ఒక పాప కథ | Telugu kathalu | Telugu Stories |Bedtime Dreams Telugu | Kattapa kathalu

అది ఒక నదీ ప్రవాహం . ఆ నది ప్రవాహంలో శ్రీదేవి అనే ఒక ఆమె కొట్టుకుంటూ …. కాపాడండి ఎవరైనా కాపాడండి. దయచేసి నన్ను కాపాడండి. అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రజిని వాళ్ల కూతురు దివ్య ఆమె కేకలు వింటారు దివ్య వెంటనే ఆ నదిలోకి దూకి ఈదుకుంటూ ఆమెను తీసుకొని బొడ్డు కు వస్తుంది. రజిని ఆమెను చూసి….. ఎవరు మీరు ఇలా నది ప్రవాహంలో కొట్టుకొని రావడానికి కారణం ఏమిటి.
అప్పుడు ఆమె…. మీ అమ్మాయి నా ప్రాణాలు కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు . ఇంత చిన్న వయసులో ఈమె ఎలా ఈ గలుగుతునుదొ ఏమో కానీ. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటూ ఏడుస్తూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
రజిని….. అది సరే కానీ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అసలు మీరు ఎవరు . ఎందుకిలా ప్రవాహంలో కొట్టుకు వచ్చారు ప్రమాదవశాత్తు జరిగిందా . లేక ఏదైనా !?
అందుకు ఆమె ఏడుస్తూ …. మీరు రెండోసారి అన్నదే సరైనది . మా అత్తయ్య నన్ను కావాలని ఈ నదిలో తోసేసింది. ఎందుకంటే నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని మాది ప్రేమ వివాహం. మా పెళ్ళి జరిగి పట్టుమని వారం రోజులు కూడా కాలేదు. ఆమె నన్ను ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు. అంటూ ఏడుస్తుంది రజిని…. అయ్యో మీరు బాధపడకండి. అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు . ఇక్కడే మా ఇల్లు వెళ్దాం పదండి అంటూ ఆమెను తీసుకొని. వాళ్ళ ఇంటికి వెళ్తారు. రజిని…. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు.
ఆమె… నా పేరు కావేరి. ఊరు కోదాడ.
అని వాళ్ళ కుటుంబం గురించి మొత్తం చెప్తుంది.
రజిని….. నా పేరు రజని నా కూతురు పేరు
దివ్య. మేము ఇక్కడే నదిలో చేపల వేటకు వెళుతూ ఉంటాము. నా భర్త చనిపోవడంతో మేము ఈ పని చేయాల్సి వస్తుంది.
ఆ మాటలు విన్న కావేరి…. అధిక సరే దివ్య చాలా తెలివైన అమ్మాయిలా ఉంది ఇంత చిన్న వయసులో ఎలాగా ఆమె ఈదుతూ నన్ను కాపాడు కలిగింది.
రజిని…. అదంతా వాళ్ళ నాన్న ఆమెకు నేర్పించినది. చాలా తెలివైనది చదువుకుంటూనే నాతో పాటు చేపలవేటకు వస్తుంది. ఇంతలో కావేరీ భర్త ఆమెను వెతుక్కుంటూ…. కావేరి ఎక్కడున్నావ్ కావేరి కావేరి ఎక్కడున్నావ్ కావేరి. అంటూ ఆమెను వెతుక్కుంటూ వస్తాడు ఆ కేకలు విన్న ఆమె…. నా భర్త కేక లాగా ఉన్నాయి అంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఏవండీ ఏవండీ అంటూ పిలుస్తూ అతని దగ్గరికి వెళుతుంది.
ఆమెను చూసిన అతను ఎంతో సంతోషపడుతూ…. కావేరి నీకు ఏం కాలేదు కదా.
ఆమె… లేదండి సమయానికి ఈ కుటుంబం వాళ్ళు కాపాడే కాబట్టి సరిపోయింది లేదంటే నేను ఉండేదాన్ని కాదు . మీ అమ్మ గారు ఇదంతా చేశారు.
ఆ మాటలు విన్న అతను… . తెలిసింది కావేరి నా స్నేహితుడి భార్య మా అమ్మ నేను నదిలో నెట్టేయడం చూసి నా దగ్గరకు వచ్చి చెప్పింది.
నేను మా అమ్మ తో గొడవ పెట్టుకుని ఆమె తో కాదు అని చెప్పి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను.
ఇంతలో రజనీ దివ్య అక్కడికి వస్తారు.
రజనీని చూసిన కావేరి భర్త…. అక్క నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు ఇక్కడ ఉంటున్నావా .
అని అంటాడు.
రజిని…. తమ్ముడు వరుణ్ ఎలా ఉన్నావ్ రా నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది . ఈమె నీ భార్య.
వరుణ్…. అవునక్కా ఈమె నా భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మన ఇంటి సంగతి మీకు తెలిసిందే కదా . అమ్మ ఇలాంటి పని చేస్తుందా అని అస్సలు అనుకోలేదు.
అప్పుడు రజిని….. అమ్మ సంగతి తెలియక పోవడం లో నాకు ఆశ్చర్యం ఏముంది వరుణ్.
నేను ప్రేమ వివాహం చేసుకున్న నే కదా నన్ను నా భర్తని చంపాలని ప్రయత్నించింది. అందుకే దూరంగా వచ్చేసాము . ఇదిగో ఇక్కడే ఉంటున్నాము.
వరుణ్ ఇదిగో మీ మేనకోడలు దివ్య.
అంటుంది. అతను దివ్య తో….. చూడు దివ్య నేను మీ మామయ్యను. అని అంటాడు అందుకు ఆమె చాలా సంతోష పడుతూ…. మిమ్మల్ని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది మామయ్య . అత్త చాలా బాగుంది మామయ్య. అంటుంది అందుకు ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు.
వరుణ్… అది సరే కానీ బావ ఎక్కడ అక్క.
రజిని…. బావా మనకి లేడు. ఆయన నది సుడిగుండంలో కొట్టుకొని చనిపోయాడు.
అంటూ ఏడుస్తూ చెబుతుంది.
ఆ మాటలు విన్న అతను…. బాధపడకు అక్కా అంటూ ఆమెను ఓదారుస్తాడు.
ఆ తర్వాత అందరూ ఆ ఇంట్లోకి వెళ్ళారు.
వరుణ్…. అక్క ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుంటాము.
ఆమె….. ఇక్కడే ఉండు రా . తమ్ముడు ఇక్కడ ఉంటాను అంటే ఏ అక్కకు అయినా ఆనందమే ఉంటుంది. కానీ అభ్యంతరం లేకపోతే అనే పదమే నాకు నచ్చలేదు. అని అంటుంది అందుకు అతను…. క్షమించు అక్క పొరపాటున నోరు జారాను. అని అంటాడు.
ఇక అప్పటి నుంచి వాళ్లు ఇద్దరూ కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. ఆ రోజు గడిచిపోయింది ఆ మరుసటి రోజు ఉదయం రజిని తమ్ముడితో….. వరుణ్ నీవు చేపల వేటకు వెళ్తున్నాము మీరిద్దరూ జాగ్రత్త.
అతను…. అక్క నేను కూడా వస్తాను. చేపలు పట్టడం నేర్చుకుంటాను.
అందుకు ఆమె ….. సరే రా. అయితే దివ్య నువ్వు అత్త కి తోడుగా ఉండు.
అని అంటుంది ఆమె సరే ఉంటాను అని సమాధానం చెబుతుంది. ఆ తర్వాత ఆ అక్కాతమ్ముళ్ల ఇద్దరూ చేపలవేటకు నది కి వెళ్తారు. అక్కడ ఆమె వలవిసిరి చేపలు పడవలోకి లాగుతుంది. దాన్ని చూసిన అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు.
రజిని….. ఏమైంది రా వరుణ్ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నావు.
అతను….. ఏం లేదు అక్క. ఏం లేదు అక్క చిన్నప్పుడు మనం సరదాగా ఒకరిని ఒకరు కొట్టుకొని తిట్టుకునే వాళ్ళం . అమ్మ నీకు ఏ పని చెప్పినా అసలు చేసే దానివి కాదు. ఇంకోటి నీకు గుర్తుందా అమ్మ చేపల కూర వండితే. ఆ వాసన నచ్చదు అని దూరంగా వెళ్లిపోయి అసలు భోజనం చేయకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి.
కానీ ఇప్పుడు ఇంత నీచు వాసన వస్తుంది . ఇంత కష్టమైన పని చేస్తున్నావు . బంధాలకు విలువ ఇస్తున్నావు నువ్వు చాలా మారిపోయావు అక్క .
రజిని…. చిన్నప్పుడు జీవితం వేరు కదా వరుణ్ అప్పుడు తెలిసి తెలియని వయసు. పెళ్లయిన తర్వాత జీవితం నాకు చాలా నేర్పించింది . మీ అందరికీ దూరం అయిన తర్వాత బంధాల విలువ ఏంటో నాకు తెలిసింది. ఇక మీ బావ నాకు సరదాగా నేర్పించిన చేపల వేట . మా జీవితాలు గడపడానికి ఆధారంగా నిలిచింది. అయినా ఎప్పుడు సంతోషంగా ఒకేలాగా సాగిపోతుంది అనుకోవడం సరైనది కాదు కదా వరం జీవితం అంటేనే ఒక రంగుల రత్నం. అని అంటుంది
వరుణ్…. నిజమే అక్క జీవితం చాలా నేర్పిస్తుంది. అది సరే కానీ నాకు కూడా చేపలు పట్టడం నేర్పించు అక్క నేను దానికోసమే ఇంత దూరం వచ్చాను. అందుకు ఆమె సరే అంటూ అతనికి వల వేసి చేపలు పట్టడం నేర్పిస్తుంది .
కొన్ని రోజులకి అతను చేపలు పట్టడం నేర్చుకుంటాడు. అక్క తమ్ముడు వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అలా ఉండగా ఒకరోజు దివ్య వరుణ్ తో…. మావయ్య మావయ్య ఈరోజు నాకు బడికి సెలవు. ఈరోజు మనిద్దరం చేపలవేటకు వెళ్దామా. అందుకు తను సరే అంటాడు ఇద్దరు కలిసి చేపల వేట కి వెళ్తారు రజిని, కావేరి ఇద్దరు ఇంటి పని చేసుకుంటూ ఉంటారు. అలా నది కి వెళ్ళిన వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
అక్కడ వరుణ్ వలను విసురుతాడు. కొంత సమయానికి వాళ్ళలో చేపల పడతాయి.
దివ్య…. మావయ్య బలంగా లాగండి.
అంటూ కేకలు వేస్తోంది అతను లాగుతూ ఉంటారు కానీ బలంగా ఉండడంతో.
ఆ తాకిడికి తట్టుకోలేక నదిలో పడిపోతాడు.
అతను…. కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ ఉంటాడు దివ్య. వెంటనే పడవలో ఉన్న తాడు ని తీసుకొని నదిలోకి దూకి అతనికి కట్టి. ఈత ఈదుకుంటూ అతన్ని పడవలోకి ఎక్కిస్తుంది.
అతను ఊపిరి పీల్చుకొని…. దివ్య నువ్వు లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో ఏమో. నీకు ఈత కూడా వచ్చా దివ్య.
దివ్య…. వచ్చి మామయ్య అత్తయ్య ని కూడా కాపాడింది నేనే. నాకు మా నాన్న ఇది నేర్పించారు నేను మా అమ్మకి నేర్పించాను ఇప్పుడు నీకు కూడా నేర్పించాల్సిన సమయం వచ్చింది . చేపల వేటకు వెళ్లే వాళ్లకి ముఖ్యంగా కావలసింది ఈత కదా మావయ్య అంటుంది.
వరుణ్….. అవును ముఖ్యంగా కావలసింది అయితే నాకు నేర్పించు దివ్య.
దివ్య…. సరే మావయ్యా మనం ఇక్కడ నుంచి చెరువులో కి వెళ్దాం అది లోతు తక్కువగా ఉంటుంది. మీరు సులభంగా ఈత నేర్చుకోవచ్చు. అని అంటుంది ఎందుకు సరే అంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ పడవ సహాయంతో బొడ్డు కి వస్తారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చెరుకు వెళ్తారు అక్కడ దివ్య అతనికి ఈత నేర్పిస్తుంది. అతను ఆ రోజు మొత్తం ఈత నేర్చుకుంటారు ఇక అతను స్వయంగా ఆ చెరువులో ఈదడం మొదలుపెడతాడు అతను చెరువులో ఈదుతూ….. దివ్య నాకు ఈత వేయడం వచ్చేసింది దివ్య . అంటూ ఆనందంతో కేకలు వేస్తాడు. దివ్య చాలా సంతోషపడుతుంది.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లిపోతారు . ఆ విధంగా వాళ్ళు చేపల వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఒకరోజు ఆ కుటుంబమంతా కలిసి భోజనం చేస్తే సంతోషంగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే వరుణ్ , రజిని ల తల్లి అయిన శారదాదేవి అక్కడికి వస్తుంది.
తల్లినీ చూసి వాళ్ళు ఆశ్చర్య పోతూ ఉంటారు.
ఆమె…. నాకు భోజనం పెట్టనా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం భోజనం పెట్టాలని తెలియదా. అని అడుగుతుంది అందుకు రజిని…. ఎందుకు పెట్టామి అమ్మ తప్పకుండా పెడతాం ఇలా రా అమ్మ కూర్చో అంటూ ఆమెను కూర్చోబెట్టి భోజనాన్ని వడ్డిస్తుంది.
అందరూ భోజనం చేస్తారు.
శారదా దేవి ఏడుస్తూ…. మీరందరూ నన్ను క్షమించాలి. నేను మీ పట్ల చాలా కఠినంగా ప్రవర్తించాను. నాకు బుద్ధొచ్చింది. నన్ను క్షమించండి. ఒకరోజు నాకు జ్వరం తగిలితే పట్టించుకునేవారు లేరు . చుట్టూ పక్కల పలకరించే వాళ్ళు లేరు. అప్పుడు అనిపించింది నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను అని . కష్టసుఖాల్లో నా అనుకున్న వాళ్లు కావాలి. అంటూ ఏడుస్తుంది ఆ మాటలు విన్న ఆ కొడుకు కూతురు ఇద్దరు దగ్గరికి వెళ్లి….. అమ్మ నువ్వు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి అమ్మ. మేమిద్దరం ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాము. మమ్మల్ని చదివించి గొప్ప ప్రయోజకుల్ని చేశావు కానీ. మేము కూడా మీ మాట వినకుండా పెళ్లిళ్లు చేసుకుని పొరపాటు చేశాము.
మాది కూడా తప్పు ఉంది.
ఆమె…. లేదు బాబు మీరు మీకు ఇష్టమైన వాళ్ళని వెతుక్కున్నారు. మీ సంతోషం మేము కోరుకున్నప్పుడు. మీరు చేసినదాన్ని మేము సంతోషంగా తీసుకోవాల్సింది కానీ సమాజం ఏమంటుందో అన్న భయంతో వ్యతిరేకించడం వల్లే ఈ సమస్యలు ఎన్ని వచ్చాయి. ఇక ఈ సమస్యలన్నిటికీ వీడ్కోలు పలుకుదాం. అందరం వెళ్లి సంతోషంగా బతుకుదాం పదండి మన ఇంటికి వెళ్దాం అంటుంది. అందుకు వాళ్లు చాల సంతోషపడుతూ సరే అంటారు అందరు కలిసి ఆమెతోపాటు వెళ్ళిపోతారు. ఇక ఆమె తప్పు తెలుసుకోవడంతో అందరూ కలిసి సంతోషంగా అక్కడే ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *