ఊరు పెద్ద కడుపు చేసిన దెయ్యం ఆరవ భాగం._ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఊరిపెద్ద కి కడుపు చేసిన దెయ్యం ఐదవ భాగం లో చింపు దయ్యం. ఊరి పెద్ద ఇంటి పై కప్పు ఎక్కి ఆ కప్పు ని పగలగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అది అలా చేస్తూ ఉండగా. పెద్దపెద్ద ఉరుములు మెరుపులు పెద్ద శబ్దాలతో…..హా…హా…హా… అని అని పెద్దగా నవ్వుకుంటూ చనిపోయింది అనుకున్నా ఆ మంత్రగత్తె మళ్ళీ వస్తుంది.

ఆ వింత అరుపులు వింత శబ్దాలు వింటున్న వాళ్ళు కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంటారు అప్పుడు ఆమె….. రాననుకున్నారా రాలేను అనుకున్నారా. కొన్నిసార్లు రావడం ఆలస్యం అవుతుందేమో. రావడం మాత్రం పక్కా.
అని సినిమా డైలాగులు చెబుతూ ఉంటుంది.
దాని అంతా చూస్తున్న వాళ్లు లక్ష్మి…. ఓయమ్మో దీని సంబరం బాగానే ఉంది సినిమా డైలాగులు చెప్పుకుంటా వచ్చిందే. పోయేది పోక పోతా పోతా ఇంత రాద్ధాంతం చేసి పోయింది మళ్లీ ఏం రాద్ధాంతం చేయడానికి వచ్చావు తల్లి.
ఊరి పెద్ద…. ఏంటి స్వామి ఒకదాని తర్వాత ఒక సమస్య వచ్చి పడుతున్నాయి అని అంటాడు ఇంటి పైనున్న నా చింపు దెయ్యం ఆ వైపు చూస్తూ….. ఎవరిది గ్రహాంతరవాసి కప్ప లాగా ఉంది. దాని మొహం చూస్తే నాకు డోకు వచ్చేలా ఉంది. చి చి గండ్ర కప్ప ముఖం అది ను.
అనుకుంటూ ఉంటాడు అప్పుడు ఆమె… ఒరేయ్ మనవడా నేను మీ నాయనమ్మ వచ్చాను రా రా …
చింపు దెయ్యం… ఏంది ఈ కప్ప నన్ను మానవుడు అంటుంది. దీని బాధ ఏంటో తెలుసుకుందాం ఆగ వే కప్ప మోహం దాన వస్తున్నాను వచ్చేదా కూడా ఆగే తట్టు కనపడడం లేదే.
అంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు ఆమె వాడిని కౌగిలించుకొని ముద్దులు పెడుతూ. ఉంటుంది అప్పుడు చింపు దెయ్యం…..ఒసేయ్ కప్ప ఆపవే పళ్ళు తోమిఎన్ని రోజులవుతుంది నోరు అంతా ఒకటే వాసన చి చి ఆపు నన్ను కిందకి దించు. అంటాడు.
ఆమె…. ఏంట్రా నాయనమా అని చూడకుండా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావ్.
చింపు దెయ్యం….. ఏంటి నువ్వు ఊరికే నాయనమ్మ నాయనమ్మ అంటున్నావు అసలు నీకు అది ఏందో చెప్పు. అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏంది. అంటుండగా ఆమె జరిగిన విషయమంతా చెబుతుంది.
దాని అంతా విని…. అమ్మో ఇ oత జరిగిందా కప్పా నాయనమ్మ. చి చి నాయనమ్మ అని అని అయితే ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను విను అంటూ అక్కడ జరిగిన విషయం అంతా చెప్తాడు. దాన్ని విన్న ఆమె… ఓహో ఆ స్వామీజీ ఇంత ఘనకార్యం చేశాడా.
అయినా ఏం పర్వాలేదు జరిగింది అంతా మన మంచి కోసమే. నేను అనుకున్నది సాధిస్తా ను ఈ ఊరి ప్రజలు అందర్నీ చంపేస్తాను. అది నీ ద్వారా మాత్రమే చేస్తాను. రా వెళ్దాం అంటూ వాడిని తీసుకెళ్తుండగా….. ఒసేయ్ కప్ప వదలవే నన్ను ఎక్కడికి వెళ్తున్నావ్. తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడు ఉన్నాడు ఒసేయ్ కప్ప వదలవే అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుండగా చింపు దెయ్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
దానంత చూసినవాళ్లు, స్వామీజీ…. మరో కొత్త ప్రమాదం మనకి రాబోతుంది. అసలు ఈ కథ ఏ మూల నుంచి ఏ మూల కి వెళ్తుందో అర్థం కావడం లేదు. చచ్చిపోయింది అనుకుంటే మళ్ళీ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆ దెయ్యం తో కలిసి ఎన్ని ఘోర ప్రమాదాలు తీసుకు వస్తుందో. అని కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో చెడ్డీ దయ్యం లేచి ….. పాలు కావాలి నాకు పాలు కావాలి. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. దాన్ని చూసిన స్వామీజీ మంత్రం వేసి దాన్ని మళ్ళీ నిద్రలోకి పంపిస్తాడు. ఆ తర్వాత స్వామీజీ ఊరి పెద్ద తో…..చూడండి మనం వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో గమనించాలి
జరగబోయే ప్రమాదాన్ని ఎలాగైనా ఆపాలి మన ఊరిని మనమే కాపాడుకోవాలి. అని చెప్పి ఆ మంత్రగత్తె వెనకాలే వీళ్ళు కూడా వెళ్తారు. ఆ మంత్రగత్తె ఆ దయ్యాన్ని గృహ లోకి తీసుకెళ్ళి. కట్టేసి ….. మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఆ దయ్యం పెద్ద పెద్దగా ఏడుస్తూ…. ఒసేయ్ కప్ప నన్ను ఏం చేస్తున్నావే. నన్ను వదిలి పెట్టు నేను నా తమ్ముడు దగ్గరికి వెళ్తాను. మంత్రగత్తె…. అరేయ్ మాట్లాడకుండా కొంచెం సేపు ఓపిక పట్టు నేను నా శక్తులతో నిన్ను ఒక గొప్ప అద్భుతమైన సృష్టిగా మార్చి ఊరి వాళ్ళ పై పగ తీర్చుకుంటానని.అని చెప్పి ఆ మంటల నుంచి ఒక వెలుగు నీ ప్రత్యక్షం చేస్తుంది .
దానిని అంతా చూస్తున్న వాళ్లు చాలా భయపడిపోతారు. అప్పుడు ఆ స్వామీజీ తన శక్తులతో దాన్ని అడ్డుకుంటాడు.
అప్పుడు ఆ మంత్రగత్తె దాన్ని చూసి….
ఎంత ధైర్యం ఉంటే నా పూజకే ఆటంకం కలిగిస్తావ. అంటూ కోపంగా మాట్లాడుతుంది.
అప్పుడు స్వామీజీ…… నువ్వు చేసేది పెద్ద తప్పు చేసింది కూడా పెద్ద తప్పు. అందుకు సిగ్గుపడకుండా ఇంక నాకు ఎదురు సమాధానం చెప్తున్నావ్ అసలు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్లావు. ఇప్పుడు మళ్లీ ఆ పిల్లవాణ్ణి ఏం చేయాలి అనుకుంటున్నావ్.
మంత్రగత్తె…హా హా..హా.. ఎందుకు నన్ను చూస్తే భయంగా ఉందా.నువ్వు భయపడుతున్నట్లు గాని మీ ఊరి ప్రజలు మొత్తం న్ని నేను నాశనం చేస్తాను. చూస్తూ చూస్తూ ఉండగానే ప్రజలందరూ రక్తం కక్కుకుని చస్తారు. అంటూ గాల్లోకి లేచి అటూ ఇటూ తిరుగుతూ…హా..హా..హా… ఇందాక ఏమి అడిగావు ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాను అనీ కదా నేను చేసిన చిన్న పొరపాటు నన్ను పాతాళంలోకి తొక్కేసి ఇన్ని సంవత్సరాలు నన్ను శపించింది ఇప్పుడు నాకు శాపవిముక్తి కలిగింది. ఇక నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇదంతా నువ్వు అడిగావని చెప్పలేదు నాకు ఇంక ఎవరూ అడ్డు రారు అని తెలుసుకుంటావు అని చెప్పాను. ఇక ముందు ముందు జరగబోయే ఘోర ప్రమాదాలు చూడండి .అంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ ఆ పిల్లవాణ్ణి తీసుకుని అక్కడి నుంచి మాయమైపోతుంది.
అప్పుడు సంతోష్… ఓరి భగవంతుడా నేను చేసిన ఒక్క తప్పు ఇంత మంది ప్రాణాలు బలి తీస్తుందని అనుకోలేదు.నేను చచ్చిపోతే బావుండు అని గోడ కి వెళ్లి తలను మోగించుకుంటూ ఉంటాడు. స్వామీజీ…. సంతోష్ పిచ్చివాడా ఏం చేస్తున్నావ్ నీకు అర్థం అవుతుందా. విధి ఆడే ఆట కి మనం బానిస కాకూడదు. విధిని ఎదిరించి నిలవాలి. అప్పుడే మనుషుల్లోనూ మన సత్తా ఏంటో తెలుస్తుంది. అని అతన్ని అడ్డుకుని ఆపి …. అసలు అది ఏం చేయాలి అనుకుంటుందో దాన్ని తెలుసుకోవాలి. పదండి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్దాం. ఇక మనకు మిగిలింది చివరిగా వాడు మాత్రమే. అంటూ ఆగ్రుహ నుంచి అందరూ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంటి దగ్గర పిల్లవాడు మంచి నిద్రలో ఉంటాడు. అప్పుడు స్వామీజీ అతని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తాడు. అప్పుడు అతని వీపు భాగంలో ఏదో రాసి ఉండటం గమనిస్తాడు.
అప్పుడు దాన్ని చదువుతాడు…. నిండు పౌర్ణమి రోజు ఈ రెండు దెయ్యాల్ని మనుషులుగా మార్చే అవకాశం ఉంటుంది. ఆ నిండు పౌర్ణమి రోజు కనుక ఆ ప్రయత్నం సఫలమైతే. ఎలాంటి బాధ ఉండదు ఒకవేళ విఫలం అయితే. పెద్ద ప్రమాదంలో పడిపోతారు. అని రాసి ఉండడం చదువుతాడు.
దాన్ని విన్న లక్ష్మి….. స్వామీజీ అది సరే కానీ ఇలా ఎందుకు రాయబడింది.
స్వామీజీ….. ఇది అంతా దేవుని లీల అనుకుంటా. ఒక దురాత్మవచ్చినప్పుడు దాన్ని అంతం చేసే మార్గం కూడా ఖచ్చితంగా ఉంటుంది అని ఈ విధంగా మనకి నిరూపించాడు. అయితే మనం పున్నమి రోజు రాత్రి కోసం ఏం చేయాలనేది ఎలా చేయాలి అనేది ఆలోచించి. ఇక ఈ కథకి ముగింపు ఇద్దాం అనుకుంటున్నాను.
ఇంతలో అక్కడికి ఆ మంత్రగత్తె గాల్లో ఎగురుకుంటూ వచ్చి…హా..హా…హా… అలా జరగని ఇస్తే నేను ఎందుకు. అలా జరగనివ్వను జరగనివ్వను హ హ హ అంటూ చెడ్డి దెయ్యాన్ని కూడా మాయం చేసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
అప్పుడు రమేష్…. ఓరి భగవంతుడా మళ్ళీ కథ మొదటికి వచ్చింది. చిక్కుముడులు విడిపోతున్నాయి అన్న సమయానికి మళ్ళీ చిక్కుముడులు వేస్తుంది ఈ పిశాచి
స్వామి ఇలా అయితే మన ఊరి ప్రజల్ని కాపాడుకోవడం ఎలా. ఇంకా ఆ పిశాచి చేతిలో మనందరం చావాల్సిందే నా.
లక్ష్మి…. చావాల్సిందే నా కాదు అందరం చచ్చిపోతాం. ఎన్నో కలలు కన్న నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఒడియాలు బిజినెస్ పెట్టుకొని డబ్బు సంపాదించడం అనుకున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు.
ఆ మాటలు విన్న అతని భర్త….. చి చి లక్ష్మి నువ్వు ఇంత మతి లేకుండా మాట్లాడుతున్నావ్ ఏంటి ఒకపక్క జరుగుతుంది ఏంటి నువ్వు మాట్లాడేదేంటి
అందుకే మీ ఆడవాళ్లు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పడం చాలా కష్టమని పెద్దలు ఊరికే చెప్పలేదు. చి చి అని ఆమెని కసురుకున్నాడు.
లక్ష్మి….. అయ్యో రామ నేను ఇప్పుడు ఏమన్నా నని నేను అనుకున్న మాటే మీకు చెప్పాను దానికే ఇంత కోపపడాలా అంటూ కోపంగా . వెనకటికి ఏదో సామెత చెప్పినట్టు గా ఉంది మీ యవ్వారం. అయినా నాకెందుకు లే నాలుగు రోజుల్లో పోయేదాన్ని అంటూ ఏడ్చుకుంటూ ఇంటిలోపలికి వెళ్ళిపోతుంది.
స్వామీజీ….. అబ్బా సంతోష్ ఒక్క నిమిషం ఆగవయ్యా. అసలు ఏం జరుగుతుందో ఏమో అని ఆందోళనగా ఉంది. నేను చదివిన ఉపనిషత్తులు గ్రంథాలు ఏవి పనిచేయటం లేదు నా మంత్రాలు కూడా ఈ పిల్ల దెయ్యాల ముందు. విఫలమయ్యాయి.
అని మాట్లాడుకుంటూ ఉండగా ఉండగా పిల్లలు ఏడుస్తున్న శబ్దాలు భయంకరంగా వినబడుతూ ఉంటాయి.
దానిని విన్నవాళ్ళు….స్వామి గమనించారా పిల్లల ఏడుపు శబ్దాలు వినపడుతున్నాయి మంత్రగత్తె ఆ పిల్లలను ఏదో చేస్తుంది. అవి ఎక్కడినుంచి వినపడుతున్నా యో. వెంటనే దాన్ని తెలుసుకుందాం. పదండి స్వామి.
స్వామి… వద్దు సంతోష్ నా మంత్రగత్తె చాలా తెలివిగా ఆలోచిస్తుంది.పిల్లలు ఏడుపు ని సృష్టించి మనని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో నా దివ్యదృష్టితో తెలుసుకుంటాను. అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. అతను అలా కళ్ళు మూసుకో గానే స్వామి కూడా అక్కడి నుంచి మాయమై పోతాడు. అలా మాయమైపోయిన స్వామిని చూసి…. అయ్యో స్వామి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు. అంటూ పెద్ద పెద్ద వాళ్ళు కేకలు వేస్తుండగా లక్ష్మి ఇంటి నుంచి బయటకు వచ్చి….. అయిపోయింది అంతా అయిపోయింది. ఇంకా ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది స్వామీజీ ఆయన దారి ఆయన చూసుకొని వెళ్ళిపోయాడు. ఇంక మనము మన ఊరి ప్రజలంతా చావాల్సిందే అందరూ బోరున ఏడుస్తుంది. అసలు స్వామీజీ ఎక్కడికి వెళ్ళాడు. ఆ మంత్రి గతే పిల్లలు ఎక్కడికి తీసుకెళ్ళింది. అనేది తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *