ఐస్ క్రీమ్ అమ్మే దెయ్యం 4_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఐస్ క్రీమ్ అమ్మే దెయ్యం మూడో భాగం లో ఆ దెయ్యం సతీష్ నీ ఊరు పెద్దనీ అలాగే మరో వ్యక్తిని పిచ్చివాళ్ళగా చేసి తన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళచేత పనులు చేయిస్తూ ఉంటుంది. ఆ విషయం గురించి సతీష్ భార్య అనిత వినాయకుడి ముందు కూర్చొని…. స్వామి వినాయక ఈ ఊరిలో ఏలాంటి సంఘటనలు జరుగుతున్నవ్వో. నీకు తెలుసు. ఆ దెయ్యం ఊరి పెద్దనీ నా భర్తని మరో వ్యక్తిని పిచ్చివాళ్ళ గా మార్చి. తన ఇష్టం వచ్చినట్టుగా వాళ్లని ఆడిస్తుంది నువ్వే ఏదైనా పరిష్కారం చూపించాలి అంటూ ఏడుస్తుంది. అప్పుడే గణపయ్యా ఆమె ముందు ప్రత్యక్షం అవుతాడు. గణపతి ని చూసిన అనిత చాలా సంతోష పడుతూ …. అయ్యా గణపయ్య నువ్వే మాకు దిక్కు. నువ్వే వాళ్ళందర్నీ మా ఊరిని కాపాడాలి అంటూ మొర పెడుతుంది.

వినాయకుడు…. బాధపడకు అనిత నేనున్నా కదా. ఈ ఊరిని ఆ దయ్యం నుంచి కాపాడుతాను అందుకోసమే కదా నేను వచ్చాను. అని అంటాడు ఆ మాటలకు ఆమె చాలా సంతోషపడుతుంది ఆరోజు రాత్రి సమయం అయ్యింది ఆ ముగ్గురు పిచ్చివాళ్ళ గా మారి గంటలు మోగిస్తూ…. ఐస్ క్రీమ్ బాబు ఐస్ క్రీం వచ్చేసాం మేం వచ్చేసాం మాతోపాటు ఈరోజు ఎవరు వస్తారు. అంటూ గంట మోగిస్తూ పెద్దపెద్దగా కేకలు వేస్తారు. ఆ కేకలకి ఊరి ప్రజలంతా భయభ్రాంతులు అవుతారు. అనిత…. గణపయ్య వాళ్ళు వచ్చేశారు. ఆ దెయ్యం కూడా ఇప్పుడే వాళ్లతో పాటు వస్తుంది. గణపయ్య…. రానివ్వవు రానివ్వవు అనిత అందుకోసమే కదా మనం కూడా ఎదురు చూస్తుంది అని అంటూనే ఒక సాధారణ మనిషిగా మారి బయటికి వెళ్తాడు అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు మారురూపంలో ఉన్న గణపతి దగ్గరకు వెళ్లి. ఆయన చుట్టూ తిరుగుతూ…. ఈరోజు నువ్వేనా మాతోపాటు వచ్చేది. హహా నవ్వుతూ ఐస్ క్రీం ఐస్ క్రీం అని అంటూ ఉంటారు ఇంతలో ఆ దెయ్యం ఐస్ క్రీమ్ బండిని తోసుకుంటూ ….హా…హా..హా భలే మంచి పని చేశారు. చెప్పకుండానే మనిషిని తీసుకొచ్చా రే అంటూ వాళ్ల దగ్గరికి వెళ్తుంది అప్పుడు మారురూపంలో ఉన్న గణపయ్య. ఆ దెయ్యం దగ్గరకు వెళ్లి….. ఏమున్నది ఈ బండి లో ఐస్ క్రీమ్ లా. అయితే ఇవన్నీ నాకే కావాలి. అంటూ ఆ బండి లో ఉన్న ఐస్ క్రీమ్ లు తింటూ ఉంటాడు. దాన్ని చూసిన దెయ్యం…. ఏరా నేనంటే నీకు భయం కలగడం లేదా. నా ముందే ధైర్యంగా సమాధానం చెప్తూ ఐస్ క్రీములు కూడా తింటావా. నిన్ను ఏం చేస్తానో చూడు. అంటూ అతనిపై తన మంత్రాన్ని ప్రయోగిస్తుంది. వెంటనే ఆ గణపయ్య కూడా పిచ్చివాడిలా మారి …. గంటను మ్రోగిస్తూ ఐస్క్రీమ్ ఐస్క్రీమ్ అని అంటాడు. దాన్ని చూసిన దెయ్యం….హా..హా హా నాకు ఎదురు సమాధానం చెప్పినా నా ముందు ధైర్యంగా నిలబడిన వాళ్ల పరిస్థితి ఇదే హా..హా..హా అని నవ్వుతుంది వెంటనే మారురూపంలో ఉన్న గణపయ్య తన చేతిలో ఉన్న గంట ను దెయ్యం పై విసిరేస్తాడు. వెంటనే ఆ గంట పెద్ద ఎలుక గా మారిపోతుంది దాన్ని చూసిన ఆ దయ్యం ఆశ్చర్యపోతుంది ఆ ఎలుక ఆ దెయ్యం వెంట పడుతుంది ఆ దయ్యం దాన్ని చూస్తూ పరిగెడుతూ…. ఇంత పెద్ద ఎలుక దీనిని నేను ఆప లేక పోతున్నాను. నా మాయ శక్తులు దానిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించడం లేదు. అంటూ పరిగెడుతుంది. అది అలా పరిగెడుతూనే ఆ ఎలక ని ఆపడానికి తన మంత్రశక్తిని ప్రయోగిస్తుంటే ఉంటుంది కానీ ఎలాంటి ఫలితం లభించదు. ఆ దెయ్యం చాలా సేపు పరిగెత్తి అలిసిపోయి ఒక చోట నిలబడి…. అమ్మో వీడెవడో మాయా మాంత్రికుడు లా ఉన్నాడు. వీడి దగ్గర క్షమాపణ కోరుకొని క్షమించమని ప్రాధేయ పడాలి. లేదంటే ఆ ఎలుక నన్ను చంపేసే లా ఉంది అని అనుకొని మారురూపంలో ఉన్న వినాయకుడి దగ్గర కు వచ్చి…. బాబు నీకు దండం పెడతాను నువ్వు ఎవరో నాకు అర్థం కాలేదు కానీ నాకంటే పెద్ద మాయ శక్తి గలవాడవాని అర్థమవుతుంది. తప్పైపోయింది నన్ను క్షమించు. అని ప్రాధేయ పడుతుంది అప్పుడు గణపయ్య అతను ఆ ఎలుకని…. ఆగు మూషిక ఆగు అని ఆదేశిస్తాడు వెంటనే ఎలుక అక్కడే నిలబడి పోతుంది. ఆ తరువాత గణపయ్య అతని రూపంలోకి మారి పోతాడు. గణపయ్యను చూసిన ఆ దయ్యం గజగజ వణికిపోతోంది.
అప్పుడు గణపయ్య… ఏంటి నోటమాట రావడం లేదా. ఎన్ని రోజుల నుంచి ఈ జనాన్ని ఎంతగా వేదిస్తున్నావ్. నిన్ను ఏం చేస్తానో చూడు అని అంటాడు అందుకు ఆ దయ్యం…. అయ్యా గణపయ్య నన్ను క్షమించు. నేను చేసింది తప్పే కానీ నన్ను అన్యాయంగా చంపేశారు. అందుకు గణపయ్య….. నిన్ను చంపిన వాడి పై పగ తీర్చుకున్న కదా. అతన్ని చంపి రక్తమాంసాల కి బానిస గా మారి ఇక్కడ ప్రజలందరినీ వేధిస్తున్నావ్వు. అంతేగా నువ్వు చెప్పదలచుకుంది. జరిగిందేమిటో నాకంతా తెలుసు. ఈ నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు.
దెయ్యం….. నిజమే స్వామి కానీ నేను రక్తమాంసాల కు బానిస అయిపోయే ఇలా చేస్తున్నాను నన్ను క్షమించు నన్ను అంతం చేయకు నీకు పుణ్యం ఉంటుంది.
అప్పుడే అనిత అక్కడకు వచ్చి….నిన్ను అంతం చేయకపోతే ఇక్కడున్న ప్రజలందరినీ నువ్వు అంతం చేస్తావు. ఆ విషయం గణపయ్య కూడా తెలుసు. ఇంకా చూస్తావ్ ఏంటి గణపయ్యా దాన్ని అంటే చేసి ఊరికి పట్టిన పీడ వదిలి oచేయి. దెయ్యం…. వద్దు స్వామి దయచేసి నన్ను వదిలి పెట్టు. అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది.
దానిని చూసి రా అనిత చాలా కంగారు పడుతూ….. స్వామి ఆ మహమ్మారి ఎక్కడికో మాయమైపోయింది. అది మళ్ళీ తిరిగి వచ్చి ఎన్ని రాద్ధాంతాలు చేస్తుందో దాని నుంచి కాపాడండి స్వామి దాన్ని అంతం చేయండి.
వినాయకుడు…. హరిత నువ్వు కంగారు పడకు. ఆ దయ్యం ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడి కె వస్తుంది.
అని అంటాడు ఇంతలో ఆ పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆ దెయ్యం ఒక చెట్టు దగ్గర ప్రత్యక్షమయ్యి…. హమ్మయ్య ఆ గణపతి నుంచి ఏదో విధంగా తప్పించుకున్నాను. త్వరలోనే నవరాత్రి రాబోతుంది ఆ తొమ్మిది రోజులు ఈ గ్రామంలోకి వెళ్లకుండా వినాయకుని నుంచి తప్పించుకోవాలి. అనుకుంటూ ఉండగా ఆ మూషికం అక్కడికి వస్తుంది ఆ మూషికం నీ చూసిన దెయ్యం… చచ్చాక బాబు ఇది ఇక్కడికి కూడా వచ్చేసింది అంటూ పరిగెడుతుంది. ఆ మూషిక o కూడా ఆ దెయ్యం వెంట పరిగెడుతూ… నువ్వు మర్యాదగా నాకు లొంగిపోవు లేదంటే గణపయ్య నిన్ను ఏం చేస్తాడో నీకు కూడా తెలుసు. అని అంటుంది అందుకు ఆ దయ్యం ఆగిపోయి… ఇంకా నేను ఎక్కడికి వెళ్లినా నా అంత తప్పేలా లేదు. అని అనుకుంటూ ఆ ఎలుక తో…. సరే పద నేనే వస్తాను అంటూ ఆ ఎలుక తో పాటు కలిసి వినాయకుడి దగ్గరికి వెళుతుంది. వినాయకుడు ఆ దెయ్యాన్ని చూసి…హా…హా నా నుంచే తప్పించుకోవాలి అనుకున్నావా అది అసాధ్యం. అని అంటాడు దెయ్యానికి ఏం చేయాలో అర్థం కాదు. ఎలా అయినా వినాయకుని ఎదిరించి అక్కడి నుంచి వెళ్లాలని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తను అనుకున్న విధంగానే అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం అనిత ని గట్టిగా పట్టుకొని…. స్వామి వినాయక నన్ను ఇక్కడి నుంచి పంపించే చెయ్యి లేదంటే ఈమెని చంపేస్తాను. గణపయ్య…హా..హా..హా మీ దెయ్యాలకి తెలివితేటలు ఉండవా. ఇప్పుడు దాకా జరిగిందంతా తెలిసి కూడా మళ్లీ నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటున్నావు. అంటూ ఉండగా అనిత ఆ దయ్యం దగ్గర్నుంచి మాయమయి వినాయకుడు పక్కకు వస్తుంది. అప్పుడు ఆ దెయ్యం చూస్తూ మరింత ఆశ్చర్యపోయి…. స్వామి గణపయ్య నన్ను క్షమించు నన్ను నేను రక్షించుకోవడం కోసం ఇలా చేస్తున్నాను నన్ను అర్థం చేసుకో అని ప్రాధేయ పడుతూ ఏడుస్తుంది.
గణపయ్య….చాలించు నీ అబద్ధపు మాటలు నీ మనసులో ఉన్న కుతంత్రం ఏంటో నాకు తెలుసు. ఎవరినైతే నువ్వు బాధించవు వాళ్ల చేతే నిన్ను అంతం చేపిస్తాను. అంటూ ఆ ముగ్గురు పిచ్చివాళ్లను ఆ దెయ్యం పై దాడి చేయబడి గణపయ్య ఆదేశిస్తాడు. ఆ ముగ్గురు గంటలు మోగిస్తూ పెద్ద పెద్దగా ఐస్క్రీమ్ ఐస్క్రీమ్ అంటూ ఉంటారు ఆ గంటల శబ్దాలు పెద్ద పెద్దగా మోగుతూ ఉంటాయి అనితా చెవులు మూసుకుంటుంది. ఆ దెయ్యం కూడా తన రెండు చెవులు మూసుకుని… దయచేసి ఆ శబ్దాలు ఆపండి అవి నాకు భయంకరంగా వినబడుతున్నాయి. దయచేసి ఆపండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ. తన శరీరం అంతా మంటలు మండి అక్కడికక్కడే మాయమైపోతుంది. ధరణి చూసిన అనితా చాలా సంతోష పడుతూ గణపయ్య తో…. స్వామి గణపయ్య నీ దయవల్ల ఆ దెయ్యం అంతమై పోయింది.
ఇక మిగిలిందల్లా ఈ ముగ్గురు వ్యక్తుల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకు రావడం స్వామి వాళ్ల పై దయ చూపించు స్వామి అని అంటుంది స్వామి తన శక్తితో వాళ్ళ ముగ్గురిని మామూలు స్థితిలోకి తీసుకొస్తాడు.
మామూలుగా మారిన ఆ ముగ్గురు గణపయ్యను చూసి…. స్వామి విగ్నేశా మమ్మల్ని కాపాడ్డానికి వచ్చావా స్వామి మీ రాకతో మా ఊరంతా పవనo అయిపోయింది.
మా జన్మలు ధన్యం అయిపోయాయి స్వామి. అంటూ ఆ ముగ్గురు స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. గణపయ్య….. మరేం పర్వాలేదు. ఇక మీరంతా నిశ్చింతగా ఉండొచ్చు. ఆ దెయ్యం ఎప్పటికీ తిరిగి రాదు.
ఇక్కడ నుంచి మీరు చాలా సంతోషంగా ఉండొచ్చు. అని అంటాడు అందుకు వాళ్లు చాలా సంతోష పడుతూ….. స్వామి చాలా కృతజ్ఞతలు మమ్మల్ని కాదు ఊరు మొత్తాన్ని కాపాడారు. అనిత…. స్వామి ఈ సారి జరగబోయే మీ నవరాత్రి ని చాలా ఘనంగా జరుపుతాము. నీకు ఇష్టమైన పదార్థాల్ని నీ ముందు ఉంచి నిన్నే ప్రార్థిస్తాం స్వామి.
వాళ్ళ మాటలు విన్న గణపయ్య సంతోషపడుతూ….. ఓ తప్పకుండా మీరు నా ముందు ఉంచే కుడుములు ఉండాలి అంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను ఇప్పుడైతే నేను వెళ్లి మళ్లీ తిరిగి వస్తాను అని చెప్పి తనపై అక్కడి నుంచి తన వాహనమైన మూషికం పై ఎక్కి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచాయి గణపయ్య ఉత్సవం రానేవచ్చింది. వాళ్లు గల పైకి ఇచ్చిన మాట ప్రకారం గణపతి ముందు రకరకాల పిండివంటలు చేసి ఉంచి ఆయన్ని పిలుస్తారు గణపయ్య వెంటనే ప్రత్యక్షమయ్యి. వాటన్నిటినీ భుజించి… దీర్ఘాయుష్మాన్ భవ సుఖశాంతులతో మీరు ఈ ఊరు మొత్తం అంతా వర్ధిల్లు గాక అని దీవించి అక్కడి నుంచి సంతోషంగా మాయమై పోతున్నాడు. ఇక అప్పటినుంచి ఆ ఊరంతా ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్టు దెయ్యం బాధ వదిలి పోయింది అని సంతోషం గణపయ్య వచ్చి వెళ్ళాడని మరింత ఆనందం తో వాళ్ల జీవితాన్ని గడుపుతారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *