ఆహారం ఇచ్చే మాయా నది Episode 147 |Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

రాజమహేంద్రవరం అనే గ్రామం ఒక నది ఒడ్డున ఉండేది, ఆ ఊరిలో చాలా మంది ప్రజలు నది మీదే ఆధారపడియు బ్రతుకుంతుండేవారు, కొందరు నీటిని ఆధ్హారంగా చేసుకొని వ్యవసాయం మీద బ్రతుకుతుండగా మరి కొందరు చేపలు పడుతూ జీవించేవారు, అలా జీవించేవారిలో రాజయ్య కూడా ఒకడు, రాజయ్య వ్యవసాయ చేస్తూ తన భార్య విమల మరియు తన కూతురు కొడుకు అయిన బాలు కీర్తి ని చూసుకుంటూ ఉండేవాడు, వాళ్ల్లు ఉన్నంతలో చాలా తృప్తిగా జీవిస్తుండేవారు

అలా ఉండగా ఒకరోజు రాజయ్య విమల పొలం లోకి నీళ్లు నది నీళ్లు మళ్లించడానికి నది దగ్గరకు వెళ్లగా అనుకోకుండా నీటి ఉద్రుక్తి పెరగడం తో రాజయ్య విమల నీటిలో మునికి చనిపోతారు, బాలు కీర్తి అనాధలుగా మిఘ్గిలిపోతారు

బాలు కీర్తి ఏ పని చేయడం రాదు అలా ఉండగా ఒకరోజు కీర్తి తో బాలు ఇలా అంటాడు

బాలు : అక్క ఇప్పుడు మన అమ్మ నాన్న లేరు, మనకేమో ఏ పని రాదు ఇప్పుడు మనం బ్రతకడం ఎలా అక్క? మన కడుపు నిండాలంటే మనం ఏమి చేయాలి అని అంటాడు

కీర్తి : తప్పదు తమ్ముడు ఏ పని రాదు అని కూర్చుంటే ఎప్పటికి ఏ పని రాకుండానే ఉంటుంది, కడుపును నింపుకోవడం కోసం ఎదో ఒక పని చేయక తప్పదు అని అంటుంది కీర్త్

ఆరోజు నుంచి బాలు కీర్తి ఇద్దరు కలిసి చాలా చోట్లకు వెళ్లి తెలిసిన వాళ్ళందరిని పని అడుగుతుంటారు, కానీ ఎవ్వరూ పని ఇవ్వరు. ఇలా ఉండగా ఒకరోజు విజయ అనే మహిళా దగ్గరకు వెళ్లి బాలు కీర్తి పని గురించి అడుగుతారు

కీర్తి : అమ్మ మేము అనాధ పిల్లలం మాకు ఎవ్వరు లేరు, తిండి తినక చాలా రోజులు అవుతుంది, దయ్యంచేసి మీరు ఏదైనా పని ఇస్తే తద్వారా వచ్చిన డబ్బుతో మేము మా కడుపులను నింపుకుంటాము అని అంటుంది కీర్తి

విజయ : ఏంటి మీరు పిల్లల మీరు పిల్లలు కాదె దెయ్యాలు. కన్న తల్లి దండ్రులనే పొట్టన పెట్టుకున్న దెయ్యాలు మీఱు, మీకోసం పగలనక రాత్రనక మీ అమ్మ నాన్న కష్టపడుతుంటే ఒళ్ళు అల్వకుండా కూర్చుని తిన్న మీకు ఏ పని వచ్చు అని నేను మీకు పని ఇవ్వాలి? ఇప్పటికి మీ ఇంట్లో జరిగిన అనర్థాలు చాలవా? మా ఇంట్లోకి వచ్చి ఎవరిని ఏమి చేయాలని చూస్తున్నారు, నేను ఉన్నంత కాలం మీ దరిద్రపు అడుగులని మా ఇంట్లో పద నివ్వను అని అంటుంది విజయ

బాలు : ఆంటీ కొంచం మర్యాదగా మాట్లాడడి మేము ఏమి అనడం లేదు కదా అని మీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు మీరు, మా అమ్మ నాన్నలు నదిలో నీటి ఉద్రుక్తి పెరగడం వల్ల చనిపోయారు అంతే కానీ మా అమ్మన్నానాలను మేము ఎందుకు చంపుకుంటాము, వాళ్ళు చనిపోయిన బాధలో మేము ఉంటె పైనుంచి మీరు ఇలా దెప్పి పొడిచే మాట్లాడు మాట్లాడుతున్నారు అని అంటాడు కోపంగా

కీర్తి : ఎదో పని కోసం అడగడానికి వచ్చాము, మీ ఆస్తిని పుణ్యానికి ఇవ్వమంలేదు కదా పని ఉంటె ఉంది అని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అంతే కానీ ఇలా మాట్లాడడం ఏమి బాలేదు అని అంటుంది

విజయ : ఇంతే చూస్తుంటే మీరు రెచ్చిపోతున్నారు, నా ఇష్టం వాచినట్టు మాట్లాడతా ఏమి చేసుకుంటారో చేసుకోండి అని బాలు కీర్తి ని ఇంటి నుచి బయటకు గెంట్టి వేస్తుంది

బాలు కీర్తి ఏడుచుకుంటూ వెళ్ళిపోతారు, అప్పుడు బాలు కీర్తి తో ఇలా అంటాడు

బాలు : ఏంటక్కా ఆవిడ కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతుంది, అమ్మ నాన్నలను చంపింది మనం అంటే నాకు చాలా బాధేసింది అక్క అని అంటాడు

కీర్తి : వాళ్ళు అన్ని ఉన్నవాళ్లు రా, ఏదైనా అన్నా కూడా వాళ్ళ మాటే గెలుస్తుంది మనం లాంటి వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోరు అని అంటూ ఇద్దరు నది వైపుగా నడుచుకుంటూ వెళ్తారు

బాలు : ఈరోజుకు ఈ నది నీరు కడుపునిండా తాగి పాడుకోవడమే అక్క, మనకి ఈ నాడే జీవనాధారం అనుకుంటా అని అంటాడు

ఇంతలో ఆ నదిలో నీటిపై తేలుతూ కొన్ని రకాలైన ఆహార పదార్ధాలు వస్తూ ఉంటాయి, వాటిని చూసిన బాలు కీర్తి ఎంతో ఆశ్చర్యపోతారు

బాలు : అక్క వాటిని చూసావా ఎన్నని రకాల ఆహార పద్దార్దాలో ఇవ్వి ఎక్కడ నుంచి వస్స్తున్నాయ్ అక్క అని అంటాడు

కీర్తి : బాలు ఇప్పుడు మన కడుపు నింపుకుందాం తరువాత్త మిగతా విషయాలన్నీ ఆలోచిద్దాం అని అంటుంది కీర్తి

నదిలో కొట్టుకు వచ్చిన ఆహార పాదారదాలన్నీ ఇద్దరు ఎంతో ఇషటంగా తిని కడుపు నింపుకుంటారు

బాలు : హమ్మయ్య ఎన్ని రోజుల తరువాత మన కడుపు నిండా ఆహారం తినామ అక్క అని అంటదు

కీర్తి : నిజమే తమ్ముడు చాలా అంటే చాలా రోజుల తరువాత ఇంత భోజం చేయడం, కానీ ఇదంతా ఎక్కడ నుంచి వస్తుందో నాకు అర్ధం కావడం లేదు అని అంటుంది

ఇద్దరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అహ్హరా పదార్థాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో కనిపెట్టలేక పోతారు, కానీ రోజు సరైన సమయానికి ఎవరో పంపినట్టుగా రకరకాల ఆహార పదార్థాలు నదిలో కొట్టుకొని వస్తుండేవి, కొన్ని రోజులు అవి ఎక్కడ నుంచి వస్తున్నాయని  తెలుసుకోవాలని బాలు కీర్తి ప్రయత్నించినప్పటికీ ఇంతకీ సమాధానం దొరకక పోవడం తో ప్రయత్నం మానేస్తారు అలా ఉండగా ఒకరోజు కీర్తి బాలు తో ఇలా అంటుంది

కీర్తి : అరేయ్ బాలు మనకి రోజు ఆహరం దొరుకుంటుంది, మన కడుపు నిండుతుంది కానీ ఇక్కడికి వచ్చిన ఆహారం చాలా ఆహరం వృధా గా పోతుంది, మన లాంటి పేదవాళ్ళు ఊరిలో చాలా మంది ఉన్నారు కదా మనం ఇకనుంచి ఇక్కడకు వచ్చిన ఆహారాన్ని మన లాంటి పెద్దవాళ్ళకి పంచి పెడదాము అని అంటుంది

బాలు ; అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క, పెడవాళ్ళకి మన లాంటి కష్టం రాకూడదు అనే నీ ఆలోచనే చాలా గొప్పది, నువ్వు చెప్పినట్టే ఛేదిద్దాం అని అంటాడు

ఆరోజు నుంచి బాలు కీర్తి రోజు నది దగ్గరకు వచ్చి నదిలో కొట్టుకు వచ్చిన ఆహారాన్ని అంతా సేకరించి ఊరిలో ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న వారందరికీ పంచి పెట్టె వారు, అలా నదిలో వచ్చిన ఆహారం పేదల పాలిట వరంగా మారింది

1 మినిట్ స్టోరీ

 కీర్తి బాలు అనే ఇద్దరు అక్క తమ్ముళ్ల అమ్మ నాన్నలు అనుకోని వరదలు రావడం వల్ల వరదల్లో చిక్కుకొని చనిపోతారు, ఏ పని రాణి బాలు కీర్తి ఆనాధలు అవుతారు, ఎవరిని అయినా పని అడుగుదాము అని వెళ్లినా ఎదో ఒకటిని అని వీలని అవమానించి పంపించేవారు, అలా ఒకరోజు బాధపడుతూ బాలు కీర్తి నీళ్లు తాగడానికి నది దగ్గరికి వెళ్లగా అక్కడ కొట్టుకువస్తున్న కొన్ని రకాలైన ఆహార పదార్ధాలు కనిపిస్తాయి, ఎంతో ఆకలి తో ఉన్న బాలు కీర్తి వాటిని తిని కడుపు నింపుకుంటారు, అలా రోజు ఆహార పదార్ధాలు రావడం తో తమ లాగే ఆకలికి అలమటించే పేదలకు నదిలో వచ్చిన ఆహార పదార్ధాలు అన్ని పంచి పెడుతుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *