క్రూరమైన సవతి కూతురు_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

రేణిగుంట అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాజశేఖర్ కమలా అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్ల కూతురు భాను, అలాగే శేఖర్ తల్లి శారద సంతోషంగా కలిసి ఒకే ఇంట్లో జీవించే వాళ్ళు. వాళ్లు రోజులు గడిచాయి కమలకు గుండెపోటు వచ్చి ఆమె చనిపోతుంది. కూతురు భాను తల్లి కోసం ఏడుస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత శారదా కొడుకుతో…. రేయ్ ఎంత కాలం ఇలా ఒంటరిగా ఉంటావు పెళ్లి చేసుకొని దాన్ని ఒక తల్లి నీ తీసుకొని రా నేను ఇవాళ ఉంటాను రేపు పోతాను. నా మాట విని తొందరగా పెళ్లి చేసుకో.
రాజశేఖర్… అమ్మ నాకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదు. నన్ను వదిలేయ్. అంటూ చనిపోయిన భార్య కమల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. రోజులు గడిచాయి.
అతని తల్లి పదేపదే పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పడుతూ ఉండేది . ఇక తప్పనిసరై విమల అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.
విమల అమాయకురాలు అలాగే చాలా మంచిది. ఆమె భాను మీరు చాలా బాగా చూసుకునేది కానీ భానుకి ఆమె అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు విమల పని చేసుకుంటూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటుంది అప్పుడు భాను…. ఏంటి మేడమ్ చాలా హడావిడిగ తిరుగుతుంది . ఏమని చెప్పాలి అంటూ ఆమె తో కాలు అడ్డం పెట్టుకుంది . కాలు తగిలి కింద పడుతుంది విమల. విమల చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే విమల అత్త అక్కడికి వచ్చి…. ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావ్. అని ప్రశ్నిస్తోంది అందుకు
భాను…. కళ్ళు నెత్తికెక్కి నట్లు ఉన్నాయి అసలు కనబడటంలేదను కుంటా అందుకే కింద పడింది. అని చెప్తుంది విమల ఏడుస్తూ లోపలికి వెళ్లి పోతుంది.
కొంత సమయం తర్వాత వంట చేస్తూ ఉండగా. భాను అక్కడికి ఆమెతో…. వంట చేస్తున్నావా . ఉప్పు కారం తగ్గించి వంట చెయ్యి మా నాయనమ్మకి బీపీ ఉంది తెలుసు కదా. అందుకు ఆమె…. అలాగే వండుతాను నీకేం కావాలో చెప్పు . నీకు కూడా మంచి భోజనాన్ని తయారు చేస్తాను.
ఆమె అందుకు కావాల్సిన వంటని అడుగుతుంది. అందుకు విమల సరే అని చెప్పి వంటని సిద్ధం చేస్తుంది .
భాను అక్కడ నుంచి వెళ్లి పోతుంది .
కొంత సమయం తర్వాత వంట పూర్తి చేసి బయటకు వస్తుంది. దాన్ని గమనించిన బాను వెంటనే వంటగదిలోకి వెళ్లి ఆ వంటల్లో ఉప్పు కారం తనకు ఇష్టం వచ్చినట్టుగా వేస్తుంది .
ఆ తర్వాత ఏం తెలియనట్టు అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మధ్యాహ్న సమయం కావడంతో అందరూ భోజనానికి సిద్ధపడతారు.
భాను, నాయనమ్మ ఇద్దరూ సిద్ధపడి ఉంటారు. అప్పుడే విమల భోజనం తీసుకువచ్చి వాళ్ల ముందు మంచి వాళ్లకు వడ్డిస్తుంది.
దాన్ని తిన్నా అత్త….. ఉప్పు కారం ఎంత వేశావు మనిషన్నవాడు ఎవరన్న తింటారా ఇంత దరిద్రంగా చేసావు .
భాను…. నేను అప్పటికి చెప్పాను కదా ఉప్పు కారం తగ్గించమని మా నాయనమ్మను చంపేస్తావా ఏంటి . అంటూ ముఖం మీద దాని విసిరికొట్టి వెళుతుంది . పాపం విమల ఏడుస్తూ….. నేను అంతా సరిగ్గానే వేసాను కదా మళ్లీ ఎందుకు ఇలా జరిగింది నాకు ఏమి అర్థం కావడం లేదు. అంటూ ఏడుస్తూ ఉంటుంది. రోజులు గడిచాయి సవతి తల్లి మీద ఆమెకి ద్వేషం బాగా పెరిగిపోతుంది.
ఒకరోజు ఆమె తల్లి తో…. నన్ను నువ్వు అసలు పట్టించుకోవడం లేదు.
నాకు జడ కూడా వేయడం లేదు.
అని అంటుంది అందుకు ఆమె…. అయ్యో అలా కాదమ్మా నువ్వు నేను పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతావు కదా . అందుకే పిలవటం లేదు ఇప్పుడే వేస్తాను ఇలా రా ఇలా వచ్చి కూర్చో. అని అంటుంది.
భాను తల్లి దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది .
ఆమె జడ వేస్తూ ఉండగా . తండ్రి రావడం గమనిస్తుంది భాను. వెంటనే భాను… అబ్బా ఎందుకమ్మా ఇంత గట్టిగా జుట్టు లాగుతున్నవు. అని అంటుంది దాన్ని గమనించిన తండ్రి…. విమల ఏంటి నువ్వు చేస్తుంది . చిన్న పిల్ల అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని తాగుతున్నావా సవతి తల్లిని తీసుకువచ్చినందుకు బాగా బుద్ధి చెప్తున్నావు అంటూ ఆమెను కొట్టాడు.
ఆమె ఏడుస్తూ లోపలికి వెళ్తుంది అప్పుడే అతని తల్లి అక్కడికి వచ్చి…. చి చి రోజురోజుకీ దీని ప్రవర్తన నాకు అసలు నచ్చడం లేదు మొన్న కూరలో ఉప్పు కారం వేసి మా ప్రాణాలు తీసింది. ఈ రోజు ఏకంగా జుట్టు పట్టుకుని లాగుతున్నదా. ఇలాంటి దాన్ని తీసుకువచ్చినందుకు నన్ను అనుకోవాలి మంచిది కదా అనుకుంటే ఇలాంటి తగిలింది ఏంటి.
అని అంటుంది రోజులు సాగిపోతూ ఉన్నాయి భాను సవతి తల్లి మీద ఏదో ఒక చాడీలు చెప్పి ఆమెను తండ్రి చేత కోట్టిస్తూ ఉంటుంది.
పాపం ఆ తల్లి ఒకరోజు చాలా బాధ పడుతూ…. నేను అసలు ఈ ఇంటికి కోడలిగా ఎందుకు వచ్చాను.నేను ఏం చెప్పినా వాళ్ళు వస్తే నేను వెళ్లడం లేదు . భానుకి నేను అంటే అస్సలు ఇష్టం లేదు . అందుకే వాళ్ల నాన్న చేత నన్ను ఇలా కొట్టి వేధిస్తుంది .
అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా రోజులు గడిచాయి
ఒకరోజు భాను చాలా హడావిడిగా పరుగులు తీస్తూ వచ్చింది. దాన్ని గమనించిన తల్లి… ఏమైంది భాను ఎందుకు అలాగా పరుగులు తీస్తూ వచ్చావు.
భాను ఏం మాట్లాడకుండా ఉంటుంది.
ఆమె సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది .
అప్పుడే అక్కడికి ఒక ఆమె వస్తుంది ఆమె…. చూడండి విమల గారు మీ అమ్మాయి పొద్దున మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి అక్కడ పెట్టిన బంగారు చైను కనబడడం లేదు ఒకసారి మీ అమ్మాయి ని అడగండి అదే మన తీసుకు వచ్చిందేమో .
అప్పుడే భాను బయటకు వచ్చి…. నేను ఎందుకు తీసుకొస్తాను నేనేమన్నా దొంగనా.
నేను మీ ఇంటికి వచ్చాను ఆడుకున్నాను .మళ్లీ ఇప్పుడే మా ఇంటికి తిరిగి వచ్చాను అంతమాత్రం డి మీ ఇంట్లో వస్తువులు పోయినందుకు నేను కారణం కాదు.
సవతి తల్లి…. మా అమ్మాయి అలాంటిది కాదు. అని సర్ది చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది.
భాను లోపలికి వెళ్లి ఏడుస్తూ…. నాకు చాలా భయంగా ఉంది ఇది నేను అనవసరంగా తీసుకొచ్చాను. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అనుకుంటూ ఆ గొలుసును చూస్తూ ఉంటుంది.
అప్పుడు ఆ తల్లి అక్కడికి వస్తుంది ఆ
గొలుసును చూసి ఆమెతో…. ఏంటి భాను నువ్వే దొంగలించవా ఈ గొలుసు మీ నాన్నకు తెలిస్తే ఏమన్నా ఉందా. వాళ్లకు సర్ది చెప్పి పంపించాను.
భాను… వద్దు నాన్న కి తెలిస్తే కొడతాడు . ఈ గొలుసు నాకొద్దు వాళ్లది వాళ్ళకి ఇచ్చేయ్ .
అంటూ గొలుసుని అక్కడ విసిరి కొడుతుంది ఆసక్తి కలిగి ఆ గొలుసు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది.
అక్కడ సవతి తల్లి ఆమెతో…. ఇదిగోండి క్షమించండి . నేను ఇందాక భాను కోసం వచ్చినప్పుడు గొలుసు తీసుకొని వెళ్లాను.
నన్ను క్షమించండి. అంటూ ఆ నింద నీ ఆమెపైన వేసుకుంటుంది.
ఆ తర్వాత ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు అత్త గమనిస్తుంది.
అత్త ఆమెను చూసి…. మీకు ఏం పోయేకాలం. వాలా ఇంట్లో నగలు దొంగతనం చేసావా నీ మొగుడు రా నీ పని చెప్తా . అంటూ ఆమెను కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళుతుంది.
ఆ తర్వాత భర్త అక్కడికి వస్తాడు విమల భర్తతో త ల్లి జరిగిన విషయమంతా చెబుతుంది దానిని విన్న అతను చాలా కోపంగా…. ఒసేయ్ నీకు నగలు కావాలంటే నన్ను అడగొచ్చు కదా . ఎందుకు ఇలాంటి పని చేశావు నలుగురిలో నా పరువు పోతుంది రేపటి రోజు వాళ్లు మన ఇంటికి రావాలన్న భయపడతారు. ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదా అంటూ ఆమె చితకబాదాడు.
అదంతా చూస్తున్న భాను తన మనసులో…. అయ్యో పాపం ఆమె ఆమె నా కోసం ఇలా ఎందుకు తన్నులు తింటుంది . నిజం చెప్తే మా నాన్న నన్ను చంపేస్తాడు ఏమో . అంటూ చాలా బాధ పడుతూ ఉంటుంది .
అతను ఆమెను కొట్టిన తర్వాత… ఈరోజు నుంచి నీకు పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వను. ఆకలి దప్పిక తో చావు అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆమె ఏడుస్తూ ఇంట్లో ఒక మూలన కూర్చుంటుంది. ఆ రోజు రాత్రి సమయం భాను ఆమె దగ్గరకు వెళ్లి…. నిజాన్ని చెప్పాల్సింది . నావల్ల మీరు మా నాన్న చేతిలో తన్నులు తిన్నారు.
అప్పుడు ఆమె….. భాను ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకు. చెప్పే మీ నాన్న నిన్ను అస్సలు ఊరుకోడు. దయచేసి ఈ విషయం ఇంతటితో మర్చిపో.
భాను…. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు నేను మిమ్మల్ని ఎన్నోసార్లు చేత కొట్టు పిచ్చా ను. అయినా నామీద మికు కోపం లేదా.
తల్లి… కోపం ఎందుకు ఉంటుంది అమ్మ నువ్వు నాకు కడుపున పుట్టకపోయినా .
నువ్వు నా బిడ్డ వి కదా. అందుకే నాకు కోపం తెలియదు కానీ ఇలాంటి పని ఇంకెప్పుడూ చెయ్యద్దు అని నాకు మాట ఇవ్వు.
అని ఆమె దగ్గర మాట తీసుకుంటుంది అదంతా చాటుగా వింటున్న అత్త…. అయ్యో నా కోడలు చాలా మంచిది నా మనవరాలు ఇన్ని రోజుల నుంచి ఆమె పైన నిందలు వేసింది. పాపం విమల మా వల్ల చాలా కష్టం అనుభవించింది. అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది కొంత సమయం తర్వాత
భాను తన తన మనసులో…. నిజంగా మా అమ్మ చాలా మంచిది. నేను ఆడ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. సౌవటి తల్లి అంటే
ఏం చేస్తుంది అని భయంతో నా తండ్రి చేత నేను ఆమెను హింసించిలా చేశాను .
కానీ నువ్వు చాలా మంచిది అంటూ ఏడుస్తూ తల్లిని హత్తుకొని….. అమ్మ నన్ను క్షమించు ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. ఇప్పుడే నీ కోసం నేను భోజనం తయారు చేస్తాను.
అది చెప్పి తానే స్వయంగా భోజనం తయారు చేస్తుంది. ఆ తర్వాత ఆ భోజనం తీసుకువచ్చి
ఆమెకు నోట్లో తినిపిస్తూ ఉంటుంది.
ఆ తల్లి భానులో వచ్చిన మార్పుని చూసి చాలా సంతోషపడుతుంది .
అప్పుడే తండ్రి ఇంటికి వస్తాడు భాను తల్లికి భోజనం తినిపించడం చూసి.
…… భాను భవతి ఎందుకు భోజనం తినిపిస్తున్న వు. ఆమెను ఎలాగైనా నిన్ను హింస పెట్టింది పైగా ఒక దొంగ.అలాంటి దానికి భోజనం ఎందుకు పెడుతున్నావు. ఆమె కసాయి తల్లి. దాన్ని చావఇవ్వాలి అని అంటాడు
అందుకు బాను ఏడుస్తూ…. నాన్న అమ్మని ఏమి అనకండి ఇందులో అమ్మ తప్పేమీ లేదు.
ఆ రోజు వంటలో ఉప్పు కారం వేసింది నేనే.
జడ వేసేటప్పుడు అమ్మ నా జుట్టు లగకపోయినా లాగినట్టు నటించింది నేనే
ప్రతి చిన్న వాటికి చాడీలు చెప్పింది నేనే.
ఆ గొలుసు దొంగతనం చేసింది కూడా నేనే అంటూ నిజం చెప్పి ఏడుస్తుంది.
అవన్నీ విన్న అతను…. అయ్యో విమల నా కూతురు చేసిన పనికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను .ఇన్ని రోజులు నిన్ను ఒక దెయ్యం లాగా అనుకున్నాను . నువ్వు ఒక
దేవతవి నువ్వు నా భార్య కావడం నాకు చాలా సంతోషం. జరిగిన వాటన్నిటికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను అంటూ క్షమాపణ అడుగుతాడు .
విమల ఏడుస్తూ….. అయ్యో మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు. జరిగింది ఏది నేను మనసులో పెట్టుకోవడం లేదు . నేను మర్చిపోయాను మీరు కూడా మర్చిపోండి.
అని అంటుంది అందుకు అతను చాలా సంతోషపడ్డాడు . ఇక ఆరోజు నుంచి ఆ కుటుంబం ఎన్ని గొడవలు మర్చిపోయి ఎంతో అన్యోన్యంగా కలిసి సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *