఉండే కీర్తి, బాలు అనే పేద పిల్లలు, అడుక్కోవడం మానేసి చేతనైన పని చేసుకోవాలని అనుకుంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఒక ఆవు, దూడను తీసుకుని వస్తుంది. ఎంత వెళ్లిపొమ్మని కొట్టిన వెళ్లకుండా వాళ్ళ దగ్గరే ఉంటుంది. దాంతో కీర్తి, బాలు…బయటికి వెళ్ళి పని చేసేడానికంటే ఆవు పాలు పితుక్కుని అమ్ముకోవడం మంచిదని భావించి ఆవును, దూడను ఇంటి దగ్గర పెట్టుకుంటారు. ఒక రోజున మేత వచ్చి రైలు పట్టాల మధ్జ్యలో ఉన్న గొయ్యిలో పడిపోతుంది. అప్పుడే ట్రై వస్తూ ఉంటుంది. ఎర్ర జెండా సహాయంతో ట్రైన్ ఆపేస్తారు. దూడను కాపాడి ఆవు దూడను కలుపుతారు. 

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *