కూరగాయలు అమ్మే పిచ్చుక | Telugu Stories | telugu Fairy Tales | Best Birds Stories Telugu

ఒక అందమైన అడవిలో చాలా పక్షులు జీవిస్తుండేవి, ఒక రోజు చోటు చిలుక ఇలా అనుకుంటుంది.

చోటు : ఈరోజు ఇంట్లో వంట చేసాయడానికి కూరగాయలు ఏమి లేవు, వెంటనే నా స్నేహితురాలు టూని పిచ్చుక దగ్గరకు వెళ్లి కూరగాయలు తెచ్చుకోవాలి. అని అనుకోని వెంటనే ఎగురుకుంటూ టూని పిచ్చుక కూరగాయల దుకాణానికి వెళ్తుంది.

టూని పిచుక తన స్నేహితురాలైన చోటు చిలుకని చూడగానే ఇలా అంటుంది.

టూని పిచ్చుక : రా మిత్రమా రా సరైన సమయానికే వచ్చావు తాజా తాజా కూరాగాయాలు అన్ని ఇప్పుడే వచ్చాయి, ఏ కూరగాయలు కావాలన్న తీసుకో నీ లాగే అందమైన ఆకుకూరలు ఉన్నాయి, నీకు ఇష్టమైన క్యారెట్ ఉంది, నీ ముక్కుతో పొడుచుకు తినడానికి తాజా తాజా టమాటాలు ఉన్నాయి ఏది కావాలంటే అవ్వి తీసుకో అని అంటుంది.

చోటు చిలుక తనకి కావలసిన కొన్ని కూరగాయలు తీసుకొని వెళ్లిపోతుండగా టూని పిచ్చుక ఇలా అంటుంది.

టూని పిచ్చుక : మిత్రమా ఒక్క నిమిషం, నిన్ను డబ్బులు ఎదగాలన్న ఉద్దేశ్యం లేదు లే కానీ ఈరోజు నువ్వే నాకు మొదటి బోణి,  మొదటి బోణి ఏ ఇలా అంటే ఇక ఈరోజు దుకాణం నడవడం కొంచం కష్టగా ఉంటుందని పెద్దోళ్ళు అంటారు అని చిన్నగా మాట్లాడుతూ ఉంటుంది టూని

ఇంతలో అక్కడికి టూని పిచ్చుక మరియు చోటు చిలుక కి స్నేహితురాలైన లూసీ పావురం అక్కడకు వస్తుంది.

లూసీ పావురం : ఏమమ్మా టూని ఈ మధ్య నువ్వు స్నేహితులకు కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నావు, అస్సలు నువ్వు మాతో ఇంతకు ముందు లా కలిసి తిరిగి ఎన్ని రోజులు అవుతుంది గుర్తుచేసుకో ఒకసారి, నువ్వు కూరగాయల దుకాణం పెడుతున్నావని తెలిసి మొదట సంతోషపడింది మేమె కానీ నువ్వు ఇలా డబ్బుల పిచ్చి పట్టిన దానిలా మారిపోతావు అని తెలిస్తే ఈ దుకాణం పెట్టనిచ్చే వాళ్ళమే కాదు. అని అంటుంది.

టూని ఇచ్చుక : ఆవుని నాకు డబ్బు పిచ్చి పట్టింది, అయితే ఏమి చెయ్యమంటారు, నాకు మీకంటే డబ్బులే ముఖ్యం డబ్బులే కడుపు నింపుతాయి డబ్బులే అవసరాలు తీరుస్తాయి మీతో తిరగడం వాల్ల  నాకు రూపాయి లాభం ఉందా చెప్పండి? పొద్దున్నే వచ్చి వ్యాపారం చేసుకోనీయకుండా మెదడు అంతా పాడు చేస్తారు వెళ్ళండి ఇక్కడ నుంచి అని తన స్నేహితుల మీదనే అరుస్తుంది టూని పిచ్చుక.

లూసీ పావురం : మిత్రమా ఒక్కటి గుర్తు పెట్టుకో జీవితం లో బ్రతకడానికి డబ్బులు అవసరమే కానీ డబ్బు మాత్రమే జీవితం కాదు, నువ్వు ఎదో రోజు స్నేహం విలువ స్నేహితుల విలువ తెలుసుకునే రోజు వస్తుంది, అప్పుడు నువ్వే మా దగ్గరికి వస్తావు అప్పటి వరకు మేము నీ దగ్గరకు రాము నీకు మా మొఖం చూపించాము అని అనేసి లూసీ పావురం మరియు చోటు కచిలుక బాధపడుతూ అక్కడ పైనుంచి వెళ్లిపోతాయి.

చోటు చిలుక : మిత్రమా టూని పిచ్చుక ఇంతలా మారిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు

లూసీ పావురం : తప్పదు మిత్రమా కాలం చాలా పనులు చేస్తుంటుంది, తాను ఇంతలా మారిపోయిందంటే తనకు ఎదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఎదో ఒకరోజు తనకి మన అవసరం వస్తుంది, తాను మనకి చెప్పడానికి ఇబ్బంది పడవచ్చు కానీ మనం తనని ఒక కంట కనిపెట్టే ఉంచాలి, తనకు ఆపద వచ్చింది అనే లోపే తనకు మనం సహాయం చేస్సాయాలి అదే మిత్రమా అసలైన స్నేహం అని అనుకుంటాయి లూసీ మరియు చోటు.

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి.

టూని పిచ్చుక కూరగాయలు అమ్ముతుండగా ఇంట్లో నుంచి తన కూతురు రూబీ బయటకు వచ్చి ఇలా అంటుంది.

రూబీ : అమ్మ నాకు ఒక పది వేళా రూపాయలు కావలి నేను నా స్నేహితులతో కలిసి పార్టీ కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుంది.

టూని : ఏంటి పార్టీకి వెళ్లడమే తప్పు అంటే పైగా నీకు పది వేళా రూపాయలు ఇవ్వాలా అని అంటుంది.

వెంటనే కోపంగా మారిపోయిన రూబీ

రూబీ : అమ్మ నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా నువ్వు డబ్బులు ఇవ్వక పోతే నిన్నైనా చంపేస్తా నేనైనా చచ్చిపోతా, అని తన దగ్గర ఉన్న కత్తిని బయటకు తీసి

రూబీ : అమ్మ నువ్వు డబ్బులు ఇవ్వలేదంటే నేను చచ్చిపోతా చచ్చిపోతా అని బెదిరిస్తోంది.

టూని : అయ్యో అయ్యో నా బిడ్డ అంత పని చెయ్యకు ఇస్తాను అని డబ్బులు తీసి రూబీకి ఇస్తుంది.

రూబీ వెంటనే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంది.

టూని : అయ్యో దేవుడా ఇంటికి నాకు ఈ కర్మ, నా కూతురు చస్తాను చస్తాను అని బెదిరించి ఇలా లెక్కకు లేనన్ని డబ్బులు అడుగుతుంటే రోజు రోజు అంత డబ్బులు నేను ఎక్కడ నుంచి తీసుకురాగలను, అందరికి దూరం అయ్యి దబ్బు పిచ్చి దానిని అనే పేరు మోస్తూ మరి డబ్బులు పోగుచేస్తున్నాను, ఇంకా ఏమి చెయ్యాలి  అని బాధపడుతుంటుంది.

రూబీ ఆ డబ్బులు తీసుకొని చిచ్చు కాకి దగ్గరకు వెళ్తుది,

చిచ్చు : రా రూబీ రా, నిన్ను ప్రేమించడం నాకు దక్కిన వరం, ఎప్పుడు కావాలంటే అపుడు ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకొస్తూనే ఉన్నావు, నేను హాయిగా విలాసాలు చేయగలుగుతున్నాను అంటే దానికి కారణం కేవలం నువ్వు తెచ్చిన డబ్బులే, ఆ అన్నట్టు చెప్పడం మరిచిపోయాను నాకు ఇంకొక రెండు మూడు రోజుల్లో మల్లి అయిదు వేళ రూపాయలు కావాలి అని అంటుంది.

రూబీ : అయిదు వేళా నా దగ్గర లేవు మా అమ్మని నేను రోజు హింసించి డబ్బులు తీసుకు వస్తున్నాను, మల్లి డబ్బులు అంటే మా అమ్మ దగ్గర మాత్త్రం ఎక్కడ నుచి ఉంట్టాయి. అని అంటుంది.

చిచ్చు : నీ దగ్గర డబ్బు లేదంటే నీ కోసం గత కొన్ని రోజులుగా కాపు కాసుకొని కూర్చున్న మహి గద్ద కి నిన్ను అమ్మేస్తే నాకు కావలసినన్ని డబ్బులు ఇస్తుంది. ఇంకా నీఇష్టం అని అంటుంది.

చిచ్చు కాకి మాటలకి కోపం తెచ్చుకుంటుంది రూబీ. గత కొంత కాలంగా రూబీ ని ఫాలో ఆవుతో గమనిస్తు ఉంటాయి లూసీ మరియి చోటు, చిచ్చు కాకి ఈ మాటలు అనగాని వాటి కోపం కట్టలు తెంచుకుంటుంది. లూసీ పావురం వెంటనే చిచ్చు ని కొట్టి రూబీ ఇచ్చిన డబ్బులు తీసుకుంటుంది.

చోటు : చూడమ్మా రూబి ఇక్కడ జరిగిన విషయం ఏది కూడా మీ అమ్మకి మేము చెప్పము, ప్రేమ గుడ్డిది కానీ ఇలాంటి వాడికి ప్రేమింపబడే అర్హత లేదు, వీడి నొస్సం దేవత లాంటి నీ తల్లిని  బాధపెడుతున్నావు, తనేమో నీకోసం రాత్రిబవళ్ళను అయిన వాళ్ళని కూడా దూరం చేసుకుంటూ డబ్బులు సంపాదించి పెడుతుంది, నువ్వవేమో ఇలా పనికి రాణి వాళ్లకి డబ్బులు ఇస్తూ తనని బాధపెడుతున్నావు. నువ్వు వ్వెళ్ళి మీ అమ్మకి క్షమాపణ చెప్పు వీడి సంగతి మేము చూసుకుంటాము అని అంటుంది.

రూబీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది.

రూబీకి : అమ్మ నన్ను క్షమించు అమ్మ, ఇన్ని రోజ్జులు నేను నిన్ను ఎంతో బాధ పెట్టాను, ఇక నుంచి నేను నీతోనే ఉంటాను నేను కూడా కూరగాయలు అమ్మడం లో నీకు సహాయం చేస్తాను   అని అంటుంది.

కూతురుతో వచ్చిన మార్పుకి టూని పిచ్చుక ఎంత సంతోషపడుతుంది.

ఇంతలో అక్కడికి చోటు చిలుక మరుయు లూసీ పావురం వస్తాయి.

లూసీ పావురం : ఏంటి మిత్రమా నీ డబ్బు వెనుక ఉన్న అసలు కారణం ఇదన్నమాట, ఇప్పుడు నీ కు డబ్బు పిచ్చి పోయి ఉంటుందే ఇక మమ్మల్ని నీ స్నేహితులుగా ఒప్పుకుంటావా మాతో స్నేహం చేస్తావా అని అంటుంది.

లూసీ అన్న మాటకు అన్ని పక్షులు ఒక్కసారిగా నవ్వుతాయి. ఇక ఆరోజు నుంచి లూసీ పావురం చోటు చిలుక టూని పిచ్చుక ఎంతో స్నేహంగా ఉంటాయి.

షార్ట్ స్టోరీ

గత కొన్ని రోజులుగా తన కూతురితో వచ్చిన మార్పు వల్ల టూని పిచ్చుక డబ్బులు సంపాదించే మెషిన్ లా మారిపోతుంది. స్నేహితులు బంధువులు అనే బేధం లేకుండా అందరి దగ్గర డబ్బు విషయం లో చాలా కఠినంగా ఉండడం తో అన్ని పశులు టూని పిచ్చుకకి దూరం అయిపోతాయి, టూని స్నేహితురాళ్ళు అయిన లూసీ మరియు చోటు చిలుక టూని అలా మారిపోవడానికి అసలు కారణం తన కూతురు అని తెలుసుకొని టూని పిచ్చ్చుక కూతురులో మార్పు తీసుకువస్తారు, ఇక ఆరోజు నుంచి లూసీ పావురం చోటు చిలుక టూని పిచ్చుక ఎంతో స్నేహంగా ఉంటాయి. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *