కిరాతకమైన మేనత్త 6 | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

అది ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో. శంకర్ పద్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకి దేవి అనే ఒక పాప ఉండేది. వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉండేది. అలా ఉండగా ఒకరోజు దేవి… నాన్న అమ్మ నాకు ఒకసారి అత్త దగ్గరకు వెళ్లాలని ఉంది. ఒకసారి అత్తని చూద్దామా చాలా రోజులు అయింది. అని అంటుంది అందుకు తండ్రి….చూసి చాలా రోజులవుతుంది కదా సరే పదండి వెళదాం . ఆనీ చెప్పి అక్కడ నుంచి మేనత్త వాళ్ళ ఇంటికి ప్రయాణమవుతారు అనుకోకుండా మార్గమధ్యలో వాహనం ఢీకొనడంతో ఆ తల్లిదండ్రులిద్దరూ అక్కడికక్కడే మరణిస్తారు.
దేవి…. నాన్న అమ్మ అంటూ పెద్ద పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది. ఆ విషయం వాళ్ళ అత్తకు తెలుస్తుంది అత్త చాలా బాధపడుతూ అక్కడికి చేరుకుంటుంది.
ఆమె… అన్నయ్య , వదిన పాప ని ఒంటరి చేసి వెళ్ళిపోయావా అని బోరున ఏడుస్తుంది.
ఆ తర్వాత పాపను తీసుకుని ఇంటికి వెళ్లి పోతుంది. ఆ రోజు నుంచి పాపని తానే స్వయంగా చూసుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడిచాయి ఒక రోజు అత్త….. ఏమే హంతకురాలా. నీళ్లు వేడి చేయమన్నాను చేసావా. నేను స్నానం చేసి బయటికి వెళ్ళాలి.
పాప…. సరే అత్తయ్య అని చెప్పి నీళ్లు కట్టెల పొయ్యి మీద కాస్తూ వుంటుంది . చాలా సమయం తర్వాత మళ్ళీ అత్త అక్కడికి వచ్చి …. ఒసేయ్ హంతకురాల. అనీ పెద్దగా పిలుస్తుంది.
పాపా ఆమెతో…..అత్తయ్య ఇందాక నుంచి మీరు హంతకురాలా హంతకురాల అని పిలుస్తున్నారు ఎందుకు అలా పిలుస్తున్నారు నాకు అర్థం కావటం లేదు. నేను ఎవరిని చంపనని ఆలా పిలుస్తున్నారు అత్తా.
ఆమె… మీ అమ్మానాన్న చంపింది నువ్వే కదా.నువ్వు ఒక నష్ట జాతకురాలి వి నువ్వు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో కలిసి వచ్చిందే లేదు. ఇప్పుడు నా ఇంటికి వచ్చావు నాకు అస్సలు కలిసి రాదు అని నాకు అర్థం అయింది అందుకే నిన్ను ఇంటెనకాల ఉన్న గదిలో ఉంచాను. ఎందుకన్నా మంచిది ఆ దరిద్రం నాకు అంటకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే చేశాను.
సరేగాని నీళ్లు కలిసావా. పాప చాలా బాధపడుతూ ఏడుస్తూ…. కాశను అత్తయ్య అంటూ ఏడుస్తుంది. ఆమె దాన్ని పట్టుకుంటుంది…. ఒసేయ్ నీళ్లు కాసవ ఏమన్నా నీళ్లు కాగిన్నియా. నిన్ను అని పక్కనే ఉన్న బకెట్లో ఆమె ముఖాన్ని ముంచి లేపుతోంది. పాప…. అత్త వద్దు అత్త ఊపిరి ఆడడం లేదు అత్త దయచేసి నన్ను వదిలి పెట్టు అత్త అని కేకలు వేస్తోంది.
అత్త ఆమెను దూరంగా విసిరి కొట్టి అక్కడ నుంచి వెళుతుంది. పాప చాలా ఏడుస్తూ….. నేనేం చేశాను ఇలా నన్ను వేధించు తింటుంది. భగవంతుడా నేను నష్ట జాతకురలినా అందుకే నా తల్లిదండ్రులు దూరమయ్యారా.
అంటూ చాలా బాధ పడుతూ ఉంటుంది అలాగే రోజులు గడుస్తున్నాయి. అత్త గర్భవతి అవుతుంది. ఆమె కోసం భర్త కొన్ని పండ్లు తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ పండ్లు ఆమెకి…. పుట్టబోయే బిడ్డ నీ కంటే అందంగా ఉండాలి. అనీ అంటాడు అప్పుడే పాప అక్కడికి వస్తుంది. అతను పాపకు కొన్ని పండ్లు ఇస్తాడు దాన్ని చూసిన ఆమె.. దీన్ని ముఖానికి పండ్లు అవసరమా ఇలా ఇవ్వు అని అంటుంది. అతను….. ఏంటి ఎలా చేస్తున్నావు చిన్న పిల్ల ఆమెకేం తెలుసు అన్ని మనమే చూసుకోవాలి.
ఆమె….. ఇందాక మీరు ఏమన్నారు నాకంటే అందంగా పాప ఉండాలి అన్నారు కదా. ఇది ఇక్కడే నా కళ్ళముందు తిరుగుతూ ఉంటే పాప ఎలా అందంగా పడుతుంది . దీని మొహం కంటే దరిద్రంగా పడుతుంది దీన్ని నా కంట పడొద్దు అని చెప్పండి. అతను…. ఎందుకు అలా మాట్లాడుతున్నావు. మన కంట పడొద్దు అంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది. అత్త…. ఏట్ లోకి వెళ్లి దూకి చావ మను. ఆ మాటలు చాలా చాలా బాధపడుతు అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆమె ఒంటరిగా ఏడుస్తూ….ఇక్కడ ఉండడం మా అత్తకి ఇష్టం లేదు ఇంక నేను చి అని పిలుచుకుంటూ ఎందుకు ఇక్కడ ఉండాలి . నేనస్సలు ఉండను . ఎక్కడికైనా వెళ్ళి పోవడం చాలా మంచిది అనుకోని ఇంట్లో నుంచి పూర్తిగా బయటికి వెళ్లిపోతుంది.
ఆమె రోడ్డుమీద కనపడిన వాళ్ళ దగ్గరికి వెళ్లి…. అయ్యా నాకు ఏదైనా పని ఉంటే ఇప్పించండి ఏ పనైనా చేస్తాను. కాదు అండి నాకు రెండు పుట్ల అన్నం పెడితే చాలు. అంత కంటే ఇంకా ఎక్కువ ఏమీ అవసరం లేదు.
అని అందర్నీ అడుగుతూ ఉంటుంది ఎవరు కూడా ఆమెకు సహాయం చేయరు. రోజులు గడిచాయి. ఆ కఠినమైన మేనత్త పాప వెళ్ళిపోయింది అని తెలిసి సంతోషపడుతుంది. భర్త….పాప వెళ్లిపోయిందని బాధ నీకు కొంచెం కూడా లేదు పాపం ఎలా ఉందో ఏం చేస్తుందో . తిన్ దో లేదో. ఏ పాపం ఎన్ని కష్టాలు పడుతుందో.నువ్వు ఇలా చేస్తున్న సంగతి పై నుండి మీ అన్న వదిన చూసి ఎంత బాధ పడుతున్నారో . అన్నీ చాలా జాలి పడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న ఆమె…. సర్లేండి మాటలు మాత్రం బాగా చెబుతున్నారు .
అతను అక్కడి నుంచి కోపంగా బయటకు వెళ్తూ ఉండగా. ఆమె…. ఎక్కడికి వెళ్తున్నారు దాన్ని వెతకడానిక. ఏం అవసరం లేదు మూసుకొని లోపలికి రండి.
అతను…. చి ఇంత కఠినంగా తయారయ్యావు ఏమిటి. అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు.
ఇది ఇలా ఉండగా పాప చాలా బాధపడుతూ రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా.
ఇంతలో ఒక ఆమె నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. పాప ఆమె దగ్గరకు వెళ్ళి…. అమ్మ నాకు ఒక ముద్ద అన్నం పెట్టా తిండి తిని నాలుగు రోజులు అవుతుంది.చాలా నీరసంగా ఉంది అమ్మ నీకు దండం పెడతాను ఒక ముద్ద అన్నం పెట్టమ్మా. అందుకామె జాలిపడి ….
పాప మీకు ముందు వెనక ఎవరూ లేరా మీ అమ్మానాన్న ఎవరు . పాప ఏడుస్తూ…. నాకు ఎవరూ లేరు మా అమ్మ నాన్న చనిపోయారు. అంటూ ఏడుస్తూ ఉంటుంది. అందుకోసమే ఆమె సరే అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ పాపకు భోజనాన్ని అందిస్తుంది. ఆమె…. పాప నీ పేరు ఏంటి.
అని అడుగుతుంది పాపా లలిత అని చెబుతుంది. ఆమె అలా గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు పాప…. అమ్మ నేను నాకు ఊరికే అన్నం పెట్టదు నేను మీ ఇంట్లో పని చేస్తాను. నాకు మూడు పూట్ల కూడా వద్దు రెండు పుట్ల అన్నం పెడితే చాలు . దానికి చాలా సంతోషం అని అంటుంది.
అందుకు ఆమె నవ్వుకుంటూ పక్కకు వెళుతుంది. ఇంట్లో పాప ఒక ఫోటో చూస్తుంది…. అమ్మ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు.
ఆమె… నా భర్త, నా కూతురు.
పాప…. మరి వాళ్ళు ఎక్కడ కనబడడం లేదు.
ఆమె ఏడుస్తూ….. వాళ్లు యాక్సిడెంట్లో చనిపోయారు అమ్మ.
పాప…. అయ్యో అమ్మ బాధపడకండి నేను ఎవరో తెలుసుకుందామని ఉద్దేశంతోనే ఆల అడిగాను నన్ను క్షమించండి.
ఇంతలో ఆమె తెల్లకోటు శతస్కోప్ ధరించి… పాప నిన్ను స్కూల్లో వదిలి పెడతాను స్నానంచేసి రా. మళ్లీ నేను హాస్పిటల్ కి వెళ్ళాలి. అని అంటుంది పాపా చాలా ఆశ్చర్య పోతూ….. అమ్మ మీరు ఎవరు డాక్టర్రా.
ఆమె…. అవును పాప నేను డాక్టర్ ని. నాకు కూతురు లేని లోటు నీలో చూసుకుంటాను. నువ్వు బాగా చదువుకొని నాలాగా డాక్టర్ అవ్వాలి. సరేనా అంటుంది ఆ మాటలకి పాప ఏడుస్తూ…. అమ్మ మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మా అత్తయ్య నన్ను ఎప్పుడు హంతకురాలివి నష్ట జాతకురాలి అంటూ నన్ను తిడుతూ ఉండేది . నన్ను బడికి కూడా పంపించేది కాదు. అంటూ జరిగిన విషయమంతా చెప్పుకొని వస్తుంది.
డాక్టర్…. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.
సరే మరి ఏం పరవాలేదు అమ్మా జరిగింది అంతా మంచి కోసమే అనుకోవడమే . అని అనుకొని ఆ అమ్మాయిని స్కూల్ కి తీసుకొని స్కూల్ దగ్గర వదిలిపెట్టి. ఆమె హాస్పిటల్ కి వెళ్తుంది. రోజులు గడిచాయి వాళ్ళిద్దరు సొంత తల్లి కూతురు లాగా సంతోషంగా గడుపుతుంటారు. ఇది ఇలా ఉండగా ఒక రోజు ఆమె హాస్పిటల్ లో ఉండగా.మేనత్త ఆమె భర్త ఇద్దరూ హాస్పిటల్ కి వస్తారు. వాళ్లు… మేడం నమస్కారం బావున్నారా
డాక్టర్…. బాగున్నాను . కూర్చోండి మీ ఆరోగ్యం ఎలా ఉంది . సమయానికి తింటున్నారా నిద్రపోతున్నారా.ఆమె…. అలాగే చేస్తున్నారండి. డాక్టర్… సరే చెక్ అప్ చేసి మందులు ఇస్తానని చెప్పి ఆమెకు మందులు ఇస్తుంది.
ఇంతలో లలిత…. అమ్మ అమ్మ అనుకుంటూ వస్తుంది. డాక్టర్…. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు .
ఆమె…. అమ్మా ఈ రోజు మా బడికి సెలవు ఇచ్చారు అందుకే ఇక్కడికి వచ్చాను.
అని అంటుంది.ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరూ ఆమెను చూసి చాలా ఆశ్చర్య పోతారు పాప కూడా వాళ్లను చూస్తుంది.
డాక్టర్…. లలిత నువ్వెళ్ళి పక్క రూమ్లో కూర్చో నేను వీళ్ళతో మాట్లాడి వస్తాను.
అందుకు పాపా అక్కడి నుంచి వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మేనత్త ఆమెతో…. ఎవరండీ ఆ పాప మిమ్మల్ని అమ్మ అని పిలుస్తుంది.
డాక్టర్…. ఆ అమ్మాయి మా పాప. పేరు లలిత.అంటుంది అందుకు వాళ్లు చాలా ఆశ్చర్య పోతారు. ఆ తర్వాత ఆమె దగ్గర మందులు తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు.
బయటకు వచ్చిన భార్యాభర్తలిద్దరూ…. ఏంటండీ ఆ దేవి ఇక్కడ పెరుగుతుందా పైగా పేరు కూడా మార్చినట్టు ఉంది లలిత అని చెబుతుంది.
భర్త… భగవంతుడు చాలా గొప్పవాడు అందుకే . సరైన చోటికి పాపను పంపించాడు . అందుకే నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాప అసలు పేరు లలితాదేవి కదా. అందరికీ దేవి అని మాత్రమే తెలుసు. లలిత అన్నది పలకడం మానేశారు. అని వాళ్లు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక కారు అతన్ని ఢీకొని వెళ్ళిపోతుంది .
ఆమె ఏడుస్తూ…. ఏవండీ ఏవండీ కేకలు వేస్తూ హాస్పిటల్కి తీసుకు వెళుతుంది.
అక్కడ లలిత ఏడుస్తూ తన డాక్టర్ తల్లికి జరిగిన విషయమంతా చెప్పి తన పేరు లలితా కాదు అన్న సంగతి చెప్తుంది. ఇంతలోనే వాళ్ళు అక్కడికి రావడం అతనికి ట్రీట్మెంట్ చేయడం కోసం అతన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. బయట ఉన్న ఆమెకు
ఆమెకు నొప్పులు వస్తాయి .
దాన్ని చూసిన పాప….. అయ్యో ఎవరైనా ఉంన్నరా. ఎవరైనా ఉన్నారా మా అత్తకి నొప్పులు వస్తున్నాయి. అయ్యో భగవంతుడా అంటూ ఏడుస్తూ అటు ఇటు చూస్తు…. అత్త కొంచెం సేపు ఓపిక పట్టు అత్త నీకేం కాదు అంటూ ధైర్యం చెబుతూ ఏడుస్తుంది.
ఇంతలో లోపల్నుంచి తన తల్లి డాక్టర్ వస్తుంది. ఆమె కూడా వెంటనే రూంలోకి తీసుకెళ్ళింది కొంత సమయానికి ఆమెకు ఒక పాప జన్మిస్తుంది. ఆమె డాక్టర్ తో జరిగిన నిజమంతా చెబుతుంది. డాక్టర్…. మీరు వెళ్లిన వెంటనే పాప అంతా నాకు నిజం చెప్పింది. మీరు కాదు అనడమే మంచిదయింది ఎందుకంటే నాకు బంగారం అంటే కూతురు దొరికింది. అలాంటి మంచి తెలివైన అమ్మాయి ని వదులుకోవడం మీది తప్పు నాకు వజ్రం లాంటి కూతురు దొరికినందుకు సంతోషపడుతున్నాను. మీ ఆయనకి ఏం కాలేదు యాక్సిడెంట్ అయింది అన్న దాంట్లో సృహ తప్పాడు చేతికి గాయం అయింది అంతే కట్టు కట్టాము కాసేపట్లో వస్తాడు. అని అంటుంది. అక్కడికి వచ్చి… అత్త నీకేం కాదు పాప చాలా బాగుంది . అత్త అంటుంది ఆమె…. దేవి నన్ను క్షమించు నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. నీ మీద ఎంత వేధించినా నామీద చాలా ప్రేమ చూపించావు. నేను నొప్పులు పడుతున్నప్పుడు నీ కంట్లో వచ్చిన నీళ్ళు చూసి నేను చాలా పెద్ద తప్పు చేశానని బాధపడుతున్నాను. అని అంటుంది.
ఇంట్లో భర్త అక్కడికి వస్తాడు…. పాపను చూసి చాలా సంతోషపడ్డాడు.కొన్ని రోజులు గడిచాయి వాళ్ళిద్దరు డాక్టర్ కి కృతజ్ఞతలు చెప్పి క్షమాపణ కోరుకొని పాపని తీసుకెళ్తామని అడుగుతారు.
డాక్టర్….. మీరు ఇలా అడగడం సరైంది కాదు నేను మీ దగ్గరికి పాపను పంపించకుండా ఉండడం కూడా సరైంది కాదు. ఇదేదీ లేకుండా మీరెవరో నాకు తెలీదు నేనెవరో మీకు తెలీదు పాప నా దగ్గరే ఉంటుంది. బాగా చదువుకుంటుంది.అందుకు వాళ్లు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఆ మాటలకి పాప చాలా సంతోష పడుతూ తల్లిని హత్తుకొని… నిజంగానే నేను కూడా బాగా చదువుకొని నీ అంత పెద్ద డాక్టర్ అవుతాను. అంటుంది. తల్లి దాన్ని చూసి సంతోష పడుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *