ఓ అమ్మ కథ | Telugu kathalu | Telugu Stories |Bedtime Dreams Telugu | Kattapa kathalu

shankarapalli అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విష్ణు , రాధిక అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకి ఇద్దరు పిల్లలు. కావేరీ కీర్తి, . వాళ్ళది చాలా పేద కుటుంబం . కావేరి పెద్దది అలాగే బాగా చదువుకుంటూ ఉంటుంది. అలాగే చాలా తెలివైనది. చిన్నమ్మాయి కీర్తి చిన్నపిల్ల కావడంతో అన్ని తెలివితేటలు ఉండేవి కాదు.
భర్త ఏ ఊర్లో పనులు ఉంటే ఆ ఊరికి వెళ్తాడు.
రాధిక ఇంటిపని చూసుకుంటూ ఉంటుంది. విష్ణు ఎప్పటిలాగే తన భార్యతో…. రాధిక నేను ఈరోజు నాలుగు ఊర్లు అవతల ఉన్న గ్రామానికి వెళ్తున్నాము నెల రోజుల తర్వాత తిరిగి వస్తాము. అప్పటివరకు నువ్వు పిల్లలు జాగ్రత్తగా ఉండండి . ఇదిగో ఈ డబ్బులు తీసుకో జాగ్రత్తగా ఖర్చు పెట్టు అని చెప్పి డబ్బులు ఇస్తాడు ఆమె డబ్బులు తీసుకొని అతనితో…. జాగ్రత్తగా వెళ్లి రండి అని చెప్తుంది . అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా నెల రోజులు గడిచాయి ఊరికి వెళ్ళిన వాళ్ళు అంతా తిరిగి వస్తారు తన భర్త రాకపోవడంతో. వాళ్ల బాబాయి అయినా రామయ్య అటుగా వెళ్లడం చూసి …. బాబాయ్ బాబాయ్ నా భర్త తిరిగి రాలేదు ఏంటి . పనికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు కదా . అందుకు అతను…. మీ ఆయన ఏదో పని ఉందని చెప్పి ఆగడు అమ్మా ఇదిగో ఈ డబ్బులు నీకు ఇవ్వమని చెప్పాడు. నేను నీ దగ్గరికి వస్తుంటే నువ్వే నాకు ఎదురు వచ్చావ్. అని అంటాడు అందుకు ఆమె డబ్బులు తీసుకొని సరే అంటుంది తన మనసులో….. అదేంటి అందరూ వచ్చి నా భర్త రాకపోవడం. ఆయనకు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు అంత పని ఏముంది .
అని అనుకుంటుంది రోజులు గడిచాయి అతను మాత్రం ఎంతని కి తిరిగి రాకపోవడంతో ఆమె చాలా కంగారు పడుతూ తన బాబాయ్ అయినా రామయ్య దగ్గరకు వెళ్లి మీ దగ్గరకు వెళ్లి ….. బాబాయ్ ఇన్ని రోజులు నా భర్త నన్ను, పిల్లల్ని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు. నాకెందుకు చాలా కంగారు గా ఉంది. నిజం చెప్పు బాబాయ్ నా భర్త ఎక్కడికి వెళ్ళాడు.
అందుకు అతను…. అమ్మ రాధిక నన్ను క్షమించమ్మా. ఏం చెప్పాలి నీకు ఆ రోజు మేము పంది కోసం వెళుతూ ఉంటే మార్గ మధ్యలో ఒక లారీ వాడు సరాసరి నా మీదకు రాబోతుండగా నన్ను కాపాడడం కోసం మీ భర్త బలైపోయాడు. అక్కడికక్కడే నీ భర్త చనిపోయాడు. అని జరిగిన విషయం చెప్తాడు ఆ మాటలు విన్న భార్య ఏడుస్తూ…. బాబాయ్ మరి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు బాబాయ్ . మరి ఈ డబ్బులు అన్నీ నెల నెల ఎవరు పంపిస్తున్నారు. నువ్వు నాకు ఎందుకు వచ్చి ఇస్తున్నావు.
అతను…. ఆ డబ్బులు నేను ఇచ్చాను అమ్మ . నీ పిల్లలు నువ్వు బతుకుతారనీ . డబ్బులు సాయం చేశాను. అంతే తల్లి. అని చెప్తాడు ఆమె ఏడుస్తూ…. బాబాయ్ మీకు చాలా కృతజ్ఞతలు కానీ నాకు నా భర్తను చివరి చూపు కూడా చూసుకో లేదు అంటూ చాలా ఏ బాధపడుతూ అక్కడినుంచి ఇంటికి వెళ్తుంది .
రోజులు గడిచాయి ఆ విషయం పిల్లలకి ఆమె ఏ మాత్రం చెప్పదు. పెద్దమ్మాయి…. ఆమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు. ఎన్ని రోజులు అయినా కూడా ఇక్కడికి రాలేదు ఎందుకు. అని అడుగుతుంది అందుకు ఆమె …. నాన్న పనిమీద ఊర్లో ఉన్నారు అమ్మ . రావడానికి చాలా సమయం పడుతుందని Ramayan తాత కి చెప్పి పంపించాడు.
అని అని చెబుతుంది అందుకు వాళ్లు సరే అంటారు. ఆ కుటుంబ పరిస్థితి సరిగా లేకపోవడంతో తల్లి రోజూ అడవికి వెళ్లి. కట్టెలు కొట్టుకొని . వాటిని ఊరు మొత్తం తిరిగి అమ్మి . వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఉండేది.
అలా ఆ కుటుంబం చాలా పేదరికంతో బాధపడుతున్నప్పటికీ ఆ విషయం పిల్లలకి తెలియకుండా తను ఒక్క పూట భోజనం చేసి పిల్లలకి మూడుపూటలా కడుపునిండా పెడుతుంది.
ఆమె రాత్రి సమయంలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ….. ఓరి భగవంతుడా ఎందుకు ఇలాంటి పని చేస్తా. నా భర్తని నాకు కాకుండా చేసి చాలా పెద్ద పొరపాటు చేశావు. ఇలాంటి ఒక రోజు వస్తుందని మేము ఊహించలేదు. జీవితాంతం కలిసి ఉంటాడని అనుకున్నాను . ఎన్నెన్నో కలలు కన్నాను జీవితం గురించి అన్ని బూడిదలో కలిపిన పన్నీరు గా మార్చేసావు. అంటూ జరిగిపోయిందని తలుచుకుంటూ చాలా బాధపడుతుంది.
అలా రోజులు గడిచాయి ఒక్కరోజు పిల్లలిద్దరూ ఇంటిదగ్గర ఉంటారు.
ఆమె పిల్లలతో….. పిల్లలు నేను అడవికి వెళ్లి కట్టెలు తీసుకుని వస్తాను మీరు జాగ్రత్తగా ఉండండి. అని అంటుంది అందుకు వాళ్లు… ఈరోజు మేము కూడా నీతో పాటు వస్తాము అమ్మ. ఆమె…. ఓద్దమ్మ అడవిలో పులులు ఉంటాయి. చాలా ప్రమాదం మీరు ఇక్కడ ఆడుకుంటూ ఉండండి .
నేను అలా వెళ్లి ఇలా వస్తాను.
అంటుంది అందుకు పెద్ద కూతురు…. పులి ఉంటే మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావ్ అమ్మ నువ్వు కూడా ఇంటి దగ్గరే ఉండొచ్చుగా .
అందుకు ఆమె…. ఇంటి దగ్గరే ఉంటే మన ఇల్లు గడవడం కష్టం అయిపోతుంది కదా అమ్మ.
కూతురు…. నాన్న మనకు డబ్బులు పంపిస్తాడు కదమ్మా . మరి ఇప్పుడు డబ్బులు కూడా పంపించడం లేదు నువ్వు నిజం చెప్తావా లేదా. నాన్న అసలు ఎక్కడికి వెళ్లాడు.
తల్లి…. మీ నాన్న ఊరు వెళ్ళాడు అని చెప్పాను కదా ఇంక నన్ను దాని గురించి పదేపదే ప్రశ్నిస్తారు ఎందుకు . ఎన్నిసార్లు చెప్పినా అదే మాట కదా. నాన్న వస్తారు త్వరలోనే తిరిగి వస్తారు అని చెప్పి అక్కడి నుంచి అడవి కి వెళ్తుంది.
ఆమె వెళుతూ వెళుతూ తన మనసులో…. ఈ పిల్లలకి నేను ఏం సమాధానం చెప్పాలి భగవంతుడా . పదే పదే వాళ్ళు నాన్న ఎక్కడ అమ్మా నాన్న ఎక్కడమ్మా అంటే . నేను ఆయన్ని ఎక్కడనుంచి తీసుకురావాలి.
అంటూ బాధపడుతూ అడవి కి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా తన పెద్ద కూతురు తన చెల్లిని తీసుకొని రామయ్య దగ్గరికి వెళుతుంది.
అక్కడ రామయ్య తో….. తాత నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పావు కదా.
అబద్ధం చెప్పనని నా మీద ఒట్టు వెయ్యి.
అందుకు తను సరే అని చెప్పి…. అదిగో ఒట్టు
వేస్తున్నాను నేను అబద్ధం చెప్పను.
అందుకు ఆమె…. మా నాన్న ఎక్కడికి వెళ్లి పోయాడు. అబద్ధం చెప్పను అని చెప్పావు నిజం చెప్పు .
అందుకు అతను… మీ అమ్మ ఏం చెప్పిందో అదే నిజం. ఆమె…. మా అమ్మ మా నాన్న చనిపోయాడని చెప్పింది .
అందుకు అతను….. అదే నిజం తల్లి మీ నాన్న చనిపోయాడు అంటూ జరిగిన విషయమంతా చెప్తాడు. అందుకే ఆమె ఏడుస్తూ…. అంటే మా నాన్న చనిపోయాడా మా అమ్మ నాకు ఏ విషయం చెప్పలేదు మీరే నిజం చెప్పారు అంటూ ఏడవడం మొదలు పెడతారు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు .
అతను వాళ్ళని ఊరుకోమని ఓదారుస్తాడు
ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు . కొంత సమయం తర్వాత తల్లి కట్టెలు అమ్ముకొని ఇంటికి తిరిగి వస్తుంది. ఆ పిల్లలిద్దరూ ఏడవడం చూసి ఆమె చాలా కంగారు పడుతూ…. ఏమైందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నారు ఏం జరిగిందో చెప్పండి. అందుకు వాళ్ళిద్దరూ…. నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్తున్నావు . మా నాన్న చనిపోయాడు అని నిజం ఎందుకు దాచిపెట్టావ్వి. అంటూ ఏడుస్తూ ఆమె నిలదీస్తారు . ఎందుకు ఆమె ఏడుస్తూ జరిగిన విషయం చెప్పి చాలా బాధపడుతు….. మీరు ఇలా బాధ పడతారు అనే ఆ విషయాన్ని దాచి పెట్టాను అమ్మ అంటూ ఏడుస్తుంది.
రోజులు గడిచాయి ఆమె కట్టెలు కొట్టు కుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది . అలా ఉండగా ఆ ఇద్దరు కూతుర్లు మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చి…. అమ్మ మాకు ఈ రోజు బడికి సెలవు దయచేసి మమ్మల్ని ఈ రోజైనా అడవి కి తీసుకెళ్ళు . అంతకు ముందు ఒకసారి అడిగినా కూడా నువ్వు కుదరదు అని చెప్పావు దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళు లేదంటే మేము ఇద్దరం వెళ్తాము .
ఆ మాటలకి తల్లి …. సరే వద్దులే అమ్మ నేను నేను మిమ్మల్ని తీసుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ . అక్కడ ఒక పెద్ద పులి ఉంది అది నాకు ఎన్నిసార్లు కంట పడిందో నాకు తెలుసు. అందుకే నేను భయపడుతున్నాను.
కూతురు….. నువ్వు ఉన్నావు కదా మాకు ఏమీ కాదు. మేము కూడా పులి ని చూసినట్టు ఉంటుంది అడవిని కూడా చూసినట్టు ఉంటుంది. అని బ్రతిమిలాడి ఉంది ఇక తప్పనిసరై తల్లి వాళ్ళిద్దరూనీ కూడా తనతో పాటు అడవికి తీసుకెళ్లాల్సి వస్తుంది.
ఇక ముగ్గురు అలా అడవి కి వెళ్తారు.
ఆ పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉండగా తల్లి కట్టెల కొడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళకి ఒక పెద్ద శబ్దం వినబడుతుంది. అదే పులి గాండ్రింపు. వాళ్లంతా చాలా భయపడుతూ ఉంటారు అప్పుడు వాళ్ల మందికి పులి రానే వస్తుంది ఆ తల్లి చిన్న బిడ్డను సంకన పెట్టుకుని. పరుగులు తీస్తుంది పెద్ద బిడ్డ ఆమెతో పాటు పరుగులు తీస్తుంది అలా వాళ్ళు పరిగెడుతూ ఉంటారు . వాళ్ల వెనక పులి పరిగెడుతూ ఉంటుంది.
అలా పరిగెడుతూ ఉండగా తల్లికి ఒక కొండ కనబడుతుంది ఆ కొండ కింద నది తల్లికి ఏం చేయాలో అర్థం . కాదు ఇక తప్పనిసరై పూలి నుంచి తప్పించుకోవడం కోసం ఆ నీటిలో కి దూకుతుంది. ఆ నీటిలో వాళ్లు కొట్టుకు పోతూ ఉంటారు. ఆమె… వద్దు అన్న మీరు ఇక్కడికి వచ్చారు . నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు భగవంతుడా నా బిడ్డలు ఇద్దర్ని కాపాడు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. అని అనుకుంటూ దేవున్ని ప్రార్ధిస్తుంది అప్పుడే ఆమెకి ఒక చెట్టు కొమ్మ అడ్డం వస్తుంది.
ఆమె దానిని పట్టుకొని తన చిన్న బిడ్డను చెట్టు పైకి పంపిస్తుంది. ఆ తర్వాత పెద్ద బిడ్డను కూడా పంపిస్తుంది.
ఆ చెట్టుకు మా బలహీనంగా ఉండడంతో ఆమె….. నేను కూడా ఎక్కాలి అంటే ఆ కొమ్మ చాలా బలహీనంగా ఉంది. నేను ఎక్కితే నా ఇద్దరు బిడ్డలు కూడా మళ్లీ నది లో పడిపోతారు అని అనుకుంటూ.
పెద్ద బిడ్డ తో….. అమ్మ ఇకనుంచి నేను లేను. ఈరోజు నుంచి చెల్లి ని జాగ్రత్తగా చూసుకో.
చెల్లికి ఏ లోటు రాకుండా ఉండాలి. అంటూ జాగ్రత్తలు చెబుతుంది. ఆ
ఇద్దరు బిడ్డలు తల్లిని చూస్తూ…. అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ. ఆమె అలా నదిలో ఉండగా
ఒక పెద్ద ముసలి ఆమె దగ్గరకు వచ్చి. పెద్దగా నోరు తెరుస్తుంది. ముసలి ని చూసిన ఇద్దరు పిల్లలు పెద్దగా….. అమ్మ అంటూ అరుసారు ఆ తర్వాత ఏం జరిగిందో
తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *