కిరాతకమైన మేనత్త 5 | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

అది ఒక అందమైన పల్లెటూరు అక్కడ శోభ అనే ఒక పాప ఏడుస్తూ ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంతలో ఒక అతను అక్కడకు వచ్చి… ఎవరమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీ చేతి నిండా గాయాలు ఏంటి. శోభ ఏడుస్తూ…. అంకుల్ నన్ను ఇకనుంచి మీ ఇంటికి తీసుకెళ్ళి పోరా మా అత్త వచ్చిందంటే నన్ను చంపేస్తుంది దయచేసి నన్ను ఇంటికి తీసుకు వెళ్లారా. అంటూ పెద్ద పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది. అతను… సరే పాపా ఏడవకు నేను మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్తాడు.
అక్కడ అతని భార్య…. ఏమండీ ఎవరు ఈ పాప. అని అడుగుతుంది జరిగిన విషయం చెప్తాడు. ఆమె పాప దగ్గరికి వెళ్లి… పాప నీ పేరేంటి. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు.
పాప ఏడుస్తూ…. నా పేరు శోభ అండి. మాది
ఈ ఊరు పక్కనే ఉన్న చెరుకుపల్లి గ్రామం మా అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత నన్ను మా మేనత్త పెంచుతుంది . నన్ను ఎప్పుడూ కొడుతూ తిడుతూ ఉండేది.
అప్పుడు ఆమె….. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పమ్మా. పాపా వివరంగా చెప్పడం మొదలు పెడుతుంది. మాది పక్కనే చెరుకుపల్లి అనే గ్రామం అనే గ్రామం మా అమ్మ పేరు సంపతి నాన్న పేరు గోవిందు. మాది చాలా చాలా ధనవంతుల కుటుంబం. నేను వాళ్లకి లేకలేక పుట్టిన సంతానాన్ని.
మేము ముగ్గురం ఎంతో సంతోషంగా ఉండే వాళ్ళం . అలా వుండగా ఒక రోజు మా నాన్న చెల్లెలు , పద్మ మా ఇంటికి వచ్చింది.
పద్మ…. అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా. మా నాన్న…. నేను బాగున్నాను పద్మ ఎలా ఉన్నావ్. ఒక్కదానివే వచ్చావే బావ రాలేదా.
మా అత్త ఏడుస్తూ…. అన్నయ్య ఆయన నన్ను ఎప్పుడూ కొడుతూ తిడుతూ ఉంటాడు ఏ పని చేసిన చీటికి మాటికి గొడవలు.
నన్ను ఎప్పుడు కొడుతూ డబ్బు తీసుకొని రా డబ్బు తీసుకురా వేధిస్తూ ఉన్నాడు అందుకే ఆ బాధలు భరించలేక ఇక్కడికి వచ్చాను.
ఆ మాటలు విన్న మా నాన్న…. మరేం పర్వాలేదు అమ్మ నువ్వు నాకు ఎక్కువ కావ్వు. అతని మనస్సు మారి క్షమాపణ చెప్పి నేను తీసుకెళ్లి అంతవరకు నువ్వెక్కడ ప్రశాంతంగా ఉండు. డబ్బుని మనం అలవాటు చేస్తే అతను ఇంకా కావాలి అని పట్టు పట్టుకుని కూర్చుంటాడు.
పద్మ తన మనసులో…. నాకు నువ్వు ఈమాట అంటావని ముందే తెలుసు.డబ్బు ఉందనే కదా నువ్వు ఇలా విఱ్ఱవీగుతున్నారు అసలు నువ్వే లేకపోతే. భార్యాభర్తలిద్దరికీ ఈరోజుతో చివరి రోజు.
అని తన మనసులో అనుకున్నది ఆ రోజు రాత్రి సమయం నేను భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాను. తెల్లవారు జమున మా అత్త పెద్ద పెద్దగా ఏడుస్తూ….. అన్నయ్య వదిన మమ్మల్ని వదిలి పెట్టి వెళ్లిపోయారా. ఇప్పుడు శోభ పరిస్థితి ఏంటి. అని మొసలి కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. అసలు మా అమ్మ నాన్న ఎందుకు చనిపోయాడు నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను మా అమ్మ నాన్న కోసం ఏడుస్తూ ఎంతో బాధ పడ్డాను…. అమ్మ ఒక సారి లే అమ్మ. నాన్న ఒకసారి ఇటు చూడండి నాన్న. అంటూ పెద్దగా ఏడ్చాను.
అత్త…. అమ్మ మీ అమ్మ నాన్న దేవుడి దగ్గరికి వెళ్లి పోయారు. బాధపడకు నేనున్నాను కదా అంటూ ఓదారుస్తుంది ఆ రోజు దహన సంస్కారాలు పూర్తి అయిపోతాయి. ఆ రోజు రాత్రి బాధగా నేను ఆలోచిస్తూ అలా రెప్పవాల్చను.నేను నిద్రపోతున్నాను అనుకొని మా అత్తయ్య మామయ్య
మాట్లాడుకుంటున్నారు .
భర్త….ఏంటి పద్మ ఉన్నట్టుండి మీ అన్నయ్య వదిన చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది.
ఆమె…. చనిపోవడం కాదు నేనే చంపేశారు ఇప్పుడు ఆస్తి మొత్తం మన సొంతమైంది.
అతను… మరి శోభ నీ ఎందుకు వదిలేసావు దాన్ని కూడా చంపేస్తే ఒక పని అయిపోయింది కదా.
అత్త … దీనికి కూడా విషం కలిపిన అన్నం పెడతారు అనుకున్నాను కానీ తప్పించుకుంది. రాత్రిపూట ఇది పాలు బ్రెడ్డు తీసుకొని పడుకుంటుదట. అలాగే ప్రాణాలతో బయట పడింది అయినా మంచి జరిగింది అందరూ ఒకేసారి చచ్చిపోతే అనుమానం వచ్చేది. ఇంకా దీని సంగతి అంటారా . నేను పెట్టే చిత్రహింసలకు అదే ఏ నువో గోయూ చూసుకుంటుంది చూడండి.
అతను…. సరే మరి అయితే తొందరగా దాని పని కూడా చూడు.అని అన్నాడు ఆ మాటలన్నీ నేను విన్నాను కానీ వాళ్ల నుంచి తప్పించుకోవాలంటే నాకు చాలా భయం వేసింది . రోజులు గడుస్తున్నాయి మా అత్త నా చేత కఠినమైన పనులు చేయిస్తు ఉంటుంది .
ఒకరోజు ఇంట్లో గ్యాస్ అయిపోయింది . కట్టెల పొయ్యి మీద వంట చేయమని నాకు చెప్పింది .
నేను… అత్త కట్టెలు ఎక్కడున్నాయి.
అత్త…. పక్కనే అడవి ఉంది గా.అడవికి వెళ్లి తీసుకొని రా. నేను…. నువ్వు కూడా నాకు తోడు రా. ఒకదాన్ని అడవి కి వెళ్ళాలి అంటే చాలా భయం.
ఆ మాటలకి ఆమె నన్ను కొట్టి అడవికి పంపింది . నేను భయం భయంగానే అడవికి వెళ్లి . కట్టెలు తీసుకొని వచ్చాను . కట్టెల పొయ్యిమీద అన్నం వండుతున్నాను .
మా అత్త …. ఒసేయ్ అన్నం మాడిపోతుంది వాసన రావడం లేదా నీకు. ముక్కులు మూసుకుపోయయా. అంటూ నన్ను కొట్టింది.
నేను ఏడుస్తు…. నాకు ఎలాంటి వాసుల రాలేదు అత్త. బహుశా ఈ కర్ర పుల్లల వాసన అలా అనిపించిందేమో.
అత్త…. నాకు ఎదురు సమాధానం చెప్తున్నావా . అన్నం ఉడికిందో లేదో చూడు అని బలవంతంగా వేడి వేడి అన్నంలో నా చేయిని పెట్టింది. నేను అమ్మ అంటూ కేకలు వేశాను. నా చేతికి గాయం ఇదే. రెండు రోజుల క్రితమే ఇదంతా జరిగింది. ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు అందుకే తప్పించుకొని దూరంగా వచ్చి ఆ చెట్టు దగ్గర కూర్చున్నాను ఇందులో మీరు కనిపించారు. అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది.
ఆ మాటలు విన్న భార్యాభర్తలిద్దరూ చాలా ఆశ్చర్యపోతూ అలాగే బాధపడుతూ…డబ్బు కోసం సొంత అన్న వదిననీ చంపే వాళ్ళు కూడా ఉంటారా . ఇలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం లో మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. నువ్వేం బాధపడకఅమ్మ. నువ్వెక్కడ సంతోషంగా ఉండొచ్చు . మాకు పిల్లలు కూడా ఎవరు లేరు నిన్నే మా కూతురు గా పెంచుకుంటాము.
ఇంతలో వాళ్ళ మేనత్త అక్కడకు వచ్చి….పెంచుకుంటారా మరి నాకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి.
అత్త నీ చూసి పాప చాలా బాధ పడుతూ ఉంటుంది.
ఇంతలో అక్కడున్న అతని భార్య….. నువ్వే నా పాప మేనత్త . నిన్ను చూసి పాప ఎంత బాయ పడుతుందో చూడు నువ్వు అసలు
మనిషివేనా చిన్న పిల్ల అని కూడా చూడకుండా చిత్రహింసలు పెడుతున్నావు.
నీకు కొంచెం కూడా జాలి లేదా.
ఆమె….నా సంగతి పక్కన పెడితే ఈ పాపని మీరు ఉంటే నీకోసం ఉంచుకుంటారు నాకు తెలియదను కొంటున్నారా.
ఆమె… పాపని మాతోపాటు ఉంచుకోవడం లోమంచి ఉద్దేశ్యమే గాని ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు.
మేనత్త పెద్దగా నవ్వుతూ….హా హా హా చాలు నీ జోకులు ఆపండి. ఇది ఇక్కడికి వచ్చింది అంటే నా గురించి పూర్తిగా ఇది చెప్పే ఉంటుంది.
వాళ్లు…. అవును పూర్తిగా చెప్పింది. సొంత అన్న వదిన ని చంపిన పాపం ఎక్కడికి పోదు ఏదో ఒక రోజు దెబ్బతింటావ్వు.
ఆమె… మీ శాపనార్థాలు పక్కన పెట్టండి . ఇది పోతే పోయింది లే అనుకునేదాన్ని ఇంత దూరం వచ్చాను అంటే మీకు అర్థం కాలేదా.
ఈ రోజే ఆస్తి సంబంధించిన కాగితాలు చూశాను ఆస్తి మొత్తం దీని పేరే ఉంది.
దీని పెంచుకుంటే ఆస్తి మొత్తం మీ సొంతం అవుతుంది అన్న దురుద్దేశంతోనే కదా దీన్ని పెంచుకుంటాను అని అంటున్నారు.
అలాంటి పప్పులు నా దగ్గరకు మర్యాదగా దాన్ని నాకు ఇవ్వండి .
అని బలవంతం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది . వాళ్లు…. నీకు దండం పెడతాను కావాలంటే ఆస్తి మొత్తం నువ్వే తీసుకో చిన్నపిల్లల ప్రాణం తీయకు ఆ ఉసురు మీకు తగులుతుంది.
అయినప్పటికీ ఆమె వాళ్ళ మాట పట్టించుకోకుండా ఆమెను బలవంతంగా తీసుకొని వెళుతూ ఉంటుంది.
పాప ఏడుస్తూ పెద్దగా అరుస్తూ ఉంటుంది .
అయినప్పటికీ పాపనీ తీసుకుని వెళుతూ ఉండగా పాపకు ఆమె చేతి నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటుంది. ఆమె కూడా పాప వెంట పరిగెడుతుంది.
అప్పుడే అత్తకి ఎదురుగా ఒక వాహనం వచ్చి ఆమెను ఢీ కొంటుంది. ఆమె దూరంగా వెళ్లి పడి అక్కడికక్కడే ప్రాణాలు పోతాయి.
దాన్ని చూసిన పాప చాలా భయపడిపోయింది ఇంతలో ఆ భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికి వస్తారు.
భార్య పాపను దగ్గర తీసుకొని…. భయపడకు శోభా దేవుడు చాలా మంచివాడమ్మ. అందుకే మీ అమ్మా నాన్న చనిపోయిన మీ అత్తని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. పాపం ఊరికే పోదు కదా. ఆమె పాపం పండింది. అందుకే ఇలా దిక్కులేని చావు చచ్చిన.
నువ్వు ఇంకా భయపడకు నేనున్నాను కదా నేను చాలా బాగా చూసుకుంటాను అని ఓదారుస్తుంది. భర్త…. అవునమ్మా శోభ
నిన్ను బాగా చూసుకుంటాము. అని చెప్పి పాపను తీసుకుని వెళ్ళి పోతారు.
ఆ రోజు సాయంత్రం మేనత్త భర్త ఆమె కోసం వెతుక్కుంటూ వస్తాడు. అక్కడ జరిగిన విషయమంతా తెలుసుకొని పాపా ఉన్న ఇంటికి వస్తాడు అక్కడ భార్యాభర్తలిద్దరూ అతన్ని చూసి …. పాప కోసం వచ్చారా.
ఆ చనిపోయిన ఆమె భర్తనా మీరు .
ఇంకా ఏం సాధించడానికి వచ్చారు . అన్యాయంగా సొంత వాళ్లని చంపినందుకు . కుక్క చావు చచ్చింది నీ భార్య . అలాంటి గతి నీకు కూడా పట్టలని వచ్చావా .
అతను….. నన్ను క్షమించండి అమ్మ. నేను అందుకోసం రాలేదు నా భార్య నేను ఎన్నో తప్పులు చేశాను నా భార్య శవాన్ని చూసి చాలా మార్పు వచ్చింది నాలో ఇదిగోండి ఆస్తి కాగితాలు మీకు ఇవ్వడానికి వచ్చాను.
అందుకు వాళ్ళు…. మాకు ఎలాంటి ఆస్తి కాగితాలు వద్దు పాపనీ మా దగ్గర ఉంచితే అంతే చాలు.
అతను…. నేను ఎందుకు వీటిని ఇస్తున్నాను అంటే పాప భవిష్యత్తు బాగుండడం కోసం . మీ దగ్గర ఆస్తి ఉంటే పాపని మంచి స్కూల్లో చదివిస్తారు. అమ్మాయి భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది . నీ కోసం కాకపోయినా పాప భవిష్యత్తు గురించి ఆలోచించి వీటిని తీసుకోండి. నేను చేసిన పాపాలు ఈ విధంగా కడుక్కొ నే అవకాశం ఇవ్వండి అంటూ ఏడుస్తాడు . అందుకు వాళ్లు అతనిని ఓదార్చి వాటిని తీసుకుంటారు.
అతను అక్కడనుంచి వెళ్ళి పోతాడు . ఇక ఆరోజు నుంచి వాళ్ళు ఎంతో ఆ బంగ్లా లోనే ఉంటూ . శోభ ని బాగా చదివించు కుంటూ సంతోషంగా జీవిస్తారు. శోభ కి తల్లిదండ్రులు లేని లోటు వాళ్ల ద్వారా తీరుతుంది. ఎన్ని రోజులు మేనత్త చేతిలో కష్టాలు పడిన శోభకు
భగవంతుడు వెళ్లి రూపంలో మంచి జీవితాన్ని ప్రసాదించాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *