ఓ ఏనుగు కథ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఉదయకాల సమయం సంజీవ్ మరియు అతని ఏనుగు సంజీవ్ బస్సు ని శుభ్రం చేస్తూ ఉంటారు. ఆ ఏనుగు నీటిని తీసుకొస్తూ ఉండగా ఆ నీటితో బస్సు శుభ్రం చేస్తూ తన ఏనుగుతో…. రే గణేష్ ఈ దెబ్బకి మన బస్సు తల తల మెరిసి పోవాలి. చూసేవాళ్ళకి ఈరోజే కొన్నట్టు గా ఉండాలి.

ఏనుగు…. సరే సరే అన్నట్టుగా తల ఊపుతుంది. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి….. ఉండే సంగతి తర్వాత కానీ ముందు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు లేదంటే ఈ బస్సు తీసుకెళ్ళిపోతాను.
అందుకు సంజీవ్ అతని వైపు చూసి….. ఆ షావుకారి గారు మీరు రండి రండి నేను మీకు ఇస్తాను అని చెప్పాను కానీ నాకు ఇవ్వాల్సిన వాళ్ళు. ఇంకా ఇవ్వలేదు వాళ్ళు ఇస్తే వెంటనే మీకు ఇచ్చేస్తాం అండి.
అందుకే అతను చాలా కోపంగా…. నువ్వు ఇస్తూనే ఉంటావు నేను తీసుకుంటూనే ఉంటాను. తాను దూర సందు లేదు కానీ మెడకో డోలు అన్నట్టు నీకు తినడానికి గతి లేదు కానీ మళ్లీ ఆ ఏనుగు అవసరమా నీకు.
అందుకు సంజీవ్….. షావుకారు గారు మాటలు కొంచెం జాగ్రత్తగా రానివ్వండి. అయినా నా ఏనుగు తో నీకేం పని. అసలు ఇది ఉంది కాబట్టే నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను లేదంటే నాతో పాటు నీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా పోయేవి.
నీ కావాల్సిన డబ్బులు లే గా రెండు రోజులో ఇచ్చేస్తాను లే.
అందుకు అతను…. తీసుకునేటప్పుడు మాత్రం మర్యాద తీసుకుంటారు ఇవ్వడానికి వచ్చేటప్పటికి మాత్రం ఇలాగే మాట్లాడుతారు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు.
అప్పుడే అక్కడికి సంజీవ్ స్నేహితుడైన
లక్ష్మణ్ అక్కడికి వస్తాడు. లక్ష్మణ్ సంజీవని చూసి… ఏరా అందరితో గొడవలు ఇంకా పెట్టుకునే ఉన్నావా. ఆ మాటలు విన్న సంజీవ్ లక్ష్యం వైపు చూసి … మిత్రమా చాలా రోజుల తర్వాత వచ్చావు అంటూ అతన్ని కౌగిలించుకున్నాడు.
అతను…. అది సరే కానీ అతనికి ఎంత డబ్బులు ఇవ్వాలి.
సంజీవ్….బస్సు కొనడానికి అతని దగ్గర అప్పు చేశాను రా అంత ఇచ్చేశాను ఇంకో 50 వేలు బాకీ ఉన్నాయి. దానికోసమే రెండు రోజులకోసారి నా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు.
అందుకు లక్ష్మణ్…. ఇదిగో 50,000 రూపాయలు తీసుకొని ముందు ఆయనకు ఇచ్చి రా పో.
సంజీవ్ కంటతడి పెట్టుకొని…. మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు రా అంటూ వాటిని తీసుకొని పరుగు పరుగున వెళ్లి ఆ షావుకారి చేతిలో పెట్టి …. ఇంక నువ్వు ఎప్పుడూ నా గురించి కానీ నా ఏనుగు గురించి కానీ మాట్లాడ్డానికి వీల్లేదు. నీతో నాకు బాకీ చెల్లిపోయింది అని చెప్పి అక్కడి నుంచి తిరిగి తన స్నేహితుడు దగ్గరికి వస్తాడు.
అప్పుడు తన స్నేహితుడితో…. ఏరా ఇన్ని రోజులకు గుర్తొచ్చానా నేను.
అతను….. కొంచెం పని హడావిడిలో ఉన్నాను రా అసలు ఇంత హడావిడి లో రెండు చేతుల డబ్బు సంపాదించడం అంటే కేవలం నీ వల్లే కదా మిత్రమా నువ్వు ఆ రోజు డబ్బు సహాయం చేయకపోతే నేను ఈ రోజు ఇంత మంచి స్థాయిలో ఉండేవాడిని కాదు. నీకు నేను ఎంత ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను.
అవును ఇందాక ఏదో ఈ ఏనుగు గురించి మాట్లాడుతున్నావు ఏంటిరా అది.
అందుకు అతను…. చెప్తాను ముందు ఇంట్లో పద నేను వస్తున్నాను అని చెప్పాడు అతను సరే అని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళి పోతాడు ఆ తరువాత సంజీవ్ తన ఏనుగుతో…. రే గణేష్ మన మిత్రుడు మన ఇంటికి వచ్చాడు. వాడి కోసం బజారుకు వెళ్లి ఆ సింగయ్య దగ్గర నా
పేరు చెప్పి వాడి దగ్గర ఉన్న అన్ని రకాల పండ్లు తీసుకొనిరా. అని అంటాడు అందుకు ఆ ఏనుగు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది ఆ తర్వాత సంజీవ్ ఇంటిలోపలికి వెళ్తాడు. అప్పుడు ఇద్దరు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు లక్ష్మణ్…. ఇప్పుడు చెప్పు రా అసలు ఏంటి ఆ కథ ఏంటి మొత్తం నాకు వివరంగా చెప్పు.
అప్పుడు అతను ఏడుస్తూ….. మిత్రమా ఆరోజు నేను రాత్రి సమయం అడవి మార్గం నుంచి కొండ ప్రాంతంలో ఇంటికి వస్తున్నాను.
నేను చాలా హుషారుగా బస్సులు నడుపుతూ ఉన్నాను ఇంతలో బస్సు బ్రేకులు పడకపోవడంతో నేను చాలా కంగారు పడుతూ…. భగవంతుడా ఏంటిది కొత్త బస్సు బ్రేకులు పడకపోవడం ఇది ఎవరో కావాలని చేసిన పని నువ్వే నన్ను కాపాడాలి.
అంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంతలో నా బస్సు అదుపు తప్పి ఒక లోయలో పడిపోయింది. నేను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ను అప్పుడు భగవంతుడు లాగ ఏనుగు నన్ను కాపాడింది
నేను చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాను. నేను కొన్ని రోజుల వరకు బస్సు జోలికి వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్లీ ఆ బస్సుని బాగు చేయించి. అదే మార్గంలో వెళ్తూ ఉండగా మళ్ళీ అప్పుడు ఎందుకు నాకు ఆ ఏనుగు కనబడింది. నేను బస్సును ఆపి దాని దగ్గరికి వెళ్లి….. నువ్వే కదా ఆ రోజు నన్ను కాపాడింది.
నువ్వు లేకపోతే నేను ఏమై పోయే వాడినో నీకు చాలా కృతజ్ఞతలు.
అందుకే ఆ ఏనుగు ఏడుస్తూ ….. ఎవరిదైనా ప్రాణమే కదా. నేను చూస్తూ ఊరుకోలేక పోయాను. కానీ ఇక్కడికి వచ్చిన కొందరు మాత్రం మమ్మల్ని ఢీకొని గాయపరచి వెళ్తున్నారు. ఈ కొండ ప్రాంతంలో వాహనాన్ని నిదానంగా నడిపితే ఏమౌతుంది. ఒక తాగుబోతు చేసిన పని వల్ల నేను నా తల్లిని పోగొట్టుకున్నాను. అతను పద్యం సేవించి బస్సు నడుపుతూ చాలా వేగంగా ఈ దారిలో వస్తున్నాడు నా తల్లి ఈ రోడ్డు పక్కగా నడుస్తూ ఉంది. వాడి వెనక నుంచి వచ్చి బలంగా నా తల్లి నీ ఢీ కొట్టాడు. తల్లి అక్కడికక్కడే మరణించింది నేను ఒంటరి దాన్ని అయిపోయాను అలా రోజులు గడుస్తున్నాయి. నేను పెరిగి పెద్దయిన ప్పటికీ నా తల్లి జ్ఞాపకాల తోనే బ్రతుకుతున్నాను.
అందుకే ప్రతి రోజూ ఇక్కడికి వస్తూ వెళ్తూ వుంటాను అనుకోకుండా మీరు ప్రమాదంలో పడడం చూసి మిమ్మల్ని కాపాడాను అని అంటుంది.
దానిని విన్న అతను చాలా బాధ పడుతూ…
బాధపడకు నువ్వు చెప్తుంటే నా కళ్లనుండి నీళ్లు ఆగటం లేదు. ఏంటో ఈ భగవంతుడు సృష్టి. అని అనుకుంటూ దానికి కొన్ని పండ్లను ఇచ్చి ….సరే మిత్రమా ఇక నేను వెళ్లి వస్తాను నువ్వు జాగ్రత్త అని చెప్పి అక్కడ్నుంచి నా బస్సు నడుపుకుంటూ చాలా నిదానంగా వెళ్తున్నాను అప్పుడు మళ్ళీ ఎదురుగా ఒక బస్సు చాలా వేగంగా దూసుకొస్తోంది నేను అప్పటికి హార ా చేస్తూ ఉన్నాను నిదానంగా
వెళ్తున్నాడు వాడు వేగంగా వచ్చిన ఢీకొన్నాడు . నా బస్సులో యే అటువైపు రోడ్డుకు ఇరువైపులా మధ్యలో వేలాడుతూ ఉంది . వాడు బస్సు నుంచి పక్కకు దూకేసాడు. వాడి బస్సు లోయలో పడిపోయింది.వాడు చిన్న చిన్న గాయాలతో అక్కడినుంచి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి పోయాడు.
నేను మాత్రం…. కాపాడండి ఎవరైనా కాపాడండి అంటూ కేకలు వేశాను. అప్పుడు మళ్లీ ఏనుగు వచ్చి తన బలం అంతా ఉపయోగించి బస్సు ని పక్కకు లాగింది ఆ సమయంలో దాని తొండానికి కాలికి బలమైన గాయం అయింది. ఆ ఏనుగు ఎంతో బాధపడుతూ….భగవంతుడా నేను ఈ వ్యక్తిని కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ నొప్పిని భరించలేక పోతున్నాను. అమ్మ భగవంతుడా అంటూ కంటతడి పెట్టుకుంది దానిని చూసి నేను తట్టుకోలేక పోయాను…. ఊరుకో తల్లి మనది ఏ జన్మ బంధమో కానీ నన్ను రెండు సార్లు ప్రమాదం నుంచి కాపాడావు మీకు చాలా కృతజ్ఞతలు. నీకేం కాదు నేనున్నాను అనే నేను దానికి ధైర్యం చెప్పి వైద్యం చేయించాను.
అప్పటినుంచి నేను దాన్ని ఎంతో జాగ్రత్తగా నా ఇంట్లో పెంచుకున్నాను. అలా కొన్ని రోజులు గడిచిన మిత్రమా ఇప్పుడు దాని కాలు అంతా అయిపోయింది. ఆ ఏనుగు నన్ను విడిచి వెళ్ళను అంటుంది . అందుకు నేను ఇక్కడే ఉండమని చెప్పాను. ఇప్పుడది చాలా సంతోషంగా ఎక్కడ ఉంది దాన్ని చూస్తూ నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు చెప్పు మిత్రమా ఆ ఏనుగు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడింది. దానికి కృతజ్ఞతగా నేను దాని కడుపు పంపుతున్నాను అంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు కదా.
అందుకు లక్ష్మణ్…. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మిత్రమా ఒక జంతువు మనిషి ప్రాణాలను కాపాడింది అంటే ఆశ్చర్యంగా ఉంది.ఏది ఇంతకీ ఆ ఏనుగు ఎక్కడుంది నా మిత్రుని కాపాడినందుకు నేను కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
అందుకు అతను…. బజార్ కి పంపించాను రా ఈపాటికి వస్తూ ఉంటుంది.
ఇంతలో సింగయ్య అక్కడికి వచ్చి…. సంజీవ్ సంజీవ్ త్వరగా రా నేను అక్కడ గాయాలతో పడి ఉంది.
అందుకు అతను…. ఏమైంది
అందుకు సింగయ్య…. చెప్తాను పద పద పద అని అంటాడు సంజీవ్ మరియు తన స్నేహితుడు సింగయ్య ముగ్గురు కలిసి ఆ ఏనుగు దగ్గరికి వెళ్తాడు.
అక్కడ సింగయ్య… సంజీవ్ ఇదంతా చేసింది ఆ గుండా వెధవ ఈ ఏనుగు రాకముందు ఇందా వాడు నా దగ్గరికి వచ్చాడు.
వాడు నాతో….. రేయ్ డబ్బులు ఇవ్వరా మామూలు ఇవ్వు.
సింగయ్య…. రోజు డబ్బు డబ్బు అని పీకు తింటున్నావు. నీ మీద పోలీస్ కేసు పెడతాను.
నా మీద పోలీస్ కేసు పెడతావా ఒక పెద్ద కత్తి ని బయటకు తీసాడు. అప్పుడే నీ ఏనుగు వచ్చి అడ్డుకొని… దయచేసి సింగయ్య నువ్వు ఏమీ చెయ్యొద్దు సింగయ్య చాలా మంచివాడు మీకు పుణ్యం ఉంటుంది అతని ఏం చేయద్దు.
గుండా….. చాలా తెలివైన ఏనుగు లాగ ఉన్నావు. అయితే వాడి బదులు నువ్వు కత్తి పోటు పొడి పింక్చుకో .
ఏనుగు… సరే సింగ్ ఏ కోసం ఆమాత్రం చేయలేనా. సరే నన్ను పొడ వండి.
సింగయ్య చేతులు నమస్కరిస్తూ అతనితో…. వద్దు బాబు దానిని ఏం చెయ్యొద్దు పాపం దానిని సంజీవ్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. దానికి ఏమన్నా అయితే వాడు తట్టుకోలేడు. వదిలేయండి బాబు చాలా మంచి ఏనుగు అది ఎవరికీ ఏ హానీ చెయ్యదు.
గుండా…. ఓహో ఆ సంజీవ్ ద ఈ ఏనుగు
వాడికి ఎంత పొగరు ఉందో దీనికి అంత పొగరు ఉంది. వాడి ప్రాణం తీయాలని వాడి బస్సు బ్రేకులు కూడా తీసేశాను కానీ ఎలాగో బ్రతికాడు.
ఏనుగు…. అయితే సంజీవ్ ని చంపాలనుకున్న నువ్వేనా నిన్ను వదిలిపెట్టను అని అతని మీదకు వస్తుండగా.
అతను ఒక పెద్ద కత్తితో ఏనుగు నీ పొడిచాడు అది కింద పడిపోయింది.
అతను వాడు ఇష్టం వచ్చినట్టు పాపం దీనిని కొడుతూనే ఉన్నాడు నేను ఎంత అడ్డుకున్న నన్ను కూడా గాయపరిచాడు.
ఆ మాటలు విన్న సంజీవ్ కోపంతో రగిలిపోతూ…. వాడికి నాతో పాత కక్షలు ఉన్న మాట నిజమే కానీ ఈ ఏనుగు ఏం చేసింది నన్ను చంపాలనుకున్నాడు ఈ ఏనుగు ప్రాణాలు కూడా తీయాలి అనుకుంటున్నాడు వాడిని వదిలిపెట్టను.
సింగయ్య…. ఆవేశ పడకు సంజీవ్ వాడిని పోలీస్ అధికారి జైలుకి తీసుకెళ్ళిపోయాడు.
దీన్ని కొడుతున్న అప్పుడే ఆ పోలీస్ అధికారి వచ్చాడు అతను పోలీసు అధికారిని తెలియక అతనిపై కూడా చేయి చేసుకున్నాడు. వెంటనే అతను గన్ను తీసి ఆ గుండా నీ జోలికి తీసుకెళ్ళిపోయాడు. వాడు నాకు తెలిసినంతవరకు జైలు శిక్ష అనుభవిస్తూ చెప్పకు తినాల్సిందే.
లక్ష్మణ్…. మంచి పని జరిగింది అలాంటి వాళ్లకి అలాగే జరగాలి. పాపం అన్యాయంగా దీని గాయపరిచాడు అంటూ బాధపడతాడు.
ఆ ఏనుగు ఎంతో ఏడుస్తూ…. మిత్రమా నాకేం కాదు కదా. నేను నిన్ను విడిచి వెళ్లి పోతన నాకు భయం వేస్తుంది. ఆ భగవంతుని నా ప్రాణాలు తీసుకు వెళ్ళద్దు అని చెప్పు మిత్రమా నాకు బ్రతకాలని నుండి నన్ను బ్రతికించు నన్ను బ్రతికించి మిత్రమా అంటూ కంటతడి పెట్టుకుంటుంది.
దానిని చూసిన అతను కూడా కంటతడి పెట్టుకుంటూ…. నీకేం కాదు నేను ఉన్నా కదా అంటూ దానికి ధైర్యం చెబుతాడు కానీ పాపం ఇంతలోనే ఆ ఏనుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అన్ని చూసిన అతను భోరున ఏడవడం ప్రారంభించాడు….. అయ్యో మిత్రమా నేను నిన్ను కాపాడుకోలేక పోయాను. నన్ను క్షమించు మిత్రమా నన్ను క్షమించు అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ అతను కూడా గుండె ఆగిపోయి చనిపోయాడు. దాన్ని చూసిన లక్ష్మణ్ సింగయ్య ఏడుస్తూ…. ఆ భగవంతుడు మిత్రుఇద్దరినీ ఒకేసారి తీసుకు వెళ్లి పోయాడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండు అంటూ ఏడుస్తూ పెద్ద కొద్దిగా అరుస్తూ బాధపడతాడు సింగయ్య అతని ఓదారుస్తాడు.
ఏదేమైనా ఆ ఇద్దరి ప్రాణాలు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *