కోడలి జుట్టు | Village Attha Kodalu | తెలుగు కథలు | Telugu Comedy Stories

ఇప్పుడు మనం చూడబోతున్నాది. ఒక కోడలు చేసిన సాహసం. ఆమె పేరు కల్పన భర్త పేరు దేవి. ఒకరోజు కల్పనా ఏడుస్తూ…. అయ్యో అప్పుడే చనిపోయావా. నీ కోసం మీ భర్త పిల్లలు ఎదురు చూస్తున్నారు. అయ్యో అని ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడుపు లు వింటున్నా దేవి ఆమె దగ్గరకు వచ్చి…… కల్పనా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్.
ఏం జరిగింది ఎవరికన్నా ఏమన్నా అయిందా చెప్పు.
కోడలు….నీకెందుకు చెప్పాలే .అనే సీరియల్ లో హీరోయిన్ చనిపోయింది. పాపం ఆ విషయం తెలియని భర్త పిల్లలు. ఇంటికి వస్తది అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారు.
దానిని విన్న అత్త…. ఒసేయ్
అసాధ్యం కూలా ఇంక నేను ఎవరో ఏదో అయింది అనుకొని చాలా కంగారు పడిపోయాను. సీరియల్ చూస్తూ ఏడుస్తున్నావా తల్లి నీకు ఒక పెద్ద దండం.
ఇంకా సీరియల్ చూడడం మానేసి పని చూసుకో మీ ఆయన పొలం నుంచి వచ్చే సమయం అయ్యింది.
కోడలు…. సర్లే అత్తయ్య అని లేచి పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో భర్త రానే వచ్చాడు. అతను…. కల్పనా కల్పన అంటూ అక్కడికి వచ్చాడు కల్పన ఏడుస్తూ వంటగదిలో ఉంటుంది.
అతను…. ఏమైంది రా ఎందుకు ఏడుస్తున్నావ్ మా అమ్మ ఏమన్నా అన్నదా.
ఆమె… మీ అమ్మ చాలా మంచిదండి . అలాంటి మంచి అత్తయ్య దొరికినందుకు నాకు చాలా సంతోషం.
భర్త… మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు.
ఆమె…. రారా నా దొంగ మొగుడా!? అనే సీరియల్లో అత్తా, కోడల్ని హింస పెడుతూ ఉంటుంది. ఆ కష్టాలు తలుచుకున్న ప్రతీసారి. నేను ఇలా ఏడుస్తూనే ఉంటున్నాను.
అతను ఆ మాటలు విని చాలా కోపంగా… ఒసేయ్ నీకు రోజురోజుకీ సీరియల్ పిచ్చి ఎక్కువ అయిపోతుంది. ఈ పిచ్చి తోనే నువ్వు పిచ్చి హాస్పిటల్ కి వెళ్లి లాగా ఉన్నావు . రేపట్నుంచి నువ్వు సీరియల్ చూడటం మానేయ్.
కోడలు…. సరే అండి రేపట్నుంచి కదా . ఈరోజు ఒక్కరోజు చూసి రేపట్నుంచి సినిమాలు చూస్తాను. అంటుంది అతను… నువ్వు మారవు . సీరియల్స్ లో చూసి ఎలా వేదిస్తున్నావ్ ఇంకా సినిమా మొదలు పెడితే ఇంకా ఎలా ఉంటుందో . అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కోడలి వంట సిద్ధం చేసి భర్తకి అత్త కి వడ్డిస్తోంది.
వాళ్ళు దాన్ని తింటారు.
వాళ్లు…. ఏది ఏమైనా కోడలి వంట మాత్రం చాలా అద్భుతంగా చేస్తుంది అని కోడలు ని పొగుడుతూ ఉంటారు ఆ మాటలకు చాలా మురిసిపోతూ … అయితే రేపటి నుంచి అత్తయ్య మరింత అద్భుతంగా చేస్తాను. కొత్త కొత్త వంటల్ని నేనే కనిపెడతాను. అని అంటుంది ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ …. అవసరంగా చెప్పినట్టు ఉన్నాను. కొత్త వంటలు ఏమి వద్దు కానీ. ఈ మాత్రం చేస్తే చాలు లే అమ్మ అంటుంది కోడలు….. సర్లే అత్తయ్య నేను ఏం ప్రయత్నం చేస్తానని చెప్పినా మీరు మాత్రం అస్సలు ఒప్పుకోరు అంటూ కోపంగా లోపలికి వెళ్తుంది ఆ రోజు గడిచి పోతుంది . ఆ మరుసటి రోజు ఉదయం కోడలు టీవీ చూస్తూ ఉండగా ఒక ఆడ్ వస్తుంది . అందులో ఒక ఆమె జుట్టుతో కారుని లాగుతూ ఉంటుంది .
దాన్ని చూసిన కోడలు….. ఇదేంటి జుట్టుతో ఒక కారు ని ఎలా లాగా కలుగుతుంది . అది ఎంతవరకు సాధ్యమవుతుంది . అని అనుకుంటూ చాలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అత్త వస్తుంది.. అత్త….. ఈరోజు మళ్లీ నీకు ఏమైందే మళ్లీ దేని గురించి ఆలోచిస్తున్నావ్ . అందుకు కోడలు….. అత్త ఇప్పుడు మనం బలంగా ఉంటే జుట్టు కూడా బలంగా ఉంటుంది కదా.
అత్త… అవును మనం ఆరోగ్యంగా ఉంటే.
ఆటోమేటిక్ గా మన జుట్టు కూడా ఆరోగ్యంగానే ఉంటుంది కదా.
అది సరి ఆ డౌట్ నీకు ఎందుకు వచ్చింది.
కోడలు…. ఏం లేదు టీవీలో ఇప్పుడే ఒక యాడ్ చూశాను . అందులో ఒక అమ్మాయి కారుని జుట్టుతో లాగుతూ ఉంటుంది.
నేను కూడా చాలా బలంగా ఉన్నాను నా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని నేను కూడా ఒక కారు ని జుట్టు తో
లాగి గొప్ప సాహస వంతురలు అని పేరు తెచ్చుకుంటాను. అని అంటుంది అందుకు ఆమె …. ఒసేయ్ అలాంటి పిచ్చి ప్రయోగాలు చేసి నీ ప్రాణం మీదకు తెచ్చుకొమ్మాక
అర్థమవుతుందా.
కోడలు…. అర్థం అవుతుందిలే అత్తయ్య. నేను ఎక్కడ గొప్ప పేరు తెచ్చుకుంటానో అని మీకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అత్త… ఒసేయ్ మెంటల్ దానా లోపలకి వెళ్ళు. దీనికి రోజురోజుకి పిచ్చి ముదిరిపోతుంది.
కోడలు కోపం గా లోపలికి వెళ్ళి పోతుంది.
ఆ రోజు రాత్రి సమయంలో అందరూ నిద్రపోతూ ఉంటారు. కోడలు బయటకు వచ్చి…. ఇక్కడ కారు ఎవరికి ఉంది ఆ మోహన్ వాళ్ళ ఇంటి ఎదురుగా కారు ఉంటుంది దానికి ఆ తాళం వెయ్యరు ఏమి వెయ్యరు దాన్ని నా జుట్టుతో లాగి ఇక్కడ దాకా తీసుకు వస్తాను అప్పుడు నా గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది.
అని అనుకొని ఆ కారు తలజుట్టూనీ కట్టి గట్టిగా గట్టిగా లాగడం మొదలు పేడుతుంది.
ఇంతలో ఎవరో ఒక వ్యక్తి దాన్ని చూస్తాడు…. అతను సరాసరి ఆమె దగ్గరకు వచ్చి …. అమ్మాయి ఏం చేస్తున్నావ్ కారు దొంగతనం చేస్తున్నావా.
ఆమె…. నేను దొంగని కాదు నా పొడవాటి జుట్టు తో ఈ కారుని ఎంత దూరమైనా నడిపిస్తాను . అదే నా టార్గెట్ కావాలంటే మీరు వీక్షించండి . ఆ మాటలకి అతను పెద్దగా అందరినీ అక్కడికి పిలుస్తాడు…. అతని కేకలు విన్న అందరూ అక్కడికి వస్తారు.
అతను… రండి రండి అందరూ ఈ వింతను చూడండి ఈ అమ్మాయి తన జుట్టుతో ఈ కారు నీ లాగ గలదంట రండి రండి అంటూ.
పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు.
అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆమెను …. లాగాలి లాగాలి లాగాలి . కోడలు జుట్టుతో కారుని లాగాలి . కోడలు జుట్టుతో కారునీ లాగాలి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. కోడలు వాళ్ళ అరుపులు కి మరింత ఉత్సాహ పడుతూ….. తాగుతున్నాను చూడండి అంటూ బలంగా లాగుతూ ఉంటుంది.
ఇంతలో అత్త…. ఒసేయ్ పిచ్చి దానా ఏమైందే నా జుట్టు పట్టుకొని లాగుతూ ఉన్నావు . వదులు వదులు అంటూనే గట్టిగా అరుస్తుంది.
కోడలు ఒక్కసారిగా నిద్రనుంచి మేలుకొని…. అత్తయ్య ఇది మీ జుట్ట నేను కారు అనుకొని బలంగా లాగుతున్నను నేను కలగన్నాను.
అస్సలు ఊహించలేదు ఇదంతా .
నొప్పి పుట్టిన అత్తయ్య నన్ను క్షమించండి.
అంటుంది అత్త కోపంగా…. ఒసేయ్ బుద్ధిలేని దాన. నిన్ను ఏం చేయాలి . రోజు రోజుకి నీకు ఒళ్ళు కొవ్వు ఎక్కుతుంది. జాగ్రత్తగా ఉండు అని అంటుంది . అందుకామె సర్లే అత్తయ్య అంటుంది. రోజులు గడిచాయి . కోడలు సీరియల్ లో ఈ సీరియల్ను చూస్తూ పొదుపు పేరుతో పిసినారితనం నేర్చుకుంటుంది. అదే పిసినారి తనాన్ని అత్త కూడా అలవాటు
చేస్తుంది. వాళ్లు వాళ్ల పిసినారితనం ఇంట్లో భోజనం కూడా వండుకో రు.. ఏదో ఒక వంకతో పక్కింట్లో నుంచో . లేదా ఎదురింట్లో నుంచో. భోజనం కూరలో తెచ్చుకుంటూ వుంటారు.
ఒకరోజు రాత్రి టీవీ చూస్తున్నా అత్త దగ్గరకు కోడలు వెళ్లి ఇలా అంటుంది.
కోడలు…అత్తగారు ఇప్పుడు తినడానికి ఎం వొండలి.
అత్త: ఏంటే కొత్తగా అడుగుతున్నావు రోజు చేసేదే చెయ్.నీకు ఇది కూడా తెలియదానే ఎడ్డీ దాన.పిచ్చి దాన..
కోడలు….:ఎందుకు అలా రోజు తిడుతారూ.నెను ఇప్పుడు ఏమన్నాను మన దగ్గరి వంట సరుకులతో వంట వండుతే, సరుకు లన్ని ఐపోతాయి.మనం కొంచెం అయినా సరుకుల్ని పొదుపు చేసుకోవాలి కదా .అందుకే మన పక్కింటి రజని దగ్గర కొంచం కూర తీసుకస్థా.
అత్త…:అబ్బే ఈ మధ్య అంత రుచిగా వండటం లేదు రజని.ఐనా ఎం చేద్దాం.మనం వండుదాం అంటే సరుకులు ఐపోతాయి.
సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్తూనే ఆమె టీవీ చూస్తుంటుంది.
కోడలు…. మరి రుచిగావుండే కూర ఎవరి దగ్గర దొరుకుతుంది.అని ఆలోచనలో పడుతుంది.అప్పుడే కరెంట్ పోతుంతి.అప్పుడు.
ఆత్త …..:ఏమే ఎక్కడ చచ్చావ్.దీపం తీసుకర త్వరగా నా దగ్గరకు.
కోడలు :సరే అత్త.
అంటూ ఆమె దగ్గరికి దీపం తీసుకెళ్లితుంది.
.అత్త….ఇంకా దీపం తీసుకు రాలేదానే ఎడ్డీ దాన.
కోడలు :తీసుకొచ్చాను అత్త.
అత్త :మరి దీపం వెలుగు ఏదే .
కోడలు :మీరు దీపం తెమ్మన్నారు.వెలిగించికాదుగా.
అత్త …..ని మతి మండా ఎంత పనిసేసావే.అనుకున్న నువ్వు ఇలాంటి పని చేస్తావ్ అని.
అని తిడుతుండగా. ఇంతలో రజిని వాళ్ల ఇంటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది.అప్పుడు కోడలు రజిని దగ్గరకు వస్తుంది.
రజిని ….ఏమే మీ అత్తని పిలిస్తే నేను వచ్చాను ఏంటి మీ అత్త ఏం చేస్తుంది.
ఆయన ఇంట్లో ఒకటే గొడవలు ఏమంటుంది ఏంటి మీ అత్త నిన్ను
కోడలు…:ఏముందే రోజు మా అత్తతో వుండేదెకదా.
రజని:సరేలే ఎం చేస్తావ్ ,లే కానీ మరి మీ అత్త ఎం చేస్తుంది.
కోడలు…:టీవీ చూస్తుంది.
రజని:అది కాదే కరంటు ఇందాకె పోయినది.మరి టీవీ ఎలా చూస్తుంది.
కోడలు. ….:ఓసి పిచిదనా పోయింది కరెంట్, టీవీ కాదు.కదా!
రజని:ఈ మాటలకేం తక్కులేదుగాని. కొంచెం పంచదార ఉంటే పెట్టవా.
కోడలు….:నివ్వు మరీనూ నాదగ్గర ఉన్నదే ఆ కొంచం మరి నికేలపెడుతా చెప్పు.
రజని:ఎప్పుడు మా ఇంట్లోనుచి కూరలు తీసుకుపోతావ్ ఎప్పుడైనా ఏమన్నా అడిగితే.మీ ఇంట్లోనుచి ఇచ్చావానే పిసినరీదానా.
కోడలు….:నాన్నే పిసినారి అంటావా. పోవే కుళ్లు బోతుదాన.
అంటూ ఉండగా కరెంట్ వస్తుంది .
రజిని…. నీ గురించి తెలిసి కూడా ఇక్కడికి వచ్చాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి.
కోడలు : ఒసేయ్ నీ చెప్పుతో కొట్టుకుంట . చెప్పులు తెగిపోతాయి . అలా తెగిపోతే నువ్వు వాటిని పడి వేయకుండా .నాకు ఇవ్వు.
ఆమె…. చి చి ఇక్కడ కూడా నీ పిసినారి బుద్ధి పోగొట్టుకున్నావ్ కాదు . అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది .
కోడలు …. మరి నేనంటే ఏమనుకుంటున్నావ్ . నా పిసినారితనం ముందు ఎవ్వరు పనికి రారు. ఏంటి ప్రేక్షకులు మీరు కూడా మా ఇంటికి వస్తారా ఏంటి.
వస్తే వచ్చినారుగాని . వచ్చేముందు పండ్లు స్వీట్లు మర్చిపోకుండా తీసుకురండి.
సరేనా మీరు కనుక మా ఇంటికి వస్తే మీకు
స్వయంగా నా చేతులతో మంచినీళ్లు ఇస్తాను తాగేసి వెళ్లిపోండి . తప్పకుండా వస్తారు కదా వచ్చే పనైతే ఎప్పుడు వస్తారో ఏం తీసుకొస్తాతో కింద కామెంట్ చేయండి.
అంతవరకు సెలవు మరి , మరో వీడియో తో మీ ముందు ఉంటాను .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *