ఊరు పెద్ద కడుపు చేసిన దెయ్యం ఐదవ భాగం._ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఊరిపెద్ద కి కడుపు చేసిన దెయ్యం నాలుగో భాగం లో చింపు దయ్యం. ఊరి పెద్ద ఇంటి పై కప్పు ఎక్కి ఆ కప్పు ని పగలగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అది అలా చేస్తూ ఉండగా. పెద్దపెద్ద ఉరుములు మెరుపులు పెద్ద శబ్దాలతో…..హా…హా…హా… అని అని పెద్దగా నవ్వుకుంటూ చనిపోయింది అనుకున్నా ఆ మంత్రగత్తె మళ్ళీ వస్తుంది.

ఆ వింత అరుపులు వింత శబ్దాలు వింటున్న వాళ్ళు కిటికీలోంచి బయటికి చూస్తూ….. రాననుకున్నారా రాలేను అనుకున్నారా. కొన్నిసార్లు రావడం ఆలస్యం అవుతుందేమో. రావడం మాత్రం పక్కా.
అని సినిమా డైలాగులు చెబుతూ ఉంటుంది.
దాని అంతా చూస్తున్న వాళ్లు లక్ష్మి…. ఓయమ్మో నేను సంబరం బాగానే ఉంది సినిమా డైలాగులు చెప్పుకుంటా వచ్చిందే. పోయేది పోతా పోతా ఇంత రాద్ధాంతం చేసి పోయింది మళ్లీ ఏం రాద్ధాంతం చేయడానికి వచ్చావు తల్లి.
ఊరి పెద్ద…. ఏంటి స్వామి ఒకదాని తర్వాత ఒక సమస్య వచ్చి పడుతున్నాయి అని అంటాడు ఇంటి పైనున్న నా చింపు దెయ్యం ఆ వైపు చూస్తూ….. ఎవరిది గ్రహాంతరవాసి కప్ప లాగా ఉంది. దాని మొహం చూస్తే నాకు డోకు వచ్చేలా ఉంది. చి చి గండ్ర కప్ప ముఖం అది ను.
అనుకుంటూ ఉంటాడు అప్పుడు ఆమె… ఒరేయ్ మనవడా నేను మీ నాయనమ్మ వచ్చాను రా రా …
చింపు దెయ్యం… ఏంది ఈ కప్ప నన్ను మానవుడు అంటుంది. దీని బాధ ఏంటో తెలుసుకుందాం ఆగ వే కప్ప మోహం దాన వస్తున్నాను వచ్చేదా కూడా ఆగే తట్టు కనపడడం లేదే.
అంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు ఆమె వాడిని కౌగిలించుకొని ముద్దులు పెడుతూ. ఉంటుంది అప్పుడు చింపు దెయ్యం…..ఒసేయ్ కప్ప ఆపవే పళ్ళు తోమిఎన్ని రోజులవుతుంది నోరు అంతా ఒకటే వాసన చి చి ఆపు నన్ను కిందకి దించు. అంటాడు.
ఆమె…. ఏంట్రా నాయనమా అని చూడకుండా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావ్.
చింపు దెయ్యం….. ఏంటి నువ్వు ఊరికే నాయనమ్మ నాయనమ్మ అంటున్నావు అసలు నీకు అది ఏందో చెప్పు. అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏంది. అంటుండగా ఆమె జరిగిన విషయమంతా చెబుతుంది.
దాని అంతా విని…. అమ్మో ఎంత జరిగిందా కప్పా నాయనమ్మ. చి చి నాయనమ్మ అని అని అయితే ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను విను అంటూ అక్కడ జరిగిన విషయం అంతా చెప్తాడు. దాన్ని విన్న ఆమె… ఓహో ఆ స్వామీజీ ఇంత ఘనకార్యం చేశాడా.
అయినా ఏం పర్వాలేదు జరిగింది అంతా మన మంచి కోసమే. నేను అనుకున్నది సాధిస్తా ను ఈ ఊరి ప్రజలు అందర్నీ చంపేస్తాను. అది నీ ద్వారా మాత్రమే చేస్తాను. రా వెళ్దాం అంటూ వాడిని తీసుకెళ్తుండగా….. ఒసేయ్ కప్ప వదలవే నన్ను ఎక్కడికి వెళ్తున్నావ్. తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడు ఉన్నాడు ఒసేయ్ కప్ప వదలవే అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుండగా చింపు దెయ్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
దానంత చూసినవాళ్లు, స్వామీజీ…. మరో కొత్త ప్రమాదం మనకి రాబోతుంది. అసలు ఈ కథ ఏ మూల నుంచి ఏ మూల కి వెళ్తుందో అర్థం కావడం లేదు. చచ్చిపోయింది అనుకుంటే మళ్ళీ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆ దెయ్యం తో కలిసి ఎన్ని ఘోర ప్రమాదాలు తీసుకు వస్తుందో. అని కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో చెడ్డీ దయ్యం లేచి ….. పాలు కావాలి నాకు పాలు కావాలి. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. దాన్ని చూసిన స్వామీజీ మంత్రం వేసి దాన్ని మళ్ళీ నిద్రలోకి పంపిస్తాడు. ఆ తర్వాత స్వామీజీ ఊరి పెద్ద తో…..చూడండి మనం వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో గమనించాలి
జరగబోయే ప్రమాదాన్ని ఎలాగైనా ఆపాలి మన ఊరిని మనమే కాపాడుకోవాలి. అని చెప్పి ఆ మంత్రగత్తె వెనకాలే వీళ్ళు కూడా వెళ్తారు. ఆ మంత్రగత్తె ఆ దయ్యాన్ని గృహ లోకి తీసుకెళ్ళి. కట్టేసి ….. మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఆ దయ్యం పెద్ద పెద్దగా ఏడుస్తూ…. ఒసేయ్ కప్ప నన్ను ఏం చేస్తున్నావే. నన్ను వదిలి పెట్టు నేను నా తమ్ముడు దగ్గరికి వెళ్తాను. మంత్రగత్తె…. అరేయ్ మాట్లాడకుండా కొంచెం సేపు ఓపిక పట్టు నేను నా శక్తులతో నిన్ను ఒక గొప్ప అద్భుతమైన సృష్టిగా మార్చి ఊరి వాళ్ళ పై పగ తీర్చుకుంటానని.అని చెప్పి ఆ మంటల నుంచి ఒక వెలుగు నీ ప్రత్యక్షం చేస్తుంది .
దానిని అంతా చూస్తున్న వాళ్లు చాలా భయపడిపోతారు. అప్పుడు ఆ స్వామీజీ తన శక్తులతో దాన్ని అడ్డుకుంటాడు.
అప్పుడు ఆ మంత్రగత్తె దాన్ని చూసి….
ఎంత ధైర్యం ఉంటే నా పూజకే ఆటంకం కలిగిస్తావ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *