కాకి దాహం Telugu Kathalu | Telugu Stories | Telugu Fairy Tales | Moral Stories -Panchatantra Kathalu

బేబీ వాళ్ళ అమ్మ …… అమ్మ బేబీ మీ నాన్న నువ్వు ఇష్టమని జున్ను పాలు తీసుకొచ్చాడు నేను జున్ను తయారు చేస్తాను ఎక్కడికి వెళ్ళకు. తమ్ముడు తో ఆడుకుంటూ ఉండు. బేబీ….. జున్ను అంటే నాకు చాలా ఇష్టం కదా అమ్మ నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఎక్కడికి వెళ్ళను తమ్ముడు తో ఆడుకుంటూ ఇక్కడే ఉంటాను. అని చెప్పి బయట తమ్ముడు తో ఆడుకుంటూ ఉంటుంది. ఒక గంట తర్వాత బేబీ వాళ్ళ అమ్మ బేబీ కి జున్ను తీసుకొచ్చి ఇస్తుంది. తను జున్ను ఇస్తూ….. అబ్బాయి ఇలా ఇవ్వు నేను లోలకకి వెళ్తాను అని చెప్పి తను బాబుని తీసుకొని వెళ్ళి పోతుంది.
బేబీ జున్ను వైపు చూస్తూ….. అబ్బాయి జున్ను తినీ ఎన్ని రోజులు అవుతుంది. అని బయట కూర్చుని
తినబోతూ ఉండగా ఇంతలో ఒక కాకి తన చేతిలో ఉన్న జున్ను ని తన్నుకు పోతుంది.
బేబీ. …. నా జున్ను జున్ను, హుష్ యుష్ అంటూ కాకి వెంటపడుతుంది.
కాకి సరాసరి ఆ జున్నుని గూటికి తీసుకెళుతుంది.
తను ఆ జున్నుని తన భర్తకు తినిపిస్తూ ఉంటుంది.
దాన్ని చూసిన బేబీ….. నా జున్ను ని తీసుకువచ్చి ఏం చేస్తున్నావు నాకు అది అంటే చాలా ఇష్టం నాకు ఇవ్వు.
కాకి….. నన్ను క్షమించు మిత్రమా నా భర్త ఆరోగ్యం సరిగా లేదు. తన ఆకలి ఆకలి అంటున్నాడు.
ఉదయం నుంచి ఎక్కడా కూడా ఆహారం దొరకడం లేదు. సమయానికి నీ చేతిలో జన్ను కనబడింది తీసుకుని వచ్చాను. నన్ను క్షమించు.
అంటూ చాలా బాధగా అడుగుతుంది అందుకు బేబీ….. అయ్యో పాపం నీ బర్త్కి ఏమైంది.
కాకి….. తన ఆరోగ్యం సరిగా లేదు. తిండి కూడా అంతంతమాత్రంగానే తింటున్నాడు. అయినా మాకు ఎక్కడ ఆహారం దొరకదు ఎవరింటి ముందు కన్న వెళ్లి అడిగితే వాళ్లు మమ్మల్ని పక్కకి వెళ్ళమంట్టు తరిమి కొడతారు. కనీసం వాళ్ళు భోజనం చేసే సమయానికి వెళ్తే ఎంగిలి చేతితో కూడా మమ్మల్ని పక్కకు విసరరు.
అలాంటి దౌర్భాగ్యమైన జీవితం మాది అంటూ ఏడుస్తుంది.
ఆ మాటలకి బేబీకి చాలా బాధ కలుగుతుంది….. నువ్వు బాధపడకు మిత్రమా ఈరోజు నుంచి నీకు ఎలాంటి బాధ ఉండదు మా ఇంటి ముందు నీకోసం ఆహారం ఉంచి తాము సంతోషంగా నువ్వు తినొచ్చు అని అంటుంది.
అందుకు కాకి చాలా సంతోష పడుతూ…… చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అని అంటుంది.
తర్వాత బేబీ అక్కడినుంచి వచ్చేస్తుంది ఆ మరుసటి రోజు ఉదయం బేబీ కాకి కోసం ఆహారం పెట్టి
తనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
చాలా సమయం వారికి కాకి రాదు ఇక బేబీ లోపలికి వెళ్తుంది.
ఇంటిలో కాకి అక్కడికి వస్తుంది తను అక్కడ పెట్టిన ఆహారం తింటూ ఉండగా. బేబీ ఇంట్లో ఉన్న కట్టెల పొయ్యి దగ్గరికి పిల్లవాడు వెళుతూ ఉంటాడు.
కాకి….. మిత్రమా మిత్రమా బయటికి రా. పిల్లవాడు పోయి దగ్గరికి వెళ్తున్నాడు. అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తోంది బేబీ వెంటనే బయటకు వచ్చి పోయి దగ్గర ఉన్న పిల్లవాడిని పక్కకు తీసుకు వస్తుంది.
తను చాలా భయపడుతూ…… మిత్రమా చాలా చాలా కృతజ్ఞతలు నా తమ్ముడు ప్రాణాలు కాపాడావు నువ్వు కనుక రాకపోయినట్లయితే ఎంత ప్రమాదం జరిగిందో. అంటూ తనకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
ఇంతలో తల్లి బయటికి వస్తుంది తల్లితో….. అమ్మ నీకు లోపల ఏదైనా పని ఉంటే తమ్ముడుని నాకు ఇవ్వమని చెప్పాను కదా. కాసేపట్లో ఎంత ప్రమాదం తప్పింది తెలుసు అంటూ ఏడుస్తూ. చెబుతుంది తల్లి
ఆశ్చర్యంగా…… ఏమైందమ్మా అని అంటుంది.
అప్పుడు బేబీ ఏం జరిగిన విషయం చెప్పి ఆ కాకి రావడం ఆలస్యమైతే ఏం జరిగిందో చెప్తుంది.
తల్లి చాలా ఏడుస్తూ బిడ్డను ఎత్తుకుని….. చాలా కృతజ్ఞతలు నీకు అని చెప్పి ఏడుస్తూ బిడ్డను తీసుకుని లోపలికి వెళ్తుంది.
బేబీ కాకితో…… నిజంగా చాలా కృతజ్ఞతలు మిత్రమా నీకు. కాకి అలా మాట్లాడుతూ ఉంటుంది బేబీ….. అవును మిత్రమా ఇంతకూ నీ పేరు ఏమిటి.
అందుకు కాకి నవ్వుతూ…… మాకు పేర్లు ఎవరు పెడతారు. మాకు దాని గురించి తెలియదు.
బేబీ….. పేరు లేకుండా ఏమని పిలవాలి. అందుకే నీకు ఒక మంచి పేరు నేను పెడతాను అని ఆలోచించి. మనిద్దరం జున్ను ద్వారా కలుసుకుందాం కాబట్టి నీ పేరు జున్ను.
కాకి….. చాలా బాగుంది మిత్రమా అని అంటుంది ఇక వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత ఆహారం తీసుకొని కాకి అక్కడ నుంచి వెళ్లి పోతుంది.
రోజులు గడుస్తున్నాయి ప్రతి రోజు కూడా కాకి అక్కడికి వచ్చి బేబీ తో మాట్లాడి ఆహారం తీసుకుని వెళ్తుంది.
ఒకరోజు బాగా పెద్ద వర్షం కురుస్తుంది. బేబీ వర్షం కారణంగా కాకి రాదు అని అనుకుంటుంది.
ఇక ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు వర్షం తగ్గిపోయిందా కాకి రాకపోవడంతో బేబీ తనని వెతుక్కుంటూ వెళ్తుంది.
కాకి తన గూటిని తన గుడ్లను , తన భర్తతో సహా అన్నింటినీ పోగొట్టుకొని ఏడుస్తూ ఉంటుంది.
పెద్ద పెద్దగా ఏడుస్తూ…… నా బిడ్డలు నాకు కాకుండా పోయారు నా భర్త నాకు కాకుండా పోయారు. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకుండా పోయింది. నేను ఇప్పుడు ఒంటరి దానిని అంటూ ఏడుస్తూ బాధపడుతుంది.
తన బాధను చూసిన బేబీ కంటనీరు తిరుగుతాయి…… జున్ను బాధపడకు జిన్ను అసలిదంతా ఎలా జరిగింది నాది.
జున్ను కాకి…… నిన్నటి నుంచి గాలివాన అస్సలు తగ్గలేదు. నిన్న చలికి తట్టుకోలేక నా భర్త చనిపోయాడు. కాలికి నా గూడు చెదిరి పోయింది. గుడ్డు నుంచి బయటికి అయినా బిడ్డలు చనిపోయారు గుడ్లు పగిలిపోయాయి అంటూ ఏడుస్తూ బాధపడుతుంది.
బేబీ అతనికి ధైర్యం చెప్పి…… మిత్రమా నువ్వు నాతో పాటు రా. ఇక్కడ మళ్లీ నువ్వు గుడి నిర్మించుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు మళ్ళీ వంటరి దాని వి అయిపోతావు.
అందుకే నీకు అంటూ నా ఇంట్లో ఒక స్థానం కల్పిస్తాను.
ఆ మాటకి జున్ను…. మీ ఇంటికా వద్దు మిత్రమా. మా కాకి జాతిని చూస్తే అందరూ అసహ్యించుకుంటారు. నేను కనుక మీ ఇంటికి వస్తే నాతో పాటు నీకు కూడా శాపనార్థాలు పెడతారు.
బేబీ…. ఎవరు ఏమన్నా అనుకోన్నివ్వు. మంచి మనసుతో మనం ఎవరికీ సహాయం చేసినా అది మంచి గా మారుతుంది కానీ చెడు కి ఎప్పుడు దారి తీయదు భగవంతుడు అలా ఎప్పటికీ చెడు చెయ్యడు. నువ్వు నాతో ధైర్యంగా రావచ్చు అని ధైర్యం చెబుతుంది కాకీ సరే అని చెప్పి తనతో పాటు
ఇంటికి తీసుకు వస్తుంది.
తను ఒక చిన్న ఇంటిని నిర్మించి అక్కడ ఉండమని అంటుంది.
తను అక్కడే ఉంటుంది బేబీ ప్రతిరోజు తనకి ఆహారాన్ని అందిస్తూ బాగా చూసుకుంటుంది.
కాకి అక్కడే బేబీ వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉంటుంది తనకి చిన్న చిన్న సహాయం చేస్తూ
అక్కడే హాయిగా జీవిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *