ఆ పాప బ్రతుకుతుందా!_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

రాజస్థానీ గ్రామంలో కిరణ్ మాధవి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు మాధువి గర్భవతి అని తెలుస్తుంది.

అతను చాలా సంతోష పడ్డాడు.
రోజులు గడిచాయి . కిరణ్ మాధవి తో…. మనకు పుట్టబోయే బిడ్డ కచ్చితంగా మగబిడ్డ అవ్వాలి అలాగే దేవున్ని ప్రార్ధించు.
అందుకు ఆమె… ప్రార్థిస్తాను కానీ ముందు ఇది చెప్పండి. ఆడపిల్ల పుడితే ఏమవుతుంది ఆమె కూడా మన బిడ్డ కదా.
అతను…. మగపిల్లాడైతే మనకి చేదోడువాదోడుగా ఉంటాడు. కట్నం తీసుకువచ్చి పెడతాడు. ఆడపిల్ల అయితే మనం ఎదురు కట్నం ఇవ్వాలి. పైగా ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అని కాపలా ఒకటి బయటికి వెళ్తే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి. ఈ సమస్య ఏమీ లేకుండా ఒక పిల్లాడు అయితే ఎంత బాగుండో.
ఆమె… అందరూ మీలాగా ఆలోచిస్తే భూమి మీద మనషులు ఉండరు. మీ అమ్మానాన్న కూడా అలాగే అనుకుంటే మీరు ఇక్కడ ఉండే వాళ్లు కాదేమో కదా.
అతను చాలా కోపంగా …. నీతులు చెప్పకుండా భగవంతున్ని ప్రార్థించు అంతా మంచి జరుగుతుంది. అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతాడు రోజులు గడిచాయి .
ఆమె ఒక రోజు ప్రసవవేదన పడుతూ ఉంటుంది. అతను….. నీకేం కాదు నువ్వు కొంచెం సేపు ఓపిక పట్టు అంబులెన్స్ కి ఫోన్ చేశాను ఆంబులెన్స్ వస్తుంది. అంటూ ఓదారుస్తాడు . ఇంతలో ఆంబులెన్స్ వస్తుంది హాస్పిటల్ ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్తారు. కిరణ్ చాలా చాలా కంగారు పడుతూ…. భగవంతుడా మగబిడ్డ పుట్టే లాగ చెయ్. అంటూ భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి అతనితో…. ఆడపిల్ల పుట్టింది. కొంచెంసేపు తర్వాత మీరు వెళ్లి ఆమెను చూడొచ్చు.
అని చెప్పి అక్కడ నుంచి వెల్లిపోయింది ఆ మాట విన్న అతను చాలా కోపంగా లోపలికి వెళ్తాడు. అతను చాలా కోపంగా… నాకు ఈ బిడ్డ వద్దు. నాకు ఈ బిడ్డ ఓద్దు అంటూ కేకలు వేస్తాడు. ఆమె మేల్కొని…. ఏమండి ఏం మాట్లాడుతున్నారు . మీరు వద్దని అనుకున్నా . మనకు పుట్టిన బిడ్డే.
అతడు…. నాకు ఈ బిడ్డ వద్దు అంటూ గొంతు పిసికి చంపడానికి వస్తాడు ఆమె
వెంటనే బిడ్డను లాక్కొని అక్కడి నుంచి పరుగులు తీస్తుంది.
ఆమె కొంచెం దూరం వెళ్ళిన తర్వాత
అతను కూడా అక్కడికి వస్తాడు.
అతను… మర్యాదగా బిడ్డనీ ఈవ్వు లేదంటే
నిన్ను దాన్ని ఇద్దరిని చంపేస్తాను . అని అంటాడు. ఆమె…. నీకు దండం పెడతాను అలా చేయొద్దు నా మాట వినండి. అంటూ ఏదో రకంగా సర్ది చెప్పి అతన్ని ఇంటికి తీసుకు వెళుతుంది. అలా ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. రోజులు గడిచాయి ఆ పిల్ల పెద్దదవుతుంది. ఐదు సంవత్సరాలు వచ్చిన దగ్గర్నుంచి ఆ తండ్రి ఆ పిల్లను వేధించుకు తింటూ ఉంటాను.
అతను ప్రతి రోజూ తాగి వచ్చి…. ఒసేయ్ పిల్ల పిశాచి. మర్యాదగా నా ఇంట్లో నుంచి వెళ్ళావే. అంటూ అరుస్తూ ఆమె నీ కొడుతూ ఉంటాడు.
తల్లి అడ్డం వస్తే తల్లిని కూడా కొడతాడు.
పాప ఏడుస్తూ….. నాన్న నన్ను కొట్టకండి నాన్న నాకు చాలా నొప్పిగా ఉంది.
అంటూ కంటతడి పెట్టుకున్న కూడా తండ్రి తల్లి కూతురు ఇద్దరినీ చితక బాదుతాన్నాడు.
తర్వాత నాకు నుంచి వెళ్ళి పోతాడు రోజులు గడిచాయి అతను ఒక రోజు… దీనిని ఇలా కాదు. బాగా చూసుకున్నట్టు నటించి ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయాలి.
అని అనుకొని ఆ రోజు నుంచి కూతురు మీద ఎంత ప్రేమగా చూసుకున్నట్టు ఆమెను దగ్గరకు తీసుకుంటాడు.
దాన్ని చూసి నా భార్య చాల సంతోషపడుతూ తన మనసులో…… భగవంతుడా నీ దయవల్ల నా భర్త మారిపోయారు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక ఎప్పుడూ ఇలాగే ఉంటే చాలా సంతోషం. అని అనుకుంటుంది అలా మరి కొన్ని రోజులు గడిచాయి పూర్తిగా వాళ్ళిద్దరు. అతన్ని నమ్ముతారు .
ఒక రోజు అతను పాపతో….. చూడు తల్లి మనం ఈరోజు ఎక్కడికైనా వెళ్దామా. పాపా…. కానీ ఎక్కడికి వెళ్తము. నాన్న.
అతను…. పక్క ఊరిలో పెద్ద జు ఉంది అక్కడికి వెళ్లి వద్దాం. అందుకు ఆమె…. సరే నాన్న వెళదాం పద అని అంటుంది.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడి నుంచి జు కి అంటారు అక్కడ ఆమె జంతువు ని చూస్తూ …. భలే భలే బాగుంది అంటూ . ఆనందంతో మైమరచిపోతుంది అదే అవకాశంగా భావించిన అతను ఆమెను అక్కడే వదిలి పెట్టి ఏమీ తెలియనట్టు గా వెళ్ళిపోతాడు. అక్కడనుంచి వెళ్ళి పోతాడు .
ఆ పాప బాధపడుతు…. నాన్న నాన్న అంటూ వెతకడం మొదలు పెడుతుంది. చాలా సమయం అయిపోతుంది అక్కడ వున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు.
ఆ పాప ఒక్కటే ఒక పులి బోను దగ్గర కూర్చొని. ఏడుస్తూ ఉంటుంది.
ఆ పాపను చూసిన పులి ఆమెనీ తినడానికి
పెద్ద పెద్దగా అరుస్తూ ఆమె మీదకు వస్తుంది.
కానీ అది బోనులో ఉండటంతో ఆ పాపనీ తిన లేక పోతుంది.
ఆ అరుపులకి ఆ పాప పెద్ద పెద్దగా ఏడవడం
మొదలుపెడుతుంది.
ఆ అరుపులు వున్న జు యజమాని ఆ పాప దగ్గరికి వస్తాడు.
అతను పాపతో….పాప ఎవరు నువ్వు.
నీతోపాటు ఎవరైనా వచ్చారా. ఎవరు నువ్వు
అని అడుగుతాడు అందుకు ఆ పాప ….. మా నాన్న నేను వచ్చాము. నాన్న వెళ్ళిపోయారు.
అంటూ ఏడుస్తాడు.
అతను….. ఏడవకు నాన్న దగ్గరికి నేను తీసుకు వెళతాను. మీది ఏ ఊరు.
పాప… మాది ఆ వూరు అని చెప్పింది పాపకి ఊరి పేరు తండ్రి పేరు తెలియదు.
ఆ వ్యక్తి…. మీ అమ్మ పేరు ఏంటో తెలుసా.
పాప… అమ్మ పేరు అమ్మ అది చెప్తూ ఉంటుంది ఎంత అడిగినా కూడా వాళ్ల ఆచూకీ అసలు చెప్పలేకపోయింది.
ఇదిలా ఉండగా ఇంటి దగ్గర భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గొడవ పడుతూ ఉంటారు.
భార్య….. ఏమండీ పాపని ఎక్కడికి తీసుకెళ్లారు. ఏం చేశారు నిజం చెప్పండి.
అతను…..తెలుసు నేను కూడా పాప కోసం వెతుకుతున్నాను.
ఆమె…. ఉదయం మీరే తీసుకెళ్లారని చుట్టుపక్కల అందరూ చెప్తున్నారు . దయచేసి నిజం చెప్పండి.
అతను….హా హా హా ఈ పాటికి అది చచ్చిపోయి ఉంటుంది. ఇంక దాని గురించి వదిలేయ్. అని లోపలికి వెళ్లి పడుకున్నాడు.
ఆమె…. ఏవండి పాప ఎక్కడ ఉందో చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ ఎంత ఏడ్చినా కూడా తను వులకడు పలకడు.
ఆమె అంత రాత్రి వేళ ఆమె కోసం వెతకడం మొదలు పెడుతుంది . కానీ ఇక్కడ పాప కనిపించదు. ఇంకా చేసేదేం లేక ఇంటికి తిరిగి వెళ్తుంది.
అక్కడ జు యజమాని ఆమెతో చాలా సేపు మాట్లాడి…..చూడమ్మా మీ అమ్మ నాన్న వచ్చేంతవరకు కొన్ని రోజులు అక్కడే ఉండు .
అంటూ తినడానికి ఆహారం అందిస్తాడు.
ఆమె సరే అని చెప్పి ఆహారం తింటుంది రోజులు గడిచాయి పాప కోసం ఎవరూ రాకపోవడంతో అతను…..మీ అమ్మానాన్న ఎవరు రాలేదు ఇంకా నువ్వు నా దగ్గరే ఉండు.
అని అంటాడు . రోజులు గడిచాయి ఆ జంతుప్రదర్శనశాల దాన్ని మరొక చోటుకీ చేయిస్తారు. ఆ పాప కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోతుంది. ఆ తల్లినీ బిడ్డని పోగొట్టుకోని ఎంతో ఏడుస్తుంది …… భగవంతుడు ఎందుకు ఇలాంటి భర్తను నాకు ఇచ్చావు ఇలాంటి కసాయి ఎవరికీ ఉండదు మా బిడ్డ ఏమైపోయిందో. ఎక్కడున్నావ్ ఏం చేస్తుందో నాకు తెలియటం లేదు. ఎక్కడ ఉన్నా బాగుండేలా గా చూడు. అంటూ భగవంతున్ని
ప్రార్థిస్తుంది.
ఇదిలా ఉండగా ఆ పాప వాళ్ళతో పాటే అక్కడ ఉన్న జంతువులు తో ఆడుకుంటూ అక్కడి వాళ్ళతో పాటు పెరుగుతుంది.ఆ జూ యజమానికి కూడా ఎవరూ లేకపోవడంతో ఆ పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.
ఆమె అక్కడే ఉంటుంది.
కానీ తల్లిదండ్రులు లేని బాధ మాత్రం తన మనసులో ఉండిపోతుంది ఆమె జు యజమానితో…. ఏమండి మా అమ్మానాన్న దగ్గరకు నన్ను ఎప్పుడూ పంపిస్తారు. నేను అక్కడికి వెళ్లి పోవాలి దయచేసి నన్ను అక్కడికి పంపించండి. అంటూ ఏడుస్తుంది.
ఆ యజమాని….. అమ్మ మీ అమ్మ నాన్న ఇంకా రారు. నువ్వు ఇంకా ఇక్కడే ఉండాలి అని అర్థం చేసుకో. నేనే మీ నాన్నని అనుకో నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను.
అని నచ్చు చెబుతాడు.
ఎందుకు ఆమె అలా ఏడుస్తూనే ఓడిపోతుంది మరి కొన్ని రోజులు గడిచాయి ఉన్నట్టుండి ఆ యజమానికి గుండె పోటు వచ్చి హఠాత్తుగా మరణిస్తాడు. మరుసటి రోజు అతన్ని చూసిన పాప ఏడుస్తూ….. నాన్న ఒక్కసారి లేవండి నాన్న. దయచేసి ఒక్కసారి లేవండి నాన్న.
అంటూ చాలా బాధ పడుతూ ఉంటుంది.
ఆమె ఏడ్చి అక్కడే ఉండిపోతుంది.
చాలా సమయం అవుతుంది ఆమె…. నాకు చాలా ఆకలిగా ఉంది ఏం చేయాలి అంటూ
బయటికి వెళ్తుంది. ఆ పాపకు ఏం చేయాలో అర్థం కాక. దారిలో వచ్చే పోయే వాళ్ళని డబ్బులు అడుగుతు…. ఏమండీ తినడానికి ఏమైనా ఇవ్వండి నాకు ఆకలవుతుంది. దయచేసి ఏమైనా తినడానికి ఇవ్వండి.
అంటూ వచ్చే పోయే వాళ్ళని అడుగుతూ.
వాళ్లు ఇచ్చిన డబ్బులతో ఏదన్న తీసుకొని తింటూ కాలం గడుపుతూ ఉంటుంది.
ఆ రోజు నుంచి ఆ పాప బిక్షాటన చేసుకుంటూ
దొరికింది తింటూ రోడ్లమీద నిద్రిస్తూ తన కాలాన్ని పడుతుంది.
రాత్రి సమయాలలో చలికి వణుకుతూ….. అమ్మ నాన్న మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. మీరు ఎక్కడున్నా నా కోసం రండి అంటూ కలవరిస్తూ ఉంటుంది. అలా మరి కొన్ని రోజులు గడిచాయి. ఆమె అలా భిక్షాటన చేస్తూ ఉండగా ఒక ఆమె….. పాప ఎవరు నువ్వు . నీకు ముందు వెనుక ఎవరూ లేరా.
పాప…. నాకు ఎవరూ లేరండి మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు. అంటూ ఏడుస్తుంది ఆమె…. బాధపడకు నువ్వు నాతో పాటు వస్తావా. మా ఇంట్లో పని చేసినవ్ అంటే నీకు మూడు పూటలా అన్నం పెడతాను.
అందుకు ఆ పాప సరే అని ఆమెతో పాటు వెళ్లడానికి సిద్ధపడుతుంది.
ఆమె పాపని ఇంటికి తీసుకు వెళ్తుంది.
అక్కడ ఇంటి పని వంట పని ఆ పాప చేత చేయిస్తూ ఉంటుంది. అలా అక్కడ పని చేసుకుంటూ. ఆమె ఇచ్చింది తింటూ ఉంటుంది. రోజులు గడిచాయి ఆమె పాప చేత కఠినమైన పనులను చేపిస్తూ సరిగ్గా భోజనం కూడా పెట్టేది కాదు.
ఒకరోజు పాప….. ఆమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా పెట్టండి.
ఆమె…. అబ్బా కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టుగా ఎప్పుడూ ఆకలి ఆకలి అంటావు
రోజు తింటూనే ఉన్నావా కొంచెం సేపు ఆగు.
పెడతాను. ముందు ఇంట్లో ఉన్న సామాన్లు బూజు దులిపి శుభ్రం చెయ్యి .
అని కోపం గా ఉంటుంది అందుకు పాప సరే అని చెప్పి. వాటిని శుభ్రం చేస్తూ ఉంటుంది.
ఇంతలో ఒక గాజు బొమ్మ కిందపడి పగిలి పోతుంది. దాన్ని చూసిన ఆమె…. ఒసేయ్ భోజనం పెట్టలేదని బొమ్మలు పగలు కొడుతున్నావా అంటూ ఆమె నీ చితకబాదింది.
పాపా…. లేదమ్మా నేను అలా చేయలేదు పొరపాటున చేయి జారింది అంటూ ఎంత చెప్పినా వినకుండా కొడుతుంది.
పాప ఏడుస్తూ….. అసలు నేను ఇక్కడ ఉండను. మీరు నన్ను ఎప్పుడు కొడుతూ తిడుతూ. ఉన్నారు నేను వెళ్ళిపోతాను అంటూ బయటకు పరుగులు చేసింది.
ఆమె కూడా పాప వెంట పరుగులు తీస్తుంది.
ఇంతలో ఒక కారు పాపను ఢీ కొంటుంది పాపా
కింద పడిపోయి…. అమ్మ దాహం దాహం
అంటూ అరుస్తూ కళ్ళముందే ప్రాణాలు విడుస్తుంది.
తనంత చూస్తున్న ఆమె…. పాప ఎవరో తెలియనట్టుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
తన తండ్రి చేసిన పనికి అభం శుభం తెలియని ఆ పాప ఎన్నో కష్టాల అనుభవించి బిచ్చగత్తె గా , పని మనిషి గా మారి చివరకు . ఎవరు లేని స్థితిలో అనాధ శవం గా మిగిలిపోయింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *