ఓ మంచి అమ్మ కథ Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales – Kattappa Kathalu

 రామాపురం అనే గ్రామంలో కమల విమల అనే ఇద్దరు అక్కా చెల్లులు ఉండేవారి, వాళ్ళ అమ్మ పేరు రాణి, ఆమె ఒక ఒంటరి మహిళ, తమకి ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నదాట్లో పిల్లలని చూసుకుంటూ ఉండేది. కానీ ఆపొలం ఊరి పక్కనే ఉన్న నది పరివాహక ప్రాంతం లో ఉండేది, నది కొంచం పొంగగానే పొలం లోకి నీరొచ్చి పోయాలం అంతా పాడయ్యేది, తరుచూ అలానే జరుగుతుండడం తో వీళ్ళకి ఎంతో నష్టం వచ్చేది. కాగా రోజు రోజుకు అప్పులు పెరుగుతూ వచ్చేవి.

అల్లా రోజులు గడుస్తుండగా ఒకరోజు రానికి అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి

వ్యక్తి :- ఏమమ్మా రాణి నీకు నేను డబ్బు ఇచ్చి  అవుతుంది, తీసుకునేప్పుడు మాత్రం రెండు నెలల్లో ఇచ్చేస్తా అని చెప్పావు కానీ  డబ్బులు తీసుకొని దాదాపుగా పది నెలలు అవుతుంది, డబ్బులు ఇస్తావా లేక ఇంట్లో సామాను మొత్తమ్ బయట వేసి ఇంటికి తాళం వేసెయ్యమంటావా

రాణి :- అయ్యో అంత పని చేయొద్దు, ఇంటి సమాను బయట వేసి ఇంటికి తాళం వేస్తే ఎలా అయ్యా, మాకు ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క దిక్కు ఆ ఇల్లు, దాన్ని కూడా మీరు లాగేసుకుంటే ఎలా? అయినా మీరే చూస్తున్నారు కదా ప్రతి సారి మేము వేసిన పంట బాగా ఏపుగా పండే సమయానికి నదిలో నీరు ఎక్కవ కావడం వల్ల చేతికి వచ్చిన పంట నాశనం అవుతుంది. ఈ సరి పంట చేతికి రాగానే నీ డబ్బులు నీకిచ్చేస్తాను ఈ ఒక్క సరికి వదిలేయ్ అని బతిమాలుతోంది

వ్యక్తి :- చెడిపోయింది మీ పంట దాంతో నాకేమి సంబంధం ? మీరు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తా అన్న సమయానికి ఇవ్వడమే నాకు కావాలి. ఇలాంటి అడ్డమైన సందానాలన్నీ చెప్పి డబ్బులు ఎగ్గొట్టాలని చూసావో? న సంగతి నీకు తెలీదు ఎదో ఒంటరి ఆడదానివి అని వదిలేస్తున్నా, ఈ సారి నీ పంట పండినా పండకున్నా నాకు అనవసరం వచ్చే రెండు నెలలలో వడ్డీతో సహా అసలు డబ్బులు మొత్తమ్ ఇచెయ్యలేదు అంటే ఈ సరి నీ ఇంటితో పాటు పొలాన్ని కూడా లాగేసుకుంటాను చెప్తున్నా అని అరుస్తూ అక్కడనుండి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి

ఇదంతా అక్కడే ఉంది గమనిస్తున్న ఇద్దరు పిల్లలు వాళ్ళమ్మ దగ్గరికి ఏడుస్తూ వస్తారు, ఆ పిల్లలలో పెద్ద అమ్మాయి అయినా కమల వాళ్ళ అమ్మతో

కమల :- అమ్మ మా కోసం, మేము బాగుడడం కోసం నువ్వు వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి మల్లి తిరిగి కట్టలేక వాళ్ళతో ఎన్ని మాటలు పడుతున్నావమ్మా, వాళ్ళు అన్నారని మాటలు అంటుంటే కూడా మాకోసం అవన్నీ భరిస్తూ వస్తున్నావు, మనకి ఉన్న ఆ పొలం వచ్చిన పంటతో మన అప్పులు ఎంతో కొంత తీరొప్తాయి అనుకుంటే ప్రతి సరి మన పొలం నది నీళ్లలో మునిగిపోతూనే ఉంది. ఈ సరి వేసిన పంట అయినా మంచిగా పండితే బాగుంటుందమ్మా అని చెప్తుంది ఏడుస్తూ వెంటనే మల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడాడుతూ

కమల :- అమ్మా నువ్వు ఒక్కదానివి ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదు కదా అమ్మ, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన అప్పులు అన్ని తీరాలంటే నేను కూడా ఏదైనా పని చేస్తానమ్మా అప్పుడు మన ఇద్దరికీ వచ్చిన డబ్బుతో అప్పులు అన్ని ఎంచక్కా తీర్చేయొచ్చు అని అంటుంది

రాణి :- నేను బ్రతికి ఉండగా నువ్వు పనిచేయడం ఏంటమ్మా? అయినా నువ్వు ఇంకా చిన్న పిల్లవి ఆటలు ఆదుకోవలసిన వయసులో పనికి చేస్తా అనడం ఏంటమ్మా ?అని అంటుందిట

కమల :- అమ్మ నువ్వేం బాధపడకమ్మా, నేను కేవలం మన అప్పులు అన్ని తీరేవరకు మాత్రమే పని చేస్తాను అప్పులన్నీ తీరిపోయాక నేను కూడా అందరి పిల్లల లాగే ఆడుకుంటాను అమ్మ

రాణి :- ఇంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు తల్లి, సరే అమ్మ కేవలం మన అప్పులు తీరిపోయే వరకు మాత్రమే నువ్వు పని చేయాలి అని చెప్పి బాధపడుతుంది రాణి

అప్పటినుంచి కమల తనకి తెలిసిన పని చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ ఇంటిని చూసుకుంటూ ఉండేది అలా ఆకొన్ని రోజులు గడిచాక

రాణి పొలం దగ్గరనుంచి ఇంటికి వచ్చి

రాణి :- కమల, విమల ఈ రోజు మన పొలంలో పంట ఎంతో ఆరోగ్యాంగా ఉంది, ఈ సరి ఈ పంట అనుకున్నట్టుగా వస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి అమ్మ అని చెప్తుంది

ఆ రోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పుడు ఇకేసారి ఉన్నపలంగా నది ఉప్పొంగడంతో నదిలో నీళ్లన్నీ ఊరిలోకి వస్తాయి. చూస్తుండగానే ఊరుమొత్తం కొట్టుకుపోతూ ఉంటుంది.

రాణి ఇల్లు మొత్తం వరద నీటితో నిండిపోతుంది. సరిగ్గా అప్పుడే రాణి అదుపు తప్పి నీటిలో పడిపోతుంది. ఆ నేటి ప్రవాహ వేగానికి కొట్టుకు పోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కొట్టుకుపోవడం చూస్తూ పిల్లలు ఏమి చేయలేక చూస్తుంది పోతారు ఇంతలో నీటిలో కొట్టుకుంటూ వచ్చిన ఒక దుంగ పిల్లల దగ్గరికి అనుకోకుండా వస్తుంది, ఇద్దరు ఆ దుంగ మీదకు ఎక్కి కూర్చిని ఒక కర్ర సహాయంతో ఆ దుంగని ఈదుకుంటూ వాళ్ళమ్మ కొట్టుకుపోయిన దారోలో వెల్తూ  ఉంటారు. అప్పుడే అక్కడ వాళ్ళ అమ్మ నీటిలో మునిగిపోతూ

రాణి :- కాపాడండి, దయచేసి ఎవరైనా నన్ను ఎవరైనా కాపాడండి అని అరుస్తా ఉంటుంది

ఇంతలో ఆ దుంగ సహాయం తో కమల విమల వాళ్ళ అమ్మ దగ్గరికి చేరుకుంటారు.

కమల :- అమ్మ నువ్వీమ్ బయపడకు అని చెప్పి నీటిలోకి చేయి అందిస్తుంది కమల వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి

అలా కొన్ని ప్రత్నాలు చేసిన తరవాత వాళ్ళ అమ్మని కూడా దుంగ మీద కూర్చో పెట్టుకోని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తారు.

ముగ్గురు అక్కడ కూర్చుని ఉంటారు ఇంతలో రానికి అప్పు ఇచ్చిన వ్యక్తి స్పృహ కోల్పోయి నీటిలో కొట్టుకు పోతూ కనిపిస్తాడు.

అప్పుడు రాణి

రాణి :- అమ్మ కమల అతను కొట్టుకు పోతున్నాడు ఎలాగైనా సరే మనం అతన్ని కాపాడాలి అని అంటుంది

అప్పుడు చిన్న పాప  విమల వాళ్ళ అమ్మని ఉద్దేశిస్తూ

విమల :- అమ్మా అతడు నీకు డబ్బులు ఇచ్చినవాడు  కదా? పోనీ అమ్మ పోనీ ఇంకా ఎప్పుడు మన దగ్గరా డబ్బులు అడుగుతూ గొడవ చేసియడానికి ఇంకా ఎవరు ఉండరు అని అంటుంది చిన్న కూతురు విమల

రాణి :- తప్పమ్మా అలా అనకూడదు, మంచి వాడైనా చెడ్డవాడైనా వాడు ఒక మనిషే కదా, మనిషే ఇంకొక మనిషిని కాపాడుకోక పోతే ఈ సృష్టే ఉండదు. ఇదిగో విమల నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడు నేను అక్క వెళ్లి ఆ మనిషిని కాపాడి తీసుకువస్తాము అని చెప్పి వెళ్లి ఆ మనిషిని కాపాడి ఆ సురక్షిత ప్రదేశానికి తీసుకు వస్తారు, కొంత సేపటి తర్వాత అతనికి మెలుకువ వస్తుంది

ఆ వ్యక్తి :- రాణి నేను నిన్ను ఎన్నిసార్లు అవమానించి ఉంట్టానో కూడా నాకు గుర్తులేదు అయినా నువ్వు నన్ను కాపాడావు, ఇదిగో నీ పోయాలం ఎప్పుడూ పదవుతూనే ఉంటుంది కదా  నా పొలం ఎలాగూ కాళిగానే ఉంటుంది కదా నీకు కావలసినంత ఇవ్వు అని చెప్తుంది

ఆ మాటలు విన్న రాణి మరియు కమల, విమల ఎంతో సంతోషిస్తారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *