కొడుకు కూతురు ఇద్దరూ సమానమే Episode 162 | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV

రాణి రాజు అనే భార్య భర్తలకు పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలు అవుతున్న ఇంకా పిల్లలు పుట్టడం లేదు, ఊరిలో ప్రజలందరూ రాణి ని బోద్రాలు బోద్రాలు అని అవమానిస్తుండేవారు, వాళ్ళ వాళ్ళ ఇళ్లలో జరిగే ఏ శుభకార్యాలకు రాణిని పిలిచేవారు కాదు. అలా ఉండగా ఒకరోజు రాణి రాజు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది.

రాణి : ఏమండి మన పెళ్లి జరిగి ఏడు సంవత్సరాలు అవుతుంది, అయినా మనకి ఇంకా పిల్లలు పుట్టడం లేదు, ఊరిలో జనాలందరూ నన్ను ఏ శుభ కార్యాలకు కూడా పిలవడం లేదు, పిల్లలు లేకపోవడం తో మనల్ని ఒక అంటరాని వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నారు, నిన్న నా స్నేహితురాలు జలజ నా మీద ఎంతో ఇష్టం తో నన్ను తన సీమంతం వేడుకకు పిలిచింది, నేను వెళ్ళొదు అనుకున్నప్పటికీ నా స్నేహితురాలు మరీ మరీ పిలిచింది వేళ్ళని అప్పటికి నేను ఒక మూలకి ఎవరికీ కనిపించకుండా కూర్చున్నాను జలజ నన్ను పట్టు పట్టి మరి తన వేడుక దగ్గరికి తీసుకెళ్లింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఏమనలేదు కానీ ఊరి ప్రజలు మాత్రం ఇలాంటి బొడ్రాలిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు రేపు నీ పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు భాద్యత వహిస్తారు అని  సరికి నాకే తల కొట్టేసినట్టు అనిపించింది, ఇక నేను అక్కడ ఉండకుండా వచ్చేసాను, పిల్లలు లేరనే విషయం మాత్రం నన్ను ఎంతో కలచి వేస్తుందండి అని అంటుంది.

రాజు : మనం మనుషులం మన చేతుల్లో ఏముంటుంది చెప్పు ఎప్పుడు ఎవరికీ ఏమి చెయ్యాలో ఆ పై వాడికి బాగా తెలుసు మన భారం అంతా దేవుడి మీద వేసి పిల్లల కోసం ఎదురుచూడడం మాత్రమే మనం చెయ్యగల అని అంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. రాణి గర్భవతి అవుతుంది.

రాణి : ఏమండి ఈరోజే నేను డాక్టర్ ని కలిసాను, టెస్ట్ లు చేసి నేను గర్భవతిని అయ్యానని చెప్పాడు ఆ వార్త విని నాకు చాలా ఆనందం వేసింది, మనకి కూడా అందరి లాగే పిల్లలు ఉంటారు, కచ్చితంగా మనకి ఒక మగ పిల్లవాడే పుడతాడు అని అంటుంది.

రాజు : చాలా చక్కటి శుభవార్త చెప్పావు రాణి, నువ్వన్నట్టు గాఎం మనకి ఒక మగ పిల్లవాడే పుడతాడు మన వంశాన్ని నిలబెట్టే వంశోద్ధారకుడు అవుతాడు అని అంటాడు రాజు

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి, రాజు రాని ల జంటకి ఒక అందమైన ఆడపిల్ల పుడుతుంది. తన పేరు కీర్తి అని పెడతారు, తనని కొన్ని రోజులు మంచిగానే చూసుకుంటారు.,

రాణి తనలో తాను ఇలా అనుకుంటుంది,

రాణి : మా ఇద్దరి పేర్లతో రాణి అని రాజు అని ఉన్నప్పటికీ మా బ్రతుకులలో మాత్రం రాణి వాసం రాజు సింహాసనామ్ లేవు, ఎన్ని సంవత్సరాలుగా ఒక మగ బిడ్డ కోసం చూస్తుంటే ఈ పనికి మాలిన కీర్తి పుట్టింది, దీనిని బదులు ఒక మగ బిడ్డ పుట్టి ఉంటె బాగుండేది అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది.

మల్లి కొన్ని రోజులకి రాణి మల్లి గర్భం దాలుస్తుంది. రెండవ కాన్పులో రాణి కి పండంటి మగ బిడ్డ పుడతాడు, అతని పేరు బాలు అని పెడతారు, బాలు పుట్టిన తరువాత  రాజు మరియు రాణి కీర్తిని సరిగా చూసుకోవడం మానేస్తారు.

అలా కొన్ని రోజులకి బాలు కీర్తి పెరిగి పెద్దవుతారు.

రోజులు గడుస్తున్నా కొద్దీ తల్లి దండ్రులకి కీర్తి మీద ప్రేమ పూర్తిగా తగ్గిపోతుంది. బాలు ని మాత్రం వంశోద్ధారకుడిగా వర్ణిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కీర్తి తో అడ్డమైఅన్ ఇంటి పనులు చేస్తుంటారు, పొలం కి కూడా తీసుకుపోతుంటారు. అక్కడ కూడా గొడ్డు చాకిరి చేయిస్తుంటారు కీర్తితో.

ఒకరోజు కీర్తి రారని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది.

కీర్తి : అమ్మ బాలు అయినా నేను అయినా ఇద్దరం నీ పిల్లలమే కదా అమ్మ అప్పుడు మా ఇద్దరి మీద సమానమయిన ప్రేమ ఉండాలి కదా, బాలు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ నన్నెందుకు ఓక్ అంటరాని దానిలా చూస్తున్నావు అని అంటుంది.

రాణి : వాడు వంశోద్ధారకుడు, కాబట్టి వాడిని ప్రేమగా చూసుకోక తప్పద్దూ నువ్వు ఎప్పుడో ఓరోజు ఎవరో ఒకరికి భార్యగా వెళ్తావు ఎప్పటికిమాతో ఉండేది వాడే కదా నువ్వు వెళ్లి ఒంటి పని చెయ్యి పో అని గద్దిరిస్తోంది.

కీర్తి గిన్నెలు తోముతుంటే రాణి మాత్రం బాలు కి అన్నం తినిపిస్తూ ఉంటుంది, ఇంతలో రామయ్య అనే ముసలాయన వచ్చ్హి ఇలా అంటాడు

రామయ్య : అమ్మ రాణి రాజుకి ఆక్సిడెంట్ అయ్యింది ఆసుపత్రికిలో చెరిపించారు మీరు తొందరగా వెళ్లి చూస్తోదండి అని అంటాడు. రామయ్య మాటలు వినిన తరువాత బాలు కీర్తి ఇద్దరు కూడా ఒక్క క్షణం కూడానా ఆలోచించకుండా వెంటనే లేచి పరిగెత్హుకుంటూ ఆసుపత్రికి వెళ్తారు. ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వాళ్ళ నాన్నని చూసి ఇద్దరు తెగ బాధ పడిపోతారు. ఆసుపత్రిలో ఉన్న రాజుని కీర్తి బాలు ఇద్దరు కంటికి రెప్పలా చూసుకుంటూ అనుక్షణం సేవలు చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకి రాజు ఇంటికి వస్తాడు. అందరు ఒక దగ్గర కూర్చున్నప్పుడు రాజు ఇలా అంటాడు.

రాజు : అమ్మ కీర్తి నువ్వు మ్మమ్మల్ని క్షమించాలి తల్లి, ఇన్ని రోజులు కొడుకు గొప్ప కూతురుతో అవసరం ఏముంది, కూతురు అంటే ఎప్పటికైనా ఇంట్లో ఒక బరువే కొడుకు వంశోద్ధారకుడు అని తెగ అనుకునే వాళ్ళం ఆ భావన తోనే ఇన్నిరోజులు నిన్ను కూడా పెద్దగా పట్టించుకున్నది లేదు, కానీ కొన్ని రోజుల క్రితం నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు మీరిద్దరూ నన్ను చూసుకున్న తీరు నాకు చాలా నచ్చినది, కొడుకైతే ఏంటి కూతురైతే ఏంటి ఇద్దరు నా పిల్లలే కదా నువ్వు చిన్న పిల్లవే అయినా న కల్లలు తెరిపించావ్ తల్లి ఇక నుంచి మీరు ఇద్దరు మాకు సమానమే ఎవ్వరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని  కీర్తి ని దగ్గరకు తీసుకుంటాడు.

షార్ట్ స్టోరీ

రాజు రాణి అనే దంపతులకి పెళ్లి అయిన చాలా సంవత్సరాల తరువాత కీర్తి బాలు అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు, కానీ వాళ్లకి మాత్రం కీర్తి ఆడపిల్లల అనే పెద్దగా నచ్చేది కాదు, ఎప్పుడు బాలు ని గర్భాం చేస్తూ ఉండేవారు కీర్తి తో మాత్రం ఇంటి పని వంట పని చూషిస్తూ ఉండేవారు ఒకరోజు రాజు కి ఆక్సిడెంట్ అయినప్పుడు కీర్తి తన తండ్రి కి చేసిన సేవలు చూసి రాజు రాణి ల ఆలోచనలో మార్పు వస్తుంది. అప్పటి నుంచి కొడుకైన కూతురైన్ సమానమే అనే అనుకుని ఇద్దరినీ ప్రేమగాక హూసుకుంటూ ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *