ఆ పాప బ్రతుకుతుందా! 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

రాజేంద్ర పురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అరవింద్ వాణి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు ఎంతో కాలంగా పిల్లలు లేరు. వాళ్లు ఎంతో మంది వైద్యున్ని కలిసిన లాభం లేకపోయింది. చాలా సంవత్సరాల తర్వాత వాణి గర్భం ధరిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోష పడతారు.
రోజులు గడిచాయి ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఆమెను పరీక్షించిన తర్వాత వాళ్లతో…. ఈ బిడ్డను కనాలంటే మీ ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. లేదంటే బిడ్డ ప్రాణం పోవాల్సిందే . ఈ రెండిట్లో ఏదో ఒకటి కచ్చితంగా జరుగుతుంది. అని చెప్తుంది ఆ మాటలు విన్న ఆమె ఏడుస్తూ…. నాకు ఏమైనా పర్వాలేదు నా బిడ్డని నా భర్త చేతిలో పెట్టి అతన్ని తండ్రి నీ చేసి నేను చనిపోయినా పర్వాలేదు డాక్టర్ అని ఉంటుంది అందుకు ఆమె ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది ఆ తర్వాత వాళ్ళు అక్కడనుంచి వెళ్ళి పోతాడు రోజులు గడిచాయి ఆమెకు ప్రసవ వేదనతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. ఆమె ప్రసవ వేదన పడి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. కొంత అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు పోకుండా ఉంటాయి కానీ ఆ తల్లి రెండు కాళ్లు చచ్చుబడిపోతాయి.
అని తెలుసుకున్న అతను చాలా బాధపడ్డాడు హాస్పిటల్ నుంచి 10 రోజుల తర్వాత ఇంటికి వెళ్తారు. ఆమె మంచం పైన ఉంటుంది .
పాపను చూసుకోవడం కోసం అరవింద్ ఒక పనిమనిషిని తీసుకొస్తాడు ఆమె పేరు
విమల. విమల పాపను చూసుకుంటూ అలాగే
అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది.
అలా రోజులు గడిచాయి అనుకోకుండా అరవింద్ విమల కి దగ్గరవుతాడు.
దాన్ని చూసిన భార్య చాలా బాధ పడుతూ …. అయ్యో నా పరిస్థితి బాగోలేదు నా భర్త మాత్రం ఏం చేస్తాడు. అంటూ బాధపడుతూ ఉంటాడు ఈ రోజు రాత్రి వాణి ఎంతో ఆయాస పడుతూ ఉంటుంది . ఆమె వెంటనే తన భర్త, విమల నీ పిలుస్తుంది . వాళ్ళిద్దరు ఆమె దగ్గరికి వెళ్తారు. వాణి ఏడుస్తూ …. ఏవండీ నేను మిమ్మల్ని నా బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నా బిడ్డను విమల బాగా చూసుకుంటుంది. మిమ్మల్ని కూడా
నాకు చాలా ధైర్యంగా ఉంది ఇప్పుడు నేను ఎలాంటి బాధ లేకుండా కళ్ళు మూస్తాను మీరు విమల నీ పెళ్లి చేసుకోండి అని అంటుంది.
ఆ తర్వాత విమల తో….. చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదైనా తప్పు కడుపులో పెట్టుకో.
నీ కన్న బిడ్డ బాగా చూసుకో. విమల… బాధపడకు అక్కా నేను ఉన్నా కదా . అంటూ ఆమెకు ధైర్యం చెప్పి ఉంది వాణి ఆయాసపడుతూ ఎంతో బాధగా కన్ను మూస్తుంది.
కొన్ని రోజులకే విమల అరవింద్ లో పెళ్లి చేసుకుంటారు. అలా ఐదు సంవత్సరాలు గడిచి పోతుంది. వాళ్ళ పాప పెద్దదవుతుంది పాప పేరు కళ్యాణి . ఆమెకు ఆరు సంవత్సరాలు వస్తాయి. అరవింద్ కి, విమలా కి పుట్టిన సంతానం రాజు అతనికి ఐదు సంవత్సరాలు. విమల వాళ్ళిద్దరినీ సమానంగానే చూస్తుంటుంది. కానీ భర్త చేసే ప్రవర్తన ఆవిడకి నచ్చదు ఎందుకంటే అతను ఎక్కువగా తన సవతి తల్లి కూతుర్ని దగ్గరికి తీస్తాడు. దాన్ని చూసిన విమల…. ఎందుకు నా భర్త కళ్యాణి మాత్రమే దగ్గర తీసుకుంటాడు నా బిడ్డ ఏం చేశాడు.నేను కూడా నా బిడ్డను మాత్రమే దగ్గర తీసి కళ్యాణి ని దూరం చేస్తే అతనికి ఆ బాధ తెలుస్తుంది.
అని అనుకొని కావాలని కళ్యాణ్ ని దూరం
చేస్తుంది. అలా రోజులు గడిచాయి కళ్యానీ ని కొట్టడం తిట్టడం లాంటివి చేస్తూ ఉండిద్ది ఆమె చేత పనులు చేయించడం లాంటివి చేస్తూ ఉంటుంది దానిని గమనించిన భర్త ఒక రోజు ఆమె తో…. ఒసేయ్ ఎంత గర్వం పెరిగిపోయింది నీకు పని మనిషి లాగా వచ్చి ఇంటికి యజమాని అయ్యావు ఆ సంగతి మర్చిపోయావా. నా బిడ్డ చేసే పనులు చూపిస్తున్నావు. అంటూ ఆమెను చితకబాదాడు.
ఆమె పెద్ద పెద్దగా అరుస్తూ….. కొట్టింది నన్ను మీరు చేస్తున్న దానికంటే నేను చేస్తుంది చాలా తక్కువే. నా బిడ్డని దగ్గరికి తీయారు. రాజు ఏం చేశాడు అతను కూడా నీ బిడ్డ కదా.
అరవింద్…. నాకు ఇద్దరు పిల్లలు సమానమే
తల్లి లేని పిల్ల పైగా ఆడపిల్ల అని చెప్పి కొంచెం దగ్గరికి తీస్తున్నాను అంత మాత్రానికి ఏం కొంపలు మునిగిపోయినట్లు ఇవన్నీ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు.
ఈసారి ఇలాగే అయిందంటే మీ ప్రాణాలు తీస్తాను. అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
అప్పుడే కళ్యాణి అక్కడికి వస్తుంది.
తల్లి ఏడవడం చూసి… అమ్మ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావ్.
విమల… ఛీ నీ వల్లే నేను ఏడుస్తున్నాను .
నా భర్త చేతిలో తన్నులు తింటున్నాను నువ్వు కూడా మీ అమ్మతోపాటు చచ్చిపోతే ఎంతో బావుండేది నా పాలిట శాపంలా తగలడం దరిద్రపు మొహం దాన అని ఆమెను తిట్టడం మొదలు పెడుతుంది. పాప ఏడుస్తూ…. అమ్మ ఏం తప్పు చేశాను.నన్ను నువ్వు రోజు తిడుతున్నావు కొడుతున్నావ్ నా చేత పనులన్నీ చూపిస్తున్నావు. అయినా నేను ఏమీ అనలేదు. నువ్వు నా తల్లివి
నీకు మంచిచెడులు అన్నీ తెలుసు . నువ్వు చేసేది అంత సరైంది అమ్మ నేను ఎప్పుడు నిన్ను సవితి తల్లి లాగా చూడలేదు నా కన్నతల్లి లాగే చూశాను. కానీ నువ్వు ఈరోజు నువ్వు అన్న మాటతో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ భోరున ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
రాత్రి సమయం అవుతుంది రాజు తల్లితో….అమ్మ అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది పొద్దున్నుంచి నాతో ఆడుకో లేదు నేను అక్క కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అక్క నాకు కనపడలేదు అక్క ని ఎక్కడికి పంపించావ్ అమ్మ.
ఆమె ఆ మాటలు విని చాలా కంగారుగా …. ఏంటి కళ్యాణి కనబడటం లేదా . అయ్యో భగవంతుడా నా భర్త వస్తే నన్ను చంపేస్తాడు.
అంటూ చాలా ఏడుస్తూ భయపడుతూ రాజు నీ వెంట పెట్టుకుని. కళ్యాణినీ వెతకడం మొదలు పెడుతుంది. అలా వాళ్ళిద్దరూ కళ్యాణి కోసం తిరుగుతూ ఉండగా భర్త అరవింద్ ఎదురు అవుతాడు ఆమె….. ఏవండీ నన్ను కొట్టొద్దు నేను ఏం చేయలేదు .
కళ్యాణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది దానికి కారణం నేను కాదు. నన్ను కొట్టొద్దు అంటూ ఏడుస్తుంది.ఆ మాటలు విన్న అతను చాలా కంగారు పడుతూ ఆమె కోసం వెతకడం మొదలు పెడతాడు.వాళ్లు అలా చాలా సమయం వరకు ఆమె కోసం వెతుకుతారు కానీ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో ఎంతో బాధగా ఇంటికి తిరిగి వెళతారు.
రాజు తన కోసం ఏడుస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా
కళ్యాణి అడవిదారి పడుతుంది. అడవిలో ఆమె బిక్కుబిక్కుమంటూ …. అమ్మా నేను ఇంట్లో ఉంటే విమల అమ్మనీ నాన్న కొడుతున్నాడు నావల్ల వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియదు అమ్మ . ఈ అడవిలో సింహం తిరిగింది కదా దానికి ఆహారం అయిపోతా అమ్మ. నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను.
అంటూ ఏడుస్తుంది అప్పుడే ఆమెకు సింహం గర్జన వినపడుతుంది.
సింహం గర్జన విన్న కళ్యాణి గజగజ
వణికిపోతూ …. అమ్మ నాకు భయంగా ఉందమ్మ. చాలా భయంగా ఉంది అమ్మ బిక్కుబిక్కుమంటూ అక్కడే కూర్చుని….. అమ్మ నేను నీ దగ్గరికి వస్తున్నాను నన్ను నొప్పిలేకుండా సింహం తినే లాగా చెయ్యి.నాకు నొప్పి రా వద్దు అమ్మ నాకు భయమేస్తుంది . అమ్మ అంటూ ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ అలాగే ఉండిపోతుంది సింహం గర్జన మరింత పెద్దగా ఆమెకు వినబడుతుంది. కళ్యాణి ఎలా భయపడుతుంది . ఎంతసేపు అయినా సరే
సింహం అరుపు మాత్రం వినపడుతుంది కానీ సింహం ఎక్కడ కనపడకపోవడంతో.
కళ్యాణి …. సింహం ఎక్కడా కనిపించడం లేదు . అంటూ తొంగి తొంగి చెట్ల చాటునుండి చూస్తుంది. దూరంగా సింహానికి శరీరం మీద బాణం గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది.
దాన్ని చూసిన కళ్యాణి… అయ్యో పాపం సింహానికి గాయం తగిలి బాధపడుతుంది .
నేను వెళ్తాను ఆ గాయానికి చికిత్స నాకు తెలుసు. పసరు వేసి కట్టుకడితే గాయం
మానిపోతుంది. కానీ సింహం నన్ను నువ్వు ఏదైనా చేస్తే . అంటూ ఆలోచిస్తూనే… చేస్తే ఏమవుతుంది నేను చనిపోవడానికి కదా వచ్చాను. అంటూ ధైర్యం తెచ్చుకొని అక్కడికి వెళుతుంది. సింహం ఆ బాణం తాకిడికి
చాలా బాధ పడుతూ ఉంటుంది . అది కళ్యాణ్ ని చూసి నాకు కూడా ఆమె వైపు కోపంగా చూడటం అలాంటిది చేయదు. తన బాధతో అరుస్తూనే ఉంటుంది. కళ్యాణి అక్కడికి వెళ్లి ఆకుల రసాన్ని పిండి ఆ గాయం మీద చల్లి తన దగ్గర ఉన్న చేతి రోమాలతో కట్టు కడుతుంది. ఆ తర్వాత సింహం జూలు నిమురుతూ…. సింహం నువ్వు బాధపడకు . నీకు గాయం తగ్గిపోతుంది. ఆ తర్వాత మీకు ఆకలి వేస్తే నన్ను తిను . సరేనా నీకేం కాదు అంటూ తన అమాయకపు మాటలతో దానికి ధైర్యం చెబుతుంది. ఆ పాప ప్రేమగా ఆ సింహం జూలు నిమరడం తో పాప మీద సింహానికి నమ్మకం కలుగుతుంది.
ఆరోజు గడిచిపోతుంది. ఇంటిదగ్గర వాళ్లు పాప కోసం వెతుకుతూ ఉంటారు. ఆమె ఎటు వైపు వెళ్లిన దొరక్కపోవడంతో మళ్లీ నిరాశ చెంది ఇంటికి వెళ్తారు. ఆ భార్య భర్తల మధ్య పాప విషయమై మళ్లీ గొడవలు మొదలవుతాయి. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు అని చూస్తున్న రాజు
ఏడుస్తూ ఉంటాడు. అలా ఉండగా సింహం
దగ్గర ఉండి నిద్రపోతున్నా కళ్యాణి ఒక్కసారిగా నిద్ర లేస్తుంది …. ఆమె చుట్టు వైపులా చూస్తుంది . అక్కడ సింహం ఉండదు.
సింహం లేకపోవడంతో ఆమె చాలా కంగారు పడుతుంది. అప్పుడే ఒక్కసారిగా సింహం అక్కడికి వస్తుంది. సింహం నీ చూసిన పాప
సింహంతో నన్ను చంపేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్లి
ఆమె పక్కనే పడుకుంటుంది. అప్పుడు ఆమెకు అర్థం అయిపోతుంది . సింహం తనతో స్నేహాన్ని కోరుకుంటుందని. ఇంకా వాళ్ళు ఇద్దరు స్నేహితులు అయిపోతారు . ఇంకా
సింహం పాప ఇద్దరూ అడవిలోనే సంతోషంగా మంచి స్నేహితులుగా తిరుగుతూ ఉంటారు.
ఒకరోజు వాళ్ళు ఆడుకుంటుండగా సింహం పొరపాటున కొండ చివరి దాకా వెళ్లి అక్కడ కొండ అంచున తన పంజాతో గట్టి గా పట్టుకొని వ్రేలాడుతూ పెద్ద పెద్ద గా గర్జిస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన కళ్యాణి
చాలా భయపడుతూ… మిత్రమా నీకేం కాదు నేను నిన్ను పైకి తీస్తాను అంటూ అటు ఇటుగా చూస్తుంది అప్పుడు ఆమెకు అక్కడ ఒక వల కనబడుతుంది వెంటనే దాన్ని తీసుకొని సింహం మీద విసిరి గట్టిగా
తన శాయశక్తులా ప్రయత్నించి దాన్ని బయటకు తీస్తుంది. ఆ తర్వాత ఆ వల ను తొలగిస్తుంది. ఆమె ఊపిరి పీల్చుకొని సింహంతో… మిత్రమా అవి ఎంత భయం వేసిందో తెలుసా . నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావు ఏమో అని . నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు అంటూ సింహం ని హత్తుకుంటుంది . సింహం కన్నీటితో ఆమెను
ముద్దాడుతోంది అలా వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా . ఆ అడవిలోనే దొరికింది తింటూ ఉంటారు . ఈ కథలో నీతి ఏంటంటే
సాయం చేసినందుకు క్రూరమృగం కూడా కృతజ్ఞత చూపిస్తుంది కానీ కొందరి మనిషికి సాయం చేసిన వాళ్లని మర్చిపోయి క్రూరమృగాలగా వాళ్లని పీకు తింటున్నాము.
అంటే కొందరు మృగం లాంటి మనుషుల కంటే మృగాలు చాలా మంచివి. క్రూర మృగాలను చూసి వాళ్ళు కొంతఅయినా జ్ఞానం తెచ్చుకోవాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *