కసాయి సవతి తల్లి _ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

కుమ్మరి పల్లి ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కుమారి అని ఒక ఆమె ఉండేది. ఆమె ఓట్టి గయ్యాలి ది . అతని భర్త పేరు ప్రసాద్. ప్రసాద్ కి ఇంతకుముందే వనజ అనే అమ్మాయి తో పెళ్లి జరిగింది . కానీ ఆమె ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయింది. అప్పటికి ఆమెకు చిన్నారి అనే ఒక పాప ఉంది. చిన్నారి (5)మంచి చెడులను ప్రసాద్ తల్లి అయిన గిరిజా దేవి . చూసుకుంటూ వుండేది. అలా కొన్ని రోజులు గడిచాయి.ప్రసాద్ ఎవరికీ చెప్పకుండా కుమారిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు. దాన్ని చూసిన తల్లి….. బాబు ఎవరు ఏమనుకున్నా నువ్వు చేసింది సరైనది. నా వయసు అయిపోతుంది. చిన్నారికి తల్లి అవసరం ఉంటుంది. చాలా మంచి పని చేశావు. అని అతనిని మేచ్చుకుంటుంది. అతను….. అవునమ్మా నేను కేవలం చిన్నారి మంచి గురించి ఆలోచించి కుమారిని పెళ్లి చేసుకున్నాను.
ప్రసాద్ తండ్రి రామయ్య….. బాబు ఏదేమైనా మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. కలకాలం చిలకాగోరింకల్లా గా . సంతోషంగా ఉండండి అంటూ దీవిస్తాడు.
అని చెప్తాడు. అలా కొన్ని రోజులు గడిచాయి కుమారి భర్తతో….. హబ్బా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అత్త మామకి నేను సేవ చేస్తూ నేను ఉండలేను. నా వల్ల అసలు కావడం లేదు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు . వేరే కాపురం పెడతాం.
ప్రసాద్…..కుమారి ఎందుకు మాట్లాడుతున్నావు మా అమ్మ నాన్న నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా. అత్తమామల పోరు కూడా లేదు. మా అమ్మ అందరి లాగా అసలు ఉండదు. వాళ్లు ముసలి వాళ్ళు కాబట్టి కొంచెం సహాయం చేస్తూ చేదోడువాదోడుగా ఉండాలి.
భార్య….. అది నేను చేయలేను అంటున్నాను. దానికి తోడు చిన్నారి. నేను వేగ లేక చస్తున్నాను. దయచేసి వేరే కాపురం పెడదాము నన్ను ఈ కష్టాలు కుంపటి నుంచి
బయటపడే యి. అంటూ ఏడుస్తుంది.
దాంతో అంతా వింటున్న గిరిజా దేవి తన మనసులో చాలా బాధపడుతుంది.
ఆమె ఒక రోజు ప్రసాద్ తో…. చూడు బాబు మీకు కొత్తగా పెళ్లయింది. నీకు కూడా సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా.
మేము ఇద్దరం పాపను తీసుకుని ఎక్కడికైనా వెళ్లి వస్తాము. మీరు సంతోషంగా ఉండండి.
అని అంటుంది ప్రసాద్….. ఎందుకమ్మా మీరు
ఉన్నారు కాబట్టి మేము సంతోషంగా ఉన్నాము. మీరు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు ఇక్కడే ఉండండి.
తండ్రి….. అరేయ్ నీకేం తెలియదు నువ్వే మాట్లాడుకు. మేము ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అని చెప్పి పాపను తీసుకుని అక్కడి నుంచి వెళ్తారు.
ఆ రోజు గడిచి పోతుంది ఆ ఆ మరుసటి రోజు భార్య…… చూశారా ఒక్కరోజు మీ అమ్మ నాన్న లేకపోతే . ఇల్లంతా ఎంత బాగుందో.
దానికి తోడు చిన్నారి కూడా లేదు ఇంకా సంతోషంగా ఉంది. మనం ఇలా సంతోషంగా ఉండాలి అంటే చిన్నారి కూడా మీ తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి. అప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటాము. అని అంటుంది ఆ మాటకి ప్రసాద్ చాలా కోపంగా….. కుమారి నేను పెళ్లి చేసుకుంది కేవలం చిన్నారి కోసం అని నీకు తెలుసు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు.
కుమారి….. ఏంటి నోరు లెగ్స్తుంది కొంచెం మాటలు తగ్గించండి . నేను అన్న దాంట్లో తప్పేమీ లేదు ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను.
ప్రసాద్ ఆమె గయ్యాళి తనానికి ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు.
రోజులు గడిచాయి వాళ్ళు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కుమారి…. ఇవ్వండి మన ఇంటి ఎదురు ఇల్లు కూడా మీరే కదా దానికి కొంచెం బాగు చేయించండి మీ అమ్మ
వాళ్లు వస్తే ఇంకా అక్కడే ఉంటారు.
త్వరగా పనులన్నీ చేయించండి.
అందుకు అతను ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు.
ఆమె.,… ఏంటి ఏం సమాధానం చెప్పడంలేదు. మీరు ఇలా సమాధానం చెప్పట్లేదనీ నేను కులి వాన్ని కూడా మాట్లాడాను. వాళ్లు రేపు వస్తారు ఆయున ఒక మాట చెప్పా మని చెప్పాను.
అని అంటూ లోపలి వెళ్ళిపోతుంది రోజులు గడిచాయి ఆమె అనుకున్నట్టుగా ఇల్లు
అత్తమామల కోసం సిద్ధం చేస్తుంది.
కొన్ని రోజుల తర్వాత గిరిజా దేవి , ఆమె భర్త చిన్నారి ముగ్గురు తిరిగి వస్తారు.
వాళ్ళు ఇంట్లోకి వస్తుండగా కుమారి…..ఒక్క నిమిషం అక్కడ నుండి ఇక్కడ కాదు మి ఇల్లు
కనబడుతుందా అక్కడే మీ ఇల్లు అన్ని శుభ్రం చేసి ఏర్పాట్లు చేశాను ఇంకా దయచేయండి.
అంటూ పెద్దగా అరుస్తూ ఉంది.
భార్య భర్తలు ఏం మాట్లాడకుండా ఎదురుగా ఉన్న ఇంట్లో కి వెళ్తారు.
చిన్నారి కూడా వాళ్ళతో పాటే ఉంటుంది.
వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటే ఒకరు ఇలా మాట్లాడుకుంటారు….. ఏవండీ కోడలు చాలా తెలివైంది కదా. అందుకే మన గురించి ఆలోచించి ప్రత్యేకంగా దీన్ని మళ్లీ శుభ్రం చేయించింది. భర్త…. భలే వెనకేసుకుని వస్తున్నావ్ ఏ. చాలా తెలివైంది కాబట్టి తల్లి కొడుకుల్లి వేరు చేసింది . ప్రత్యేకంగా కాపురం పెట్టింది. రెండు రోజులు ఉంటే తండ్రి కూతుర్రి నీ కూడా వేరు చేస్తుంది. అని తిడుతూ ఉంటాడు అదంతా చాటుగా వింటున్న కుమారి అక్కడికి వచ్చి…. నేనేమీ అంత కసాయి దాన్ని కాదు నా బిడ్డను తీసుకుని వెళ్తాను. నేను నీ మంచి కోసం ఇలా చేస్తే నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు.
ఈ రోజుల్లో మంచితనానికి స్థానమే లేదు అంటూ చిన్నారిని తీసుకుని వెళ్తుంది.
చిన్నారి….. నేను రాను నేను నాయనమ్మ దగ్గరే ఉన్నాను. నేను రాను అంటూ ఏడుస్తుంది. అయినప్పటికీ ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా. చిన్నారి ని బలవంతంగా ఇంటికి తీసుకు వెళుతుంది.
రోజులు గడిచాయి చిన్నారిని ఆమె సరిగా చూసుకోలేదు కాదు. వాళ్ళ నాయనమ్మ దగ్గర కూడా వెల్ల ఇచ్చేది కాదు. చిన్నారి నాన్నతో…. నాన్న నేను ఇక్కడ ఉన్నాను నన్ను నాయనమ్మ దగ్గరికి పంపించమని అమ్మతో చెప్పు. అమ్మ నన్ను ఎప్పుడు కొడుతుంది నాకు సరిగ్గా నువ్వు కూడా పెట్టడంలేదు.
అన్నమడిగితే నన్ను కొడుతుంది. అంటూ తన చేతికున్న గాయాల్ని చూపిస్తుంది.
దాడి చూసిన తండ్రి. కోపంగా ఆమెతో ….. ఒసేయ్ కుమారి ఎందుకు చిన్న పిల్ల అని చూడకుండా ఇలా చిత్రహింసలు పెడుతున్నావూ.
కుమారి…. ఏంటి అలా గొంతు చించుకుని అరుస్తున్నావ్వూ. ఎక్కువ మాట్లాడకు అది ఏం పని చేయకుండా ఉంటే. ఊరికే తిండి పెట్టాలా. అందుకే పనులు నేర్పిస్తున్నను పనిచేయకపోతే ఒక దెబ్బ కొట్టాను . ఆ మాత్రం దానికి ఎందుకు ఆలా గంగిరెద్దులా రంకెలు వేస్తున్నావు.
అతను….. అవునే గంగిరెద్దు నై. నిన్ను చేసుకొని నువ్వు చెప్పిన ప్రతి దానికి తల ఊపుతున్నాను. నోరు ఉందికదా అని ఎగసెగసి పడుతున్నావవు.బిడ్డకు అన్నం పెట్టి ఎన్ని రోజులు అవుతుంది. బిడ్డకి కాదు నాకు అన్నం పెట్టి ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా.
కుమారి…. నేను పెట్టేది ఏంటి. వండుతున్నాగా పెట్టుకోని తినలేరా.
అంటూ అరుస్తూ లోపలికి వెళ్తుంది.
అతను ఏడుస్తున్న చిన్నారిని పట్టుకొని…
నన్ను క్షమించు తల్లి నేను .పెళ్లి చేసుకోను చాలా పెద్ద పొరపాటు చేశాను.
అంటూ ఏడుస్తాడు. రోజులు గడిచాయి చిన్నారికి అక్కడ ఏమాత్రం ఉండడం ఇష్టం ఉండదు. గిరిజా దేవి రోజు వాళ్ళ తగాదాలు చూస్తూనే ఉంటుంది. కానీ చూసీచూడనట్టుగా వదిలేస్తుంది. ఒకరోజు చిన్నారి పరుగు పరుగున తన నాయనమ్మ దగ్గరికి వెళ్తుంది.
ఆమెను చూసిన నాయనమ్మ చాల సంతోషపడుతూ ఆమెను హత్తుకుంటుంది.
అప్పుడు ఆమె….. చిన్నారి ఏమ్మా బాగున్నావా. మీ అమ్మ ఇంట్లో లేదా. ఆమె చూసిందంటే కొంపలు మునిగిపోతాయి.
చిన్నారి…. మరి ఏం పర్వాలేదు నాయనమ్మ .
మా అమ్మ కూరగాయల కోసం వెళ్ళింది.
ఈరోజు మా అమ్మ చికెన్ చేసింది. అందుకే నీకు తీసుకుని వచ్చాను.
ఆమె….. వద్దమ్మ మీ అమ్మకు తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపో .
చిన్నారి…. నాయుడమ్మ నువ్వేమీ కంగారు పడకు. నేను భోజనం చేసేటప్పుడు నాకు వడ్డించింది . అమ్మకి తెలియకుండా నేను ఆ ముక్కల్ని దాచి పెట్టుకున్నాను. ఆ మాటలు విన్న ఆమె ఏడుస్తూ….. నా బంగారు తల్లి నా మీద నీకు ఎంత ప్రేమ. అంటూ చాలా సంతోషపడుతుంది.
చిన్నారి… నాయనమ్మ అమ్మకి నాన్నకి ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉన్నాయి.
అమ్మ నాన్న మీద కోపాన్ని నామీద చూపిస్తుంది. నాకు అన్నం పెట్టదు కొడుతుంది. నిన్న రాత్రి కూడా వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. అమ్మ కోపంగా నన్ను చితకబాదింది. నా విపు చూడు. అంటూ తన గాయాల్ని చూపిస్తుంది.
ఆమె వాటిని చూసి…. అయ్యో చిన్న పిల్ల అని కూడా చూడకుండా. గోడ్డునీ బాదినట్టు బాగుంది. దానికి అసలు భగవంతుడు మనసే ఇవ్వలేదు. ఉండమ్మ వెన్న రాస్తాను అంటూ వెన్న తీసుకు వచ్చి ఆమె గాయాలకు రాస్తోంది. చిన్నారి…. నాయనమ్మ నాకు చాలా నొప్పిగా ఉంది. నేను ఆ ఇంట్లో ఉండను నాయనమ్మ నేను నీ దగ్గరే ఉంటాను .
ఆమె…. సరే ఎక్కడికి వెళ్లిందు లే కానీ నువ్వు
ఇక్కడే ఉండు. అని అంటుంది చిన్నారి కొంచెంసేపు తర్వాత నిద్రపోతుంది.
కొంత సమయానికి కుమారి ఇంటికి తిరిగి వస్తుంది. చిన్నారి లేకపోవడంతో… ఒసేయ్ చిన్నారి ఎక్కడ చచ్చావ్. తలుపులు కూడా వేయకుండా ఎక్కడికి వెళ్లావు.అంటూ కేకలు వేస్తోంది అప్పుడే గిరిజా దేవి బయటకు వచ్చి … మా ఇంటి దగ్గర నిద్రపోతుంది. అసలు నువ్వు మనిషివేనా పిల్లనీ అలా గొడ్డును బాదినట్లు బాదావు. వాడి మీద కోపం పిల్ల మీద చూపించే ఏంటి.
ఆమె…. నా కూతురు నా ఇష్టం. నేను కొడతాను చ oప్పుకుంటాను నీకేంటి అంటా.
అంటూ పెడ గా మాట్లాడుతుంది.
ఆమె…. నేను నీ ముందు ఏం మాట్లాడలేక పోతున్నాను. దయచేసి పిల్లల్ని కొట్టొద్దు. ఆమె ఎంతగా బాధపడుతుంది. భర్తను ప్రేమగా చూసుకోవడం నేర్చుకో.
కుమారి…. నాకు మీరు నీతులు బోధించాల్సిన అవసరం లేదు కానీ బిడ్డ ని పంపించండి. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి . అది పని చేయాలి.
అత్త….. అంత చిన్న పిల్ల చేత గొడ్డు చాకిరీ చూపిస్తున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా. నలుగురూ నాలుగు రకాలుగా నవ్విపోతారు.
కుమారి… నీతో మాటలు అనవసరం. అంటూ లోపలికి వెళ్లి నిద్రపోతున్న చిన్నారిని కాలితో తన్ని…. ఒసేయ్ నిద్ర లే. అందరి చేత మాటలు పడేలాగా చేస్తున్నావు. అంటూ బలవంతంగా ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్లి పోతుంది.
ఇంటిదగ్గర చిన్నారి పనులు చేస్తూ ఉంటుంది.
దానంత చూస్తున్నా దేవి మాత్రం ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది.
అలా ఆ తండ్రి కూతురు ఇద్దరూ ఆ గయ్యాలి చేతిలో నలిగి పోతూ సతమతమవుతూ వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు.
తల్లి గిరిజా దేవి ఆమె మనసు ఇప్పటికైనా మారాలి అని చెప్పి దైవాన్ని ప్రార్ధిస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. ఎప్పటికైనా కుమారి మనసు మారి అందరూ ఉమ్మడి కుటుంబం లాగా కలిసి మెలిసి ఉండాలని మనం కోరుకుందాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *