కిరాతకమైన మేనత్త Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

పందిళ్లపల్లి అనే గ్రామంలో శారద కీర్తన అనే అత్తా కోడలు ఉండేవాళ్ళు. అత్త కీర్తనని ఎప్పుడు తిడుతూ ఉంటుంది.
ఎందుకంటే కీర్తన డబ్బు లేని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి . కీర్తన ఎవరో కాదు స్వయానా శారద అన్నయ్య కూతురు.
ఆయన చనిపోతూ చివరి కోరికగా శారదా కొడుకైన కిరణ్తో…… రేయ్ కిరణ్ నేను చనిపోతున్నాను కీర్తన తల్లి లేకపోయినా నేనే తల్లిలాగా అల్లారుముద్దుగా పెంచుకున్నాం మాకు డబ్బు లేకపోవచ్చు కానీ . గుణంలో మర్యాదలలో అంతకన్నా మించి ఎక్కువ ఉంటుంది నా కూతుర్ని పెళ్లి చేసుకోరా దానికి ఒక మంచి జీవితం ఇవ్వరా.
కిరణ్… మావయ్య తప్పకుండా నేను కీర్తన ని పెళ్లి చేసుకుంటాను . మీరేమి బాధపడకండి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోయినా సరే నేను కీర్తన ని పెళ్లి. చేసుకుంటాను.
ఆ మాటలు విన్న అతను చాలా సంతోషంగా అతని చేతిలో చేయి వేసి….. చాలురా ఈ మాట ఒక్కటి చాలు . ఇదిగో ఈ రోజు నుంచి నా బంగారు తల్లి నీ సొంతం అనే కీర్తన చేయి అతని చేతిలో ఉంచి ప్రశాంతంగా కన్నుమూస్తాడు.
కీర్తన….. నాన్న నాన్న అంటూ ఏడుస్తుంది.
కొన్ని రోజులకి కిరణ్ కీర్తన ని పెళ్లి చేసుకుంటాడు . అది తల్లికి ఏ మాత్రం ఇష్టం ఉండదు . కిరణ్ అందగాడు ఉద్యోగ వంతుడు. అతని కోసం ఎన్నో డబ్బున్న కుటుంబం నుంచి సంబంధాలు వస్తూ ఉన్నాయి అందుకే ఆయన్ని కాదని కొన్ని కేసులను చేసుకున్నందుకు ఆమెకు చాలా కోపం. ఆ కారణంతోనే కోడల్ని ఎప్పుడు తిడుతూ కొడుతూ ఉండేది.
కానీ కీర్తన ఒక్క రోజు కూడా తన భర్త కి కానీ. ఆమె ఎదురు తిరగడం కానీ చేసేది కాదు.
అలా రోజులు గడుస్తున్నాయి కీర్తన గర్భవతి.
ఆ విషయం తెలిసిన అత్త కోపంతో రగిలి పోతూ తన మనసులో….. దీని బతుకు నాశనం చేద్దాం అనుకుంటే ఇది తల్లి అయ్యింది. అయినా సరే పిల్ల తల్లి ఇద్దర్ని చంపేస్తాను .
అని అనుకొని ఆమెను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఒక రోజు….. ఒసేయ్ కోడలా బావిలో నీళ్ళు అన్నీ ముగ్గురికి పడిపోయాయి. అసలు వాసన వస్తుంది నువ్వు బావిలోకి దిగి బావిని శుభ్రం చెయ్యి. ఈరోజు కొత్త నీరు పంపు వస్తాయి వాటిని మనం వాటిని బావిలోకి వదులుకున్నాను అంటే ఈ నీటికి కొరత ఉండదు .
అందుకు ఆమె గర్భవతి అయిన సరే దానిని ఒప్పుకుని బావిలోకి దిగుతూ అక్కడ
మురికి నీటిని దొంగలతో తోడుగా అత్త బుంగలు నీళ్ళు తోడి పక్కన పోస్తూ ఉంటుంది అలా శుభ్రంగా బావిని శుభ్రం చేస్తుంది కోడలు ఆ తర్వాత….. అత్తయ్య నిచ్చిన వేయండి నేను పైకి వస్తాను. అని అంటుంది అందుకు అత్త…. ఆ వేస్తాను వేస్తాను అని అంటుంది ఇంతలో పంపులు రావడంతో దాన్ని గమనించి…. ఆహా ఎంత మంచి సమయానికి పంపులు వచ్చాయి. అని ఆ నీటిని బావిలోకి పెడుతుంది బావి పైన మూత వేస్తుంది కోడలు….. అత్తయ్య ఏం చేస్తున్నారు అత్తయ్య అత్తయ్య ఏం చేస్తున్నారు. అత్తయ్య అడ్డు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది అత్త మాత్రం పట్టించుకోకుండా తీరిగ్గా అక్కడే కూర్చుంది.
నీళ్లు సగం దాకా వచ్చి స్థాయి ఆమె చాలా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటుంది.
కీర్తన ఏడుస్తూ….. భగవంతుడా ఏంటిది నాకు కావాలని చంపడానికి ప్రయత్నిస్తుంది ఏమండీ మీరు ఎక్కడున్నారు.
అంటూ ఏడుస్తూ ఉంటుంది . నీళ్లు దాదాపు ఆమె గొంతు వరకు వచ్చేస్తాయి.
ఆమె మరింత పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది .
ఇంతలో కొడుకు …. అమ్మ కీర్తన ఎక్కడ అమ్మ కీర్తన ఎక్కడ. అంటూ కేకలు వేస్తాడు.
ఆమె…. ఏమోరా ఎక్కడికో వెళ్ళింది.
అతను…. ఎక్కడికి వెళ్లింది ఏంటమ్మా ఎప్పుడు సంతకాలు చేయాలి. వాళ్ల నాన్న రిటైర్మెంట్ డబ్బు వచ్చింది. అలాగే ఆ ఇల్లు కూడా అమ్మేస్తున్నాను అది కూడా బాగా పలుకుతుంది సంతకం చేయాలి అమ్మ వాళ్ళు వస్తున్నారు. అని అంటాడు డబ్బు మాట వినగానే అత్త చాలా. సంతోష పడుతూ…. అమ్మో ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది ఇది మాత్రం ఇప్పుడు చచ్చిపోకుండా ఉండాలి. భగవంతుడు ఇంకేం కాకుండా చూడు అని అనుకొని కొడుకుతో….. కొడుకుతో నువ్వు ఇంటెనకాల రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూడు అక్కడికి వెళ్ళింది ఏమో. అని అంటుంది అందుకు తను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఇక వెంటనే ఆమె కూడలికి బావిలో తాడు వేసి ఆమెను బయటికి లాగుతుంది.
కీర్తన ఏడుస్తూ…. అతియా ఏంటి అత్తయ్య ఇది. మీరు నన్ను చంపడానికి సిద్ధమయ్యారు కదా. ఆమె… అయ్యో నేను ఎందుకు చంపుతావు అమ్మ. నేను హడావిడిగా నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు దెయ్యం పట్టిన పట్టినట్టుగా అయిపోయింది నా పరిస్థితి అంటూ ఏడవడం మొదలు పెడుతుంది.
ఆమె… సరే అత్తయ్య మీరు ఏం బాధపడకండి అంటూ లోపలికి వెళ్తుంది . ఆమె సరాసరి స్నానానికి వెళుతున్న ఇంతలో కిరణ్ వస్తాడు తల్లితో….. అమ్మ అక్కడ లేదమ్మా.
తల్లి…. స్నానానికి వెళ్ళింది లేరా వచ్చేస్తుంది లే. అని అంటుంది ఇంతలో ఆమె స్నానం చేసి బయటకు వస్తుంది జరిగిన విషయం అనేది కూడా ఆమె చెప్పదు.
అప్పుడే ఒక డబ్బున్న వ్యక్తి కూడా పేపర్లు డబ్బులు తీసుకొని వస్తాడు.
కీర్తన చేత సంతకాలు చేయించుకొని… ఇది మా అమ్మ మీ నాన్న రిటైర్మెంట్ డబ్బులు అలాగే ఆయన డబ్బుని కూడబెట్టిన డబ్బు వడ్డీతో సహా అన్నీ కలిపి 50 లక్షలు. తీసుకోండి అలాగే ఆ స్థలాన్ని కూడా అమ్ముదాం అంటున్నారట నేను తీసుకుంటాను అది అంత చెబుతున్నారు.
కిరణ్…. ఆ స్థలాన్ని వేరే వాళ్ళు అడిగానండి 15 లక్షలకు బేరం కుదిరింది. అతను…. నేను ఇరవై లక్షలు ఇస్తాను అండి. నాకు దానిని ఇప్పించండి.
కిరణ్…. ముందు వాళ్లతో బేరం అయిపోయింది కదా అండి నేను
అతని తో మాట్లాడాలి ఆ వ్యక్తి రానే వస్తాడు అతను…. కిరణ్ డబ్బు నాకు సరిపోయే లాగా లేదు . ఇంకా ఎవరని అడిగితే వాళ్లకు ఇచ్చాయి. అని అంటాడు అందుకు కిరణ్…. మరేం పర్వాలేదు ఆయన కొనుక్కుంటా అంటున్నాడే. అంటాడు ఇక తర్వాత వాటికి సంబంధించిన పత్రాలు తీసుకువచ్చి అందిస్తాడు కిరణ్ ఇక దాన్ని తీసుకొని 20 లక్షలు ఇచ్చి పాత్రలతో సహా ఆయన వెళ్ళిపోతాడు.
మొత్తం 70 లక్షలు కూడా కీర్తన చేతిలో ఉంచుతాడు కిరణ్. కీర్తన వెంటనే డబ్బులు మొత్తం అత్తగారి చేతిలో పెట్టి…. అత్తయ్య నేను కట్నం తీసుకోలేదు కదా ఇదిగోండి కట్నం కింద డబ్బు. తీసుకోండి ఇదంతా మీ సొంతమే. అని ఆమె చేతిలో పెట్టి అక్కడ నుంచి వెళ్లి పోతుంది.
ఇక ఆరోజు నుంచి అత్త కోడలి ఎంతో ప్రేమతో పలకరిస్తూ. చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది అలా రోజులు గడుస్తున్నాయి కీర్తన మార్పుని గమనిస్తుంది.
కీర్తన అత్తగారితో….. అత్తయ్య ఒక్క మాట అడుగుతాను నిజం చెప్తార.
అత్త…. ఏంటమ్మా అది చెప్పు. అని అంటుంది.
కీర్తన… అత్తయ్య నాకు డబ్బు లేదనే కదా నన్ను ఇన్ని రోజులు ఎందుకు పెట్టారు ఇప్పుడు డబ్బు చూసి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు . నాకు విలువ లేదు కానీ డబ్బులు చూసి నాకు విలువిచ్చారు.
ఇది మీకు న్యాయంగా ఉందా అత్తయ్య.
ఆ మాటలకు ఆమె అలా ఏం లేదు అమ్మా అంటూ బుకాయిస్తున్నారు కీర్తన…. అత్తయ్య డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది.
కానీ ప్రేమ ఆప్యాయతలు అలాగే ఉంటాయి.
మీరు నన్ను చంపడానికి కూడా సిద్ధమయ్యారు. నా కడుపులో బిడ్డ పెరుగుతున్న సంగతి కూడా తెలుసు. ఆ బిడ్డ బయటకు వచ్చి మిమ్మల్ని నాయనమ్మ అని పిలవడం ఇష్టం లేదా .
అయినా నాకు అర్థం కాక ముందు మీరు మేనత్త ఆ సంగతి మర్చిపోయారా. నీ మేన కోడలి చంపేస్తారా అత్తయ్య అంటూ ఏడుస్తు…. ఇదంతా చూసిన మీ అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది అత్తయ్య అంటూ ఏడుస్తుంది. ఆమె ఒక్కసారిగా వాటన్నిటినీ గుర్తుతెచ్చుకొని ఏడుస్తూ….. అయ్యో నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ. ఉంటుంది ఇక అప్పటి నుంచి ఆమె మనసు మార్చుకొని డబ్బు మనిషి లా కాకుండా ప్రేమ ఆప్యాయతలు ఉన్న మనిషిగా కీర్తననీ చూసుకుంటుంది

Add a Comment

Your email address will not be published. Required fields are marked *