కిరాతకమైన మేనత్త 4 | Telugu kathalu |Telugu Stories |Bedtime Dreams Telugu| Kattapa kathalu

ఇచ్చాపురం మనం ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో. ఆ గ్రామంలో పవన్ అనురాధ అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్లు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు రోజులు సంవత్సరాలు గడిచాయి. వాళ్లకు మీనా అనే ఒక పాప జన్మించింది. ఆ పాపని వాళ్ళు చాలా చక్కగా చూసుకునే వాళ్ళు కొన్ని సంవత్సరాలు గడిచాయి పాప కు పది సంవత్సరాలు వచ్చాయి. చక్కగా చదువుకుంటూ అల్లరి చేయకుండా మీనా పద్ధతిగా ఉంటుంది . పాపను చూసి తల్లిదండ్రులు చాలా మురిసిపోతూ ఉండేవాళ్ళు అలా రోజులు గడిచాయి ఒకరోజు పవన్ ఎప్పటిలాగే తన పొలం పని చేసుకోవడానికి పొలానికి వెళ్ళాడు. అతని పొలం పని చేసుకుంటూ ఉండగా ఒక పాము మీద కాటు వేసి అక్కడ నుంచి వెళ్లి పోతుంది .
కానీ అతను అది పాము అని గమనించకొడు. ఏదో ఒక పురుగు కుట్టింది అన్న ఉద్దేశంతో. తన పని చేసుకుంటూ ఉంటాడు.అతనికి ఆ పాము శరీరం సన్నగా ఒంట్లో ప్రవేశించడంతో కొంచెం కొంచెంగా నీరసపడి పోతూ ఉంటాడు ఆయన….అబ్బా ఉన్నట్టుండి ఇంత నీరసం వచ్చేస్తుంది ఏంటి . ఏదో తిక్క తిక్క గా ఉంది. ఇంక మిగిలిన పని రేపు చేసుకోవచ్చు . అని అనుకుని అక్కడికి వచ్చి ఇంటికి వెళ్తాడు.
ఇంటిదగ్గర తను నీరసంతో పడుకుంటాడు భార్య ….. ఏమైందండీ ఎందుకు అలా ఉన్నారు అతను… ఏముంది కాదా పొలంలో ఏదో కాల్ మీద కుట్టినట్లు ఉంది . ఆ తర్వాత నుంచి అసలు ఒంట్లో బాలేదు.
అని చెప్తాడు ఆమె కాలు మీద చూస్తుంది . పాము కాటు వేసిన ఘాట్లు ఉంటాయి..
ఆమె…. ఏవండీ ఇది పాముకాటులా ఉందండి. అని చెప్తుంది . అతను చాలా కంగారు పడతాడు . ఆమె…. ఏమండి నేను ఇప్పుడే వెళ్లి డాక్టర్ను తీసుకుని వస్తాను .
మీరు జాగ్రత్త అని చెప్పి ఒక గుడ్డ తో కలిపి గట్టిగా కట్టి , అక్కడినుంచి డాక్టర్ కోసం వెళ్తుంది . ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆమెకు జరిగిన విషయం చెప్తోంది. దానిని విన్న డాక్టరమ్మ త్వరగా వెళ్దాం పద అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని తనతో పాటు ఇంటికి బయలు దేరుతుంది ఇద్దరు ఇల్లు చెరుకు ఉంటారు కానీ అప్పటికే అతనికి ఒళ్ళు మొత్తం విషయం పాకిపోయి నోటి వెంబడి నురగ కక్కుకోని చనిపోతాడు.
దాన్ని చూసిన ఆమె బోర్నన ఏడుస్తూ…. ఏవండీ ఒక్కసారి లేవండి నీ కూతురు వస్తే నేను సమాధానం చెప్పాలి. అంటే పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మీనా బడి నుంచి వస్తుంది. తండ్రి చనిపోవడం చూసి అతని దగ్గరికి వెళ్లి…. నాన్న ఏమైంది నాన్న . నన్ను ఒకసారి లే నాన్న ఆడుకుందాం లే నాన్న అంటూ ఏడుస్తూ. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉంటుంది.
ఇక తర్వాత కార్యక్రమం పూర్తవుతుంది. రోజులు గడిచాయి . అతను చనిపోయిన తర్వాత ఆ తల్లి కూతుర్లు ఇద్దరు అతని మీద చాలా దిగులు పడుతూ ఉంటారు.
అలా ఉండగా ఒకసారి మీనా మేనత్త అక్కడికి వస్తుంది. ఆమె…. వదిన వదిన మేము తీర్థయాత్రల కి వెళ్ళాము . అన్నయ్య చనిపోయిన విషయం నాకు నిన్ననే తెలిసింది. అసలు ఏం జరిగింది వదిన. అని అడుగుతుంది అప్పుడు ఆమె ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది.
ఆమె…. అయ్యో బంగారం లాంటి మా అన్నయ్య . ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇంత చిన్న వయసులోనే దేవుడు తీసుకెళ్ళి పోతాడనుకోలేదు. అంటూ ఆమె కూడా చాలా బాధపడుతుంది.
పాపా… అత్త ఏడవకు . అంటూ ఓదారుస్తుంది చాలా సమయం వరకు వాళ్లంతా చాలా బాధ పడుతూ. ఉంటారు సాయంత్ర సమయం కావడంతో. మేనత్త వాళ్లతో…. వదిన నేను వెళ్లి వస్తాను . అన్నట్టు వదిన ఇప్పుడు ఇంటి పరిస్థితి బాలేదు కదా . మీనా చదువుకయ్యే ఖర్చు నేను భరిస్తాను . ఆమె… వద్దులే శారద నేను ఏదో కుల్లో నాలో చేసి చదివిస్తాను.
అయినా ఇక దీనికి చదువు ఎందుకు లేమ్మా. ఆడపిల్ల సరే అయితే చదువుకున్న వాడిని భర్తగా తీసుకురావాలి. వాళ్లకి కట్నాలు ఇచ్చే స్తోమత మాకు లేదు . చదువు ఇంతటితో ఆపేస్తాను.
ఆమె.. అయ్యో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నా మాట విను . నేను మీనా ను మా ఊరు తీసుకెళ్తాను అక్కడ స్కూల్ లో చదివి ఇస్తాను. ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను. నా కూతురు శోభ తోనే . మీనా కూడా ఉంటుంది కాదనకు. అని అడుగుతుంది అందుకు ఆమె సరే అంటుంది .
అప్పుడు మీనా…. అమ్మ నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తానమ్మ.
అందుకు తల్లి…. మీనా నువ్వు ఇక్కడే ఉన్నావా అంటే నీ చదువు ఆగిపోతుంది. తినడానికి తిండి కూడా సరిగా ఉండదు అమ్మ. నువ్వు ఆక్కడికి వెళ్లావు అంటే శోభ తో పాటు . బడికి వెళ్లి వచ్చు మంచి బట్టలు వేసుకోవచ్చు బాగా చదువుకోవచ్చు. సరే నా మాట విన అత్తతో పాటు వెళ్ళు . అని సర్ది చెప్పింది అందుకే ఆమె సరే అంటుంది .
ఆ తర్వాత శారద పాప ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మీనా శారద వాళ్ళ ఇంటిని చూసి …. అత్త ఇంత పెద్ద ఇల్లు నీదేనా. శారద… అవును మీనా ఈ ఇల్లు మనదే . చూడు ఇక్కడ నువ్వు హాయిగా ఉండొచ్చు. శోభ తో పాటే హాయిగా చదువుకోవచ్చు . ఇంతలో శారద కూతురు శోభ అక్కడికి వస్తుంది. మీనా శోభ ని చూసి.. శోభ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శారద… శోభ మీనా కూడా ఇక్కడే ఉండి చదువుకుంటుంది.
అల్లరి చేయకుండా గొడవలు పడకుండా ఆడండి సరేనా అని చెప్పి లోపలికి వెళ్తుంది .
వాళ్ళిద్దరూ హాయిగా అక్కడే ఆడుకుంటూ. బడి సమయాలలో బడికి వెళుతూ. సంతోషంగా ఉంటారు. అలా ఉండగా ఒకరోజు మీనా. అత్త దగ్గరకు వచ్చి….. అత్త ఇదిగో నాకు స్కూల్లో క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు బహుమతి ఇచ్చారు. ఆమె చాలా సంతోషపడుతూ…. చాలా మంచిది.
మరి sobha కి ఏం వచ్చింది.
ఇంతలో శోభ అక్కడికి వచ్చి….. అమ్మ నాకు ఏమీ రాలేదు అంతకు ముందు నాకు మొదటి ప్రైజ్ వచ్చేది ఇప్పుడు మీనా కి వచ్చింది.
ఆటలో ఫస్ట్ ప్రైజ్ మీనా కి పాటల్లో ఫస్ట్ ప్రైజ్ మీనా కి . స్కూల్లో ఫస్ట్ ప్రైస్ మీనా కే అన్ని మీనా కి వచ్చాయి నాకు అసలు ఏమి రాలేదు నేను ఇంకా బడికి వెళ్ళను అంటూ ఇంట్లోకి ఏడుస్తూ వెళ్తుంది.
నన్ను చూసిన ఆమె…. శోభ ఎందుకు అలా ఏడుస్తున్నావు . నువ్వు కూడా మీనా తో పోటీపడి చదువుకో ఎప్పటిలాగే నీకు కూడా మంచి మంచి బహుమతులు వస్తాయి అందులో ఏముంది.
ఆమె… అమ్మ నేను బడికి వెళ్లాను అని చెప్పాను కదా నేను బడికి వెళ్లాలంటే మీనా బడికి వెళ్ళకుండా ఉండాలి లేదంటే మీనాని ఏదన్నా బడి లో చేపించు . మేమిద్దరం మాత్రం ఓకే స్కూల్లో చదివాము.
ఆమె…. నా బంగారు తల్లి అయిన ఇక్కడ మరో స్కూల్ అంటూ ఏమీ లేదు కదా.
ఏం చేయమంటావ్ నాకు నీ కంటే ఎక్కువ ఏమీ కాదు.
అప్పుడు శోభ…. అయితే అసలు స్కూలు మానిపించిచేసేయి లేదంటే వాళ్ళ ఊరు తిరిగి పంపించు. ఆమె… అయ్యో ఆమెనీ ఇంటికి తిరిగి పంపించి మన పరువు పోతుంది.
సరే నేను ఏదో ఒకటి చేస్తాలే కానీ నువ్వు విశ్రాంతి తీసుకో . అది చెప్పి పక్కకు వెళ్లి పోతుంది. శారదా తన మనసులో…. నేను అసలు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాను. నేను మీన నీ ఇంటికి తిరిగి పంపిస్తే నా పరువు పోతుంది. దానంతట అదే ఇంటికి వెళితే . ఇక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయింది అని ఏదో ఒకటి చెప్పొచ్చు. దాని కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తూ .సరే దాన్ని ఏదో ఒక రకంగా చిత్రహింసలు పెడితే అది ఇంటికి వెళ్తాను అని అంటుంది . నాక్కూడా ఒక బాధ వదిలిపోతుంది. నా కూతురు కంటే ఎవరైనా ఎక్కువ ఏంటి. అని అనుకుంటుంది .చిన్నపిల్లల తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తల్లి స్వార్ధ బుద్ధితో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు మీనాతో…. మీనా ఈరోజు పని చాలా ఎక్కువగా ఉందమ్మ. sobha నీ సాయం చేయమంటే చెయ్యను అంటుంది నాకు ఈ రోజు సహాయం చెయ్ అమ్మ.అంటుంది అందుకు మిన సరే అంటుంది ఇక ఆమెకు ఇంటి పనిలో సహాయం చేస్తూ ఉంటుంది . అలా రోజు ఏదో ఒక వంకతో ఆమెను బడికి వెళ్ళకుండా చేసి ఇంటిలో పనిచేస్తూ ఉంటుంది రోజులు గడిచాయి ఒక రోజు మీనా….అత్త నేను బడికి వెళ్ళి వారం రోజులు పైన అయిపోతుంది .
నువ్వు ఏదో ఒక వంకతో నన్ను బడికి పంపించట్లేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను ఈ పాటలు వినకపోతే పూర్తిగా వెనుకబడి పోతారు అత్తయ్య నేను బడికి వెళ్తా ఈరోజు.
ఆ మాటలకి ఆమె కోపంగా… ఒసేయ్ నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చాను బట్టలు తిండి పెడుతున్నాను నాకు కొంచెం పనిలో సహాయం చెయ్యమని అంటే నాకు ఎదురు సమాధానం చెప్తున్నావా. అంతేలే అమ్మ కాలుకు వేసుకున్న చెప్పుల్ని నెత్తిన పెట్టుకో కూడదు అని. అంటారు. అంతేలే మన ఇంటి దీపం ఏ కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలింది అంట అలాగే ఉంది ఇప్పుడు నిన్ను చూస్తుంటే.
అందుకామె ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ రోజు నుంచి అత్త కఠినంగా ఆమె పట్ల ప్రవర్తిస్తూ ఏదో ఒక వంక తాను తిరుగుతూ ఉంటుంది. ఒక రోజు ఆమె పనిచేస్తూ ఉండగా అత్త…. ఎందుకమ్మా ఇక్కడ ఇలా బాధపడుతూ పనిచేయడం నలుగురు చూస్తే ఏదో అనుకుంటున్నారు.
అయినా నేను నిన్ను ఏదో కష్ట పెడుతున్నాను అని అనుకోవడం కోసమే కదా . నువ్వు ఇలా చేస్తున్నావు. మీ అమ్మకు తెలిస్తే ఆమె ఎంత బాధ పడుతుందో. అందరి దృష్టిలోనూ రాక్షసినీ చేద్దామనే కదా . అంటూ కపట కన్నీరు కారుస్తోంది.
మీనా…. అయ్యో అత్తయ్య ఎందుకు బాధ పడుతున్నారు. నాకు చదువు లేక పోయినా పర్వాలేదు. నీకు నేను సహాయం గా ఉండాలి. అందుకోసమే నేను ఇదంతా చేస్తున్నాను.
ఎవరు ఏమన్నా అనుకొని అత్త . నువ్వు నాకు మంచి తిండి పెడుతున్నావు బట్టలు ఇస్తున్నావ్వు. అది చాలు అంటుంది.
ఆమె మనసులో…. హమ్మయ్య ఇది బడికి వెళ్లడం మానేస్తున్నదన్నట. అన్నీ సంతోషపడుతుంది. రోజులు గడిచాయి
ఆమె తల్లి ఆరోగ్యం బాగో లేదని తెలుస్తుంది. మీనా శోభ శారద ముగ్గురు ఆమె దగ్గరికి వెళ్తారు. అప్పటికి ఆమె చనిపోతుంది.
మీనా…. అమ్మ నువ్వు కూడా నన్ను వదిలి పెట్టి వెళ్లి పోయావా . ఇంకా నేను ఎందుకమ్మా ఇక్కడ ఉండాలి. అంటూ ఏడుస్తుంది.
ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం జరగబోతుంది . అత్త శోభ మీనా ని తీసుకొని ఇంటికి వెళ్లి పోతుంది. ఇక తల్లి కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంది కాబట్టి . ఇప్పుడు మీనా ని ఏమన్నా ఎవరూ అడిగేవాళ్లు లేరు. అనుకోని ఆమె చేత ఇక ఒక పని మనిషిలాగా పని చేయించుకుంటూ .
తిట్టడమే కాకుండా కొట్టడం కూడా మొదలు పెడుతుంది.
పాపం రోజు మీనా ఏడుస్తూనే ఆ ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తూ…. అమ్మ నాకు మరో దారి లేదు. ఎటూ వెళ్ళలేను. చచ్చినట్టు ఇక్కడే ఉండి అత్త చెప్పినట్లు వినాల్సిందే . అని ఎంతగానో బాధ పడుతూ కఠినమైన పనులు కూడా చేస్తూ ఉంటుంది. కానీ మనసులేని అత్త మాత్రం చిన్న పిల్ల అని కూడా లేకుండా.
ఆమెని ఎలా పడితే అలా గా కొడతా, తిడతా.
వాటన్నిటినీ భరిస్తూనే మీనా…. భగవంతుడా ఇక నా జీవితం అంతా నీ చేతిలోనే ఉంటుంది. ఏదో ఒకరోజు నాకు కూడా మంచి జీవితం ప్రసాదిస్తావని కోరుకుంటున్నాను. అని ఎంతగానో బాధ పడుతుంది.
శారదా వేధింపులు చాలా ఎక్కువ అవుతాయి . మీనా తన కన్నీటి బాధలు దిగమింగుకుంటూ . అక్కడే పెట్టింది తింటూ
కఠినంగా తన జీవితాన్ని గడుపుతుంది ఎప్పటికైనా అత్త తన మనసు మార్చుకుని ఎప్పటిలాగే ప్రేమగా చూస్తుంది అని ఆశతో
ఆ చిన్న ప్రాణం అలాగే మిగిలిపోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *