ఏనుగు సాహసం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక కొండ ప్రాంతం ఆ కొండ మీదకి ఒకే ఒక్క దారి ఉండేది ఆ దారిలో వాహనాలన్నీ వెళ్తూ ఉంటాయి. అలా ఉండగా ప్రతి రోజు ఒక బస్సు తీసుకొని ఆ కొండ ప్రాంతం నుంచి మనోజ్ అనే ఒక వ్యక్తి వెళుతూ ఉంటాడు. అతను అలా వెళ్తూ ఉండగా ఆ పరిస్థితి ఒక ఏనుగు అడ్డం వస్తూ ఉండేది. మొదట్లో అతను ఆ ఏనుగును చూసి చాలా భయపడుతూ ఉండేవాడు. పోను పోను అతనికి అలవాటు అయిపోతుంది ఒక రోజు ఖాళీ బస్సు తో అతని వెళుతూ ఉండగా ఆ ఏనుగు ఆ బస్సుకు అడ్డంగా వస్తుంది వెంటనే అతను బస్సును ఆపి ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళు ….. ఏంటి నువ్వు ప్రతిరోజు ఈ బస్సు కి అడ్డం వస్తావు నీకేం కావాలి. అని అడుగుతాడు. అయితే నువ్వు చాలా అమాయకంగా…. నాకు ఈ బస్సు చూడడం అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను నా ఆకలి బాధను మర్చిపోవాలంటే దాన్ని చూస్తే ఆనందంతో ఆకలి మర్చిపోతాను అందుకే వచ్చేపోయే వాహనాలు చూస్తూ ఉంటాను.

అతను ఆ ఏనుగుతో…. అయ్యో పాపం నీకు ఆహారం దొరకడం లేదా.
ఏనుగు….లేదు ఇక్కడ ఉన్న చెట్లని కొట్టి వేస్తే మాకు ఆహారం ఏమి దొరుకుతుంది ఒక్కపూట దొరకడమే గగనంగా ఉంది.
అందుకు అతను ఆ ఏనుగు పై జాలి పడి… అయ్యో అయితే నువ్వే బాధపడక నేను నీకు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాను. కానీ నువ్వు ఏ వాహనం కి పడితే ఆ వాహనానికి అడ్డం వెళ్ళకు. పొరపాటున వాళ్ళు వేగంగా వస్తే వాళ్ళకి ప్రమాదం నీకు ప్రమాదం. జాగ్రత్తగా ఉండు. అని అంటాడు
అందుకు ఏనుగును…. సరే ఇక నుంచి నేను ఎవ్వరి వాహనానికి అడ్డు వెళ్ళను. అని అంటుంది అందుకు అతను …సరే రేపటి నుంచి నీకు ఆహారం నేనే అందిస్తాను.అని చెప్పి అక్కడ నుంచి తన బస్సు ని తీసుకొని వెళ్ళి పోతాడు.ఆ మరుసటి రోజు అతను బస్ తీసుకొని ఆ మార్గంలో వెళుతూ ఉండగా ఆ ఏనుగు బస్సు కి అడ్డంగా వస్తుంది. అతను బస్సు ని ఆపి… దిగి వచ్చి దానికి అరటిపళ్లను ఇచ్చి. తిను తిను బాగా తిను. అని చెప్పి అరటి పండ్లను తినిపించి వెళ్తాడు.
అతను వెళ్ళిన తర్వాత ఆ ఏనుగు చాలా సంతోష పడుతూ…. ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం మాలాంటి జీవులు సంతోషంగా జీవిస్తాయి ఇతని ఇతని కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు కాపాడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది అలా రోజులు గడిచాయి ప్రతిరోజు అతను అరటిపండ్లను తీసుకు వెళుతూ ఆ ఏనుగుకి అందిస్తూ ఉంటాడో అలా ఒక రోజు అతని భార్య అతనితో…. ఏమండీ ఏంటి మీరు రోజు అరటిపండు గలను కొనుక్కొని తీసుకెళ్తున్నారు అంట ఆ సుబ్బయ్య చెప్పాడు. ఏం చేస్తున్నారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు.
అప్పుడు అతను ఆ ఏనుగు గురించి చెప్తాడు.
దాన్ని విన్న భార్య…. అయ్యో పాపం పోనీలెండి ఏదో ఒక రకంగా మనం ఆ ఏనుగుకి సహాయం చేస్తున్నాo. అది చాలు
అయి ఉంటుంది ఆ రోజు కూడా అతను అరటి పళ్ళ వ్యాపారి సుబ్బయ్య దగ్గరికి వెళ్లి. అరటి పండ్లను కనుక్కుంటాడు అప్పుడు సుబ్బయ్య…. బాబు నువ్వు ఎందుకు అరటి పళ్లను రోజు తీసుకెళ్తున్నావ్వు. మీ భార్యకు చెబితే ఆమెకు తెలీదు అంటుంది వాటిని ఏం చేస్తున్నావు.అది నాకు అనవసరం కానీ ఏదైనా మంచి పని కోసం అయితే నేను కూడా సహాయం చేద్దామని తప్పుగా అనుకోవద్దు.
అందుకు అతను…. మీరు అనుకున్నది నిజమే నేను సహాయం చేయడం కోసమే తీసుకు వెళ్తున్నాను. అంటూ ఆ ఏనుగు గురించి చెప్తాడు. దానిపైన సుబ్బయ్య ఆశ్చర్యంతో…. నీ మనసు చాలా గొప్పది బాబు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా దీవిస్తాడు. ఇదిగో ఆ ఏనుగుకి నా వంతుగా ఈ అరటిపళ్లను తీసుకువెళ్ళు. ఇక్కడి నుంచి నేను కూడా అరటిపండ్లు ఉచితంగా ఇస్తాను
అందుకు అతను…. చాలా కృతజ్ఞతలు కానీ మీ కుటుంబ అంతంతమాత్రంగా ఉంటుంది. మీరు సహాయం చేయాలనుకుంటే అందుకు చాలా కృతజ్ఞతలు. మీకు వీలైనప్పుడు మాత్రమే చేయండి దీంతో ఇబ్బంది ఏమీ లేదు.
అందుకు అతను…… మరి ఏం పర్వాలేదు బాబు నాకు ఉన్నంతలో నేను సహాయం చేస్తున్నాను. అని అరటిపళ్లను ఇస్తాడు వాటిని తీసుకొని ఆ వ్యక్తి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అలా బస్సులో వెళ్తుండగా ఆ ఏనుగు అడ్డం వస్తుంది . వెంటనే అతను బస్సుని ఆపి ఆ ఏనుగుకి ఆహారం తినిపిస్తాడు. అప్పుడే బస్సు లోపల ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి అతనితో…. ఏమయ్యా నీకు కొంచెం కూడా బుద్ధి ఉందా. మాకు ఊరికి వెళ్లడానికి ఎన్నో పనులు ఉంటాయి. నువ్విలా బస్సుని గంటలు గంటలు ఆపితే ఎలా.
మాకు అవతల బోలెడన్ని పనులు ఉన్నాయి తితి బండి త్వరగా ఇయ్యవయ్యా నీకు ఏం పని పాట లేనట్టుంది. దారిన పోయే వాటికి మరి ఆహారాన్ని అందిస్తున్నావ్వు.
అందుకు డ్రైవర్…. ఎందుకలా మాట్లాడుతున్నారు ఎవరిదైనా కడుపే కదా ఎవరైనా ఆకలి. ఆకలి విలువ ఆకలి బాగా తెలుసు కాబట్టి దీనికి సహాయం చేస్తున్నాను మీకు అంత ముఖ్యమైన పనులు ఉంటే మీరు వేరే బస్సు ఎక్కి వెళ్లొచ్చు. ఇది నా సొంత బస్సు గవర్నమెంట్ బస్సు కాదు. నా ఇష్టం వచ్చిన చోట ఆపుతాను. ఇష్టం ఉంటే ఎక్కడండి లేదంటే లేదు బలవంతం ఏమీ లేదు.
ఆ వ్యక్తి…. భలే పొగరుగా మాట్లాడుతున్నావే.దీనికి ఆహారం తినిపించడం వల్ల నీకు ఏం లాభం వస్తుంది నష్టమే కానీ. దానికి తోడు వచ్చిన ప్యాసింజరల ని తిట్టి తున్నావు.
డ్రైవర్…. నాకు ఏదో వస్తుందని నేను ఈ పని చేయటం లేదు ఇందాక చెప్పాను ఆకలి విలువ నాకు తెలుసు అందుకే ఆకలి తీరుస్తూ ఉన్నాను అని అంటాడు ఆ వ్యక్తి…. సరే నీతో నాకు మాటలు ఎందుకులే. అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ ఏనుగు అతనితో…. నా వల్ల చాలా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. నావల్ల ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించు.
అందుకు డ్రైవర్…. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకు. మంచి మనసు ఉన్న వాళ్ళు ఎవరూ అలా మాట్లాడరు. మంచి మనసున్న ఆ సుబ్బయ్య నీకు ఇవ్వమని ఈ రోజు పండ్లు ఎక్కువ ఇచ్చాడు అంటూ సుబ్బయ్య గురించి కూడా చెప్తాడు.
అందుకు ఆ ఏనుగు…. అవునా సుబ్బయ్య ఎవరో నాకు తెలీదు కానీ నా మంచి కోరుకున్నాడు కాబట్టి అతనికి నేను కృతజ్ఞతలు చెప్పాను అని చెప్పు. అని అంటుంది అతను సరే తప్పకుండా చెప్తాను అని అంటాడు. ఆ ఏనుగుకి ఆహారం తిన్న పించిన తర్వాత తన బస్సు తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అలా రోజులు గడిచాయి మనోజ్ కి ఆరోగ్యం సరిగా లేక
ఆరోజు బస్సు ని తీయడు. పాపం అతను తన మనసులో…. పాపం ఆ ఏనుగు నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ నా ఆరోగ్యం పరిస్థితి ఏం బాలేదు. భగవంతుడా నేను త్వరగా కోలుకునేలా చూడు లేదంటే ఆ ఏనుగు పస్తులతో ఉండాల్సి వస్తుంది.
కానీ బాధపడతాడు అక్కడ ఏనుగు కూడా అతని కోసం ఎదురు చూస్తూ….. ఏమైంది ఈరోజు నా మిత్రుడు రాలేదు నాకు చాలా ఆకలిగా ఉంది అసలు అతను ఎందుకు రాలేదు. అతనికి అంతా బాగానే ఉంది కదా భగవంతుడా నా మిత్రుడికి ఏం కాకుండా చూసుకో. అంటూ దేవున్ని ప్రార్థిస్తుంది అలా ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు కూడా అతని ఆరోగ్య పరిస్థితి ఏం బాగోదు అలా అతను వైద్యం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు.
అప్పుడు అతను తన భార్యతో….. శారద నా తమ్ముడిని బస్సు కి వెళ్ళమని చెప్పు.
ఇప్పటికే నేను చాలా పొరపాటు చేశాను. ఈ జ్వరం మామూలు జ్వరం అనుకున్నా కానీ ఇంత తీవ్రంగా ఉంటుంది అని అనుకోలేదు.
ఇప్పటికే బస్సు నడపక పోవడం వల్ల ఎంతో నష్టం పోయాను. ఈ జ్వరం ఇప్పుడల్ల తగ్గేలా లేదు . ముందు బస్సు తాళం వాడికి ఇచ్చి బస్సు కి వెళ్ళమని చెప్పు. అందుకు భార్య తాళం తీసుకుని. తన భర్త తమ్ముడు దగ్గరికి వెళుతుంది. అక్కడ అతనితో….. చూడు శంకర్ మీ అన్నయ్య ఆరోగ్య పరిస్థితి బాలేదు.
బస్సు ని ఖాళీగా ఉంచడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని వరకు బస్సు ని నువ్వు నడుపుకొని వచ్చిన డబ్బు నువ్వే తీసుకో .
శంకర్…. సరే వదిన నేను కూడా పొలం పనికి పొద్దునే వెళ్లి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ నాలుగు రోజులు బస్సు నడిస్తే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా. నేను బస్సులో జాగ్రత్తగా నడుపుతాను అన్నయ్య ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి మీ అక్క నుంచి బస్సు తీసుకొని వెళ్తాడు. ఇంటిదగ్గర మనోజ్ భార్య తో…. అయ్యో వాడికి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను.
భార్య… ఏంటండి అది.
అతను…ఏం లేదు పాపం ఆ ఏనుగు ఎన్నో రోజుల్లోగా నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది పాపం దానికి ఏమన్నా తీసుకెళ్ళమని చెప్పాల్సింది. ఆ విషయం గురించి మర్చిపోయాను.
ఆమె…. అవునండి నాకు కూడా గుర్తు లేదు.
సాయంత్రం వస్తాడుగా అప్పుడు చెప్తాను.
అందుకు అతను….. వాడు సాయంత్రం కాదు రాత్రి వస్తాడు. అప్పటికి మనం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. ఉదయాన్నే వాడి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇచ్చి ఆ ఏనుగుకి ఏదో ఒకటి తీసుకు వెళ్ళమని చెప్పు.
అందుకు ఆమె సరే అంటుంది.
అక్కడ అ శంకర్ బస్సు నడుపుతూ కొండపైకి వెళ్తాడు ఆ ఏనుగు దూరం నుంచి బస్సు చూసి ఎంతో ఆనందంతో తనలో …….ఇన్ని రోజులకి నా మిత్రుడు మళ్లీ వస్తున్నాడు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్లి పోయాడు ఏమో అని కంగారు పడిపోయాను అనుకుంటూ ఆ బస్సు కి అడ్డం వెళ్తుంది ఆ ఏనుగు గురించి తెలియని శంకర్ బస్సును ఆపి హారన్ కొడుతూ ఉంటాడు.
ఎంతసేపు హారం కొట్టినా ఏనుగు పక్కకి తప్పుకోవటంతో అతనికి కోపం వచ్చి ఒక కర్రతో… ఏయ్ పక్కకు తప్పుకో పక్కకు తప్పుకో అంటూ దాన్ని కొట్టి పక్కకి పంపిస్తాడు. పాపం ఆ ఏనుగు చాలా బాధ పడుతూ…..అయ్యో ఇతడు నా మిత్రుడు కాదు కానీ బస్సు మాత్రం నా మిత్రుడు నా మిత్రుడు కి ఏమైంది ఎందుకు అతను రావడం లేదు అని అతని తలుచుకుంటూ బాధపడుతుంది.
అలా ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయం మనోజ్ భార్య శంకర్ కి ఆ ఏనుగు గురించి చెప్పాలని తన దగ్గరికి వెళుతుంది. కానీ అప్పటికే శంకర్ బస్సు ని తీసుకొని వెళ్ళి పోతాడు. ఆ రోజు కూడా ఆ ఏనుగు అతని బస్సు కి అడ్డం వస్తుంది.
అతను బస్సును ఆపి చాలా కోపంగా ఒక కర్ర తీసుకొని… ఏంటే ప్రతిరోజు నా బస్సు కి అడ్డం పడుతున్నావ్ చావాలని ఉందా . అంటూ దాన్ని చితకబాదాడు.
ఏనుగు పాపం…. అయ్యో నన్ను క్షమించండి నన్ను క్షమించండి అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. శంకర్ తన బస్సు ని తీసుకొని ముందుకు వెళతాడు ఆ ఏనుగు చాలా బాధపడుతూ…. నా మిత్రుడు ఏమైపోయారు ఇతను ఎవరు నన్ను నిన్న కొట్టాడు ఇవాళ ఇంకా ఎక్కువగా కొట్టాడు రేపటి నుంచి ఈ బస్సు కి అడ్డం అస్సలు రాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పెద్ద పెద్దగా అరుపులు వినబడతాయి…. కాపాడండి ఎవరైనా కాపాడండి బస్సు లోయలో పడి పోయేలా ఉంది. అంటూ కేకలు వేస్తారు.ఆ కేకలు విన్న ఏనుగు పరుగుపరుగున ముందుకు వెళుతుంది అక్కడ బస్సు అటువైపు లోయలోకి ఇటువైపు కి దారి వైపుగా వేలాడుతూ ఉంటుంది. లోపల ఉన్న ప్రయాణికులు భయంతో పెద్ద పెద్ద కేకలు వేస్తారు దానిని చూసిన ఏనుగు…. భయపడకండి నేను మిమ్మల్ని కాపాడతాను అని చెప్పి తన తొండంతో చాలా బలంగా బస్సు ని ముందుకీ లాగుతోంది. అలా లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వెంటనే శంకర్ బయటకు వచ్చి…. నీకు చాలా చాలా కృతజ్ఞతలు నా ప్రాణాలతో పాటు ఎంతోమంది ప్రాణాలు కాపాడాను. నిన్ను నేను అనవసరంగా బాధించాను. నన్ను క్షమించు నువ్వు లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో.మీకు కృతజ్ఞతలు అని చెప్తాడు.
అప్పుడు ఏనుగు…. మరేం పర్వాలేదు
కానీ నా మిత్రుడు అనుకొని ప్రతిరోజు మీకు అడ్డం వచ్చాను నన్ను క్షమించండి.
అప్పుడు అతనికి కొంత అర్ధం అవుతుంది.
అప్పుడు ఏనుగుతో…… అతను ఎవరో కాదు నా సోదరుడు అతనికి ఆరోగ్యం బాగోలేదు అని జరిగిన విషయం చెప్పాడు.
ఏనుగు చాలా బాధపడుతూ…. ఒకసారి నన్ను నా మిత్రుడు దగ్గరికి తీసుకెళ్ళరా అని అంటుంది. అందుకు తను సరే అని ఆ ఏనుగుని నీ తన అన్నయ్య దగ్గరికి తీసుకు వెళ్తాడు. ఏనుగు ని చూసిన అతను చాలా సంతోష పడతాడు. ఏనుగు మాత్రం చాలా బాధ పడుతూ …. అయ్యో మిత్రమా నీకు ఇప్పుడు అంతా సరిగానే ఉంది కదా అంటూ ఆప్యాయంగా పిలుస్తూ బాధపడుతుంది.
అందుకే అతను …. అంతా సరిగ్గా ఉంది . నువ్వు బాధపడకు. అని అంటాడు అప్పుడు శంకర్ జరిగిన విషయం అంతా చెప్తాడు.
దాన్ని విన్న భార్యాభర్తలిద్దరూ…. చాలా కృతజ్ఞతలు అమ్మ నువ్వు లేకపోతే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఏదో. భగవంతుడు ఈ ద్వారా ఆ ప్రమాదాలు తప్పించాడు. అని దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక అప్పటినుంచి ఆ ఏనుగు అక్కడే ఉంటుంది.
దాన్ని వాళ్ళు చక్కగా పెంచుకుంటూ ఉంటారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *