ఐస్ క్రీమ్ అమ్మే దెయ్యం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

రాజంపల్లి అనే ఒక అందమైన గ్రామం ఉండేది అక్కడ అర్ధరాత్రి 12 గంటలకు ఊరిలో గంట మోగిస్తూ ఐస్క్రీమ్ ఐస్క్రీమ్ అంటూ శబ్దాలు చేస్తూ ఎవరో తిరుగుతూ ఉండే వాళ్ళు అందుకుని వూరి ప్రజలు ఎవరు బయటకు వచ్చే వాళ్ళు కాదు . పొరపాటున ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు మాయమైపోయే వాళ్ళు. ఆ ఘటన గురించి ప్రజలు భయంతో వణికిపోతూ దాని గురించి చెప్పుకునే వాళ్ళు. ఒక రోజు ఆ ఊరికి కొత్తగా నరేంద్ర, అనిత, అనే దంపతులు వచ్చారు . అతడు ఆ ఊరి గురించి తన భార్యతో ఇలా అనడం ప్రారంభించాడు.
నరేంద్ర— అనిత మీ ఊరి ప్రజలు ఎందుకు ఇంతగా భయపడుతున్నారు ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉంటాయా. నేను ఈరోజు ఐస్ క్రీమ్ అమ్మేది ఎవరో కనుక్కుంటాను చూడు!
అని అన్నాడు అందుకే అనిత
అనిత— మనం కొత్తగా వచ్చాము మనకు ఎందుకండీ ఇలాంటి సాహసాలు చెప్పండి .
అని అన్నది
నరేంద్ర కు ఆ మాటలు పట్టీపట్టనట్లు గా ఉన్నాయి. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు భయంకరమైన శబ్దాలు రావడం ప్రారంభమయ్యాయి. వెంటనే ఎవరో గంట మోగిస్తూ…. (ఐస్క్రీమ్ ఐస్క్రీమ్ )…అని అరవడం ప్రారంభించారు వెంటనే నరేంద్ర బయటకు వచ్చి అటు ఇటు చూడగా అతనికి ఎవరూ కనిపించలేదు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఒకరు నరేంద్ర ముందుకు వచ్చారు.అప్పుడు
నరేంద్ర– ఎవరు నువ్వు ఇంత రాత్రి వేళ నీకు ఇక్కడేం పని. ఓయ్ నిన్నే అడుగుతుంది సమాధానం చెప్పవేంటి. ఓయి చూడు మాట్లాడు నిన్నే.
అప్పుడు దెయ్యం
దెయ్యం—-( పెద్దగా నవ్వుతూ)హ హ హ.. భయంకరంగా అరుస్తూ… (పెద్దగా) ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నవు .నీ పని నువ్వు చూసుకో కుండా నన్ను కదిలిస్తున్నవేంటి . ఏంటి ఇక్కడ ఉండాలి లేదా నీకు!?
ఆ మాటలకు
నరేంద్ర –(భయంతో వణుకుతూ)
నువ్వు దెయ్యాన్ని వా నన్ను ఏం చేయకు అని పరుగెత్తుతుండగా ఆ దెయ్యం
దెయ్యం— ఎక్కడికి నువ్వు వెళ్లేది. నా గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళలేదు నువ్వు కూడా అంతే
రా ..రా.. రారా!.. అంటూ అతన్ని తన చేతిలో ఉన్న గంటలో బంధించింది .
దాన్ని అంత దూరం నుంచి గమనిస్తున్న అతని భార్య అనిత.
మరుసటి రోజు కంగారు కంగారుగా ఆ ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. అప్పుడు అతడు ఊరి వారిని పిలిచి.
ఊరిపెద్ద– చూడండి అందరూ ఈ రాత్రి పన్నెండు గంటలకి ఆ గంటను మ్రోగిస్తూ ఐస్క్రీమ్ ఐస్క్రీమ్ అని ఎవరు అమ్ముతున్నారో గమనించండి. కానీ పొరపాటున కూడా ఎవరు బయటకు రాకండి అని చెప్పాడు అర్ధ రాత్రి 12 గంటలు అయింది అందరూ చూస్తుండగా.
దెయ్యం గంట మోగిస్తూ—– రండి రండి నా దగ్గరకు రండి ఐస్ క్రీమ్ తీసుకోని వెళ్ళండి అని (భయంకరంగా )అరుస్తూ ఉంది. దాన్ని చూసి వాళ్లందరూ భయంతో వణికిపోయారు.
మరుసటి రోజు అందరూ సమావేశమయ్యారు.
ఊరి పెద్ద వాళ్లతో
ఊరి పెద్ద— చూశారు కదా! దానిని అది ఒక పెద్ద దెయ్యం అది మన ఊరి ప్రజలను మాయం చేస్తుంది కొత్తగా వచ్చిన ఈమె భర్త నరేంద్ర ని కూడా అదే మాయం చేసింది. ఈమె ద్వారానే నేను విషయం తెలుసుకొని మీకు కూడా తెలియజేయడం కోసం ఇలా చేశాను .ఈరోజు మనం అందరం కొంచెం ధైర్యం తెచ్చుకుని దానిని అడ్డుకొని ఎందుకిలా చేస్తుందో కనుక్కుందాం .
అని అనుకున్నారు ఆ రోజు అర్ధ రాత్రి 12 గంటలు అయింది.
దెయ్యం– గంటను మ్రోగిస్తూ రండి ..రా…రండి ఐస్ క్రీమ్ తీసుకోండి అని అరవడం ప్రారంభించింది అప్పుడు ఊరి ప్రజలు అందరూ దాని దగ్గరకు వచ్చినప్పుడు ఆ దెయ్యం– హ హ హ హ అని (పెద్దగా నవ్వుతూ) రండి రండి అందరూ నా దగ్గరకు బందీ అవ్వడం కోసం వచ్చా రా! హ హ హ… అని (నవ్వింది )అందుకు ఊరిపెద్ద
ఊరిపెద్ద—చూడు దెయ్యం. ఎందుకు నువ్వు అందరినీ గంటలో బంద్ఇస్తున్నావు !?అసలు నువ్వు ఎవరు!?. ఏం కావాలి నీకు .నీకేం కావాలో చెప్తే మేము నీకు అప్ప చెప్తాము అని అన్నారు అందుకు దెయ్యం
దెయ్యం– హ హ హ ఏమి అడిగిన ఇస్తారన్న మాటకు నేను నిజం చెప్తున్నాను నేను ఒక చిన్న ఐస్ క్రీమ్ వ్యాపారిని నన్ను ఒక దొంగ ప్రతిరోజు. కొడుతూ తిడుతూ ఐస్ క్రీమ్ కింద పడేస్తూ . పాడు చేసే వాడు. ఒక రోజు నా చేతిలో. గంట ను విడగొట్టి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా అంతే నా చేతిలో ఉన్న కొత్త గంట విరగ్గొట్టాడు. నాకు బాగా కోపం వచ్చింది. ఒకరికి ఒకరు ఘర్షణపడ్డాము ఆ ఘర్షణలో వాడు నన్ను చంపేస్తాడు . అందుకే వారిపై పగ తీర్చుకోవడం కోసం నేను దెయ్యం గా మారి వచ్చాను. నాకు వాడు కనిపించడం లేదు. అందుకే నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళని గంట లోబంద్చేస్తున్నాను.. నాకు వాణ్ణి పట్టిస్తే గంటలో బందీగా ఉన్న వాళ్ళని వదిలేస్తా .
అని అన్నది
అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న దొంగ భయంతో పరిగెడుతూ ఉండగా ఆ నేరం చేసింది వీడే అని గ్రహించి ఊరి ప్రజలు వాడిని దెయ్యానికి పట్టించారు.
దెయ్యం— ఆ దెయ్యం( పెద్దగా నవ్వుతూ) హ హ హ… మీకు చాలా ధన్యవాదాలు. హ హ హ.. అని అంటూ చేతిలో ఉన్న గంటను విసిరేసి ఆ దొంగని తీసుకుని మాయమైపోయింది .ఆ గంట కింద పడిన వెంటనే దానిలో బందీగా ఉన్న వాళ్లు బయటకు వచ్చారు.
అప్పట్నుంచి ఆ దయ్యం ఊరి వైపు తిరిగి రాలేదు ప్రజలందరూ హాయిగా జీవించసాగారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *