కసాయి తల్లి _ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

అది ఒక విశాలమైన గ్రామం. ఆ గ్రామంలో సింహాద్రి అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు అమృత. మళ్లీ తిరిగి ఒక పాప వుంది. ఆమె పేరు మీనా (5) మన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది.

రోజులు గడుస్తున్నాయి ఒక రోజు రాత్రి సమయం. అమృత తండ్రి వాళ్ళ ఇంటికి వచ్చి. తలుపు కొడుతూ ….. సింహాద్రి, అమ్మ అమృత తలుపు తీయండి. అంటూ కేకలు వేస్తడు. అమృతా నిద్రలేచి….. ఇంత రాత్రివేళ మ నాన్న ఎందుకు వచ్చాడు. అంటూ అమృత వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా వాళ్ళ తండ్రి ఒక పుట్టిన బిడ్డ ని పట్టుకొని ఉంటాడు. ఆమె….ఇంతా రాత్రి వేళ ఇక్కడికి
ఎందుకు వచ్చారు. ఈ బిడ్డ ఎవరు అంటూ
అడుగుతాడు. అందుకు అతను ….. ముందు లోపలికి పదమ్మ చెప్తాను. అంటూ లోపలికి వెళ్తాడు. అతను…. మా ఈ పాప నా స్నేహితుడి కూతురి పాప. వీళ్ళ అమ్మ పాపని
కనీ చనిపోయింది. నా స్నేహితుడు కూడా ఎప్పుడో చనిపోయాడు. చనిపోయిన ఆమెకు ఎవరూ లేరు. దిక్కుతోచని పరిస్థితిలో ఈ బిడ్డని ఇక్కడికి తీసుకు వచ్చాను.
నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు ఆమె సరే అంటుంది.
అప్పుడే తన భర్త అక్కడికి వస్తాడు . జరిగిన విషయం భార్య అతనికి చెబుతాడు.
అతను…. మరి ఏం పర్వాలేదు . ఈ పాప కూడా ఇక్కడే ఉంటుంది. అని అంటాడు.
రోజులు గడిచాయి పాపకు లక్ష్మి అని పేరు పెడతారు. మీనా (15) లక్ష్మి (5) ఇద్దరు కూడా
పెద్ద వాళ్లు అవుతారు. సింహాద్రి ఎక్కువగా లక్ష్మి తో ఆడుకుంటూ. ఆమెనీ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. దానిని గమనించిన భార్య…. ఉంది మీరు ఎక్కువగా లక్ష్మీ ఎందుకు దగ్గర తీస్తున్నారు ఆమె మన సొంత కూతురు కాదు కదా. మీనా సంగతి పట్టించుకోవడం లేదు ఏమైంది మీకు.
సింహాద్రి…. అలా ఏం లేదు లక్ష్మీ చిన్న పిల్ల కదా. పైగా తల్లిదండ్రులు ఎవరు లేరు. అందుకే అలాగా ప్రేమతో చూస్తున్నా ఇందులో తప్పేముంది.
భార్య…. తప్పేం లేదు. చూసేవాళ్ళకి అంతగా బాగోదు. పైగా మీనా కూడా చాలా బాధపడుతుంది. అని చెప్తుంది అందుకు అతను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు.
రోజులు గడిచాయి అతను మాత్రం ఏమి మాట్లాడవు లక్ష్మి చాలా ప్రేమ తో మాట్లాడుతూ ఆమె తో ఆడుకుంటూ ఉంటాడు. నన్ను చూసిన భార్య…. అసలు నా భక్తికి ఎన్నిసార్లు చెప్పినా ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఏదో విధంగా లక్ష్మీ కొంచెం దూరం చేయాలి. లేదంటే నా భర్త పూర్తిగా మీనా సంగతి మర్చి పోతాడు. ఆమె మీద అసలు ప్రేమ చూపించడు. అని అనుకుంటుంది ఆ మరుసటి రోజు లక్ష్మి ఆడుకుంటు ఉండగా.
ఆమె లక్ష్మితో…. లక్ష్మి బయట ఇల్లు చిమ్ము.
అని అంటుంది అందుకు లక్ష్మి….. అమ్మ నాకు సరిగ్గా రాదు కదా. అని అంటుంది అందుకు ఆమె…. తినడం మాత్రం బాగా వచ్చే. నేను నేర్పిస్తాను చూసి నేర్చుకో. అంటూ చిమ్మడం నేర్పిస్తుంది. లక్ష్మీ దాన్ని చూసి సరే అని చెప్పి చిమ్ముతూ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత అమృత… ఒసేయ్ లక్ష్మి వచ్చి గిన్నెలు శుభ్రం చెయ్యి అని అంటుంది.
ఆమెకు వచ్చినట్టుగా శుభ్రం చేస్తుంది.
అలా లక్ష్మి తో బట్టలు ఉతకడం ఇల్లు శుభ్రం చేయడం పాత్రలు శుభ్రం చేయడం లాంటి పనులు చేయిస్తూ ఉంటుంది.
ఆమె అలా పనులు చేస్తూ ఉండాలి అప్పుడే సింహాద్రి అక్కడికి వస్తాడు. అతని లక్ష్మితో… అమ్మ లక్ష్మి ఈ పనులన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావ్ అమ్మ ఎక్కడికి వెళ్ళింది.
లక్ష్మి… అమ్మ నా చేత పనులు చేయిస్తున్నది
నాన్న అని అంటుంది. అప్పుడు అక్కడికి భార్య వస్తుంది. సింహాద్రి… ఏంటి నువ్వు చేస్తున్న పని అస్సలు నచ్చలేదు చిన్న పిల్ల చేత ఇంటి పనులు ఎందుకు చేపిస్తున్నావు.
ఆమె…. ఇందులో తప్పేంటి . మనమేమన్నా లక్ష్మినీ దత్త త తీసుకున్నామా. మా నాన్న తీసుకొచ్చి వదిలి పెట్టాడు. నాకు తోడుగా ఉంటుంది కదా ఇంటి పనుల్లో. నాకు పని మనిషి లాంటిది. అంతే ఇంకా ఎలాంటి సంబంధం లేదు. మీరు మరీ అంత ప్రేమ చూపించాల్సిన అవసరం అసలు లేదు.
కాదు కూడదు అని చెప్పండి. ఏదైనా హాస్టల్లో వదిలిపెట్టండి. లేదంటే ఏదైనా ఆశ్రమంలో చేర్పించండి. అని తెగేసి చెబుతుంది.
అతను ఏం మాట్లాడలేక అక్కడనుంచి వెళ్ళి పోతాడు. రోజులు గడిచాయి ఆమె కఠినమైన పనులు చేయిస్తూ. ఉంటుంది నాకు రోజు తన మనసులో….. అసలు నా భర్త ఈ పాపని ఎందుకు బయటికి పంపించడం లేదు ఏదైనా ఆశ్రమంలో చేర్పించవచ్చ్ కదా. పైగా చాలా ప్రేమగా చూపిస్తాడు. నేను దీన్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఇది మాత్రం బయటికి వెళ్లడం లేదు. దీని బయటికి పంపించడం ఇలా అయితే కష్టం ఇంకొంచెం కష్ట పెట్టాలి అని అనుకుంటుంది.
ఆరోజు లక్ష్మి ఇంటి పని చేస్తుండగా.
అమృత…. లక్ష్మీ వెళ్లి మీనా బట్టలను ఇస్త్రీ చేయి. అని అంటుంది అందుకు ఆమె సరే అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఆమె బట్టలను ఇస్త్రీ చేస్తూ ఉండగా. పొరపాటున ఆమె చేస్తున్న బట్ట కొంచెం ఖాలి అయిపోతుంది.
దానికి చూసిన మీనా…. అయ్యో బంగారం లాంటి నా డ్రెస్ ని కాల్చేశావు కదా. అంటూ ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్లి… అమ్మ లక్ష్మి నా డ్రెస్ ని కాల్చేసింది. అంటూ చెప్పింది ఆమె చాలా కోపంగా….. ఒసేయ్ ఏంటి నువ్వు చేసిన పని. తినడం మాత్రం బాగా తింటావవు. పని చేయాలని తెలియదా. అంత విలువైన డ్రెస్ని కాల్చేశావు.
లక్ష్మి…. అమ్మ నాకు సరిగా చేయడం రాదు కదా ఆ విషయం చెప్పినా మీరు వచ్చినట్టు చేయమని అంటారు. అందుకే ఏం మాట్లాడకుండాఇక్కడికి వచ్చాను ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు.
అందుకు ఆమె చాలా కోపంగా…. ఎదురు సమాధానం భలేగా చెప్తున్నావు. అంటూ ఆమెను కొడుతుంది.
ఆమె ఏడుస్తూ…. అమ్మ వద్దమ్మా నన్ను కొట్టకు అమ్మ చాలా నొప్పిగా ఉందమ్మ.
అంటూ ఏడుస్తుంది. అలా అని ఏదో ఒకరకంగా చిత్ర హింసలు పెడుతూనే ఉంటుంది. దానిని అంతా సింహాద్రి చూస్తూనే ఉంటాడు. కానీ ఏం మాట్లాడు రోజులు గడిచింది ఒక రోజు తల్లి మీనా తో…. చూడు లక్ష్మి ఎందుకు ఇంటి పనులు చేస్తుందో నీకు తెలుసా.
మీనా…. తెలియదమ్మా ఎందుకు చేస్తుంది.
తల్లి…. ఎందుకంటే లక్ష్మీ తాతయ్యకు దొరికింది. అంటూ పెద్ద పెద్దగా లక్ష్మి కి వినపడేలా చెబుతోంది.
ఆ మాటలు విన్న లక్ష్మి అక్కడకు వచ్చి….. ఏంటమ్మా మీరు ఉంటుంది. నిజంగా నేను మీ కూతురు ని కాదా. మీరు నాన్నతో ఆ మాట చెప్పన్నపుడు. నాకు అర్థం కాలేదు అయితే నేను నిజంగా నీ కూతుర్ని కాదా.
ఆమె…. కాదు నిజంగా నువ్వు నా కూతురిని కాదు. అంటూ జరిగిన విషయం చెప్తుంది.
ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడుతూ. అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది.
ఆ రోజు రాత్రి అవుతుంది ఆమె ఒక చోట కూర్చుని ఏడుస్తూ….. నాకు అమ్మానాన్న ఎవరు లేరు. నేను ఒక అనాధను. అంటూ చాలా బాధపడుతుంది.
ఇదిలా ఉండగా సింహాద్రి ఇంటికి వెళ్తారు అక్కడ లక్ష్మి లేకపోవడం తెలుసుకొని.
భార్యతో….. లక్ష్మీ ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లింది. ఆమె ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది.
అప్పుడు అతను కోపంగా….. ఏం మాట్లాడకుండా అలా నుoచున్నావు ఏంటి ఏం జరిగిందో చెప్పు.
అప్పుడు మేనా. తన తండ్రికి జరిగిన విషయం అంతా చెబుతుంది దానిని నిన్న తను చాలా కోపంగా….. నీకసలు బుద్ధుందా చిన్నపిల్ల అని కూడా చూడకుండా బయట పంపిస్తావా.
ఆమె…. నేను పంపించ లేదు. తనే వెళ్ళి పోయింది. అసలు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. తను ఏమన్నా నీ సొంత కూతురా అంతలాగ బాధపడిపోతున్నారు.
అందుకు అతను… అవును నా కూతురే. అని అంటాడు. అందుకు ఆమె చాలా ఆశ్చర్య పోతూ ఉంటుంది.
వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది.
ఇదిలా ఉండగా అప్పుడే చిట్టి దగ్గర ఏడుస్తున్న లక్ష్మిని చూసిన అమృత తండ్రి …. లక్ష్మి ఏంటమ్మా ఇక్కడున్నావ్. అంటూ అడుగుతాడు అప్పుడు ఆమె ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెబుతోంది.
అతను…. నువ్వేమి బాధపడకు నేను చెప్తాను
పదా అంటూ ఆమె తీసుకొని ఇంటికి వెళ్తాడు.
ఇంటిదగ్గర అమృత భర్త తో…. అసలు ఎవరు మీ రెండవ భార్య ఎవరు. నాకు నిజం తెలియాలి మీరు శ్రీరామచంద్రుడు అనుకున్నాను కాని మీరు అది కాదు అని అర్థం. నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు. నేను నీకు ఏమి అన్యాయం చేశాను అని.
అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది .
అప్పుడు తండ్రి అక్కడికి వస్తాడు.
తండ్రిని చూసిన అమృత…. నాన్న మీరు నిజం చెప్పండి . ఈ పాప ఎవరు . ఎందుకు మీరు ఇంత నాటకమాడి నన్ను మోసం చేశారు.
అప్పుడు అతను… అమృత నేను చెప్పేది విను. అసలేం జరిగిందంటే. నాకు మీ అమ్మ కాకుండా మరో భార్య ఉంది. ఆమె చనిపోతూ మీ చెల్లెలు అయినా కవితని నా చేతిలో పెట్టింది. ఆమెను పెంచి పెద్ద చేశాను.
అప్పుడే సింహాద్రి ఆమెకు పరిచయం అయ్యాడు వారిద్దరి ప్రేమ విషయం నాకు చెప్పారు. నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను.
వాళ్లు సంతోషంగా ఉన్నారు.
నేను దాన్ని చూసి సంతోషపడ్డాను. ఒక రోజు మీకు బాగోలేదు అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లాను కదా అప్పుడు డాక్టర్ నాకు ఒక విషయం చెప్పారు.
డాక్టర్…. మీ అమ్మాయికి గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ బిడ్డ పుట్టిన ఏదో ఒక సమస్య ఉంటుంది. కాబట్టి ఆమె సంసారానికి పనికి రాదు.
ఆ మాటలు విని నేను చాలా బాధపడ్డాను. అసలుకే మీ అమ్మ లేదు నేను పోయిన తర్వాత.నిన్ను ఎవరు చేసుకుంటారో నాకు అర్థం కాలేదు. నాకు నీ పట్ల చాలా భయం కలిగింది బాధ కలిగింది .
అదే విషయాన్ని మీ చెల్లి కవిత ,సింహాద్రి కి చెప్పాను. అప్పుడు కవిత…. నన్ను నువ్వేం బాధపడకు. మేమున్నాం కదా అక్కనీ చూసుకుంటాం. అని చెప్పింది అయినప్పటికీ . నా మనసులో సందేహాలు వస్తూనే ఉన్నాయి నేను…. అలా కాదు సింహాద్రి నీ కాళ్లు పట్టుకుంటాను. నా కూతుర్ని పెళ్లి చేసుకో. అప్పుడే ఆమెకంటూ ఒక తోడు ఉంటుంది అని నాకు భరోసాగా ఉంటుంది కాదు అనకు నీ కాళ్లు పట్టుకుంటాను. సింహాద్రి …. నా భార్య ఉండగా మరో అమ్మాయికి ఎలా తాళి కట్టాలి నా మనసులో కవితకి తప్ప మరో అమ్మాయి కి స్థానం లేదు.
అని చెప్పాడు కానీ కవిత ఆ బాధను అర్థం చేసుకొని నీ మంచి కోరి తన పసుపు కుంకాలు నీకు త్యాగం చేసింది.
అప్పుడు మీ ఇద్దరికీ నేను పెళ్లి చేశాను.
కవిత గర్భం దాల్చింది.
అదే సమయంలో నువ్వు కూడా గర్భవతివి అయ్యావు. మనం ఒకటి అనుకుంటే భగవంతుడు మరొకటి చేశాడు అనుకున్నాము. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఎంతగానో ప్రాధేయపడ్డాము.
అలాగే బిడ్డ చాలా ఆరోగ్యంగా పుట్టాడు కానీ చనిపోయాడు. ఆ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పి . ఆ రోజే అదే హాస్పిటల్లో పుట్టిన కవిత బిడ్డ మీనా నీ . కవిత మీ దగ్గర
ఉంచింది. మీనా కూడా నీ బిడ్డ కాదు కవిత బిడ్డ. అలా కొన్ని రోజుల తర్వాత
కవిత మరోసారి గర్భం ధరించింది.
ఈసారి బిడ్డను కానీ కన్నుమూసింది నా బంగారు తల్లి. ఆ బిడ్డ ఏ ఈ లక్ష్మి.
అందుకే అర్ధరాత్రి వేళ బిడ్డను తీసుకోని వచ్చాను. అంటూ జరిగిన విషయం చెప్తాడు.
దాన్ని విన్న ఆమె చాలా బాధ పడుతూ…. అయ్యో నన్ను క్షమించండి . నేను చిన్న పిల్లల పట్ల చాలా కఠినంగా ప్రవర్తించాను. కవిత నా చెల్లెలు. ఆమె పెట్టిన బిక్ష ఇదంతా . అంటూ భోరున ఏడుస్తూ ఆ పిల్లల్ని హత్తుకుంటుంది.
ఆ రోజు నుంచి అందరూ సంతోషంగా జరిగిందంతా మర్చిపోయి వాళ్ళ జీవితాలు గడుపుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *