ఒక్క టైర్ బైకు Single wheel Bike | Telugu Kathalu | Telugu Stories| Stories in Telugu | fairly tales

వినయ్ అనే వ్యక్తి కోదండాపురం అనే గ్రామంలో మెకానిక్ పని చేస్తూ బ్రతికేవాడు, అతనికి ఒక కూతురు ఉంది ఆమె పేరు కమల, కమల పుట్టగానే ఆమె తల్లి నిర్మల చనిపోయింది, దాంతో కమల బాగోగులు చూసుకునే బాధ్యత వినయ్ పై పడింది, ఒకరోజు వినయ్ ఫ్రెండ్ అయిన వర్మ వినయ్ దగ్గరికి వచ్చి

వర్మ :- రేయ్ వినయ్ నాకు ఎప్పటినుంచో నీకు చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ఎలా అర్ధం చేసుకుంటావో అని ఇన్ని రోజులు ఆగాను కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు, నువ్వు పట్నం లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఇలా చిన్న ఊరిలో మెకానిక్ షాప్ పెట్టుకొని కూతురు కోసం బ్రతకడం నీకు ఏమి అనిపించడం లేదా? కమల ని తీసుకొని పట్నం వెళ్లి మంచి ఉద్యోగం చేసుకొని  అక్కడే ఉండు అని చెప్తాడు

వినయ్ :- ఇంత చిన్న వయసులో కమల ని పట్నం తీసుకెళ్లి ఆ హడావుడి జెఈవితానికి దాన్ని అలవాటు చేయలేను, నేను ఇక్కడే ఉంటాను, నేను నాకు ఉన్న తెలివితేటలతో కొన్ని పుస్తకాలు చదివి బాటరీ తో నడిచే ఒక స్కూటర్ని తాయారు చేస్తున్నాను, ఒక వేళ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి ఆ స్కూటర్ విజయవంతంగా నడవడం మొదలు పెడితే నేను పట్నం వెళ్లడం కాదు, పట్నం నుంచే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు నా దగ్గరికి వస్తాఋ ఈ డిజైన్ కోసం అని అంటాడు వినయ్

వర్మ :- ఏంటి నువ్వు బాటరీ తో నడిచే స్కూటర్ని తాయారు చేస్తున్నావా? పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళే బ్యాటరీ బండ్లు తాయారు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు నువ్వు వాళ్ళకంటే గొప్ప వాడివా? వాళ్ళకంటే నీకు ఈ వాహనాల తయారీలో ఎక్కువ అనుభవం ఉందా? ఇలాంటి తలతిక్క పనులన్నీ మానేసి బుద్దిగా పట్నం వెళ్లి ఎదో ఒక కంపెనీలో దొరికిన ఉద్యోగం చేసుకుంటూ కమల ని మంచిగా చూసుంటూ బ్రతుకుపో అని చిరాకుగా చెప్పేసి వెళ్ళిపోతాడు

వినయ్ :- వీడు నన్ను పట్నం వీళ్ళు డబ్బులు సంపాదించి బాగుపడుమంటున్నాడు, అదే నేను కష్టపడి నా సొంతగా బాటరీ బండి తాయారు చేస్తానంటే మాత్రం వాడని చెబుతున్నాడు, అందరు నేను బాటరీ బండి చేస్తానంటే ఎవ్వరికి నమ్మకం లేదు ,నేన్ను నేను నిరూపించుకోవటానికి ఇదొక్కటే మార్గం అని అనుకోని తన షాప్ దగ్గరికి వెళ్తాడు,

తన బాటరీ బండిని రిపేర్ చేస్తహూ ఇలా అనుకుంటాడు.

వినయ్ :- ఇంకా కొద్దీ రోజుల్లో ఈ బండి పూర్తి అవుతుంది, పూర్తవగానే నేను ఈ బండి మీద ఊరంతా తిరిగి అందరికి చూపిస్తాను అనుకుంటాడు

అలా కొని రోజులు గడుస్తాయి వినయ్ తాయారు చేసే బాటరీ బండి పూర్తవుతుంది, దానికి ఒకే చక్రం ఉంటుంది, దానిని ఊరు అందరికి చూపించాలి అనుకోని వినయ్ అందరిని పిలుస్తూ

వినయ్ :- అరేయ్ వర్మ, జమీందారు గారు చూడండి ఒక్క చుక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవస్సరం లేకుండా బ్యాటరీతో నడిచే బైక్ నేను నా సొంతగా తాయారు చేసాను, ఈ బండి డిజైన్ ని పెద్ద పెద్ద కంపెనీలకి అమ్మి మీకంటే గొప్ప వాటిని అవుతాను, చూడండి నా బైక్ ఎలా నడుస్తుందో అని బైక్ ఎక్కి స్టార్ట్ చేసి నడప బోతాడు కానీ బైక్ స్టార్ట్ ఎవ్వదు  అది చూసిన జనాలందరూ ఒక్కసారిగా నవ్వుతారు, అది చూసి వినయ్ కి ఎంతో అవమానంగా అనిపిస్తుంది, మల్లి ప్రత్నించగా బైక్ ప్రాబ్లెమ్ వల్ల వినయ్ కింద పడిపోతాడు, అలా జరగడం తో వినయ్ కి ఎంతో అవమానంగా అనిపిస్తుంది. ఆ అవమాన భారంతో ఇంటికి వెళ్లి దిగులుగా కూర్చుంటాడు. అక్కడికి కమల వచ్చ్హి

కమల :- నాన్న నువ్వు అలా దిగులుగా కూర్చుంటే ఏమి బాలేదు నాన్న,

 వినయ్ :- నన్నేం చేయమంటావు అమ్మ ఊరందరి ముందు నా పరువు పోయింది, నన్ను ఏ పని చేతకాని వాడిలా చూస్తున్నారు,

 కమల :- నాన్న నువ్వు చేసే కష్టం ఏంటి అన్నది నీకు మాత్రమే తెలుసు, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన నీకు ఏమి చేతకానట్టు కాదు, మల్లి ఒక సరి నాకోసం ప్రయత్నించు నాన్న అని అంటుంది.

కమల చెప్పిన మాటలకు వినయ్ కి ఎంతో ఊరట లభిస్తుంది.

వినయ్ :- చిన్న పిల్లవి అయినా నువ్వు చాలా గొప్పగా చెప్పవమ్మా, నీకోసమైనా నేను మల్లి ప్రయత్నం చేస్తాను అని చెప్పి, మల్లి బాటరీ బండిని నడిపించడానికి ప్రయత్నాలు చేస్తాడు వినయ్

ఈసారి వినయ్ బండి విజయవంతంగా నడుస్తుంది. అప్పుడు వినయ్ ఊరిలోకి ఆ బండిని తీసుకొని వెళ్తాడు, అలా  వినయ్ బాటరీ బండి   గురించి పెద్ద పెద్ద కంపెనీలకు కూడా తెలుస్తుంది, ఆ డిజైన్  కోసం పెద్ద కంపెనీ ఆఫీసర్స్ విజయ్ ఇంటికి వస్తారు, అందులో ఒక ఆఫీసర్

ఆఫీసర్ :- వినయ్ గారు మీరు చేసిన బాటరీ బండి ఎంతో బాగా మాకు నచ్చింది, మీకు పెద్ద మొత్తం లో డబ్బులిచ్చి మీ బాటరీ బండిని కొనుక్కోవాలి అనుకుంటున్నాము, మేము మీకు పెట్టుబడి పెడతాము మీరు మా కోసం ఇంకా చాలా బాటరీ బైక్ లను తాయారు చేసి ఇవ్వాలని చెప్తారు.

దానికి వినయ్ సరే అని ఒప్పుకుంటాడు

వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వినయ్ చాలా ధనవంతుడిగా మారిపోతాడు, తన కూతురు కమల ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఊరిలో వినయ్ ని అవమానించిన ప్రజలే వినయ్ ని మెచ్చుకుంటూ ఉంటారు, వినయ్ పెద్ద కంపెనీ వ్వాళ్లు కిచెప్పినట్టుగానే చాలా బాటరీ బైక్స్ ని తాయారు చేస్తూ ఉంటాడు, కమలాన్ని కూడా మంచి స్కూల్లో చేర్పిస్తాడు. అలా కొద్దిరోజుల్లోనే వినయ్ ఊరిలో అందరికంటే ధనవంతుడిగా మారిపోతాడు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *