ఎగిరే గర్భవతి కోతి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో సింహాద్రి అనే ఒక వ్యక్తి ఉండేవాడు . అతని వద్ద ఒక గర్భవతి అయిన కోతి ఉండేది. అది ఒక రోజు పెద్ద పెద్దగా ఏడుస్తూ సింహాద్రి తో….. నేను ఇక్కడనుంచి వెళ్ళిపోతాను నాకు నీ దగ్గర ఉండడం ఇష్టం లేదు. అంటూ సైగా చేస్తోంది

సింహాద్రి….. కానీ ఎందుకు అలా నేను నిన్ను బాగా జాగ్రత్తగా చూసుకుంటాను కదా. నీకు ఇక్కడ ఏమన్నా ఇబ్బందిగా ఉందా.
అందుకు కోతి ….. నాకు ఇక్కడ తిండి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అక్కడ ఆకాశంలో పక్షులు చూడు ఎంత బాగా ఎగురుతున్నా యో. వాటిని చూస్తుంటే నాకు కూడా అలాగే ఎగరాలని ఉంటుంది ఇక్కడే ఉంటే నేను నీకు సేవలు చేస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. అంటూ సైగ చేస్తుంది .
అందుకు అతను పెద్దగా నవ్వుతూ….హా
.హా..హా నీకు మతి ఉండే ఇలాగా అంటున్నావా. నువ్వు ఆకాశంలో ఎగరడానికి పక్షి వి కాదు . నువ్వు ఒక జంతువు వి.అది ఎలా సాధ్యం అవుతుంది.
కోతి…. అది నాకు సాధ్యం అవుతుంది. దయచేసి నా కట్లు విప్పి నేను వెళ్ళిపోతాను.
అందుకు అతను…. సరే నీ కట్లు విప్పి వేస్తాను. అంటూ దాని కట్లు విప్పేసాడు.
ఆ కోతి చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ కోతి ఆ చెట్టు ఈ చెట్టు మీద గెంతుతూ ….. ఆహా ఇన్నాళ్టికి నేను స్వేచ్ఛని పొందుతున్నాను. నా కడుపులో ఉన్న బంగారు తల్లి ఇప్పుడు నీకు ఆనందమే కదా. త్వరలోనే నేను ఆకాశంలో ఎగురుతా ను. చుక్కల సీమనీ చూసి వస్తాను. అంటూ తెగ ఆనంద పడిపోతూ ఉంటుంది. అది బాగా గెంతి అలసిపోయి ఒకచోట ఒక చెట్టు మీద కూర్చొని…. అబ్బా నాకు చాలా ఆకలిగా ఉంది ఇక్కడ తినడానికి ఏమీ లేవు అనుకుంటా. అని అటూ ఇటూ చూడగా దానికి ఒక పెద్ద పండు కనపడుతుంది ఆ కోతి ఆ పండు దగ్గరికి వెళ్లి…. అరే ఆశ్చర్యంగా ఉంది ఈ పండు ఇంత పెద్ద పండు ఎక్కడా చూడలేదు. చూస్తుంటే నాకు నోరూరిపోతుంది. అని అనుకొని ఆ పండుని తింటుంది. ఆ పండుని తిన్న వెంటనే ఆ కోతికి రెండు రెక్కలు వచ్చేస్తాయి. ఆ రెక్కలు చూసి కోతి చాలా సంతోష పడుతూ…. భగవంతుడా నాకు రెండు రెక్కలు ఇచ్చావా. అయితే ఇప్పుడు నా కోరిక తీరబోతుందన్నమాట. చాలా సంతోషం స్వామి అంటూ ఆకాశంలోకి ఎగురుతుంది. ఆ కోతి ఆకాశంలో ఎగురుతూ చాలా సంతోష పడుతూ….. నాకు ఈ జన్మకి ఇది చాలు నేను అనుకున్నట్టుగానే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగర గలుగుతున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి కావాలన్నా స్వేచ్ఛగా వెళ్లగలవు. అంటూ ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది అప్పుడు దానికి భూమిమీద ఆ వున్న వి అన్ని చిన్న చిన్న గా కనబడుతూ ఉంటాయి. వాటిని చూసి ఆ కోతి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ కోతికి ఒక పెద్ద అడవి కనబడుతుంది ఆ కోతి ఆ అడవిని చూసి…. అబ్బా ఎంత అందంగా ఉంది ఈ అడివి . ఒకసారి నేను ఆ అడవిలో కి వెళ్ళాలి. అంటూ అడవి లోకి వెళ్తుంది అక్కడ దానికి రకరకాల పండ్లు రుచికరమైన ఆహారం దొరుకుతుంది. ఆ కోతి ఆ రకరకాల పండ్లను తింటూ చాలా సంతోష పడుతూ…. జీవితం అంటే ఇలా ఉండాలి. నేను ఊహించని జీవితం నా సొంతం అవుతుంది.
లేదంటే ఎప్పుడూ ఆ వ్యక్తి దగ్గర పనులు చేస్తూ బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. స్వేచ్ఛ అంటే ఇదే అంటూ ఆనందపడుతుంది.
అలా ఆ తోట లోనే చాలా సంతోషంగా ఎగురుతూ ఉంటుంది రోజులు గడుస్తున్న వి.
ఆ కోతి చాలా సంతోషంగా ఆకాశంలో ఎగురుతూ ఉండగా కింద నుంచి ఒక వ్యక్తి దాన్ని చూస్తాడు. ఆ వ్యక్తి తన మనసులో…. అరే ఏంటి ఆశ్చర్యం ఏంటి ఆ జీవి. వింతగా ఉంది చూడ్డానికి కోతి ఆకారంలో ఉంది. దీన్ని గనక పట్టుకుంటే మనకి ఏదో ఒక లాభం వస్తుంది అనుకుంటా. అని అనుకొని తన చేతిలో ఉన్న బాణాన్ని ఆ కోతి మీద గురి చూసి విసురుతాడు. ఆ బాణం వెళ్లి సరాసరి ఆ కోతి రెక్క కి తగులుతుంది . ఆ కోతి….అమ్మ నాన్న రెక్కలు విరిగిపోయి నొప్పిగా ఉంది అంటూ పెద్దగా కేకలు వేస్తూ కిందపడి పడుతుంది. వెంటనే ఆ వేటగాడు ఆ కోతి వెంట పడతాడు. దానిని గమనించిన కోతి గెంతుకుంటూ…. ఓరి భగవంతుడా ఇదెక్కడి కర్మ రా బాబు. నేను స్వేచ్ఛగా తిరుగుతూ అనుకుంటే ఈ వేటగాడు నా వెంట పడ్డాడు ఏంటి.భగవంతుడా చచ్చాను నువ్వే నన్ను కాపాడాలి అంటూ పరుగెడుతూ ఉంటుంది అలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక చెట్టు చాటున ఉంటుంది. ఆ వేటగాడు…. ఏ వింత జీవి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా నుంచి తప్పించుకోలేవు. నేను ఈరోజు నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టను అంటూ మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఆ కోతి అతనికి కనబడుతుంది. వెంటనే దాన్ని పట్టుకొని…. నువ్వు బలే తింటా ఆకారంలో ఉన్నావు. నీకు మాయలు మంత్రాలు తెలుసు అనుకుంటా. నాకు సహాయం చెయ్యి నాకు డబ్బు కావాలి బంగారం కావాలి.
కోతి ఏడుస్తూ….. నేను మాయ జీవిని కాదు నాకు ఎలాంటి మంత్రాలు రావు దయచేసి నన్ను విడిచిపెట్టు అంటూ సైగ చేసి. చూపుతోంది.
ఆ వ్యక్తి….. నువ్వు మర్యాదగా అడిగితే మాట వినవా అనుకుంటా నువ్వు చెప్తావా లేకపోతే నా చేతిలో ఉన్న బాణాన్ని నీ గొంతులో గుచ్చ మంటావా.
కోతి…. నేను నిజంగా చెప్తున్నాను. నాకు ఎలాంటి మయశక్తులు లేవు దయచేసి నన్ను వదిలి పెట్టు. అని ఎంతగానో ప్రాధేయ పడుతుంది కానీ అతడు దాని మాట వినకుండా. ఒక కర్ర తీసుకొని ఆ కోతిని కొడుతూ ఉంటాడు. ఆ కోతి…. వద్దు నన్ను కొట్టొద్దు దయచేసి నన్ను కొట్టొద్దు. అబ్బా నొప్పి భగవంతుడా నొప్పి అంటూ పెద్దగా అరిచి ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్న ఉంది. అప్పుడు ఆ కోతి….నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడున్నాను అంటూ అటూ ఇటూ చూస్తూ. ఇప్పటిదాకా జరిగిందంతా ఓ పీడ కాలా . నిజం అనుకొని చచ్చాం రా దేవుడా. అమ్మో ఇలాంటి దుస్థితి కనుక నిజంగా నాకు వస్తే వాడి చేతిలో నేను చచ్చే దాన్ని. అందని దానికోసం ఆశపడితే ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. కోరి కోరి ప్రమాదాలు తెచ్చుకోవడం ఎందుకు రా భగవంతుడా. అది అనుకొని ఇంటికి తిరిగి వెళ్లాల నిర్ణయించుకుoటుంది. కానీ తన మనసులో…. అమ్మో ఇప్పుడు గనుక నేను ఇంటికి వెళ్తే సింహాద్రి ఏమనుకుంటాడో ఏమో. నేను చాలా బెట్టుగా బయటకు వచ్చాను కాబట్టి నేను ఇక్కడే ఉండి పోతాను అని అనుకుంటుంది అలా రోజులు గడిచాయి.
ఆ కోతికి తినడానికి ఎక్కడ ఆహారం సరిగ్గా దొరకదు అది ఆకలితో అల్లాడి పోతు… ఓరి భగవంతుడా నా పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది. ఇక్కడే ఉంటే ఆకలితో చచ్చేలా ఉన్నాను. ఇంటికి వెళితే నా మొఖం సింహాద్రి ఎలా చూపించాలో అని భయంతో చచ్చేలా ఉన్నాను. ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. అది చాలా సేపు ఆలోచించి…. ఇంక నేను ఏం చేయలేను ఏదైతే అదే అయింది ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకుంటుంది.
ఆ కోతి అనుకున్న విధంగానే తన ఇంటికి తిరిగి వెళుతుంది అక్కడ తన యజమాని ఆ కోతి వైపు అలా చూస్తూ ఉంటాడు.
ఆ కోతి మాత్రం ఏం సమాధానం చెప్పకుండా
ఇంట్లో లోపలికి వెళ్లి అక్కడ ఉన్న పాత్రలను శుభ్రం చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఇ దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ … ఏమైంది నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు తిరిగి వచ్చావు. ఆకాశంలో ఎగరడం అయిపోయిందా. నీ రెక్కలు ఎక్కడున్నాయి.
అప్పుడు ఆ కోతి…నన్ను క్షమించు సింహాద్రి నేను నీ మాట వినకుండా విను అందుకు నాకు తగిన శాస్తి జరిగింది. తిండి తిని రెండు రోజులు అవుతుంది. కడుపులో ఉన్న నా బిడ్డ తో సహా పస్తులు ఉండాల్సి వచ్చింది. కడుపులో పేగులు ఆవురావురుమంటూ అరుస్తున్నాయి. అంటూ ఏడుస్తూ సైగ చేసి చెప్తుంది. పాపం ఆ కోతి బాధను అర్థం చేసుకున్న సింహాద్రి…. సరే బాధ పడకు నేను ఉన్నాగా. ఇప్పుడే నీకు ఆహారం తీసుకొస్తాను అని చెప్పి దానికి ఆహారం తీసుకొస్తాడు. ఆ కోతి ఆహారాన్ని ఆవురావురుమంటూ ఒకేసారి తింటూ ఉంటుంది.
సింహాద్రి …. చిన్నగా తిను ఎందుకు అంత హడావిడిగా తింటున్నావు నీవు పదార్ధాలు ఎవరు లాక్కోరు ఇక్కడ చిన్నగానే తిను అని అంటాడు. అందుకా కోతి సరే అని చెప్పి చిన్నగా ఆ మొత్తం ఆహారాన్ని తినేస్తుంది.
సింహాద్రి… అయిపోయింది గా ఇంకా ఏంటి పని ఏమన్నా ఉంటే చేసుకో మీ అమ్మగారు వచ్చే సమయం అయ్యింది. ఇంటి పని చేయకపోతే నిన్నే అనవసరంగా తిడుతుంది.
కోతి …. అలాంటి పప్పులు నా దగ్గర పడుకో నేను చకచకా పని చేస్తాను.అంటూ ఇంట్లో ఉన్న పాత్రలు కడిగేస్తుంది బట్టలు ఉతికే స్తుంది. నీళ్లు తోడి మొక్కలకి పోస్తుంది. అలా ఆ కోతి ఇంటి పనులన్నింటినీ ముగి చేస్తుంది అప్పుడు అతని భార్య అక్కడికి వచ్చి .. అబ్బో ఈరోజు మన కోతి చాలా హుషారుగా ఉంది. ఇంటి పనులన్నీ చక్కగా చేసేసింది. ఏం జరిగింది ఏంటి. అని ఆశ్చర్యంగా అడుగుతుంది అందుకు సింహాద్రి… ఏం జరగలేదు ఈ రోజు తనకి పనులన్నీ చేయాలనిపించింది అందుకే అలా చేసింది.
అప్పుడు భార్య చాల సంతోషపడుతూ…. నా బంగారు తల్లి కి నేను అంటే చాలా ఇష్టం. అందుకే చెప్పకుండానే ఈ పనులన్నీ చేస్తుంది. అంటూ ఆ కోతిని మెచ్చుకుంటూ ఉంటుంది ఆ కోతి ఆమె మాటలకి చాలా సంతోష పడుతూ తన మనసులో….. వీళ్లు చూపించే ప్రేమ ముందు అయినా తక్కువే నేను ఎంత తప్పుగా ఆలోచించి ఈ ఇంట్లో నుంచి వెళ్లాను.
వెళ్లిన తర్వాత నాకు తెలిసింది ఎంత ఇబ్బంది పడ్డానో అని. ఎవరికైనా నా అందరూ ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు వాళ్ళు దూరమైతే ఆ విలువ తెలుస్తుంది. నాక్కూడా వీళ్ళ నుంచి వెళ్లిన తర్వాతే వీళ్ళ విలువ తెలిసింది. ఇంకెప్పుడూ నేను వీళ్ళని మొదలుపెట్టి వెళ్ళనే వెళ్ళను. అని అనుకుంటుంది. సరే అని చెప్పి ఆ కోతి అక్కడి నుంచి వెళ్లి పని చేస్తూ ఉండగా తన చేతికి గాయం అవుతుంది అప్పుడు ఆ కోతి… అమ్మ అబ్బా నా చేతికి గాయం అయింది. అమ్మ అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది.
ఆ కేకలు విన్న భార్యాభర్తలిద్దరూ ఆ కోతి దగ్గరకు వచ్చి… అయ్యో ఏమైంది అమ్మా అలా ఏడుస్తున్నావు.అంటూ చేతి వైపు చూస్తుంది దాని చేతికి గాయమవడంతో ఇద్దరు చాలా కంగారు పడుతూ ఉంటారు భార్య.. ఏవండీ త్వరగా వెళ్లి ఇంట్లో ఉన్న పసుపు డబ్బా ను ఏదైనా గుడ్డు ని తీసుకుని రండి. ఇంత పెద్దగా ఏమైందో చూడండి అంటూ ఏడుస్తూ ఉంటుంది అతను లోపలికి వెళ్ళి వాటిని తీసుకొని వస్తాడు. వెంటనే ఆమె కోతికి పసుపు వేసి కట్టు కట్టి.. చూసుకునే పని లేదా అమ్మ. నీకు ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి. నొప్పిగా ఉందా అమ్మ తగ్గిపోతుందిలే అంటూ ఏడుస్తూ ఆ కోతిని హత్తుకుంటుంది. ఆమె యొక్క అమ్మ ప్రేమ ను చూసిన కోతి కంటతడి పెట్టుకుంటూ… నేను ఒక మూర్ఖురాలు ని. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఎవరు వెళ్ళాలి అని అనుకోరు నేను అలాంటి పని చేశాను చాలా పెద్ద పొరపాటు చేశాను నేను ఎన్నిసార్లు దీని గురించి ఆలోచించి నా తప్పే లేదు. ఇలాంటి మంచి మనసు నుంచి దూరం అయితే అది నాకు పాపం శాపం అని ఏడుస్తుంది.
ఆ భార్యాభర్తలు ఇద్దరూ చాలా బాధ పడుతూ కోతితో…..ఏం కాదు తల్లి తగ్గిపోతుంది నువ్వు అసలు ఎలాంటి పని చేయకుండా హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకొ అని చెప్పి లోపలికి తీసుకెళ్లి పోతారు.
ఈ కథలోని నీతి ఏంటంటే అందని వాటి కోసం ఆశపడి వెళ్ళిన కోతికి ఎలాంటి చేదు అనుభవం ఎదురైన ఎన్నో చూసాము కదా అందుకే అందని ఆకాశం కోసం నిచ్చెనలు వేయడం మూర్ఖత్వం. అందని వాటికోసం జరగని వాటి కోసం ఆలోచించి కాలాన్ని వృధా చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
ఉన్న దానిలోనే ఆనందపడుతూ సంతోషంగా జీవిద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *