ఐస్ క్రీమ్ అమ్మే దెయ్యం మూడవ భాగం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఐస్ క్రీమ్ అమ్మే దయ్యం రెండో భాగంలో సతీష్ మరియు ఊరిపెద్ద ఇద్దరూ కలిసి ఆ దెయ్యాన్ని తన ఐస్క్రీం బండి లో బంధించి. ఆ బండిని సతీష్ ఊరిచివర అడవిలో విడిచి తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ దెయ్యం పీడ వదిలిపోయిందని అందరూ అనుకుంటారు. అలా రోజులు గడిచాయి. ఒకరోజు ఆ అడవిలో విడిచిపెట్టిన ఐస్క్రీం బండి నుంచి. రేయ్ సతీష్ గా నిన్ను వదల రా నిన్ను వదలను. నిన్ను, ఆ ఊరి పెద్ద ఆఉరి మొత్తాన్ని నాశనం చేస్తాను. ఎవరైనా దీని బదులు కొట్టండి. ఎవరైనా నన్ను ఈ బందీ నుంచి వినిపించండి….. వస్తాన్ రా వస్తా …వస్తా వస్తా కసితో నా పగని తీర్చుకొని వెళ్తా.హా….హా…హా….

అని పెద్దగా నవ్వుతూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాడు. అప్పుడే ఆ శబ్దాలు విన్న ఒక పిచ్చివాడు. తనలో….. బలే బలే బలే ఈ పెట్టి లోనుంచి అరుపులు వినపడుతున్నాయి. ఈ పెట్టెలో దాకున్న దొంగ ఎవరు. నిజం చెప్పకపోతే నేను నిన్ను కొడతాను.
అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న ఆ దెయ్యం…… రా రా రా నా మగడ నన్ను ఈ బందీ నుంచి విడిపించడానికి వచ్చావు. రా నీ పని చెప్తా అని అనుకొని వాడితో….. రా వచ్చి ఈ పెట్టి ని బద్దలు కొట్టు . రా త్వరగా రా బద్దలు కొట్టు. హా…హా…హా…
ఆ మాటలకి ఆ పిచ్చి వాడు…… ఏ బూచి నువ్వు ఎవరో చెప్పకుండా నేను దీన్ని తీయను.
దెయ్యం…..నేను ఎవరో చెప్తాను కానీ ముందు దీని తియ్యి మనిద్దరం కలిసి ఆడుకుందాం.
పిచ్చోడు….. అయితే సరే నేను ఇప్పుడే తీస్తాను. అంటూ ఆ పెట్టి ని బద్దలు కొట్టాడు.
వెంటనే ఆ పెట్టి లో నుంచి దెయ్యం పెద్దగా నవ్వుతూ…..హా….హా….హా…. ప్రేతాత్మ విడుదలయ్యింది. ఇక ఎవ్వరూ బతికి ఉండరు. అని అనుకుంటూ ఆ పిచ్చి వాడితో….. ఏరా నీకు ఆట కావాలా అంటూ వాడి వైపు కోపంగా చూసింది.
పిచ్చివాడు….. అమ్మో బూచి బూచి హుమ్మ్..హుమ్మ్…. అంటూ ఏడవడం మొదలుపెట్టాడు.
దెయ్యం వాడిని చూస్తూ…. వీటి శరీరం నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రజల్ని మోసం చేయాలంటే ఇదే మంచి ఉపాయం అని అనుకొని వాడి శరీరంలోకి ప్రవేశించింది.
ఆ రోజు రాత్రి ఆ దెయ్యం పిచ్చివాడిని రూపంలో ఆ ఊరిలో నడుచుకుంటూ ఊరి పెద్ద ఇంటికి వెళ్ళింది.
ఆ పిచ్చి వాడిని చూసిన ఊరిపెద్ద…… ఏరా ఏంటి ఇటు వచ్చావ్ . ఏంటి ఆకలేస్తుందా అన్నం తింటావా అన్నoని పెట్ట మంటావా.
అని అడుగుతాడు ఆ పిచ్చి వాడు ఊరి పెద్ద వైపు కోపంగా చూస్తూ ఉంటాడు.
ఊరిపెద్ద….
ఏంట్రా ఏం మాట్లాడవు. ఆ చూపు ఏంట్రా. పిచ్చి చేష్టలు మరింత పెరిగి పోయినట్టు ఉన్నాయి దెయ్యం పట్టిన వా డి లాగా చూస్తున్నావ్.
మాటలకి ఆ పిచ్చివాడు దయ్యంగా మారి…. అవును రా నేను దయ్యాన్ని…హా..హా…హా… అని తన చేతిలో ఉన్న గంటను మ్రోగిస్తూ ….
ఐస్ క్రీమ్ కావాలా బాబు… ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ రా ఇంకా గుర్తు రాలేదా. నన్ను పెట్టి లో బంధించా వుు కదా ఇప్పుడు నేను బయటకు వచ్చేసా… ఎవ్వరినీ వదలను అందర్నీ చంపేస్తా. అంటూ అతన్ని చంపడానికి వెళుతుంది.
ఊరిపెద్ద భయంతో….. వద్దు నన్నేం చెయ్యొద్దు. నీకు మేము ఎంతో సహాయం చేశాను నువ్వు చేసిన పనికి నిన్ను అలా బంధించాము. అని బ్రతిమిలాడాడు.
కానీ ఆ దెయ్యం వినకుండా అతని గొంతు పట్టుకుంది.
వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది…… నేను వీళ్ళందర్నీ చంపితే నాకేం ఆనందం ఉంటుంది. అయితే నేను వీళ్ళందర్నీ పిచ్చి వాళ్ళ లాగా మారుస్తాను.
అని అనుకొని అతన్ని పిచ్చివాడిలా గా మార్చేసింది. అప్పుడు ఊరి పెద్ద పిచ్చోడిలా గా మారి ఒక గంట ని పట్టుకొని దానిని మోగిస్తూ…. ఐస్ క్రీం ఐస్ క్రీం ఏం ఐ స్క్రీన్ అంటూ కేకలు వేస్తూ తిరుగుతాడు. దాన్ని చూసిన సతీష్ తన భార్యతో అనిత తో…. ఎవరా పిచ్చివాడు గంటని పట్టుకొని ఐస్క్రీమ్ ఐస్క్రీమ్ అని తిరుగుతున్నాడు. కొంపదీసి ఆ దెయ్యం ఆ పెట్టి లో నుంచి బయటికి రాలేదు కదా. నేను వెళ్ళి చూస్తాను.
అనిత…. ఏవండీ ఎవరో ఏంటో మనకెందుకు వదిలేయండి.
సతీష్… అలా మాట్లాడితే ఎలా అనిత మన ఊరిలో ఘోరాలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. మళ్లీ ఇదంతా దెయ్యం పని అయితే. ప్రజలందరూ ఇబ్బంది పడతారు.
అని బయటకు వెళ్లి చూస్తాడు….. అక్కడ ఉన్న ఆ ఊరి పెద్దనీ చూసి తనలో…. ఊరి పెద్ద లాగా ఉన్నాడు. ఏమైంది ఈయనకు
అని అనుకొని అతనితో ఏమైంది అండి మీకు.
అది ఆశ్చర్యంగా అడిగాడు కానీ ఊరిపెద్ద మాత్రం…… గంట మోగిస్తూ ఐస్ క్రీం ఐస్ క్రీం అని అనుకుంటూ అడవి లో కి వెళ్ళిపోయాడు.
అప్పుడు సతీష్ తనలో…… ఏమైంది నాకు అంతా అయోమయంగా ఉంది. అని అనుకుంటుండగా దెయ్యం పట్టిన పిచ్చివాడు పిచ్చివాడు లాగే అతను కూడా గంట మోగిస్తూ ఐస్ క్రీం ఐస్ క్రీం అని అనుకుంటూ సతీష్ ముందు నుంచి వెళ్తాడు.
దాన్ని చూసిన సతీష్ పరుగుపరుగున భయంతో ఇంట్లో ప్రతి పరిగెడుతూ తనలో… అయ్యో మా ఊరికి ఏంటి ఒకటి దాని తర్వాత ఒకటీ సమస్యలు వచ్చి పడుతున్నాయి.
అని అనుకుంటూ తన ఇంటి లోపలికి వెళ్ళాడు.
ఇంటిలోపల సతీష్ భార్య అనిత….. ఏమైందండీ అలా కంగారుగా పరిగెడుతూ వచ్చారు.
సతీష్….. అనిత ఐస్క్రీమ్ ఐస్క్రీమ్. అని గంట మోగిస్తూ ఉన్న ఆ పిచ్చి వాడు ఎవరో కాదు మన ఊరి పెద్ద. అలాగే అడవి లోపల ఉండే పిచ్చి వాడు కూడా అలాగే గంట మోగిస్తూ తిరుగుతున్నాడు .
అనిత….. ఇదే ఏంటండీ అసలు వాడు అలా ఎందుకు చేస్తున్నారు.
సతీష్…. అదే నాకు అర్థం కావడం లేదు.
అనిత….. బహుశా ఆ దయ్యం ఆ పెట్టి నుంచి బయటకు వచ్చి ఇలా చేస్తుందేమో అండి.
సతీష్….అవును అదే నాకు అనుమానంగా ఉంది రేపు ఉదయం వెళ్లి ఆ పెట్టి లో ఆ దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి. అని చెప్తాడు.
ఆ మరుసటి రోజు సతీష్ అడవి దగ్గరికి వెళ్ళాడు…. అక్కడ ఐస్ క్రీమ్ బండి యధాస్థానంలో ఉంటుంది. దానిని చూసి సతీష్…. అరే ఐస్ క్రీమ్ బండి చెక్కుచెదరకుండా ఉంది దీన్ని ఎవరు తెరవలేదు. అయితే ఇది ఆ దెయ్యం పని కాదు. ఎందుకంటే దెయ్యం ఈ పెట్టి లోనే బందీ గా ఉంది. అని అనుకుంటాడు.
ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రాంతం అంతా చీకటిగా మారిపోతుంది. దాన్ని చూసి సతీష్ చాలా కంగారు పడతాడు.
ఇంతలో ఆ దెయ్యం గంట మోగిస్తూ….. హహహ అని నవ్వుతూ పెట్టి లోపలి నుంచి బయటకు వస్తుంది.
దాన్ని చూసి సతీష్ ఆశ్చర్యపోయి….. నువ్వు ఎలా బయటకి వచ్చావు ఇన్ని బంధించాము కదా.
దెయ్యం….. నేను బయటికి వచ్చి ఇప్పటికీ ఒక రోజు గడిచిపోయింది రా వెర్రి నాయనా.హా…హా….హా… అదిగో ఆ పిచ్చివాడు ఈ పెట్టి ని బద్దలు కొట్టాడు.
ఇప్పటిదాకా నువ్వు చూసిందఅంతా నా మాయలతో నేను చేసిందే. అని ఆ పిచ్చివాడిని చూపిస్తూ.
నా పెట్టి బద్దలు అయిపోయినందుకు నాకు బాధ లేదు. నేను బయటికి వచ్చానన్న సంతోషమే ఎక్కువగా ఉంది.
సతీష్ ఆ మాటలు విని ఆశ్చర్యపోయి…. అసలు ఎందుకిలా చేస్తున్నావు అయితే. మా ఊరి పెద్దలు కూడా నువ్వే పిచ్చి వాడిలాగా మార్చావు కదా.
దెయ్యం…. అవును మార్చాను ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే అంటూ అతన్ని కూడా పిచ్చివాళ్ళ మార్చేసింది. సతీష్ కూడా పిచ్చి వాళ్ళ లాగా మారిపోయి గంటను మ్రోగిస్తూ ఐస్ క్రీం ఐస్ క్రీం అనుకుంటూ ఉంటాడు.
దెయ్యం దాన్ని చూసి… హ హ హ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక మీ ముగ్గురు నేను చెప్పినట్లు వినాల్సిందే. అని అంటుంది చూస్తుండగానే రాత్రి సమయం అయింది.
దెయ్యం ఆ ముగ్గురు పిచ్చి వాళ్లతో…. ఇప్పుడు మీరు ఊరు లోకి వెళ్లి ఐస్క్రీం అమ్ముతూ ప్రజలకి భయాన్ని కలిగించండి. మీరు చేసే గంటల శబ్దానికి వాళ్లు బిక్కుబిక్కుమంటూ చావాలి. పొండి వెళ్ళండి.
అని ఆదేశించింది.
వాళ్ళు ముగ్గురు ఆ దెయ్యం చెప్పినట్టుగానే గంటలు మోగిస్తూ….. ఐస్ క్రీం ఐస్ క్రీం అని పెద్ద పెద్దగా అరుస్తూ మా ఊరిలో తిరుగుతూ ఉంటారు.
సతీష్ భార్య అనిత తన భర్త కోసం ఎదురు చూస్తూ తన ఇంట్లో ఉండగా ఆ శబ్దాలు విన్నది ఆమె కిటికీ నుంచి వాళ్ల ముగ్గురు ని చూసి…. అయ్యో ఊరిపెద్ద నా భర్త ఆ పిచ్చివాడు వీళ్లంతా ఎందుకు ఇలా చేస్తున్నారు. అయ్యో భగవంతుడా ఇదంతా ఆ దెయ్యమే చేస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి వారిని ఎలా కాపాడాలి మా ఊరికి ఎలా రక్షించాలి. నువ్వే మాకు ఏదైనా సహాయం చెయ్యి. అంటూ కన్నీరు కారుస్తోంది.
అక్కడ దెయ్యం తన మనసులో ….. ఇక చిన్నగా ఊరి ప్రజలందరినీ పిచ్చివాళ్లు గా మార్చి నా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఇబ్బంది చేస్తాం. ఇక ఈ ఊరికి మహారాజు అవుతాను. నేను చెప్పిందే వీళ్ళు చేస్తారు. హా..హా..హా… ఇంత మంచి రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు.
ఇక ఈ ఊరి ప్రజలు ఇక ముందు ముందు తరాల వాళ్ళందరూ నా బానిసలు. అని సంబర పడుతూ ఉంటుంది.
ఇక ఊరి ప్రజలు వాళ్ల ముగ్గురిని చూసి భయంతో…… అయ్యో దేవుడా ఇదంతా ఆ దెయ్యం మే చేస్తుంది . ఇక ఊరి ప్రజలు అందర్నీ కూడా ఇది ఇలాగే చేస్తుందేమో. అని కంగారు పడుతూ ఉంటారు.
కొంత సమయానికి వాళ్ళు ముగ్గురు అక్కడినుంచి మాయమైపోయారు. గంటల శబ్దాలు ఐస్క్రీమ్ అరుపులు మాత్రమే వస్తున్నాయి. వాళ్లు అక్కడ నుంచి వెళ్ళిపోయినా ఆ అరుపులు చేస్తుంది ఆ దెయ్యం పైన ఆకాశంలో ఎగురుతూ….. గంటను అరుస్తూ తన లో….. ఇక ప్రతిరోజు భయంతో చావండి. ఈరోజు మాత్రం నేను ఎవ్వరిని పిచ్చి వాళ్ళ లాగా మార్చాను. ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనుకొని. రోజు రోజు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చావాలి. అదే నాకు ఆనందం హా…హా…హా.. అని నవ్వుకుంటూ అది కూడా మాయమైపోయింది. అది మాయమైపోయిన వెంటనే ఆ గంటల శబ్దాలు అరుపులు కూడా మాయమై పోయాయి.
ఇక ఆ ఊరిని ఆ దెయ్యం భారీ నుంచి ఎవరు కాపాడుతారో ఎలా కాపాడుతారో అది ఏం చేతినుంచి వాళ్ళ తప్పించుకుంటా రో లేక అందర్నీ అది పిచ్చి వాళ్ళల మారుస్తుందో.
అసలు ఏం జరుగుతుందో అనేది తర్వాతి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *