ఒక కుటుంబ కథ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

శంకరాపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. అక్కడ గోవిందమ్మ గోవింద్ రాజ్ కి ఒక కుమారుడు ఒక కుమార్తె అతని పేరు రాజేంద్ర . ఆమె పేరు అనూష .అనూష రాజేంద్ర కంటే పెద్దది కావడంతో ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. ఆ తర్వాత రాజేంద్ర కి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు అతనికి సరోజన ఇచ్చి పెళ్లి చేశారు. సరోజ ఆ ఇంటికి వచ్చిన కొత్తల్లో అత్తయ్య బాగా చూసుకునేది. అలా రోజులు గడిచాయి ఒకరోజు గోవిందమ్మ…. అమ్మాయి saroja మీ ఇంటి వాళ్ళు ఇంతవరకు కి కట్నం డబ్బులు ఇవ్వలేదు. దాని సంగతి అడుగుతుంటే ఏం మాట్లాడట్లేదు ఏంటి.

సరోజ…. అత్తయ్య మా ఇంటి పరిస్థితి అస్సలు బాలేదు మా నాన్న పొలం వేసి వరదలు రావడం వల్ల అతివృష్టి కలిగి పంట మొత్తం పాడైపోయింది. ఇప్పుడు అప్పుల బాధ లో ఉన్నాడు. ఈ సమయంలో నేను కట్నం గురించి అడగడం అంతా మంచిది కాదు అనుకుంటున్నాను అత్తయ్య.
అందుకు అత్తయ్య కోపంగా….. ఏమే నాకే మంచిచెడులు నేర్పించే అంత పెద్ద పెద్దదానివి అయిపోయావు. నరికి పోగులు వేస్తాను నా సంగతి తెలియదు నీకు.
అందుకు సరోజ… అయ్యో ఎందుకు అలా మాట్లాడుతున్నారు నేను ఉన్న మాట చెప్పాను.
అప్పుడు అత్తయ్య చాలా కోపంగా …. ఉన్న మాట అన్న మాట మాటలు బాగానే నేర్చావు భయం భక్తి లేకుండా పోయింది. అంటూ ఆమెను చితకబాదింది.
పాపం saroja పెద్ద పెద్దగా ఏడుస్తూ…… అయ్యో అత్తయ్య నన్ను కొట్టకండి. అయ్యో అత్తయ్య కొట్టకండి. అంటూ అరుస్తూ ఉండగా ఇంతలో సరోజ భర్త వచ్చి….. అమ్మ ఎందుకు సరోజన కొడుతున్నావ్ ఒక్క నిమిషం ఆగు .
అంటూ అడ్డుకుంటాడు ఆమె….. నువ్వు దీనిని తీసుకుంటావు కాబట్టే దీని ఆటలు బాగా సాగుతున్నాయి. అని కోపంగా లోపలికి వెళ్తుంది. అలా ఆరోజు గడిచిపోయింది.
ఉదయం లెగిస్తే చాలు అత్తయ్య అనవసరంగా ఆమెను మాట పారేసుకుంటుంది. కొడుతూ ఉంటుంది ఆ బాధను భరించలేక ఆమె ఎంతో బాధపడుతూ…. అమ్మ నాన్న నన్ను ఈ నరకంలో పడేశారు ఎందుకు నేను అబ్బాయి గా పుట్టిన బాగుండేది నాకెందుకు ఇంత పాడు రాత రాశాడు దేవుడు .దేవుడు కు కూడా న్యాయం లేదు. అంటూ బోరున ఏడుస్తుంది.
పాపం భర్త ఏం చేయలేక ఆమెతో…. saroja కొన్ని రోజులు ఓపిక పట్టు మనం వేరే కాపురం ఉందాం అప్పుడు నీకు ఎన్ని కష్టాలు ఉండవు.
దాన్ని చాటు నుంచి వింటున్న అత్త ….. అమ్మో ఓలమ్మో ఓలమ్మో అంతా అయిపోయింది ఇది ముదురుష్టపది ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అంతే సంగతులు.
ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేసింది ఇప్పుడు వేరే కాపురం కూడా మొగుడి చేత పెట్టించాలని చూస్తుంది నా కొడుకు నీ నాకు
కాకుండా చేస్తుంది దేవుడా నువ్వు నలుగురు వింటే నవ్విపోతారు. అయ్యో అయ్యో అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది.
దాన్ని విన్న saroja ఆమె భర్త ఇద్దరూ ఆమెను చూస్తూ ఉంటారు అతను… అమ్మ సరోజ నన్ను వేరే కాపురం పెట్టమని అడగలేదు నువ్వు పెట్టే బాధను చూడలేక ఆమెకు తో అలా అన్నాను.
అత్తయ్య…. నాకు తెలుసు రా అది దాని తెలివితేటలు. దాని నోటి నుంచి కాకుండా నీ నోటి నుంచి వచ్చే లాగా చేసింది మాయదారి ది. మంచి మంచి సంబంధాలు ఎన్నో వచ్చిన దగ్గరి సంబంధం అని దీన్ని అంటగట్టి నందుకు మనకి అవ్వాల్సిందే. అని అంటుంది అతను ఏం చేయలేక అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.
సరోజ కూడా ఏడుస్తు లోపలికి వెళ్ళి పోతుంది. అలా రోజులు గడిచాయి రోజులు గడిచే కొద్దీ ఆమెకు దినదినగండంగా ఉంటుంది. ఒకరోజు అత్త మావయ్య ఇద్దరూ బయటకు వెళ్తారు. తన భర్త ఆమెతో చాలా సేపు మాట్లాడి అతను కూడా బయటికి వెళ్తాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఒక్కటే ఒంటరిగా ఉంటుంది. అప్పుడే ఆమె భర్త స్నేహితుడైన అరవింద్ అక్కడికి వస్తాడు . అరవింద్ ఆమెతో…. సరోజ వీడు ఎక్కడికి వెళ్ళాడు.
సరోజ…. ఏమో అన్నయ్య ఇప్పుడే వస్తానని బయటికి వెళ్లాడు.
అతను…. మీ అత్త మావయ్య ఎక్కడికి వెళ్లారు.
సరోజ…. ఏమో అన్నయ్య వాళ్ళు కూడా బయటికి వెళ్లారు ఎక్కడికి వెళ్లారు నాకు తెలియదు.
అందుకు అతను…. సరే saroja ఒకవేళ మీ ఆయన గనుక వస్తే నేను ఇంటికి వచ్చి వెళ్లానని చెప్పు.
సరోజ…. తప్పకుండా చెప్తాను అన్నయ్య అని అంటుంది. అతను సరే అని చెప్పి అక్కడనుంచి వెళ్ళి పోతాడు అప్పుడే వాళ్ళ అత్తయ్య మావయ్య అతని చూస్తారు.
అతన్ని చూసిన ఆమె…. అమ్మో అమ్మో కోడలు ఇలాంటిదని అస్సలు అనుకోలేదు.
ఎవరూ లేని సమయంలో అతను ఎందుకొచ్చాడు అంటారు. ఇప్పుడే దాన్ని కడిగి పడేస్తాను. అని కోపంగా మీ దగ్గరికి వెళ్లి … ఏమి ఎవరు వాడు ఎందుకు ఎవరు లేనప్పుడు ఇక్కడికి వచ్చాడు ఎన్ని రోజులనుంచి సాగుతుంది. నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు.
సరోజ…. అత్తయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు అతను నాకు అన్నయ్యతో సమానం ఎవరో కాదు అరవింద్ అన్నయ్య మీ అబ్బాయి కోసం వచ్చాడు.
అత్తయ్య…. ఎవరు లేనప్పుడు రావాల్సిన అవసరం ఏంటి నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మడానికి ఇక్కడ ఎవరూ లేరు. నా చెవిలో పువ్వులు పెట్టాలని ప్రయత్నించకు.
ఈ విషయాన్ని భర్త చెప్పి నీకు విడాకులు ఇప్పించి చేస్తాను. అంటూ ఉండగా ఆమె భర్త అక్కడికి వస్తాడు.
వెంటనే అత్తయ్య తన కొడుకుతో….రా రా రా ఇంటి పరువు అంతా గంగలో కలిపింది నీ పెళ్ళాం. పట్టపగలే ఎవడో ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. అదేమని అడిగితే అన్నయ్య అని సాకులు చెప్తుంది.
అప్పుడు saroja ఏడుస్తూ…. ఏవండీ అరవింద అన్నయ్య మీకోసమే వచ్చాడు నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు నా మాట నమ్మండి అయ్యో భగవంతుడా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు. నన్ను పుట్టినప్పుడే చంపేయాలి సింది. అంటూ బోరున ఏడుస్తుంది.
అత్తయ్య…. ఈ ఏడుపులు ఏమి తక్కువ లేదు. ఇంక దీనికి విడాకులు ఇవ్వడం చాలా మంచిది రా.
అప్పుడు ఆమె భర్త…. అమ్మ నీకు సరోజ అంటే ఇష్టం లేదని నాకు తెలుసు. ఇప్పుడే నాకు అరవింద్ ఎదురొచ్చాడు ఎవరు లేరని చెప్పాడు. వాడు కనుక నాకు ఎదురు రాకపోతే నువ్వు చెప్పింది నేను నమ్మి నా భార్యని అపార్థం చేసుకునే వాడిని. ఇంకోసారి దయచేసి ఇలా మాట్లాడ కమ్మ. అంటూ తన భార్యని తీసుకొని లోపలికి వెళ్ళి పోతాడు.
అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది సరోజ భర్త వాళ్ళ మావయ్య ఇంట్లో లేనప్పుడు అత్తయ్య సరోజ తో…. ఒసేయ్ సరోజా నీ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదే. కట్నం డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఇస్తే మా వోడు ఏదో ఒక వ్యాపారం చేసుకునే వాడు వీడికి ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి వాటిలో ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు నువ్వు కనుక లేకపోతే ఎంత బాగుండేదో నా మాట విని ఎక్కడికైనా వెళ్లి చావే.నా కొడుక్కి బాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను మా బతుకులు అన్నా మారిపోతాయి. వాడు కూడా కోటీశ్వరుడికి అల్లుడు అవుతాడు. ఈ ఒక్క పని చేసి పెట్టు వై నీకు పుణ్యం ఉంటుంది అని నోటికొచ్చినట్టు. తిడుతూ ఉంటుంది సరోజా మాటలకి చాలా బాధ పడుతూ…. అత్తయ్య దయచేసి అలా మాట్లాడకండి అత్తయ్య. ఇప్పుడు నా ఇంటి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి. మీరు సాటి ఆడదాని బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు. కొన్ని రోజులు ఆగండి అత్తయ్య.
అత్తయ్య…. ఇంకెంత కాలం ఆగాలి తల్లి నువ్వు దయచేసి చావే. అని అంటూ ఆమెను చితక బాదుతూ చావే చావు . చావు అంటూ కొడుతుంది
పాపం saroja చాలా పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత అత్తయ్య ఆమెను బాగా కొట్టు అక్కడినుంచి కూరగాయల మార్కెట్ కి వెళుతుంది.
ఇంట్లో సరోజ ఒకటి ఒంటరిగా ఉండి ఏడుస్తూ…. భగవంతుడా ఎందుకు నాకు ఈ కష్టాలు నాకు బ్రతుకు బ్రతకాలని లేదు నేను కనుక చనిపోతే నా కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని మా అత్తయ్య చెబుతుంది నా వల్ల నా భర్తకి కూడా మంచి జరుగుతుంది అంటే నా ప్రాణాలు తీసుకోవడం మంచిది. అంటూ ఏడుస్తూ ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా. అనూష అప్పుడే అక్కడికి వస్తుంది.
సరోజ ని చూసి…. వదిన ఏమైంది అంటూ ఆమెని అడ్డుకుంటుంది. అనూష…
ఏం జరిగిందని వదిన ఇలాంటి పని చేస్తున్నావు. ఏం జరిగిందో చెప్పు నీకు వచ్చిన కష్టం ఏంటి.
అప్పుడు saroja ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెబుతుంది. దానిని అంతా విన్న అనూష…. చి చి మా అమ్మ ఇలాంటివి అనుకోలేదు. ఎలా అయినా ఆమెకు బుద్ధి వచ్చాక చేస్తాను ఆమె ఒక కూతురికి తల్లి అన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తుంది.
అని ఆమెని అరుస్తూ ఆమెకు బుద్ధి చెప్పాలని అనుకుంటుంది కొంత సమయం తర్వాత గోవిందమ్మ ఇంటికి తిరిగి వస్తుంది.
అప్పుడు అనూష ఏడుస్తూ ఇంట్లో కనిపిస్తుంది అప్పుడు గోవిందమ్మ….. అనూష ఏందమ్మా ఎప్పుడు వచ్చావు అల్లుడు రాలేదా. ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు.
అప్పుడు అనూష ఏడుస్తూ…. అమ్మ నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను నా అత్త మామయ్య నా భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారమ్మ.
గోవిందమ్మ…. ఎందుకు తల్లి వాళ్ళకి అంత కట్నం పొలం కూడా ఇచ్చాము కదా ఇంకా డబ్బులు ఎందుకు అడుగుతున్నారు.
అనూష…. మీ అల్లుడు ఏదో కొత్త వ్యాపారం మొదలు పెడతాడు అంట దానికి 15 లక్షలు కావాలంటున్నాడు 15 లక్షలు తీసుకురాకపోతే మళ్లీ ఇంటికి తిరిగి రాకు అని నన్ను పంపించాడు.
అందుకు ఆమె…. ఇప్పటికి ఇప్పుడు 15 లక్షల అంటే ఎక్కడనుంచి తీసుకురావాలి అమ్మ. అయ్యో భగవంతుడా నా కూతురికి ఎంత పెద్ద కష్టం పెట్టావు. అంటూ బోరున ఏడుస్తుంది.
అలా ఆ రోజు గడిచి పోతుంది తర్వాత మరుసటి రోజు ఉదయం అనూష భర్త అక్కడికి వస్తాడు.అప్పుడు అనూష అతనికి జరిగిన విషయమంతా చెప్పి ఒక నాటకాన్ని ఆడమని చెప్తుంది. అందుకు తను సరే అంటాడు అప్పుడు తన అత్తయ్యతో…. అత్తయ్య మీ అమ్మాయికి నేను విడాకులు ఇస్తున్నాను నాకు ఒక మంచి సంబంధం వచ్చింది బాగా డబ్బున్న వాళ్ళు. ఆ అమ్మాయిని చేసుకుంటే నా జీవితం మారిపోతుంది.
గోవిందమ్మ…. బాబు ఎందుకు బాబు దాని గొంతు కోస్తావు. అది అమాయకురాలు దానికి ఏం తెలీదు. నువ్వే ప్రపంచంలా భావిస్తుంది . నువ్వు అడిగిన డబ్బు ఏదో ఒక విధంగా కొంచెం ఆలస్యమైనా మేము ఏర్పాటు చేస్తాం నువ్వు మాత్రం అలాంటి పనులు చేయకు.
అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
అతను…. అవన్నీ కుదరదు నాకు విడాకులు కావాల్సిందే.
గోవిందమ్మ…. బాబు నీ కాళ్లు పట్టుకుంటాను అలా మాట్లాడకు అని అతను పాదాలపై పడుతుంది. అప్పుడు అనూష ఆమెను పట్టుకొని పైకి లేపి…. అమ్మ నువ్వు నీ కూతురు గురించి ఇంతగా బాధపడుతున్నావు. మరి నీ కోడలు విషయంలో ఎందుకు అలా లేవమ్మా. నీ కూతురు ఒక న్యాయం నీ కోడలకి ఒక న్యాయమా.మన ఇంటి పరిస్థితి ఎలా ఉందో వదిన వాళ్ళ ఇంటి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ఒక్క నిమిషమైనా ఆలోచించావా అమ్మ. ఆమెని ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టావు. పాపం వదినా నేను ఒక్క నిమిషం కనుక ఆలస్యంగా వచ్చినట్లయితే చచ్చి శవం లాగా మారేది ఆ ఉసురు ఎవరికీ అమ్మ.
అని అంటుంది. గోవిందమ్మ మాటలకి ఒక్క నిమిషం ఆలోచిస్తూ నిలబడుతుంది.
అనూష…. అమ్మ నీలో మార్పు కోసమే మేము ఒక నాటకం ఆడాము. నీ కూతురికోసం అల్లుడు కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డావ్వు. మీ కోడలు లో నీ కూతురు చూసుకుంటే ఇదంతా జరిగేది కాదు.
అప్పుడు గోవిందమ్మ తన కోడల్ని గట్టిగా పట్టుకొని పెద్దగా ఏడుస్తూ….. అమ్మ సరోజ నన్ను క్షమించు. నేను నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. నావల్ల నువ్వు చావడానికి కూడా సిద్ధపడ్డావ్వ తల్లి నా లాంటిది భూమ్మీద ఉండకూడదు నన్ను క్షమించు అమ్మ అని ఉంటుంది.
అందుకు సరోజ…. పెద్ద వాళ్ళు అలా మాట్లాడకండి అత్తయ్య అంటూ కంటి నీరు తుడుస్తుంది ఇక ఆ రోజు నుంచి గోవిందమ్మ పూర్తిగా మారిపోయి సరోజ నీ చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *