కిరాతకమైన మేనత్త – 3_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

అది ఒక గ్రామం . ఆ గ్రామంలో కృష్ణయ్య వాణి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకి అక్షర అని పాప ఉండేది . వాళ్ళతో పాటే కృష్ణయ్య సహోదరి అయిన కావేరి కూడా అక్కడే ఉండేది. అక్షరా తను ముద్దు ముద్దు మాటలతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ రోజులు గడిచాయి అక్షరా కి కిరణ్ అనే అబ్బాయితో తన అన్నయ్య పెళ్లి చేస్తాడు. అక్షర చాలా బాధతో ఆ ఇంటిని విడిచి పెట్టి . మెట్టినింటికి కాపురానికి వెళుతుంది. అక్కడ ఆమె చాలా సంతోషంగా ఉంటుంది . అన్న వదిన ప్రేమను పూర్తిగా
మర్చిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు కృష్ణయ్య ఎప్పటిలాగే పొలం పనికి వెళ్తాడు .
అతను పొలం పని చేస్తుండగా ఒక పాము అతని కాటు వేస్తుంది . అతనికి ఏదో కొట్టినట్టు అనిపిస్తుంది కానీ అది పాము అని అతను భావించాడు . అతను అలా పని చేసుకుంటూనే ఉంటాడు . కొంత సమయానికి
అసలు కళ్ళు చీకట్లు కమ్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో అతను నూట నురగలు కక్కుతూ చనిపోతాడు. చీకటి పడుతుంది భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కంగారుగా దీపాన్ని పట్టుకొని పొలానికి బయలుదేరుతుంది.
అక్కడ భర్త చనిపోయి కనిపిస్తాడు. ఆమె భర్తను చూసి బోరున విలపిస్తూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు జరగవలసిన కార్యక్రమం అంతా జరిగి పోతుంది . వాణి చనిపోయిన భక్తి గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చిదాని లాగా మారిపోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడే అక్షర తన భర్తతో పాటు అక్కడికి వస్తుంది. వదిన పరిస్థితి చూసి చాలా బాధపడుతుంది తన భర్తతో… ఏమిటి కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉన్నాను మా వదిన ఆరోగ్యం కుదుటపడిన అంతవరకు . అందుకు తను సరే అంటాడు ఆ భార్యభర్తలిద్దరు కూడా అక్కడే ఉంటూ పాపని ఆమెని ఇద్దరిని చుసుకుంటూ ఉంటారు. రోజులు గడిచాయి ఆమె వదిన పిచ్చి చేష్టలు ఆమెకి విసుగు కలిగించే లాగా ఉంటాయి . ఆమె ఎంతో కోపంతో వాళ్ళ వదిని కొడుతూ…. ఒసేయ్ పిచ్చి ముండ ఎంత పని చేసేవ్వి. ఆకలి అవుతుంటే నన్ను అడగాలి పొయ్యి మీద పాలు అన్నం చట్టి కూర చట్టి అన్నిటినీ పాడు చేసావు కదే. అంటు అవును కొడుతూ ఉంటుంది .
అప్పుడు పాప అడ్డుపడి… అమ్మునీ కొట్టొద్దు
అమ్మని కొట్టొద్దు . మేనత్త….. ఒసేయ్ పిల్ల పిశాచి . ఈ వయసుకే ఇక దేవుడు ఎన్ని తెలివితేటలు పెట్టాడు . అమ్మను కొడుతున్నారని కూడా తెలిసిందన్నమాట.
నిన్ను కూడా కలిపి కొడతాను అంటూ ఇద్దరినీ చితక బాధ పెట్టింది ఇంతలో అక్కడికి భర్త వచ్చి …. ఓయ్ ఎందుకు అలా కొడుతున్నావ్ పడని వాళ్ళు ఏం చేశారనీ ఆమె జరిగిన విషయం చెప్పింది.
ఇతను….ఇంత చిన్న విషయానికి వాళ్ళని గొడ్డుని బాదినట్లు బాదుతున్నవి . కొంచెం మనిషిలాగ ప్రవర్తించు.
అంటూ కోపం గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడిచాయి
ఆమె తన మనసులో…. మా అన్నయ్య పోయాడు . మా అన్నయ్య పాటు ఇది కూడా పోయినట్లయితే బాగుండేది. ఇప్పుడు ఇక్కడ కొచ్చి ఇరుక్కుపోయినటుంది . ఇప్పుడు అందరు నేను దీన్ని బాగా చూసుకుంటున్న అని అంటున్నారు ఇప్పుడు కనుక. ఇక నుంచి వెళ్తే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. ఇది కూడా పోతే ఇంటిని అమ్మి . ఆ బుడ్డ దాన్ని అనాధ ఆశ్రమాల్లో చేర్పిస్తాను. అది త్వరగా జరిగితే బాగుండు అనుకుంటూ వాళ్ళ చావుని కోరుకుంటుంది .
రోజులు గడిచాయి ఆమె చాలా కోపంగా పాపతో… ఒసేయ్ పిల్ల పిశాచి . మీ అమ్మకి నీకు సేవలు చేయ లేక చస్తున్నాను . ఈరోజు నుంచి మి పనులు మీరే చేసుకోవాలి . లేదంటే
మీకు నేను అన్నం పెట్టాను. ఉంటుంది పాప ఏడుస్తూ….. అత్త మాకు పనులు ఏమున్నాయి.
అత్త…. ఏమున్నాయ్ అంటున్నారంటే పిల్ల పిశాచి . మీ బట్టలను ఉతిక లేక చస్తున్నాను .
అమ్మ ఒక పిచ్చిది బట్టలు మురికి అంటించుకుని నా ప్రాణాలు తీస్తుంది.
రేపట్నుంచి నువ్వు చెరువు దగ్గరకు వెళ్లి పెళ్లి బట్టలు శుభ్రం చేసుకుని రా . లేదంటే మీ ఇద్దరికీ అన్నం పెట్టాను .
పాప ఏడుస్తూ సరే అత్త అలాగే చేస్తాను.
ఉంటుంది. ఆ పిచ్చి తల్లి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది ఆ మరుసటి రోజు అవుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం పాప తన తల్లి నీ వెంట పెట్టుకొని చెరువు దగ్గరకి వెళ్తుంది . అక్కడ తన చిన్న చిన్న చేతులతో బట్టలు ఉతుకుతూ. ఉంటుంది తన తల్లి అక్కడే కూర్చుని నీటి తో ఆడుకుంటూ ఉంటుంది .
ఆ పిచ్చి తల్లికి ఒక చేప కనబడుతుంది దాన్ని చూసి…
బలే బలే చేప అంటూ లోపలికి వెళుతుంది .
అలా చెరువు లోపలికి వెళ్ళి ఆమె మునిగిపోయి…. అమ్మ అమ్మ అంటూ పెద్దగా కేకలు వేస్తోంది .
దాన్ని చూస్తున్నా చిన్న పిల్ల …. ఎవరైనా రండి మా అమ్మ మునిగి పోతుంది అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది.
చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ తల్లి చనిపోయి అక్కడ సెవెము గా మారి ఒడ్డున కొట్టుకు వస్తుంది.
పాపా తల్లిని చూసి ఏడుస్తూ….. అమ్ము లేమ్మా ఒకసారి లేమా . అమ్మ నీకోసం నేను బొమ్మలు మొత్తం ఇస్తాను . నీ తో ఆడుకుంటాను . ఒకసారి లేమ్మా అంటూ ఏడుస్తుంది. పాపం ఆ చిన్న పిల్లలకి తల్లి చనిపోయిందని కూడా తెలియదు .
ఆమె అలా ఏడ్చి ఏడ్చి కొంత సేపటికి తన అత్త దగ్గరకు వెళ్లి …. అమ్మ అక్కడ పడిపోయి లేక పోవడం లేదు. అని జరిగిన విషయం చెప్పింది. దాన్ని విన్న ఆమె చాలా హడావిడిగా అక్కడికి చేరుకుంటుంది. శవాన్ని చూసి నా మేనత్త…. అమ్మయ్య మంచి పని జరిగింది. రోజు దీనికి పిచ్చి వేషాలు తో నా ప్రాణాలు తోడుతు ఉండేది . ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. అని అంటుంది.
ఆ పాప ఏడుస్తూనే ఉంటుంది ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని జరిగిపోతాయి.
ఆ మరుసటి రోజు ఉదయం ఆ మేనత్త …. ఒసేయ్ నా ముద్దుల కోడలా ఎక్కడ చచ్చావ్ ఏ . రా మీ అమ్మ పోయిందని ఇంకా ఏడుస్తూనే ఉన్నావా . నోరు మూసుకొని ఎక్కడున్నావ్ త్వరగా రావే . అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. కానీ ఆ పాప నీ ఎంత పిలిచినా పలకకపోవడంతో మేనత్త లోకి వెళ్లి చూస్తుంది ఆ పాప చలిజ్వరంతో వణుకుతు
ఉంటుంది. దాన్ని చూసి నా మేనత్త…. దీనికి చాలి జ్వరం వచ్చినట్టుంది . పోనీలే దీని పీడ కూడా పోతే ఈ ఇల్లు అమ్ముకొని మేము సంతోషంగా బతకొచ్చు. అని అనుకుంటూ ఆమె ని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు ఆ పాప ఏడుస్తూ… అమ్మ అమ్మ అంటూ మూలుగుతూ చలికి వణుకుతూ ఉంటుంది.
అప్పుడే వాళ్ళ మామయ్య అక్కడికి వస్తాడు.
అక్షరనీ చూసి… అయ్యో ఒళ్ళు మండిపోతుంది అంటూ అక్కడి నుంచి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్తాడు.
మేనత్త అడ్డుకొని…ఎక్కడికి వెళ్తున్నారు డాక్టర్ ని తీసుకోవడానికి . మేము ఆ పని చేయలేక పట్టీపట్టనట్లు గా ఇంటిలో కూర్చోండి అది పోతే ఇల్లు బంగారం కూడా ఉంది. కొంత డబ్బు ఉంది అవన్నీ మన సొంతమవుతాయి.
మీరు పెత్తనం కట్టుకోకుండా అలా కూర్చోండి.
అతను కోపంగా….ఒసేయ్ నీకు పట్టినట్టు డబ్బులు పిచ్చి నాకు పెట్టలేదే. నేను డాక్టర్ ని తీసుకుని వస్తాను అడ్డం వచ్చావంటే నిన్ను అడ్డంగా నరికేస్తా ను. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఆమె చాలా కోపంగా పాప దగ్గరికి వెళ్లి…. ఒసేయ్ నీ వల్ల నా మొగుడు నన్ను తిట్టాడు అంటూ ఆమెను చితకబాదుతుంది.
ఆ పాప ఏడుస్తూ… వద్దు అత్త కొట్టొద్దు. నొప్పి పుడుతుంది . ఓద్దు అత్త అంటూ ఎంతగానో
ప్రాధేయ పడుతూ ఏడుస్తూ ఉంటుంది అయినప్పటికీ ఆమె జారి పడకుండా ఆమెను కొట్టి….. నిన్ను ఇలా కాదు నిన్ను దిండు పెట్టి
ఊపిరాడకుండా చేసి చంపేస్తాను అంటూ లోపలికి వెళ్లి దిండు తీసుకొని వస్తుంది.
ఆమె దిండుని ఆమెపై పెట్టి గట్టిగా నొక్కుతుంది పాప గిలగిలా కొట్టుకుంటూ అరుస్తుంది . అప్పుడే డాక్టర్ ని తీసుకొని భర్త రావడం గమనించి ఆ దిండు ని పక్కకు తీసేస్తుంది. ఏం తెలియనట్టు గా అక్కడ వినబడుతుంది డాక్టర్ ఆ పాపని పరీక్షించి…. అయ్యో పాప పరిస్థితి చాలా ఇది గా ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్లడం మంచిది . అని అంటాడు అందుకు అతను సరే అంటారు ఆ పాపని ఆసుపత్రికి తీసుకొని వెళ్తాడు.
ఇంటి దగ్గర ఉన్న ఆమె …. ఇది ఎక్కడి నుంచి దాపురించి నా పాలిట పడింది దీని హాస్పిటల్ ఖర్చులు అంటూ బోచ్చాడన్ని డబ్బులు అవుతాయి. చి చి దీన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి బయటికి పంపించడమా లేదంటే శాశ్వతంగా పైకి పంపించడంమా. అనేది చేయాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తాను. అనుకుంటుంది మూడు రోజులు గడిచాయి ఆ పాపని అతను హాస్పిటల్లో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు.
వైద్యురాలు…. పాప ఆరోగ్యం చాలా మెరుగుపడింది ఇంక మీరు ఇంటికి తీసుకొని వెళ్లొచ్చు. అని అంటుంది అతను సరే అని చెప్పి పాపను ఇంటికి తీసుకొని వస్తాడు.
భార్య…. నా మాట వినకుండా హాస్పిటల్ తీసుకెళ్లారు ఎంత డబ్బు వదిలీచ్చారు.
అతను చాలా కోపంగా….ఎంత డబ్బు అయితే ఏంటి నువ్వు ఇవ్వలేదు కదా వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బే కదా అయినా. డబ్బు కోసం నువ్వు ఇంత కఠినంగా మారతావు అని అస్సలు అనుకోలేదు .
మన పెళ్లి కాకముందు మి వదిన అన్నయ్య
నిన్ను ఎలా చూసుకుంటారో మన పెళ్లి తర్వాత నాకు ఎన్నిసార్లు చెప్తావు మర్చిపోయావా. మీ వదిన అన్నయ్య ఆత్మహత్యలు శాంతించవ్వి. ఎందుకంటే నువ్వు వాళ్ళ కూతురిని ఎలా చూసుకుంటున్నా వో. పైనుంచి వాళ్ళు చూస్తూ ఎంతగానో బాధ పడుతూ ఉంటారు.
నీలాంటి చెల్లెలు పుట్టినందుకు వాళ్లు ఎంతగానో బాధ పడుతుంటారు అంటూ కోపంగా క అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆ రోజు రాత్రి సమయం అందరు నిద్ర ఇస్తూ ఉంటారు . అప్పుడు వాళ్ళ అన్న ఆత్మ ఆమె కలలో కనబడి …. అమ్మ కస్తూరి నేను చనిపోయిన తర్వాత మీ వదిన నీ నువ్వు ఎలా చూసుకుంటావో నాకు బాగా తెలుసు అంత కఠినంగా ప్రవర్తించారు ఇప్పుడు అదే నా బిడ్డ పట్ల చూపిస్తున్నావు . నిన్ను నేను ఈ చేతులతో పెంచాను . అమ్మ నాన్న లేని లోటు తీర్చాను. దానికి కృతజ్ఞతగా అయినా నా బిడ్డను బాగా చూసుకో నీ కాళ్లు పట్టుకుంటా నమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు ఆమె ఒక్క సారిగా నిద్ర నుంచి లేచి…. అన్నయ్య నన్ను క్షమించు నిజంగా నేను చాలా చాలా ఘోరంగా ప్రవర్తించాను గడిచిన గతాన్ని పూర్తిగా మర్చిపోయాను. నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలా చెయ్యను . నా కోడలు నీ సొంత కూతురు లాగా చూసుకుంటాను నన్ను నమ్ము. ఇప్పటిదాకా నేను చేసిన దానికి నన్ను క్షమించు అన్నయ్య అంటూ ఏడుస్తుంది.
అప్పుడే భర్త ఆమె వైపు …ఏమైంది అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆమె జరిగిన విషయం చెప్పి క్షమాపణ కోరుకుంటుంది.
ఆ రోజు నుంచి ఆమె తన కోడలిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ . సంతోషంగా ఉంటుంది తన మేనత్త లో అమ్మ ప్రేమను చూసుకుంటూ ఆమె కూడా సంతోషంగా
ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *