ఊరి పెద్ద కడుపు చేసే దెయ్యం 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

మన మొదటి భాగంలో రాక్షసి బిడ్డ బయటకు వచ్చి ఊరు మొత్తం తిరుగుతూ అల్లకల్లోలం చేస్తుంది. దాన్ని ఎలా ఎలా ఎలా వదిలించాలి అని ఊరిపెద్ద సంతోష్ తన స్నేహితుడు రమేష్ ఇద్దరూ పరిష్కారం కోసం ఊరి చివర ఉన్న స్వామిజి ఆశ్రమం దగ్గరికి వెళ్తారు. అక్కడ అ స్వామీజీ ఉండరు ఆయన ఆచూకి కోసం చాలా వెతుకుతారు. అతను షిరిడి వెళ్లారు అని అక్కడ ఆశ్రమంలో ఉన్న ఒక స్త్రీ ద్వారా తెలుసుకుంటారు దాన్ని విన్న వాళ్ళు ఎలా అయినా సరే ఈ సమాచారం స్వామీజీకి చెప్పాలి అని వీళ్ళు కూడా స్వామీజీ ని వెతుక్కుంటూ వెళతారు. ఇక్కడ మా ఊరిలో ఆ రెండు తలల దెయ్యం …. పాలు ఆకలి గా ఉంది నాకు చాలా ఆకలిగా ఉంది. అంటూ ఊరిలో తిరుగుతూ ఉంటాడు.

ఆ అరుపులు శబ్దాలు వింటున్న ప్రజలు ఇంటిలోపల నుంచి బయటకు రారు.
ఇంతలో ఒక ముసలావిడ తన మనసులో…. అయ్యో భగవంతుడా ఏంటి మాకు ఈ కష్టాలు. ఆ దెయ్యం బిడ్డ ఏడుపు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఏం చేద్దాం . నేను కూడా ఒక బిడ్డకి తల్లి నే కదా. ఆ బాధ నేను భరించలేకపోతున్నాను. అని అనుకొని ఒక పెద్ద గిన్నెలో పాలు తీసుకొని తన ఇంటి ముందు పెట్టి …… పాలు ఇక్కడ ఉన్నాయి. వచ్చి తాగి నీ ఆకలి తీర్చుకో. అనీ పెద్దగా కేక పెట్టి ఆ దెయ్యం కి వినపడేలా గా చెబుతుంది. ఆ మాటలు విన్న దెయ్యం గాల్లో ఎగురు కుంటూ అక్కడికి వస్తుంది అప్పటికే ఆ ముసలి ఆవిడ పాల గిన్నెను అక్కడ పెట్టి ఇంటి లోపలికి వెళ్లి తలుపులు బిగించుకుo ఉంటుంది. అక్కడికి వచ్చిన ఆ దెయ్యం బిడ్డ ఆ పాలు మొత్తం తాగుతాడు. అప్పుడు ఆ రెండు తలలో రాక్షస తల ….. నువ్వు పాలు మొత్తం తాగి నీ సగం కడుపు నింపుకున్నాఉ. మరి నా ఆకలిని ఎవరు తీరుస్తారు నాకు రక్తం కావాలి. నీకు పాలు ఇచ్చిన ఆ ముసలావిడ నాకు రక్తం ఇవ్వాలి. అంటూ కేకలు వేస్తోంది. అప్పుడు మరోవైపు ఉన్న మనిషి తల….. వద్దు తప్పు నువ్వు అలా చేయకూడదు. ఆమె నా ఆకలి తీర్చింది అంటే నాకు అమ్మతో సమానం. నువ్వు అలా చేయకూడదు. రాక్షస తల….. నువ్వు మాట్లాడకు జరగబోయేది ఏదో కేవలం అలా చూస్తూ ఉండు. అంటూ అక్కడి నుంచి గాల్లోకి ఎగిరిపోతుంది. అలా కొంత సమయానికి ఆ అరుపులు ఆగిపోవడంతో ఆ ముసలావిడ ఆ పాత్రను తీసుకురావడానికి బయటకు వెళ్తుంది వెంటనే అక్కడికి వచ్చి ఆమెను పట్టుకొని ఆమెను చంపి రక్తం తాగి వెళ్ళిపోతుంది. ఆమె కింద పడి కొనఊపిరితో…. అమ్మ భగవంతుడా . పాముకు పాలు పోస్తే కాటు వేస్తుంది అని నాకు తెలిసి వచ్చింది. నా ప్రాణాలు పైకి పోతున్నాయి . అంటూ ఎంతో బాధపడుతూ రోదిస్తూ చనిపోతుంది. దానిని అంతా కిటికీల ద్వారా చూస్తున్న ఊరి ప్రజలు….. పాపం కొంచెం కూడా జాలి లేకుండా అ దెయ్యం ఎలా చేసిందో చూడండి. అంటూ అందరూ వాపోతారు. అలా గాల్లోకి ఎగిసిన దెయ్యం తన గృహంలో కి వెళ్ళిన తర్వాత మంచి తలకి దయ్యం తలకి చాలా సేపు ఘర్షణ జరుగుతుంది. ఆ ముసలి ఆమెను అన్యాయంగా చంపేసావ్ అంటూ. మంచి తల
లేదు నేను కేవలం నా ఆకలి కోసమే ఆమెను చంపేస్తాను. అంటూ దెయ్యం తల ఘర్షణ పడి కొంత సమయానికి అది నిద్రలోకి జారుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఊరి ప్రజలంతా ఒకచోట చేరి ఒకరితో ఒకరు….. ఊరి పెద్ద ఆ మంత్ర గతిని ఊరు నుంచి పంపించి ఎంత పెద్ద తప్పు చేశాడు. అదే గనక జరగకపోతే ఇదంతా వచ్చేది కాదు. ఇంకా మన ఊర్లో ఎంత మంది ప్రాణాలు ఆ దెయ్యం బలి తీసుకుంటుందో. ఇంకా ఎంతమంది శవాలుగా మారుతారు ఏమో అంటూ భయపడతారు. ఆరోజు రాత్రి ఆ దయ్యం ఊర్లోకి వచ్చి….. ఆకలి దాహం పాలు కావాలి రక్తం కావాలి అంటూ కేకలు వేస్తోంది . కానీ ఆ రోజు మాత్రం ఎవ్వరూ కూడా బయటకు రారు ఆ దయ్యం అక్కడే గాల్లో అటూ ఇటూ తిరుగుతూ. పెద్ద పెద్దగా ఏడుస్తూ కేకలు పెడుతూ అరుస్తూ ఉంటుంది ఆ మరుసటి రోజు ఉదయం కాగానే అక్కడి నుంచి వెళ్లి పోతుంది. కానీ ఆ శబ్దాలు అరుపులు మాత్రం ఏమాత్రం తగ్గవు. ఇది ఇలా ఉండగా స్వామిజీ కోసం వెళ్లిన వాళ్లు ఇద్దరూ స్వామీజీ ఆచూకీ దొరక్కపోవడంతో. ఎంతో బాధతో భయంతో తిరిగి వస్తారు. వాళ్లు ఊరికి తిరిగి వచ్చే సమయానికి చాలా చీకటి పడుతుంది అప్పుడు ఆ దెయ్యం ఊరిలో అటూ ఇటూ తిరుగుతూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. దానిని చూసిన ఊరి పెద్ద రమేష్ లు భయపడి ఒక చోట అనుకుంటారు. అప్పుడు వాళ్ల మనసులో…
భగవంతుడా ఈ దెయ్యం పీడ మాకు ఎప్పుడు వదులుతుంది. ఎలా అయినా ఈ గండం నుంచి నువ్వే గట్టు ఎక్కించాలి. అని అనుకుంటారు . ఆ దయ్యం కొంచెం పక్కకు వెళ్లగానే ఇద్దరు పరుగుపరుగున వాళ్ళ లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. వాళ్లను గమనించినా దయ్యం అక్కడికి వచ్చి తలుపులు కొడుతూ….. తలుపు తియ్యి నేను నిన్ను చూశాను. నాకు నువ్వు కావాలి ఆకలి మండిపోతుంది.నా ఆకలి తీర్చు అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ దెయ్యానికి అక్కడ ఒక పాము కనబడుతుంది . ఆ పామును పట్టుకొని ఆమాంతం మింగేస్తుంది. అలా రాక్షసి దెయ్యం తల కడుపు నిండుతుంది కానీ. మనిషి తల ఉన్న భాగం మాత్రం ఆకలితో ఏడుస్తూనే ఉంటుంది. అలా తెల్లవారిపోయింది . ఆ ఏడుపు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆ సమయంలోనే స్వామీజీ ఊరికి తిరిగి వచ్చాడు. ఆ వింత శబ్దాలు ఏడుపు చూసి ఆయన చాలా ఆశ్చర్య పోయి…. ఏంటి ఈ వింత శబ్దాలు అసలు ఊర్లో ఏం జరుగుతుంది. ఆ ఊరి పెద్ద ఎక్కడున్నాడో. ఏం చేస్తున్నాడో దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అని ఉరి పెద్ద ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ తలుపు తియ్యి సంతోష్ రమేష్ తలుపు తీయండి అంటూ తలుపులు కొడతా ఉంటాడు లోపల ఉన్న ఊరు పెద్ద.., నువ్వు దెయ్యానివే నాకు తెలుసు . మర్యాద ఎక్కడినుంచి వెళ్లకపోతే నేను నిన్ను బంధించా చేస్తాను. జాగ్రత్త నాకు మాయ మంత్రాలు చాలా తెలుసు. అని దెయ్యం అనుకొని దాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు స్వామీజీ….. నేను నిజంగానే స్వామీజీని వచ్చాను కావాలంటే నీ కిటికీ తలుపు తెరిచి చూడు. అని అంటాడు . వెంటనే అతను….. ఆ ఇంటి కిటికీ తలుపులు తెరిచి చూస్తాడు. బయట స్వామీజీని చూసి చాలా సంతోషపడి తలుపులు తెరిచి…. రండి స్వామి .నన్ను క్షమించండి ఇదంతా ఆ దెయ్యం చేస్తుందేమో అని. నేను తలుపులు తీయలేదు.
స్వామీజీ ఆశ్చర్యం గా… దెయ్యం ఏంటి నువ్వు ఏం చెప్తున్నావ్ నాకు అర్థం కాలేదు..
అప్పుడు పెద్ద స్వామీజీకి జరిగిన విషయమంతా చెప్తాడు.
దానిని అంతా విన్న స్వామీజీ…. నువ్వు చేసిన ఆ ఒక్క చిన్న తప్పు వల్ల ఎంత అనర్ధాలు జరిగింది. అయ్యో సంతోష్ నువ్వు మంత్రగత్తె ని పూరి నుంచి పంపించకుండా ఉండాల్సిందే. అసలిదంత జరిగేది కాదేమో. అయినా ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు. దానికి ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది కాదు ఉంది అని గట్టిగా చెప్పాడు.అప్పుడు
ఊరి పెద్ద… ఆ ధైర్యంతోనే ఉన్నాం స్వామి మీకోసం వెతికాము. కానీ మీరు మాకు కనిపించలేదు. ఎలాగైతే ఇప్పుడు ఇక్కడికి రావడం మంచిదయింది. మీ ఊరిని మీరే కాపాడాలి నేను చేసిన తప్పు కి ఊరు మొత్తం బలికావడం నాకు ఇష్టం లేదు. అంటూ చేతులు జోడించి ప్రాధేయపడతాడు. అప్పుడు రమేష్…. స్వామి చెప్పిందంతా విన్నారుగా మీరే మమ్మల్ని కాపాడాలి. కానీ నాకు ఒక సందేహం స్వామి అది సగం మంచిగా సగం దెయ్యంగా ఎందుకు ఉందో ఎవరికీ అర్థం కాలేదు.
అని అడుగుతాడు అప్పుడు స్వామీజీ…. ఆ దెయ్యం బిడ్డ మనిషి గర్భంలో పెరిగాడు కాబట్టి సగం మనిషి ఆ దెయ్యం ఇచ్చిన శాపం వల్ల ఉద్భవించాడు కాబట్టి సగం దెయ్యం లాగా ఉన్నాడు. మీరు ఎవ్వరు భయపడకండి ఇక నేను వచ్చాను గా ఆ దెయ్యం అంతు తేలుస్తాను. అని అంటాడు అందరూ తిండితిప్పలు మానేసి ఆ దెయ్యం రాకకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ రోజు రాత్రి సమయం రానే వచ్చింది. ఆ దెయ్యం గాల్లో ఆకలి రక్తం…. పాలు కావాలి నాకు పాలు కావాలి అంటూ కేకలు వేస్తూ వస్తోంది.
అప్పుడు స్వామీజీ దాన్ని ముందుకు వెళ్లి మంత్రంతో దాన్ని బంధించడానికి ప్రయత్నిస్తాడు.
ఆ స్వామీజీ ని చూసిన ఏంటి నువ్వు నన్ను ఏదో చేయడానికి వచ్చినట్టు ఉన్నావ్ ఏ నేను నీకుఏంటి నువ్వు నన్ను ఏదో చేయడానికి వచ్చినట్టు ఉన్నావ్ ఏ నేను నీకు భయపడను. ఈ ప్రపంచంలో ఎవ్వరు నన్ను ఏమి చేయలేరు. హా….ham..ha… జాగ్రత్త నువ్వే విఫలమవుతావి… అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది అప్పుడు స్వామీజీ న మంత్రాలు చదివి దానిపై ప్రయోగిస్తాడు మంత్రానికి దూరంగా తప్పుకుంటుంది.
స్వామీజీ మరోసారి దాన్ని బంధించడానికి ప్రయత్నిస్తాడు. అది మళ్ళీ తప్పించుకొని…. స్వామి నువ్వు నన్ను ఏం చేయలేవు . నన్ను బంధించడం నీకు సులభం అనుకున్నావా. నన్ను బంధించి లేవు నువ్వు నన్ను బంధించి లేవు. హా..హా హా… అంటూ పెద్దగా నవ్వుతూ ఉండగా స్వామీజీ మరోసారి చాలా మంత్రాలు చదివి. దానిపై ప్రయోగిస్తాడు. ఆ దయ్యం పెద్దగా కేకలు వేస్తూ ….. అమ్మ అమ్మ అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. దానిని చూసిన ఆ ఊరి ప్రజలంతా చాలా సంతోషిస్తారు. ఆ దెయ్యం పీడ వదిలింది అని ఎంతో ఆనంద పడుతూ ఉంటారు. ఇంతలో పెద్దపెద్ద ఉరుములు మెరుపులు శబ్దాలతో ఆ దెయ్యం మళ్ళీ తిరిగి వస్తుంది . కానీ అది ఒక్క సారిగా రెండు భాగాలుగా విడిపోయి మనిషి బిడ్డకి మనిషిగా. రాక్షసి బిడ్డ రాక్షసి బిడ్డగా ఇద్దరు వేరువేరుగా విడిపోతారు. దాన్ని చూస్తూ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యంతో ఉండిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేది తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *