కిరాతకమైన మేనత్త – 1_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

కింతటి భాగంలో జగదీష్ మల్లయ్య, సుబ్బయ్య కు డబ్బులు ఇస్తాడు వాళ్లు చాలా సంతోషపడుతూ. అతనికి కృతజ్ఞతలు చెప్పి డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత కుటుంబంతో విశ్రాంతి తీసుకుంటోంది ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రోజులు గడుస్తున్న వి అనుకోకుండా జగదీష్ కి అతని భార్యకు జబ్బు చేస్తుంది. అసలు ఎందుకు అలా జరిగిందో ఎవరికీ అర్థం కాదు. ఆ విషయం తెలుసుకున్న మల్లయ్య సుబ్బయ్య చాలా బాధ పడతారు. రజిని… సుబ్బయ్య బాబాయ్ డాక్టర్ ని తీసుకొని రా. త్వరగా వెళ్ళు బాబాయ్. అంటూ ఏడుస్తూ చెప్తుంది.
సుబ్బయ్య సరే అని చెప్పి పరుగు పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ని తీసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. డాక్టర్ వాళ్ళిద్దర్నీ పరీక్షించి….. వీళ్ళిద్దరికీ ఏమైందో నాకు అంతుచిక్కడం లేదు. చూస్తుంటే అంతా నార్మల్గానే ఉంది. ఏమి అర్థం కావడం లేదు.
కానీ ఈ బిళ్ళలు వాడండి రేపు కూడా ఒకసారి వచ్చి చూస్తాను. అంటాడు అందుకు వాళ్లు సరే అని అతను ఇచ్చిన మందులు తీసుకుంటారు. రోజులు గడుస్తున్న అది వాళ్ళ వ్యాధి ఏ మాత్రం తగ్గదు . వాళ్ల పరిస్థితి చూసిన రజిని తన తల్లి కాళ్లు పట్టుకొని …..
ఏడుస్తూ అమ్మ ఒక్కసారి లేమ్మా . మీకు ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి అమ్మ . అయ్యో భగవంతుడా నా తల్లిదండ్రులకు ఏం జరిగింది. ఎందుకు నాకు ఇలాంటి కష్టం తీసుకొస్తున్నావ్వు. ఇప్పటికే నన్ను ఒంటరి దాని చేసింది సరిపోలేదా . మళ్లీ నన్ను ఒంటరి దాన్ని చేయాలని ప్రయత్నిసున్నావా . అలా అయితే నన్ను బలి తీసుకో నన్ను చంపేయ్ . అంటూ అక్కడే ఉన్న మంచానికి తల బాదుకుంటూ ఉంటుంది.
జగదీష్ అతని భార్య అంతా వింటూ ఉంటారు కానీ వాళ్ళు ఉరకలు పలకరు.
అప్పుడే మల్లయ్య అక్కడికి వస్తాడు.
మల్లయ్య రజనీని చూసి… అయ్యో రజనీ ఏం చేస్తున్నావ్ నీకు మతి పోయిందా.
రజిని…. బాబాయ్ నన్ను చావనీవు ఇదంతా
నా వల్లే నేను అదృష్టవంతురాలిని. అందుకే
నా తల్లిదండ్రులకి ఇలా జరిగింది.
అంటూ బోరున ఏడుస్తుంది.
మల్లయ్య…. నువ్వేమీ కంగారు పడకు . అంతా మంచే జరుగుతుంది . సుబ్బయ్య పట్నం వెళ్లి డాక్టర్ను తీసుకుని వస్తున్నాడు.
వాళ్లు తప్పకుండా వీళ్ళకి ఏం జరిగిందో చెప్తాడు ఆ వ్యాధిని నయం చేస్తాడు.
అని అంటాడు ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే వైద్యుల్ని తీసుకొని సుబ్బయ్య ఇంటికి వస్తాడు. ఆ వైద్యురాలు వాళ్ళిద్దరినీ పరీక్షించి…. వీళ్లకు వచ్చిన వ్యాధి ఏంటో నాకు కూడా అర్థం కాలేదు.పెళ్లి శరీరంలో ఎలాంటి మార్పులు కూడా లేదు అంతా సరిగానే ఉంది కానీ వీళ్ళు ఎందుకు కదల్లేని స్థితిలో ఉన్నారో అర్థం కాలేదు . అని చెప్పి కొన్ని మందులు రాసి వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
సుబ్బయ్య మల్లయ్య ….. అయ్యో భగవంతుడా దొంగల అయిన మాకు మంచి మనసుతో ఉద్యోగాలు కల్పించారు. అలాంటి మంచి మనసు ఉన్న వీళ్లకు ఎందుకు ఇలా చేసావు. అయ్యో అంటూ ఏడుస్తూ ఉంటాడు.
రజినీ తిండి తిప్పలు మానేసి తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటుంది.
మల్లయ్య సుబ్బయ్య ఎంత చెప్పినా సరిగ్గా తిండి కూడా తినదు. ఇది ఇలా ఉండగా దోస పోసే రోసామ్మ …. ఏంటి రెండు రోజుల నుంచి రజనీ నా దగ్గరికి రావడం లేదు. ఏమి ఉంటుంది ఒకసారి ఇంటికి వెళ్లి చూద్దామా !?
నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది.
వెంటనే వెళ్ళాలి. అని అనుకుని రజనీ ఇంటికి బయలు దేరుతుంది. రజిని ఆమెను చూసి పరుగు పరుగున వెళ్ళి గట్టిగా పట్టుకొని…. పెద్దమ్మ చూడు పెద్దమ్మ . మా అమ్మ నాన్న కి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నా గతి ఏమైపోతుంది నేను రోడ్డును పెడతాను. అంటూ ఏడుస్తుంది.
తన యొక్క ఏడుపు ని చూసిన ఆమె కూడా చాలా ఏడుస్తూ…. అమ్మ రజిని ఊరుకో మేమంతా ఉన్నాం కదా మీ అమ్మకి నాన్నకి ఏమీ కాదు. అంటూ ధైర్యం చెబుతుంది అప్పుడే మల్లయ్య సుబ్బయ్య అక్కడికి వస్తారు. రోసమ్మ వాళ్ళని చూసి…. అసలు ఏం జరిగింది. వైద్యులను తీసుకొచ్చారా .
అందుకు వాళ్ళు…. తీసుకొచ్చాము పట్నం నుంచి కూడా తీసుకు వచ్చాము. కానీ వీళ్ళు యొక్క వ్యాధి ఏమిటి అనేది మాత్రం తెలియలేదు. అని అంటారు అందుకు ఆమె
వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లను చూస్తుంది.
అప్పుడు ఆమె వాళ్ళని చూసి సుబ్బయ్య తో…. సుబ్బయ్య గారు వీళ్ళకి ఎవరో చేతబడి చేశారు. అందుకే వీళ్ళు ఇలాగా కదలలేని స్థితిలో పడుకోని ఉన్నారు.
ఆ మాటలు విన్న సుబ్బయ్య …. అవునా మరి ఇప్పుడు ఎలా. ఇదంతా ఎవరు చేసుకుంటారు. అంటూ కంగారు అడుగుతాడు అందుకు ఆమె…. ఎవరో గిట్టని వాళ్లే ఇదంతా చేసినట్టున్నారు.
వాళ్లు…. మరి ఇప్పుడు ఎలా మళ్లీ మళ్లీ మామూలు స్థితికి తీసుకు రావాలంటే ఏం చేయాలి.
రోసమ్మ…. కంగారు పడాల్సిన ఏమీ లేదు. మా నాన్న చిన్నప్పుడు ఒక ఒక చెట్టు మూలిక ఇచ్చాడు . దాన్ని దంచి నీటిలో వేసి తాగితే వీళ్ళు మళ్లీ మామూలు స్థితికి వస్తారు . అలాగే ఇది ఎవరు చేశారనేది కూడా నాకు తెలిసిపోతుంది.
అందుకు వాళ్ళు….. ఆ పని త్వరగా చేయి. అని అంటారు ఆమె సరే అని చెప్పి తన ఇంటికి వెళ్లి వాటిని తీసుకొని తిరిగి మళ్లీ రజనీ ఇంటికి వస్తుంది. అక్కడ ఆ ఏరు నూరి నీటిలో కలిపి వాళ్లకి అందిస్తుంది కొంత సమయం తర్వాత. వాళ్ళిద్దరూ మామూలు స్థితికి వస్తారు. దాన్ని చూసిన వాళ్లు చాలా సంతోష పడుతూ….. హమ్మయ్య భగవంతుడి దయవల్ల నీకు న్యాయమయింది.
అని అంటారు అందుకు వాళ్ళిద్దరూ….. అసలు ఏం జరిగింది ఏమైంది మాకేం అర్థం కావడం లేదు.
అప్పుడు వాళ్ళంతా జరిగిన విషయం చెప్పారు. సుబ్బయ్య…. ఈ రోసమ్మ అసలిదంత ఎవరు చేశారు నీకు అర్థం అయిందా .
అందుకు ఆమె…. అర్థమైంది. చూపిస్తాను
అంటూ వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తుంది.
అది ఎవరో కాదు వసంత భర్త.
దాన్ని చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతారు .
వీళ్లంతా ఇంట్లోకి వెళ్ళగానే వసంత వాళ్లను చూసి ….. ఆశ్చర్యంగా ఉంది అందరూ ఒకే సార్ వచ్చారు .అందరు బాగున్నారా ఈమె ఎవరు అంటూ రోశమ్మ వైపు చూస్తుంది.
అప్పుడు రజిని ఆమెను గట్టిగా పట్టుకొని….. అమ్మ ఎందుకు ఇలా చేశావు. అని ఏడుస్తూ అడుగుతుంది.
దాన్ని చూసిన ఆమె ఆశ్చర్యంగా…. ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావ్ నాకు ఏమీ అర్థం కాలేదు.
అప్పుడు రోసమ్మ జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్ని విన్న వసంత….. నా కుటుంబం అని మీకు చూపించింది కానీ నేను అలా చెయ్యను .
జగదీష్…. కచ్చితంగా నీ భర్త అని నాకు అర్థమైంది. వాడిని పోలీసులుకు పట్టించుకోకుండా వదిలి పెట్టి నందుకు
ఈ విధంగా చేస్తారు అని అస్సలు అనుకోలేదు ఎక్కడున్నాడు వాడు వాడి ప్రాణం తీస్తాను.
అంటూ కోపం గా అరుస్తూ ఉంటాడు అందుకు ఆమె…. అతనికి ఆరోగ్యం సరిగా లేదు. ఆయన పడుకున్నాడు నా భర్త అలా చేసి ఉండడు. అని అంటుంది అందుకు వాళ్లు ఆశ్చర్యపోయి. అతని దగ్గరికి వెళ్తారు.
అప్పుడు అతను మంచం మీద పడుకొని చాలా నీరసంగా… మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అని అంటాడు. జగదీష్…. జరిగిన విషయం అంతా తనకు చెప్పి….. ఇందులో ఎంత నిజం ఉందో నువ్వే చెప్పాలి.
అని అంటాడు అందుకు తను ఏడుస్తూ… మీరు చెప్పిందంతా నిజమే నేనే ఇదంతా చేశాను. కానీ మిమ్మల్ని చంపడం కోసం కాదు రజిని ని చంపడం కోసం. కానీ అది విఫలం అయి మి మీదికి వచ్చింది . నిజానికి అది నేను దొంగల ని పంపించు ముందు చేసింది కానీ అది విఫలం అయింది అని వారు చెప్పడంతో నేను దొంగల్ని పురమాయించాను. ఇదంతా ఎప్పుడు జరిగింది కానీ ఇప్పుడు చేసింది కాదు.
తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అని. నేను అన్యాయం చేయాలనుకున్నాను అందుకే దేవుడు నన్ను మంచనా పడేసాడు.
అంటూ ఏడుస్తాడు అదంతా విన్న వాళ్లు కూడా చాలా బాధ పడతారు.
వసంత ఏడుస్తూ…. సంతోషంగా జీవించాలి అనుకున్న మా జీవితంలో ఇలాంటి మార్పు వస్తుందని అనుకోలేదు అతని ఆరోగ్యం బాగాలేదు. చాలా డబ్బు ఖర్చు పెట్టాను ఏం జరిగిందో ఏమో. అసలు అర్థం కావటం లేదు.
అని బాధ పడుతుంది అప్పుడు రోశమ్మ ఆ మందునీ నూరి నీటి ద్వారా అతనికి అందిస్తుంది. వెంటనే అతను ఆరోగ్యవంతుడై అయ్యి నిలబడతాడు దాన్ని చూసి వాళ్ళంతా సంతోష పడతారు అప్పుడు
రజిని…. పెద్దమ్మ మీకు చాలా చాలా కృతజ్ఞతలు నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వ్యాధిని తొలగించావ్వు. నీకు ఎన్ని దండాలు పెట్టినా సరిపోవు అంటూ ఏడుస్తుంది.
రోసమ్మ… ఇదంతా చేతబడి చేయడం వల్లే జరిగింది . చేతబడి విఫలమైనప్పుడు చేయించిన వాళ్ల మీద ఆ ప్రభావం అంతా పడుతుంది. అలాగే ఆ కుటుంబం పెద్ద వాళ్ల మీద పడుతుంది అందుకే మీ అందరికీ అనారోగ్యం సంభవించింది అని చెప్తుంది.
అందుకు వాళ్లు…. నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మా అందరి ఆరోగ్యాలు మళ్లీ కుదుట పడ్డయి చాలా సంతోషం .
అని అంటాడు అందుకు వాళ్లు …. నిజమే అందరం ఒకేచోట ఉన్నాం కదా. ఈ సంతోష సమయంలో కలిసి వనభోజనం చేసుకుందాం.
అని అంటాడు అందుకు వాళ్లు సరే అంటారు.
రజిని…. అందరం ఇక్కడున్నాము మరి ముఖ్యమైన వాళ్ల సంగతి ఏంటి .
వాళ్ల గురించి మీరు మర్చిపోయారా అందుకు జగదీష్…. ఎవరు ఎవర్ని మర్చిపోలేదు మీ మేనత్త కళ్యాణి లేకుండా ఇదంతా జరగదులే నువ్వేం కంగారు పడకు అని అంటాడు.
ఆ మాటలకి రజనీ నవ్వుకుంటుంది.
ఆ తర్వాత జగదీష్ మరియు రజిని ఇద్దరు కలిసి కళ్యాణి ఇంటికి వెళ్తారు.
వాళ్ళిద్దర్నీ చూసిన కళ్యాణి చాల సంతోషపడుతూ…. అన్నయ్య రజిని మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. అంతా కులాసానే కదా. అని యోగక్షేమాలు అడుగుతుంది అందుకు జగదీష్… అంత ఇప్పుడే కుదుటపడింది అంటూ జరిగిన విషయమంతా చెప్తాడు. దాన్ని విన్న ఆమె చాలా ఆశ్చర్య పోతూ…. ఇంత జరిగిందా పోన్లెండి జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాము కదా చాలా సంతోషం.
అని అంటుంది జగదీష్…. ఈ సంతోష సందర్భంలో మనం అందరం వన భోజనం చేయాలని చెప్పడానికి వచ్చాను నువ్వు బిడ్డ మీ భర్తను తీసుకొని మన ఇంటికి వచ్చేయండి. దాని గురించి మాట్లాడుకుందాం. అని అంటాడు అందుకు ఆమె సరే అంటుంది.
ఆ మరుసటి రోజు అందరూ ఆ ఇంట్లో కలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *