కోతి చేసిన సహాయం | Telugu Stories | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu

అది ఒక అందమైన ఊరు ఆ ఊరిలో శారద అనే ఒక గుడ్డి ఆమె ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలిద్దరూ ఆమెను తీసుకొని రోజు భిక్షాటన చేసేవాళ్ళు . అలా వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకునే వాళ్ళు.
అలా ఉండగా ఒక రోజు శారద ఇంటి ముందు కూర్చొని చీమలు పెట్టిన బెడ్ మొక్కను
ఎండలో ఉంచి చీమలు దులుపుతూ ఉంటుంది. ఇంతలో ఒక కోతి అక్కడికి వచ్చి ….. బ్రెడ్ ముక్క నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఇప్పుడే దాని తినేస్తాను లేదంటే ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను . అని అనుకొని అక్కడికి వెళ్లి ఆ బెడ్ ముక్కను తీసుకొని చెట్టు మీదకు వెళ్ళిపోతుంది.
శారద….. ఎవరమ్మా రొటీనీ తీసుకెళ్లింది అనురాధ కీర్తి మీ ఇద్దరి లో రొట్టెను తీసుకెళ్ళింది ఎవరో చెప్పండి.
అని అంటుంది ఆ ఇద్దరు పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి … ఏంటమ్మా అరుస్తున్నావు . మేము ఎవరూము కూడా రొట్టెనీ తీసుకు వెల్లలేదమ్మా . అని అంటారు అందుకు ఆమె ఏడుస్తూ …. అయితే ఇక్కడ రొట్టె ఎవరు తీసుకు వెళ్లారు .
అనురాధ…. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు రొట్టె పోతే పోఇవ్వమ్మా.
శారద….. పోతే పోనివ్వ ఆకలి విలువ తెలిసిన దానివైనా నువ్వు . ఒక్కపూట అన్నం లేకపోతే మనం ఎంత తంటాలు పడుతున్న మీకు తెలుసుగా . నిన్నటి నుంచి కీర్తి తినడానికి ఏమీ లేదు. డబ్బా లో పెట్టిన రొట్టె తీస్తే నా చేతులకి చీమలు పాకినట్లు అనిపించాయి. అందుకే ఎండలో పెట్టాను కానీ ఇంట్లోనే దాన్ని ఎవరో తీసుకుపోయారు.
అంటుంది. కోతి పై నుండి దాన్ని గమనిస్తూ…. అయ్యో నేను చాలా పెద్ద పొరపాటు చేశానే ఆ పాప నిన్నటి నుంచి ఏమీ తినలేదు అంట.
నా స్వార్థం కోసం ఆ పాప నోటి దగ్గర తిండిని తీసిన దాన్ని అయ్యాను అంటూ చాలా బాధపడుతుంది. అరే అనవసరంగా దొంగిలించి తిన్నాను అంటూ చాలా బాధపడుతుంది.
కీర్తి…. అమ్మ నేను ఇప్పుడు తినకపోతే ఏం కాదమ్మా . ఇప్పుడు నేను బిక్షాటన కి వెళ్తాను కదా అక్కడ ఏమైనా దొరికితే తింటాను అని సమాధానం చెబుతుంది.
ఆ తర్వాత ముగ్గురు కలిసి భిక్షాటనకు వెళ్తారు. వాళ్లు…. బాబు ధర్మం చేయండి కళ్ళు లేని దాన్ని బాబు . నా బిడ్డల ముఖం చూసి అయినా నాకు ధర్మం చేయండి. అంటూ భిక్షాటన చేస్తూ ఉంటారు కానీ ఆరోజు ఎవరూ కూడా వాళ్ళకి దానం తీయకపోవడంతో నిరాశగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు కీర్తి…. అమ్మ అసలు మాకు ఎందుకు ఇలా అడుక్కోవాలి. నా తోటి వాళ్ళు అందరూ బాగా చదువుకుంటున్నారు బడికి వెళ్లి మరి మేమిద్దరం ఇలా భిక్షాటన ఎందుకు చేయాలి.
అందుకు ఆమె ఏడుస్తూ…. మరి ఏం చేయమంటావు తల్లి మనం బ్రతకాలంటే
ఇది తప్ప మరో మార్గం లేదు నాకు కళ్ళు ఉండి ఉంటే అలాగే ఏదో ఒక పని చేసి మిమ్మల్ని చదివిస్తూ వచ్చిన దానితో కాలాన్ని గడిపే వాళ్ళం కానీ అలా కాలేదు కదా.
అనురాధ…. అమ్మ అసలు నీకు కళ్ళు ఎలాగా పోయాయమ్మ. నాన్న ఎందుకు చనిపోయాడు అమ్మ ఈ నిజాలు ఎప్పుడు అడిగినా ఎందుకు మాకు చెప్పడం లేదు . అంత చెప్ప కోడనివా.
అందుకు తల్లి ఏడుస్తూ.. .. సమయం వచ్చినప్పుడు చెబుతాలేమా అని అంటుంది ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు ఇంటి ముందు వాళ్లకి రకరకాల పండ్లు ఉంటాయి వాటిని చూసి అనురాధ…. అరె ఎవరు ఈ రకరకాల పండ్లు ఇక్కడ పెట్టింది . అంటూ అటూ ఇటూ చూస్తారు. కీర్తి వెంటనే అక్కడికి వెళ్లి చాలా రుచిగా ఉన్నాయి పండ్లు అంటూ తినడం మొదలు పెడుతుంది.
అనురాధ…. అమ్మ ఇక్కడ ఎవరో పండ్లు పెట్టారు అమ్మ.
ఆమె…. అయ్యో ఎవరు ఇక్కడ పెట్టుకొని పక్కకు వెళ్తుంటారు. వాటిని మీరు తాకాకండి
అని అంటుంది ఎందుకు వాళ్ళు. కొంచెం సమయం వరకు దూరంగా ఉంటారు కానీ ఎవరూ రాకపోవడంతో వాటిని తీసుకొని ఇంట్లో ఉంచుతారు.
ఆ తర్వాత వాటిని ముగ్గురు సంతోషంగా తింటారు. శారద…. ఎవరో మన గురించి తెలుసుకొని కావాలని వీటిని ఇక్కడ ఉంచినట్టు ఉన్నారు . అని చెబుతుంది.
అదంతా చూస్తుంటే కోతి…. హమ్మయ్య ఈ రోజు నా వల్ల ఆ కుటుంబం యొక్క ఆకలి తీరింది అందుకు చాలా సంతోషంగా ఉంది.
అని అనుకొని అక్కడికి వెళ్లి పోతుంది.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు తల్లికి ఆరోగ్యం బాగోక …. అమ్మ అయ్యా అంటూ మంచం మీద పడుకొని మూలుగుతూ ఉంటుంది.
దాన్ని గమనించిన ఇద్దరు కూతుర్లు చాలా భయపడుతూ…. అమ్మ ఏమైంది అమ్మ అమ్మ ఏమైంది అమ్మ అని ఏడుస్తూ ఉంటారు ఆమె…. ఉన్నట్టుంది నా ఒళ్లంతా మంటలు మండిపోతుంది. ఎందుకిలా జరుగుతుంది నాకు అర్థం కావటం లేదు భగవంతుడా .
అని ఏడుస్తూ ఉంటుంది .
అప్పుడే ఆ కోతి అక్కడే ఉన్న చెట్టు దగ్గర నుంచి ఆ దృశ్యాలు మొత్తం చూస్తూ ఉంటుంది. కోతి తన మనసులో…. ఏంటిది ఆ తల్లికి ఏం జరిగింది. అంటూ చాలా లోపలికి వెళ్తుంది కోతి ని చూసిన ఇద్దరు పిల్లలు …. అమ్మో కోతి కోతి అంటూ పెద్దగా అరుస్తారు.
కోతి వాళ్ళని చూసి… మిత్రులారా భయపడకండి నేను మీకు ఎలాంటి హానీ చేయను . అమ్మకు ఏం జరిగిందో అని కంగారుగా ఇక్కడికి వచ్చాను.
అని అంటుంది అనురాధ భయపడుతూ…. అమ్మకి ఉన్నట్టుండి శరీరం అంతా వేడిగా మంటలు మండుతుందనీ చెబుతుంది .
కోతి అటు ఇటు చూస్తుంది తాను తీసుకొచ్చిన పండ్లలో రెండు పండ్లు తినకూడని పండ్లు ఉంటాయి దాన్ని చూసిన కోతి…. అయ్యో నేను పండ్లతో పాటు తినకూడని పండ్లు తీసుకోవచ్చా నా అవి తింటే కొన్ని గంటల తర్వాత శరీరమంతా మంటలు మండుతుంది .
కీర్తి…. అయితే నిన్న పండ్లు తీసుకు వచ్చింది నువ్వు కానీ ఎందుకు.
అప్పుడు కోతి జరిగిన విషయమంతా చెబుతుంది.
అనురాధ…. ఓ కోతి మాటలతో కాదు కానీ. త్వరగా మా అమ్మ కి విరుగుడు ఏమైనా చెప్పు. లేదంటే ఏం జరుగుతుందో అని మాకు చాలా భయంగా ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *