ఏనుగు సహాయం | Telugu Stories | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu

అనకాపల్లి అనే ఒక గ్రామం ఉండేది అక్కడ గజేంద్ర అనే ఒక ఏనుగు ఉండేది. అది అందరికీ మిత్రుడు లాంటిది. అందరూ పిల్లలు పెద్దలు దానికి తినడానికి ఏదో ఒకటి అందిస్తూ ఉంటారు. అదే ఊర్లో శైలజ అనే ఒక పాప ఉండేది ఆ పాపకి గజేంద్ర అంటే చాలా చాలా ఇష్టం గజేంద్ర తో కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు శైలజా తన తల్లితో కలిసి బట్టలు ఉతకడానికి నది కి వెళ్తుంది. శైలజ కూడా ఆమెతో పాటుగా నది కి వెళ్తుంది. అక్కడ ఆమె బట్టలు వెతుకుతుండగా . ఇద్దరు వ్యక్తులు ఆమె ముందుకు వచ్చి…. మర్యాదగా నీ మెడలో ఉన్న గొలుసు చెవి కమ్మలు ఇవ్వు. లేదంటే నిన్ను ఒక్క దెబ్బకి దేవుడి దగ్గరికి పంపిస్తాము.
ఆమె చాలా భయపడుతూ …. వద్దు దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోండి ఇవి నా కూతురికి ఇవ్వాల్సినవి . నా కూతురు పెద్ద అయితే వీటిని వేసుకోవాలి . నేను సొమ్ములు కొనే అంత స్థోమత లేని దాన్ని . దయచేసి
నన్ను వదిలి పెట్టండి అని బ్రతిమిలాడి తో ఉంటుంది. వాళ్లకి కోపం వచ్చి పాపను తీసుకుని…. పాప కోసమేనా నువ్వు ఇదంతా చేస్తోంది. అసలీ పాప లేకపోతే అంటూ ఆమెను పట్టుకొని …. మర్యాదగా నగలన్నీ నాకు ఇవ్వు లేదంటే పాపానీ
నదిలోకి విసిరి కొడతాను. అంటూ ఆమెను బెదిరిస్తూ ఉంటాడు ఇంతలో ఆ పాప….. గజేంద్ర కాపాడు గజేంద్ర. గజేంద్ర కాపాడు అంటూ కేకలు వేస్తోంది. ఆ చిన్నపిల్ల కేకలు ఆ ఏనుగుకి . వినపడక పడకపోవడంతో.
ఆమె తల్లి …. గజేంద్ర మమ్మల్ని కాపాడు గజేంద్ర మమ్మల్ని కాపాడు అంటూ కేకలు పెడుతుంది. ఆ పెద్ద పెద్ద కేకలు దూరంగా వెనుక ఉన్న ఏనుగు కు వినపడతాయి వెంటనే ఏనుగు రంకె వేస్తూ అక్కడికి పరుగులు తీస్తుంది . ఏనుగు తన తొండంతో వాడిని తరిమి కొడుతుంది. వాళ్ల అక్కడినుంచి భయంతో పరుగులు తీస్తారు.
తల్లి ఏనుగుతో…. చాలా చాలా కృతజ్ఞతలు గజేంద్ర సమయానికి వచ్చి నన్ను నా కూతుర్ని కాపాడావు అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
పాప…. చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అని దానికి ఆమెకూడా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఆ తర్వాత ఆ ఏడుగుతో కలిసి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం యేనుగు వాళ్ళ ఇంటి దగ్గరే పడుకొని ఉంటుంది.
రాత్రి సమయం అవుతుంది ఆ ఇద్దరు వ్యక్తులు … ఆ ఏనుగు ఎంత పని చేసింది రా . ఈరోజు దాని పని చెప్పాలి వెళ్దాం పద. అని అనుకొనేదాన్ని వెతుక్కుంటూ ఇంటి దగ్గరికి వస్తారు . ఏనుగు మంచి నిద్రలో ఉంటుంది.
వాళ్ళలో ఒకడు కర్ర తీసుకొని దాన్ని కొట్టడానికి వస్తూ ఉండగా . అప్పుడే ఇంట్లో నుంచి పాప తలుపు తీసుకుని బయటకు వస్తుంది. దాన్ని చూసిన వాళ్లు దూరంగా పక్కన దాక్కుంటారు.
పాప ఎనుగు దగ్గరకు వెళ్లి…. గజేంద్ర గజేంద్ర ఇదిగో ఈ అరటి పండ్లు తిను. ఈరోజు పొద్దున్నుంచి నీకు నేను ఏమి ఇవ్వలేదు కదా. ఆకలేస్తుంది కదా నీకు అని వాటిని అందిస్తూ ఉంటుంది ఏనుగు వాటిని తింటూ. ఉండగా ఆ ఇద్దరు దొంగలు లో ఉన్న చోట ఏదో శబ్దం వినబడుతుంది పాపా… ఏంటి ఆ శబ్దం అని అటు ఇటు చూసి నప్పుడు. పాపకి ఆ దొంగలు కనబడతారు.
పాప వెంటనే… గజేంద్ర దొంగలు పొద్దున అమ్మను ఏడిపించారు కదా . అదుగో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి కర్రలు తీసుకొని నిన్ను కొట్టడానికి వచ్చారు అంటూ వాళ్లని చూపిస్తుంది .. ఏనుగు రంకెలు వేస్తూ దగ్గరికి పరిగెడుతుంది . ఆ ఏనుగు చూసిన వాళ్ళిద్దరూ చాలా భయంతో అక్కడినుంచి పరిగెడతారు…. అమ్మో నా వల్ల కాదు. ఈ ఏనుగు ఎక్కడ దొరికింది రా బాబు నా ప్రాణాలు పోతున్నాయి అంటూ పరిగెడుతూ ఉంటారు ఆ ఏనుగు వాళ్ళని పట్టుకుని దూరంగా విసిరేస్తూ వాళ్లను కొట్టడం మొదలుపెడుతుంది .
వాళ్ళు భయంతో వెనక్కి తగ్గకుండా అక్కడ నుంచి పరుగులు తీస్తారు. పాప ఏనుగు దగ్గరకు వచ్చి….. మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు. నా ప్రాణాలు కాపాడబ్వు. మా అమ్మని కూడా కాపాడావు. మీకు చాలా కృతజ్ఞతలు అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
ఆ మాటలు విన్న ఏనుగు తన మనసులో…. ఇక్కడ ప్రతి కుటుంబం నాకు సహాయం చేస్తుంది. అలాగే తిండి పెడతారు కానీ ప్రేమగా మాత్రం చూసుకోవడం లేదు . అలాంటి బంగారు లాంటి ప్రేమ నీదమ్మా నేను నేను ఎలా వదులుకుంటాను . అని అనుకుంటూ… పాపను తీసుకుని అక్కడ నుంచి వెళ్లి పోతుంది.
కొన్ని రోజులు గడచాయి ఏనుగు ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ వాళ్ళకి పనులు చేసి పెడుతూ ఉంటుంది. అది ఏనుగు పనులు చేయడం చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఆమె తల్లి ….. నిజంగా ఏనుగు పని చేస్తుంటే బలే చూడముచ్చటగా ఉంది. బట్టలు ఆరా వేయడం నీళ్ళు తీసుకురావడం. నేల్లనీ మొక్కలకి పోయడం చాలా బాగుంది. అంటూ ఏనుగుని చాలా పొగుడుతూ ఉంటుంది. ఏనుగు చాలా సంతోష పడుతూ ఉంటుంది. కూతురు…. నిజంగా గజేంద్ర చాలా తెలివైనవాడు అమ్మ ఇకనుంచి గజేంద్ర మనతోపాటే ఉంటాడు ఊరు మొత్తం తిరగడం అలాంటివి చేయడం మనం పెంచుకుందాం అని అంటుంది.
ఆమె… దొంగల బారి నుంచి మనల్ని కాపాడే అప్పుడే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందో అర్థమైంది . కాబట్టి మనం గజేంద్రనీ ఇక్కడే
ఉంచుకుందాం అని అంటుంది గజేంద్ర మాటలకి చాలా సంతోష పడుతూ …. ఇంక నేను ఎంచక్కా పాప తో ఆడుకుంటాను. అని సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి ఆ ఏనుగు కూడా వాళ్ళతో పాటే ఉంటూ హాయిగా వాళ్లు పెట్టింది తింటూ సంతోషంగా వారితో పాటే ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *