ఊరి పెద్ద కి కడుపు చేసే దెయ్యం 8_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఊరు పెద్ద కి కడుపు చేసే దెయ్యం ఏడో భాగం లో ఆ మంత్రగత్తెని సమాధి చేసి ఎవరి దారిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు ఆ సమాధి నుంచి ఆ దెయ్యం నేను వస్తాను అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం. అలాగా కొన్ని రోజులు గడిచాయి. ఆ మంత్రగత్తె దెయ్యం గా మారిపోతుంది. ఆ సమాధి నుంచి…. రేయ్ ఊరిపెద్ద గా , స్వామీజీగా ,లక్ష్మి , సంతోష్ ఇక మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. మా ఊర్లో మాత్రం చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటారు వినాయక చవితి వస్తుంది అని ఊరిపెద్ద ప్రజలతో…. చూడండి మనకి దేవుడు ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. ఎలాగోలా ఇప్పుడు ఆ దెయ్యాల గోల కూడా వదిలిపోయింది. కాబట్టి ఈసారి గణపయ్య ఉత్సవం చాలా బాగా చేయాలి అనీ చెప్తాడు.

అందుకు ప్రజలంతా సరే అని అంటారు. చింపు చెడ్డి దెయ్యాలు రెండు ఒక డబ్బాను(హుండీ) తీసుకొని ఇంటింటికీ వెళ్లి తలుపు కొడుతూ …. అమ్మ వినాయకుడి చందా కోసం వచ్చాము అని పెద్దగా అరుస్తూ ఉంటాయి లోపల్నుంచి వచ్చినవాళ్లు వాళ్లు కి తోచినంత చందాని ఆ డబ్బాలో వేస్తారు.
తక్కువ ఇచ్చిన వాళ్ళతో ఆ దయ్యాలు…. ఏంటి తక్కువ డబ్బులు ఇస్తున్నారు. కొంచెం ఎక్కువ ఇస్తే మీకు నేను ఎక్కువ ప్రసాదం ఇస్తాను. అప్పుడు వినాయకుని కృప మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అది అంటాయి ఆ మాటలకు వాళ్ళకి నవ్వు వచ్చి. సరే అలాగే అంటూ మరి కొంత డబ్బుని ఆ వుండి లో వేస్తారు. అలా ఆ రోజు మొత్తం చింపు చెడ్డి దయ్యాలు ఊరు మొత్తం తిరిగి డబ్బులు వసూలుచేసి. ఊరు పెద్ద ఇంటికి వెళ్తాయి. ఆ డబ్బులు చూసిన ఊరిపెద్ద…. చాలా బాగా చేశారు. దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు మనం పండగ పనులు మొదలు పెట్టాలి.
అలాగే మీరు ఇద్దరు ఒక పని చేయండి అడవికి వెళ్లి కొన్ని తాటి ఆకులు తీసుకురండి పందిరి వేయడం కోసం. అంతలోకి ఇక్కడ మేము బొంగు లను నాటుతూ ఉంటాము.
చెప్పు చెడ్డి దెయ్యాలు సరే అని చెప్పి అక్కడి నుంచి చిరా ఒక కొడవలి తీసుకొని అడవి కి వెళ్తారు వాళ్ళు అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద తాడిచెట్టు కనబడుతుంది. చెడ్డి… చింపు అదిగో ఆ చెట్టుకి చాలా ఆకులు ఉన్నాయి వాటిని కొట్టుకుందాం పద. ఈసారి గణేష్ ఉత్సవం బాగా జరుపుతారు అంట. మనం కూడా అ గణపయ్య పనులు చేయడం చాలా ఆనందంగా ఉంది కదా.
చింపు…. అవును చాలా ఆనందంగా ఉంది నాకు. అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్లకి….. నా బిడ్డ లారా నేను ఇక్కడ ఉన్నాను నేను మీ దగ్గరికి రావాలంటే నన్ను బయటకు తీయండి. అని స్వరం వినబడుతుంది. చింపు చెడ్డి దెయ్యాలు… ఎవరు మనతో మాట్లాడుతుంది అంటూ అటూ ఇటూ వెతుకుతారు. అక్కడే ఉన్న పూడ్చి పెట్టిన సమాధి నుంచి ఆ మాటలు వినపడతాయి. చింపు చెడ్డి దయ్యాలు అక్కడికి వెళ్లి…. ఎవరు మీరు. మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అసలు భూమి లోపలికి ఎలా వెళ్లారు. అని అమాయకంగా అడుగుతాయి.
అప్పుడు ఆ స్వరం…. నేనే వినాయకుని నేను మీ దగ్గరికి రావాలి అంటే నన్ను బయటికి తీయాలి. నన్ను బయటికి తీయండి మీ ఊరికి తీసుకెళ్లండి. అని అంటుంది వెంటనే వాళ్ళు… స్వామి వినాయక ఇప్పుడే నిన్ను బయటకు తీస్తాము. అని ఆ గుంటను తవ్వుతారు ఆ గుంట లోపల్నుంచి దయ్యం బయటకు వచ్చి….హా…హా..హా ఏరా మనవళ్ళు ఎలా ఉన్నారు. మీ నాయనమ్మ ని వచ్చేసాను రా.
దెయ్యాన్ని చూసిన వాళ్ళిద్దరూ భయంతో అక్కడ్నుంచి పరిగెత్తడానికి ప్రయత్నిస్తారు.
ఎందుకంటే వాళ్లు దెయ్యం రూపంలో ఉన్న మనుషులు అంటే పిల్లలతో సమానం. పైగా వాళ్ళకి ఆ గుంటలో ఉన్నది దయ్యం అన్న సంగతి కూడా తెలియదు. ఆ విషయం తెలియక వాళ్ళు దానిని తెరిచారు. ఆ దెయ్యం వాళ్ళిద్దరికీ పట్టుకొని …. ఎక్కడికి పారిపోతారు రా ముందు నేను మీ ఇద్దర్ని మళ్ళీ చెడ్డవాళ్ళు గా మారుస్తాను. అప్పుడే ఆ వూరి మీద పగ తీర్చు కుంటాను . అని అంటూ ఉంటుంది. చింపు చెడ్డి దయ్యాలు భయంతో…. స్వామి గణపయ్య మమ్మల్ని నువ్వే కాపాడాలి. నీ పేరు చెప్పి ఈ దెయ్యం మమ్మల్ని మోసం చేసింది. అంటూ గణపయ్య అని ప్రార్థిస్తారు. వెంటనే గణపయ్య అక్కడ ప్రత్యక్షం అవుతాడు. గణపయ్య ను చూసిన ఆ దెయ్యం చింపు చెడ్డి దెయ్యాలనీ వదిలేస్తుంది అది భయంతో అక్కడినుంచి పరిగెడుతూ ఉండగా. గణపయ్య ఆమె ముందు ప్రత్యక్షం అవుతాడు. అలా గణపయ్య నుంచి ఆ దెయ్యం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఆ దెయ్యం బాగా అలసిపోయి ఒకచోట నిలబడుతుంది.
గణపయ్య… ఏంటి అలసి పోయావా.
దెయ్యం… అవును గణపయ్యా అలిసిపోయాను. నువ్వు ఈ మనిషిని కాపాడ్డానికి వచ్చావా. నేను వాళ్ళనీ చంపేస్తాను ఎవరిని బ్రతకన్నివను.హా…హా…హా… అని అని అంటుంది అందుకు గణపయ్య …. అప్పటి వరకూ నువ్వు బ్రతికి ఉంటే కదా . ఈ లోపే నిన్ను నేను అంతం చేస్తాను. అని విఘ్నేశ్వరుడు దానిపై మంత్రం ప్రయోగిస్తూ ఉండగా చింపు చెడ్డి దయ్యాలు…. స్వామి స్వామి ఒక్క నిమిషం ఆగండి. దీనిని ఇక్కడే అంతం చేస్తే ఎలా ఉరి ప్రజల ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. అందుకోసం దీనిని ప్రజల చేత అంతం చేయించండి. అప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. అందుకు గణపయ్య… సరే అయితే దీన్ని ఊర్లోకి తీసుకు వెళ్దాం అంటూ ఆ దెయ్యాన్ని తీసుకు వెళుతూ ఉంటాడు. ఆ దెయ్యం… గణపయ్య మర్యాదగా వదిలి పెట్టి నన్ను. మర్యాదగా వదిలిపెట్టు. అంటూ కేకలు వేస్తోంది గణపయ్యా దాన్ని అలాగే తీసుకువెళతాడు.
ఊరి ప్రజలు అందరూ గణపయ్యను ఆ దెయ్యాన్ని చూసి చాలా ఆశ్చర్య పోతారు.
అందరూ గణపయ్యకు చేతులతో మొక్కి … జై గణపయ్య జై జై గణపయ్య అంటూ పెద్దపెద్దగా కేకలు వేస్తారు. గణపయ్య వాళ్లందర్నీ దీవించి…. చూడండి ఎన్నో రోజులుగా ఈ దెయ్యం మీ ఊరి వాళ్ళ ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు దీనిపై మీకు పగ తీర్చుకునే అవకాశం ఇస్తున్నాను.
అందుకు ఊరిపెద్ద…. చాలా సంతోషం స్వామి దీని వల్ల మా జీవితాలు అంతా అల్లకల్లోలం అయ్యాయి. దీన్ని ఇప్పుడే చంపేస్తాను అంటూ అందరూ దాన్ని చంపడానికి వస్తూ ఉండగా గణపయ్య…. ఒక్క నిమిషం ఆగండి. అంటూ వాళ్లని ఆపి ఆ దెయ్యం తో…. చూశావుగా ఎలాగా నిన్ను అసహ్యించుకుంటున్నారో. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఇలాంటి మంచి పని చేయలేదు. అలాగే మరణించిన తర్వాత కూడా చేయలేదు. పైగా అన్ని తప్పులే చేస్తున్నావు.
అంటూ ఆమెను మందలిస్తాడు.
ఆ దయ్యం చాలాసేపు ఆలోచించి…. గణపయ్య నన్ను క్షమించు నాకు అంత అర్థం అయింది.నేను బ్రతికి ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగపడలేదు చనిపోయిన తర్వాత కూడా ఎవరికీ ఉపయోగ పడకపోగా అందర్నీ హింసించినా ను అందుకు వాళ్లు నా పై పగ పెంచుకోవడం తప్పేమీ లేదు. నేను మనస్ఫూర్తిగా మీతో చెప్తుంది ఏంటంటే. మీరు నాపై పగలు తీర్చుకోండి నన్ను అంతం చెయ్యండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. ఆ దయ్యం మాట్లాడిన మాటలు కి ప్రజలకు ఏం చేయాలో అర్థం కాదు దాని పై కొంతమంది జాలి పడుతూ ఉంటే మరికొందరు … ఇది మళ్లీ ఏదో పన్నాగం పొందుతుంది అని అనుకుంటారు. అప్పుడు ఆ మాటలు విన్న దయ్యం….. నేను పూర్తిగా మారిపోయాను నేను ఎలాంటి కుట్రలు చేయడం లేదు. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను నన్ను అంతం చేయండి నాలాంటి వాళ్లకి ఇక్కడ స్థానం లేదు నేను ఇంకా ఇక్కడే ఉంటే నీకే ప్రమాదం. అంటూ ఏడుస్తూ పెద్దపెద్దగా కేకలు వేస్తోంది.అప్పుడు గణపయ్య…. ఇప్పటికైనా నీ బుద్ది మార్చుకో ఉన్నందుకు చాలా సంతోషం ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు ఈ వూరు జోలికి రాకు వస్తే అప్పుడు నేను రావాల్సి వస్తుంది.
అందుకు ఆ దయ్యం… స్వామి నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను మీ సేవ చేసుకునే అవకాశం కల్పించండి. దయచేసి కాదనకండి. నాకు మీరు కూర్చునే పీఠం లాగా మరి నా జీవిత కాలమంతా మిమ్మల్ని మోసే అవకాశం కలిగించండి. కాదనకండి స్వామి కాదనకండి అంటూ ప్రాధేయ పడుతోంది. అందుకు గణపయ్య …..సరే నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు కోరుకుంది జరుగుతుంది అంటూ వరమిస్తాడు. వెంటనే ఆ దెయ్యం సింహాసనం గా మారిపోతుంది. దానిని చూసిన ఊరి ప్రజలంతా చాలా ఆనంద పడతారు. గణపయ్య ఊరి ప్రజలతో… చూడండి మీరు నన్ను పూజించాలి అనుకుంటే. ఈ సింహాసనంపై నన్ను ఉంచి పూజించండి అప్పుడే మీకు సుఖ శాంతులు ఆయురారోగ్యాలు సంభవిస్తాయి ఎందుకంటే ఆ దెయ్యం కోరిక తీరాలంటే మీరు తప్పక అలా చేయాల్సి ఉంటుంది. అందుకు ఊరిపెద్ద… స్వామి మీరు చెప్పినట్టే చేస్తాము.
ఈ సింహాసనం పైన మీ విగ్రహాన్ని ఉంచి మిమ్మల్ని కొలుస్తాము స్వామి. అని అంటాడు. అందుకు గణపయ్య…. మీ అందరికీ సుఖశాంతులు కలుగును గాక అంటూ వారిని దీవించి విగ్రహం గా మారిపోతాడు. గణపయ్య విగ్రహాన్ని మారడాన్ని చూసిన ప్రజలంతా జై గణపయ్యా జై జై గణపయ్య అంటూ అరుస్తూ జేజేలు కొడతారు ఊరి పెద్ద వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని ఆ సింహాసనం మీద ఉంచి అక్కడే పందిరి కూడా వేస్తారు. అలా 2 రోజులు గడిచాయి వినాయకచవితి రానే వచ్చింది. ఊరి ప్రజలందరూ గణేషుని పూజించడం కోసం ఆ పందిరి దగ్గరకు వచ్చి పూజలు చేస్తూ గణపయ్యకు ఇష్టమైన ఆహార పదార్థాలు తీసుకు వచ్చి ఆయన ముందు ఉంచుతారు.
ఆ రోజు గణపయ్య ఆ పిండివంటలు ని చూసి వాళ్ల ముందు ప్రత్యక్షమై వాటన్నిటినీ భుజించి అక్కడ ఉన్న వాళ్లందర్నీ దీవిస్తాడు. ఊరి ప్రజలంతా గణపయ్య మరోసారి రావడం చూసి చాలా సంతోష పడతారు. ప్రతి ఒక్కరూ వరుసగా గణపయ్య పూజిస్తూ వాళ్ళ కోరికలను అడిగి స్వామి వారి చేత వాటిని తీర్చుకుంటారు. అలా అందరు అడిగిన ప్రతి ఒక కోరికను గణపయ్య తీర్చి అక్కడి నుంచి మళ్లీ మాయమై పోతాడు. ఇక గణపయ్య నవరాత్రులు బాగా జరుపుకున్న ఊరి ప్రజలు అక్కడే గణపయ్యకు ఒక ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకుని ఆ పందిని కాస్త పెద్ద ఆలయంగా మార్చేసి నిత్యం పూజలు జరుపుకుంటూ ఉంటారు. ఆ విధంగా గణపయ్య ఆ దెయ్యానికి మోక్షం కలిగిస్తాడు అలాగే ఊరి ప్రజలందరికీ మేలు చేకూర్చి వెళ్తాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *