కసాయి మొగుడు Telugu Stories | Telugu Fairy Tales | Telugu Kathalu | Kattapa Kathalu

ఒక ఊరిలో విష్ణు, వందన అనే భార్య భారతలు ఉండేవారు, వాళ్లకి ఒక కూతురు ఉండేది, ఆమె పేరు స్వాతి. విష్ణు కి ఆడపిల్లలు అంటే అస్సలు నచ్చేది కాదు, స్వాతిని కూడా ఎప్పుడు ద్వేషిస్తూనే ఉండేవాడు. ఒక రోజు స్వాతి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది.

స్వాతి : అమ్మ నాన్న ఎందుకమ్మా నాతో ఎపుడూ కోపంగానే ఉంటాడు, నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకోడు ఎందుకు అమ్మ, నేనంటే నాన్నకు ఇష్టం లేదా అమ్మ అని అడుగుతుంది.

స్వాతి అడిగిన ప్రశ్నలకి వందన కి ఏమని సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు, కానీ స్వాతి దృష్టిలో విష్ణు ని చెడ్డవాడిగా ఉంచాలి అనుకోలేదు కాబట్టి విష్ణు ని సమర్థిస్తూ సంధానం చెప్పాలి అనుకోని ఇలా అంటుంది.

వందన : అమ్మ స్వాతి అలా ఏమి లేదమ్మా, మీ నాన్న నిన్ను గొప్పగా చాలా ప్రేమగా చూసుకోవాలి అనుకుంటాడు అందుకోసమే చాలా డబ్బులు సంపాదించాలి నిన్ను మహారాణిలా చూసుకోవాలి అని రాత్రిబవళ్ళు కష్టపడి పన్ని చేస్తుంటాడు, అలా పని చేస్తుతాడు కాబట్టి ఎప్పుడు అలసిపోయి ఉంటాడు, అలసటతో నీతో సరిగా మాట్లాడలేకపోతాడు అంతే కానీ నీ మీద ప్రేమ లేక కాదు అని చెబుతుంది.

కానీ స్వాతికి మాత్రం వాళ్ళ నాన్న మీద ఎంతో ప్రేమ ఉన్నప్పట్టికీ వాళ్ళ నాన్ మాత్రం స్వాతిని ఎప్పుడు తిడుతూ కొడుతూ ఉంటాడు.

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు విష్ణు ఎదో పని మీద బయటకు వేళ్తాడు.

వందన కొన్ని రోజులుగా నీరసంగా ఉండడం గమనించిన స్వాతి తన తల్లి దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది.

స్వాతి : అమ్మ నువ్వు ఒక వారం రోజులుగా నాకు నీరసంగా కనిపిస్తున్నావు, నాన్నేమో ఎప్పుడు ఎవరిని పట్టించుకోడు, నాకెందుకో భయంగా ఉంది  మనం ఆసుపత్రికి వెళదాము అమ్మ అని అంటుంది.

స్వాతి వందన ను తీసుకొని ఆసుపత్రికికి వెళ్తుంది. వండని పరీక్షించిన డాక్టర్ ఇలా అంటుంది.

డాక్టర్ : మరేం భయపడవలసిన అవసరం లేదు ఇప్పుడు మీరు గర్భవతి అయ్యారు, అని చెబుతుంది.

ఆ మాట విన్న వందన మరియు స్వాతి ఎంతో సంతోషిస్తారు.

వందన : అమ్మ స్వాతి నువ్వ్వు బయటకు వెళ్లి కొన్ని మిఠాయిలు పట్టుకొని రా పో మీ నాన్న రాగానే ఈ శుభవార్త చెప్పి మీ నాన్న నోరు తీపి చేద్దాం అని అంటుంది.  సరే అని చెప్పి స్వాతి ఎంతో ఆనందంగా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది.

కొత్త సేపటి తరువాత విష్ణు ఇంటికి వస్తాడు.

వందన : ఏమండి నేను మీకో శుభవార్త చెప్పాలి అనుకుంటున్నాను, ఇప్పుడు నేను గర్భవతిని, ఉదయం ఒంట్లో నలతగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పారు అని తన భర్తకి ఎంతో సంతోషంగా చెప్తుంది.

విష్ణు : అవునా ఐడి నిజంగానే శుభవార్తే కానీ, కడుపులో పెరుగుతుంది అబ్బాయి అయితే మాత్రమే శుభవార్త అవుతుంది. మల్లి నీ కడుపులో పెరిగేది అమ్మాయి అయితే మాత్రం ఈ గర్భం నేను ఉండ్చాలి అనుకోవడం లేదు అని అంటాడు కోపంగా

వందన : అదేంటండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా మన పిల్లలే కదా

విష్ణు : నాకు అబ్బాయి మాత్రమే కావలి. అబ్బాయి అయితే నా ఆశ్తికి వారసుడు అవుతాడు, కానీ అమ్మాయి అయితే నా ఆస్థి అంతా పోతుంది, వాళ్ళ పెళ్లిళ్లు పేరంటాలు చేసే వరకే నాకు సరిపోతుంది, తరువాత నన్ను నా ఆస్తిని చూసుకునేది ఎవరు? అందుకే నేను ఈరోజే నిన్ను నాకు తెలిసిన డాక్టర్ దాగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాను మల్లి కడుపులో పెరుగుతుంది అమ్మాయి అని తెలిస్తే ఈ గర్భ తీసేయిస్తాను, ఇప్పటికి ఇంట్లో తిరుగుతున్న ఒక అమ్మాయి చాలు, ఆ శనిని కాదని మల్లి ఇంకో శనిని ఇంట్లోకి తెచ్చుకోమంటావా పదా ఇప్పుడే వెళ్లి పరీక్ష చేయించుకుందాము అని అంటాడు కోపంగా.

వందన : నేను రాను, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు నా పిల్లలే, నా కడుపులో పెరుగుతున్న ప్రాణాన్న్ని నేను చంపుకోలేను అని అంటుంది.

వందన మాటలకి కోపం తెచ్చుకున్న విష్ణు వందన ని కొడతాడు.

ఇదంతా ఇంటి బయట ఉంది చూస్తున్న స్వాతి తన తండ్రి ప్రవర్తనని చూసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది.

వందన ని కొట్టిన తరువాత విష్ణు బలవతంగా ఓక్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాడు.

డాక్టర్ బయటకు వచ్చి మీకు ఆడపిల్ల పుట్టబోతుంది అని చెప్తాడు.

విష్ణు : ఆడపిల్ల నాకు వద్దు వెంటనే కడుపులో బిడ్డని కడుపులోనే చంపెయ్యండి  మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్తాడు విష్ణు డాక్టర్ కి

ఇదంతా అర్ధం చేసుకున్న వందన ఆసుపత్రి నుంచి పారిపోయి పోలీస్ వాళ్లకి జరిగిన విషయం అంతా చెబుతుంది.

పోలీస్ లు వచ్చి గర్భ నిర్ధారణ పరీక్ష చేసినందుకు డాక్టర్ ని, చేయించినందుకు విశ్ను ని అరెస్ట్ చేస్తారు.

అలా కొని రోజులు గడిచి పోతాయి, స్వాతి తన గర్భవతి తల్లికి ఎలాటి లోటు రాకుండా చూసుకుంటూ ఉంటుంది.

కొన్ని రోజులకు వందన ఒక పండంటి ఆడ బిడ్డకు జన్మ నిస్తుంది. ఆ బిడ్డ పుట్టినప్పటి న్నుంచ్చి వందన కి అన్ని రకాలుగా కలసి వస్తూ ఉంది, ఏ పని తలపెట్టినా అన్ని రకాలుగా విజయమే సాదిస్తుంటుంది. అప్పటి నుంచి వందన స్వాతిని తన రెండో బిడ్డని చూసుకుంటావు ఎంతో ఆనందంగా బ్రతుకుతుంది. కాని మనసులో మాత్రం తన భర్త జైలు నుంచి విడుదల అయ్యే సమయానికైనా తనలో మార్పు రావాలని అందరూ దేవుళ్ళకి రోజు దండం పెడుతూనే ఉంటుంది.

షార్ట్ స్టోరీ

ఒక ఊరిలో విష్ణు, వందన అనే దంపతులకు స్వాతి అనే ఒక అమ్మాయి ఉండేది, విష్ణు కి ఆడపిల్లలు అంటే అస్సలు నచ్చేది కాదు, ఒకమగ పిల్లడు కావాలని చూస్తుండేవాడు, కానీ రెండో సారి గర్భం లో కూడా మల్లి ఆడపిల్లల పుట్టాబితుంది అని తెలుసుకున్న విష్ణు కడుపులోనే బిడ్డను చామేయ్యాలి అనుకుంటాడు. అది తెలుసుకున్న వందన భారతం పోలీసులకు అప్పగించి తనకు పుట్టిన బిడ్డ మరియు స్వాతి తో చాలా ఆనందంగా బ్రతుకుతూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *