ఊరి పెద్దకి కడుపు చేసే దెయ్యం 5_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

మనం మునుపటి భాగంలో ఆ దెయ్యం రెండు విధాలుగా మారిపోవడం చూసాం ఆ తర్వాత దానిని చూసిన ప్రజలు ఆశ్చర్యంగా భయంతో పరుగులు తీసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి తలుపు లు వేసుకుంటారు. స్వామీజీ సంతోష్ రమేష్ లు ఒకరితో ఒకరు రమేష్ పరిగెత్తు పరిగెత్తు స్వామీజీ పరిగెత్తండి.రమేష్ పరిగెత్తు అంటూ వాళ్ళు ముగ్గురు కూడా ఇంటి లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటారు. లోపల స్వామీజీ తో…. స్వామీజీ ఏంటి ఎలా జరిగింది. అవి రెండు గా ఎలా మారిపోయాయి.

స్వామీజీ…. అదే నాకు అర్థం కావడం లేదు.
అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఆ రెండు దెయ్యాలు ఒకరితో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి వాటి మాటలు వింటున్న స్వామీజీ. వాళ్లతో…. ఒక్క నిమిషం ఆగండి ఆ దెయ్యాలు 2 మాట్లాడుకుంటున్నాయి వాటి సంభాషణ విందాం. అంటూ కిటికీ తలుపులు తెరిచి పాట సంభాషణ వింటూ ఉంటాడు.(మంచి దెయ్యం)…… అయ్యో ఎందుకు వీళ్లంతా ఇలా పరిగెడుతున్నారు.
చెడు దెయ్యం):….. నీకు ఇంకా అర్థం కాలేదా. నేను వాళ్ళ రక్తాన్ని తాగుతానని వాళ్లకు భయం. హా…హా..హా…
మంచి దెయ్యం…. నువ్వు అలా చేయడం తప్పు అయినా వాళ్ళు ఏదో అనుకుంటూ పరిగెత్తారు.
చెడు దెయ్యం… నీకు అది కూడా తెలీదా మనుషులందరూ ఒకరినొకరు పిలుచుకోవడం కోసం పేర్లు పెట్టుకుంటారు. నీకు అది కూడా తెలియదు నా కంటే నువ్వు చాలా తెలివి తక్కువ దానివి.
మంచి దెయ్యం…. అయ్యో అయితే మనం కూడా పేర్లు పెట్టుకుందాం. నీ వళ్ళంతా చింపిరి జుట్టుతో ఉంది. అందుకే నీ పేరు చింపు.
అప్పుడు చింపు దెయ్యం….. అయితే నీ పేరు చెడ్డి అని అంటుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చింపు… నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఎవరికైనా రక్తం తాగకపోతే నా నాలిక ఊరుకోవడం లేదు అంటూ పరుగులు తీస్తూ అందరినీ ఇంటి దగ్గరికి వెళ్లి తలుపులు కొడుతూ ఉంటుంది.
చెడ్డి మాత్రం అక్కడే ఉండి …. పాలు కావాలి నాకు ఆకలిగా ఉంది . అంటూ ఏడుస్తుంది అప్పుడు అదంతా చూసిన స్వామీజీ…. చూడండి ఈ రెండు దెయ్యాల సంభాషణ విన్నారు కదా. రక్తం కోసం పాకులాడుతున్నది చెడు దెయ్యం. పాల కోసం ఏడుస్తుంది మంచి దెయ్యం. ముల్లును ముల్లుతోనే తీయాలి. ఈ చెడ్డి దెయ్యం ఎవరిని ఏమి చేయదు మీరు ఒక పని చేయండి అదిగో ఆ చింపు అటుగా వెళ్తుంది మీరు త్వరగా వెళ్లి దీన్ని ఈ చెడ్డి దెయ్యాన్ని తీసుకురండి. అని అంటాడు వాళ్ళిద్దరూ నిదానంగా అడుగులు అడుగులు వేసుకుంటూ వెనకనుంచి వచ్చి చెడ్డి దెయ్యం నోరు మూసి బలవంతంగా దాన్ని లోపలికి ఎత్తుకుపోతారు. బయట చింపు ఆకలి ఆకలి రక్తం కావాలి అంటూ ఇంటి తలుపులు కొడుతూనే ఉంటుంది కానీ ఎవరు తలుపులు తీయకపోవడంతో తిరిగి వెనక్కి వస్తుంది అప్పుడు చెడ్డీ దెయ్యం కనిపించకపోవడంతో…. అయ్యో నా సోదరుడు ఎక్కడికి వెళ్లి పోయాడు. అంటూ వెతుకుతూ ఉంటాడు . ఇంతలో ఆ దెయ్యానికి ఒక టైర్ కనిపిస్తుంది. దాన్ని తీసుకొని…. అరే భలేగా ఉంది నేను దీంతో ఆడుకుంటాను అంటూ ఒక కర్ర తీసుకొని ఆ టైంనీ కొట్టుకుంటూ ఆ గ్రామంలో ఆకలి ఆకలి అంటూ తిరుగుతా ఉంటుంది. ఇది ఇలా ఉండగా అక్కడ మంచి దెయ్యాన్ని స్వామీజీ దగ్గర తీసుకెళ్తారు. ఆ దెయ్యం…… వద్దండి నన్ను నాకు ఆకలిగా ఉంది. అమ్మ ఆకలి హుమ్మ్ హుమ్మ్…హుమ్మ్ . అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు స్వామీజీ….. ఇదిగో నువ్వు ఏడవకుండా ఉంటే నీకు పాలు తీసుకొచ్చి ఇస్తాను.
అందుకు దెయ్యం…. ఏడవను ఇవ్వండి అని అంటుంది స్వామీజీ సంతోష్ భార్య తో… లక్ష్మీ గారు ఇంట్లో ఉన్న పాలు తీసుకుని రా అని చెప్తాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి కొన్ని పాలు తీసుకొని వస్తుంది. ఆ దయ్యం ఆ పాలు మొత్తాన్ని తాగి…. నాకు మరికొన్ని పాలు కావాలి త్వరగా తీసుకువచ్చి ఇవ్వండి. అంటూ పెద్ద పెద్దగా పాలు ఆకలి అంటూ ఏడుస్తుంది.
దాన్ని చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోయి…. లక్ష్మీ తో లక్ష్మీ ఇంకేమైనా పాలు ఉంటే తీసుకుని రా.అని అంటారు లక్ష్మీ లోపలికి వెళ్లి ఉన్న మిగిలిన పాలు కూడా తీసుకొచ్చి ఇస్తుంది. ఆ దయ్యం ఆ పాలు కూడా తాగి …. ఆకలి నాకు ఇంకా కొన్ని పాలు కావాలి. అంటూ పెద్ద పెద్ద గా గోల చేస్తుంది.
అప్పుడు లక్ష్మీ తనలో…. వామ్మో ఇది ఏంది రా దేవుడా. ఇన్ని పాలు తాగి ఇంకా ఆకలి అంటుంది. దీని ఇక్కడ కనుక ఉంచితే మా ఇల్లు గుల్ల అవుతుంది. అని అనుకుంటూ ఉంటుంది. స్వామీజీ దానిపై మంత్రం వేసి దాని కడుపునిండా ఎలా చేస్తాడు.
ఆ దెయ్యం ఏడుపుని ఆపివేసి….. పెద్ద పెద్దగా పెద్దగా హా. .హా. హమ్. అని నవ్వుతూ ఆ ఇల్లంతా అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది
అది అలా పరిగెడుతుంటే ఆ శబ్దానికి వాళ్ల గుండె ఆగినంత పనవుతుంది.
వాళ్ల మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ….. స్వామి ఏదో ఒకటి చెయ్యండి ఆ వింత శబ్దాలు మేము వినలేక పోతున్నాము దానిపై మంత్రం వేసి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని చేయండి.
అప్పుడు స్వామీజీ దాన్ని పై మంత్రం వేసి … రా వచ్చి కూర్చో వెంటనే ఆ దెయ్యం నవ్వుకుంటూ ఆ స్వామికి దగ్గరికి వచ్చి…. చెప్పు చెప్పు ఏంటి పిలిచావు. ఆ మాటలకి స్వామీజీ కి కూడా ఏం చేయాలో అర్థం కాదు. నుంచి ఎలా అయినా ఆ రెండు దయ్యాల నుంచి ఆ ఊరిని కాపాడాలని అనుకుంటాడు.
ఆ దెయ్యం అలా చూస్తూ చూస్తూ…. మీరు ఎవరు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు నేను ఇక్కడనుంచి వెళ్ళిపోతాను. అని మారం చేస్తూ ఉంటుంది.
అప్పుడు ఊరు పెద్ద సంతోష్…… చూడు నీకు ఏం కావాలన్నా ఇస్తాం కానీ నువ్వు ఎప్పుడూ ఊర్లోకి రాకూడదు. అలాగే నీ సోదరుడు చింపు కూడా మీకు ఏం కావాలన్నా ఇస్తాము ఇక్కడ నుంచి వెళ్లి పోవడానికి మీకేం కావాలి.
ఆ మాటలు విన్న స్వామీజీ….. భలే మంచి ప్రశ్న అడిగావు నాకు ఈ ఆలోచన తట్టలేదు. అంటూ దయ్యం తో నీకేం కావాలో చెప్పు దానికి నీకు ఇస్తాను.
అందుకు ఆ దెయ్యం… హా …అని ఆవలిస్తూ
నాకు నిద్ర వస్తుంది నాకు ఏం కావాలో నీకు తర్వాత చెప్తాను. అని అక్కడే పడుకుంటుంది. దాని గురక శబ్దానికి అక్కడ ఉన్న వాళ్లంతా దాక్కొని చెవులు మూసుకుంటారు. అప్పుడు ఒక వాళ్ళల్లో…. దేవుడా ఏంటి ఇది మాకు. దీని ఆకలి దీని నడక దీని గురక మా ప్రాణాలు తీసే స్తున్నాయి. స్వామి ఏదో ఒకటి చేయండి స్వామి. అంటూ కేకలు వేస్తారు.
ఇదిలా ఉండగా టైర్ తీసుకెళ్ళిపోయాడు దయ్యం ఆటలు ఆడుకుంటూ ఉండగా ఆ టైరు ఒక కాలువలోకి వెళ్లి పోతుంది.
దాన్ని చూసిన దెయ్యం….. అరే ఇది ఇది ఇప్పుడే కాలువ లో కి వెళ్లిపోవాలా. చి చి అని అనుకుంటూ వెనక్కి వస్తూ అయ్యో నా సోదరుడు తప్పిపోయాడు అయ్యో నా సోదరుడు ఎక్కడికి వెళ్లి పోయాడు. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ……. చెడ్డి ఎక్కడున్నావ్ చెడ్డి ఎక్కడున్నావ్ అంటూ అందరిలోకి తొంగి తొంగి చూస్తాడు . కిటికీలు ఇల్లు అన్ని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఊరు పెద్ద ఇంటి దగ్గరికి రాగానే తన తమ్ముడు నిద్రపోతూ కనిపిస్తాడు. అతన్ని చూసి….. ఓ నువ్వెక్కడున్నావ్ ఆ. ఆగు వస్తున్న అని అని లోపలికి వెళ్ళడానికి మార్గం వెతుకుతాడు. కానీ ఆ దెయ్యానికి ఎక్కడ మార్గం కనిపించకపోవడంతో వాళ్ల ఇంటి పైకి ఎక్కి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటాడు. లో ఇంటి లోపల ఉన్న వాళ్ళంతా ఆ శబ్దానికి మరింత భయపడిపోతారు.
అప్పుడు స్వామీజీతో సంతోష్…… స్వామి ఏంటిది స్వామి మీరు ఈ దెయ్యాన్ని తీసుకురమ్మని తీసుకు వచ్చాము ఏంటి ఈ వింత శబ్దాలు ఏంటి ఈ వింత లు ఏదో ఒకటి చేయండి స్వామి.
స్వామి …… అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాను. ఈ దెయ్యం ద్వారా అయితే మనకి ఎలాంటి హాని లేదు. ఇక దీని సోదరుని సంగతి చూడాలి. ఏదైనా ఇచ్చి వీటిని ఊరు నుంచి పంపిo చేయాలి లేదా మన o ఊరు నుంచి వెళ్లిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కచ్చితంగా జరగాలి నా మాయ శక్తులు కూడా వీటి మీద ప్రభావితం చేయటం లేదు. అని స్వామీజీ కూడా చేతులెత్తాడు.
స్వామీజీ మాటలు వింటున్న వాళ్లంతా ఆశ్చర్యపోయి చూసి వింతగా ఒకరినొకరు చూసుకుంటూ. ఉంటారు అప్పుడు లక్ష్మి….. ఎందుకు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. అయితే తీసుకురమ్మని గాని దాన్ని అమాంతం ఎత్తి వచ్చారుగా. ఇప్పుడు ఏం జరిగినా అందరూ అనుభవించాల్సిందే. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం . ఉంటే అందరం కలిసి ఉంటాం చచ్చిపోతే అందరం కలిసి చచ్చిపోతాం చేసేదేముంది అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.
పైన ఉన్న చింపు మాత్రం ఆ ఇంటి మీద అటూ ఇటూ పరిగెడుతూ …… నన్ను లోపలికి రానివ్వండి తలుపు తెరవండి. నా తమ్ముడు నీ ఏం చేస్తున్నారు. మర్యాదగా తలుపులు తెరవండి అంటూ పెద్ద పెద్ద గోల చేస్తాడు.
లోపల ఉన్న వాళ్లంతా భయపడతారు వాళ్ల ఏం చేయలేని పరిస్థితి. ఇంతలో ఆ దెయ్యం ఆ ఇంటిని పైకప్పుని పగల కొట్టడానికి ప్రయత్నిస్తుంది. దాని ప్రయత్నం ఫలిస్తుందా లేదా అసలు అది ఏం చేయాలి అనుకుంటుంది ఆ దెయ్యాల భరీ నుంచి ఆ ఊరిని ఎవరు కాపాడుతా రొ ఒకవేళ కాపాడు లేకపోతే ఈ దెయ్యాలు ఎంత అల్లరి చేస్తాయో అనేది తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *